కంటి నిండా నిద్ర పోవడం... చాలా మందికి ఒక కల. బిజీ లైఫ్‌స్టయిల్‌లో నూటికి తొంబై మందికి సాధ్యం కాని వరం. ప్రశాంతత కొరవడితే నిద్ర దూరమవుతుంది. నిద్ర దూరమైతే చికాకులు మొదలవుతాయి. ఆ ప్రభావం పని నైపుణ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకదానికి మరొకటి ఇంటర్‌లింక్‌గా సాగే సమస్యల వలయం ఇదంతా.
రాత్రి గదిలో లైట్లు ఆపేసి దీనిని ఆన్ చేస్తే మిణుకు మిణుకుమంటూ బెడ్‌ల్యాంప్‌గా చిరుకాంతులీనుతుంది. బెడ్‌రూమ్‌లో ల్యాంప్‌షేడ్‌కి ప్రత్యేకంగా స్థలం కేటాయించడం సాధ్యం కానప్పుడు గోడకు బెడ్‌ల్యాంప్ అమర్చుకుంటాం. అదేదో ఇలా... వాల్ హ్యాంగింగ్‌లో ఉంటే పగలంతా మంచి పెయింటింగ్‌గా గది అందాన్ని పెంచుతుంది, రాత్రి బెడ్‌ల్యాంప్‌గా పనిచేస్తుంది. బుద్ధుని రూపం అలసిన మనసుకు సాంత్వననిస్తుంది. పైగా నిద్రలేచిన వెంటనే మొదటగా బుద్ధుడిని చూస్తుంటే మనిషి ఏ రోజుకారోజు తనను తాను సంస్కరించుకుంటూ ఉంటాడు. మనసులో క్రోధం, సహోద్యోగుల మీద ఆవేశకావేశాల వంటివి పెరగకుండా ఉంటాయి. కాబట్టి మానవసంబంధాలు మెరుగుపడుతుంటాయని బౌద్ధాన్ని ఆచరించేవారి విశ్వాసం. |
Pages
▼
No comments:
Post a Comment