మాది విజయనగరం. విశాఖపట్నంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నాను. రోజూ అప్ అండ్ డౌన్ ప్రయాణించాలి. మొదట్లో నా జుట్టు చాలా బాగుండేది. ఈ మధ్య బాగా డ్రై అవడమే కాకుండా, విపరీతంగా ఊడిపోతోంది. ఈ సమస్యకు ఇంట్లోనే చేసుకోదగ్గ పరిష్కారం సూచించగలరు.
- రేవతి, ఈమెయిల్ నాది పొడి చర్మం. మూతి చుట్టూ నల్లగా అయ్యింది. అది పోవడానికి ట్యాన్ క్లీనర్‌ని ఉపయోగిస్తున్నాను. కాని ఫలితం లేదు. సరైన సలహా ఇవ్వగలరు. - సౌజి, ఈమెయిల్ రోజులో చాలాసార్లు మనకు తెలియకుండా చేతులతో ముఖాన్ని రుద్దేస్తుంటాం. దీనివల్ల చర్మం పొడిబారడమే కాదు, నల్లబడుతుంది. చర్మం పై రబ్ చేయాలంటే టిష్యూ పేపర్‌ని ఉపయోగించాలి. రాత్రి పడుకునేముందు మూతి చుట్టూ బ్రైట్‌నింగ్ సీరమ్ రాస్తే నలుపు తగ్గుతుంది. నా వయసు 22. నా తలలో చుండ్రు ఎక్కువగా ఉంది. దీనివల్ల జుట్టు కూడా రాలుతోంది. మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి. యాంటీ డాండ్రఫ్ షాంపూలనే వాడుతున్నాను. అయినా ఫలితం లేదు. చుండ్రు, మొటిమలు తగ్గే ఉపాయం చెప్పగలరు. - శ్రీ, రామ్‌నగర్ నాది జిడ్డుచర్మం. ముక్కు మీద మొటిమల తాలూకు నల్లమచ్చలు ఉన్నాయి. ఇంకా పెదవులు, మెడ చుట్టూ నల్లగా ఉంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి. వీటివల్ల ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నాను. పరిష్కారం చెప్పగలరు. - అనన్య, మహబూబ్‌నగర్ మొటిమల తాలూకు నల్లమచ్చలు తగ్గాలంటే మంచి బ్రాండెడ్ కంపెనీ యాస్ట్రిజెంట్‌తో రోజుకు మూడుసార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అలాగే పాలపొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు ముఖానికి ప్యాక్‌లా వేసుకోండి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోండి. |
Pages
▼
No comments:
Post a Comment