మూత్రపిండాలు రక్తంలోని విషపదార్థాలను, అదనంగా ఉన్న నీటిని క్రమంగా తొలగిస్తుంటాయి. మనకిడ్నీలు ప్రతిరోజూ 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. ఇంతగా పనిచేసే ఈ మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గడాన్ని దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్-సీకేడీ) అని అంటారు. ఇది చాపకిందనీరులా విస్తరించి, తాను సోకిన విషయమే తెలియకుండా రోగిని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని ‘సెలైంట్ డిసీజ్’ అని కూడా అంటారు. ఇలా వాటి పనితీరు క్రమంగా తగ్గుతూ ఒక దశలో పనిచేయకుండా పోతాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా పేర్కొంటారు. దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి... కారణాలు లక్షణాలు: కాళ్లవాపులు ముఖం వాపు ఆకలి తగ్గడం ఆగకుండా వాంతులు ఎప్పుడూ నీరసంగా ఉండటం ఆయాసం రావడం రాత్రివేళ మూత్రం కోసం ఎక్కువగా నిద్రలేవాల్సి రావడం, అప్పుడు మూత్రం చుక్కలు చుక్కలుగా తక్కువగా రావడం మూత్రంలో రక్తస్రావం... వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కిడ్నీలు 50 శాతం దెబ్బతిన్న తర్వాతే బయటపడతాయి. చికిత్స: రోగి కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నా కిడ్నీ చేసే విధులను నిర్వహించే డయాలసిస్ అనే ప్రక్రియను నిత్యం చేయించుకోగలిగినప్పుడు కిడ్నీ రోగి సైతం ఒక సాధారణ వ్యక్తి జీవించినంత కాలం, కిడ్నీ వ్యాధిగ్రస్తులూ జీవించవచ్చు. డయాలసిస్‌లో రెండు రకాలు. మొదటిది హీమో డయాలసిస్; రెండోది పెరిటోనియల్ డయాలసిస్. కిడ్నీల రక్షణకు తేలికైన పరీక్షలు... చిన్నప్పుడే వచ్చిన (టైప్-1) మధుమేహ బాధితులు, ఆ వ్యాధి బారిన పడిన ఐదేళ్ల నాటి నుంచి ప్రతి ఏటా కిడ్నీపరీక్షలు ఏవైనా ఉన్నాయేమోనని సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పెద్దయ్యాక వచ్చిన (టైప్-2) మధుమేహ బాధితులు దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరును తెలుసుకునే పరీక్షను చేయించుకోవాలి. ఆ తర్వాతినుంచి ప్రతి ఏడాది ఒక్కసారైనా క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకుంటూనే ఉండాలి. ఆ తేలికైన పరీక్షలివి... మూత్రంలో ఆల్బుమిన్: ఇది ఒక రకం ప్రోటీన్. ఇది మూత్రంలో సుద్దలా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గినట్లే. అందుకే మధుమేహ బాధితులు ప్రతిఏటా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. రక్తంలో సీరమ్ క్రియాటినిన్: కిడ్నీలను కాపాడుకోవాలంటే... మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెరవ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్‌బీ1సీ (గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్) అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రక్తపోటు ఉన్నవారు బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్ 110 ఎంజీ/డీఎల్ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా చూసుకోవాలి. - రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే... మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ, ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. - ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే బేకరీ ఆహారాన్ని, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. - విసర్జన సమయంలో మూత్రంలో సుద్దలా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. |
Pages
▼
No comments:
Post a Comment