ప్రోత్సాహకరపు మాటలు ఇలా ఉంటాయి. నీకు ఈ పని బాగా నచ్చిందనుకుంటాను. చాలా బాగుంది. నువ్వు కొత్త విషయాలను నేర్చుకుంట్నూవు. నీకది ఏవిధంగా అనిపిస్తూ ఉంది? ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాటలు ఇవే. నీ సంగతి నాకు బాగా తెలిసే నీకు ఈపనిని అప్పగించాను. నువ్వీ పని బ్రహ్మండంగా చేస్తావు. అది కొంచెం కష్టమైన పని అయినా నువ్వు తప్పక చేయగలవు. ప్రశంసాపాత్రమైన మాటలు: థాంక్యూ నువ్వు చేసిన పని నిజంగా బాగుంది. నా పనిని తేలిక చేసింది. నీ సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నీ అవసరం నాకెంతో ఉంది. నీ సహాయం నాకెప్పటికీ అవసరమే. |
Pages
▼
No comments:
Post a Comment