కాలేయం సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా ఉండి, అందులో కొవ్వు పదార్థాల నిల్వ ఎక్కువగా ఉంటే... ఆ కండిషన్‌ను ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఈ కండిషన్ ఉన్నప్పుడు సాధారణంగా బయటకు ఎలాంటి లక్షణాలూ కనపడవు. ఏవైనా ఆరోగ్యపరీక్షలు చేయిస్తున్నప్పుడు ఈ కండిషన్ బయట పడుతుంది. ఈ కండిషన్ ఉన్నవారిలో కాలేయంలో ఉండే ట్రాన్స్‌ఎమైనేజెస్ సంఖ్య కూడా పెరుగుతుంది.
కారణాలు : అధిక బరువు
శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం
శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి లేదా ఒకేచోట స్థిరంగా కూర్చుని పనిచేసే వృత్తిలో ఉండటం
మత్తుపానీయాలు సేవించడం
డయాబెటిస్
పైన పేర్కొన్న పరిస్థితుల్లో తనలోకి చేరుకునే అధిక కొవ్వును కాలేయం అదుపులో ఉంచలేదు. దాంతో కాలేయంలో కొవ్వుపదార్థాల నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా కాలేయ సామర్థ్యం తగ్గడం, వాపు రావడం, గట్టిదనాన్ని సంతరించుకోవడం జరగవచ్చు.
నిర్ధారణ పరీక్షలు : పూర్తి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ) కాలేయ పనితీరు పరీక్ష (లివర్ ఫంక్షన్ టెస్ట్-ఎల్‌ఎఫ్‌టీ) సీటీ లివర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ లివర్ బయాప్సీ లిపిడ్ ప్రొఫైల్ ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్, ఆర్‌బీఎస్ వంటి పరీక్షలు.
వ్యాధి వచ్చేందుకు అవకాశం (రిస్క్) ఉన్నవారు:చక్కెరవ్యాధి (డయాబెటిస్) ఉన్నవారికి
స్థూలకాయం / అధిక బరువు ఉన్నవారికి
రక్తంలో కొన్ని కొవ్వుపదార్థాలు (హైపర్‌ట్రైగ్లిజరిడిమియా వంటివి) ఉన్నవారికి
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి
నివారణ : బరువు పెరగకుండా చూసుకోవడం
వ్యాయామం చేయడం
పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం
ఆహారంలో కొవ్వులు తగ్గించడం.
చికిత్స : దీనికి ప్రత్యేకంగా మందులు ఉండవు. అయితే వ్యాధి వచ్చిన కారణాన్ని కనుగొని ఆ పరిస్థితిని నివారించేలా చికిత్స చేయడం వల్ల ఈ కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్య స్వల్పంగానే ఉంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. దీర్ఘకాలంగా ఉంటే అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి కండిషన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. లక్షణాలను బట్టి... కార్డస్ మరైనస్, చెలిడోనియమ్, సియోనాంథస్, లైకోపోడియమ్, కాల్కేరియా కార్బ్, మెర్క్‌సాల్, మాగ్‌మూర్, నక్స్‌వామికా, ఫాస్ఫరస్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది.
- డాక్టర్ ఎం. శ్రీకాంత్
సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్
No comments:
Post a Comment