నాకు వచ్చే నెలలో పెళ్లి. చలికాలం వల్ల చర్మం డ్రైగా, పొడిగా ఉంటుందని ఫేషియల్స్ చేయించుకున్నాను. కాని అవి ఏవీ నా ముఖానికి సూట్ కావడం లేదు. వీటి కారణంగా చర్మం ఇంకా నల్లబడింది. మేకప్ క్రీమ్‌లు వాడితే ముఖంపైన ప్యాచ్‌లుగా కనిపిస్తోంది. నా చర్మతత్వం మెరుగుపడటానికి, మృదువుగా, కాంతివంతంగా మారడానికి ఏం చేయాలి?
- పూర్ణిమ, ఈ మెయిల్ నా వయసు 29. రెండేళ్ల క్రితం మలేరియా వచ్చింది. బాగా నల్లబడ్డాను. జుట్టు కూడా బాగా ఊడిపోయింది. ఇంకా ఈ సమస్య ఇలాగే ఉంది. పూర్వపు రంగు రావాలంటే ఏం చేయాలి? - స్వాతి, ఇ - మెయిల్ మలేరియా వచ్చి రెండేళ్లు అయిందంటున్నారు. మలేరియా వచ్చినప్పటికీ... సాధారణంగా ఏడు నెలల నుంచి ఏడాది లోపు చర్మం, జుట్టు సాధారణ స్థితికి వస్తాయి. మీకు అలా జరగలేదంటే థైరాయిడ్, ఇతర ఆరోగ్యసమస్యలు ఏమైనా ఉన్నాయేమో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోండి. అలాగే చర్మం, జుట్టు రంగు కూడా మారిందేమో చెక్ చేయించుకోండి. చిరాంజి (సారపప్పు. హెర్బల్ షాపులలో లభిస్తుంది)ని పాలలో రాత్రి నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోండి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోండి. రోజూ ఇలా చేస్తూంటే కొన్నాళ్ల కు మీ పూర్వపు రంగు వచ్చేస్తుంది. తలకు వారానికి ఒకసారైనా గుడ్డుతో ప్యాక్ వేసుకోండి. ఇంకా జుట్టు ఊడటానికి కారణమేంటో డాక్టర్‌ని అడిగి, వారు సూచించిన జాగ్రత్తలు పాటించండి. - రోజా, ఇ - మెయిల్ పూర్వకాలంలో షాంపూలు, సబ్బులు లేవు. నూనెలు కూడా బాగా జిడ్డుగా ఉండేవి. పైగా వారానికి ఒకసారి తలంటుకోవడం వల్ల జుట్టు తేమను కోల్పోయేది కాదు. కాని, ఇప్పుడలా కాదు. జిడ్డు తక్కువగా ఉండే నూనెలను వాడుతున్నాం. పైగా వారంలో ఎక్కువసార్లు తలంటుకుంటున్నాం. కుంకుడుకాయలు, షికాయల్లో ఉండే ఆమ్లతత్వం వెంట్రుక తేమను ఎక్కువ తీసేస్తాయి. దీనివల్ల జుట్టు పీచులా తయారవుతుంది. నిపుణులను వద్దకు వెళ్లి జుట్టు తత్వాన్ని పరీక్షించుకోండి. దానికి తగిన చికిత్స తీసుకొని, వారు సూచనలు పాటించండి. ప్రస్తుతం keraspaseవాడండి. దీంట్లో షాంపూ, ఆయిల్, కండిషనర్ అన్నీ ఉంటాయి. | |||
Pages
▼
No comments:
Post a Comment