టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందువల్ల వారి అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా గది ఏ రంగులో ఉంటే ఇష్టమో ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి.
టీనేజర్స్ గదిలో ఉండే మంచం కొద్దిగా పెద్దదిగా ఉండాలి. అలాగే ఆ గదిలో వార్డ్‌రోబ్స్ ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఒక వార్డ్‌రోబ్‌కి అద్దం బిగించితే మంచిది. తెలుపు, మెరైన్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, గ్రే రంగులైతే ఫర్నిచర్‌కి కూడా సూట్ అవుతాయి. షెల్వ్స్‌కి ఉండే స్టాండ్‌లు లేతరంగులలో, మంచి ఆకృతిలో ఉంటే, పుస్తకాలు ఉంచడానికి అనువుగా ఉంటాయి. అలాగే చదువుకి సంబంధించినవాటిని ఉంచుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. కంప్యూటర్ తప్పనిసరి కనుక, అనువుగా ఉండేలా అమర్చుకోవాలి. మూయడానికి అనువుగా ఉంటే డ్రా ఉన్న టేబుల్స్, కొన్ని ఓపెన్‌గా ఉన్న టేబుల్స్ ఉంటే బొమ్మలను షోగా అమర్చుకోగలుగుతారు. ఒకవేళ టీనేజర్లు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నవారైతే వాటికి సంబంధించిన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ఉదాహరణకి బెడ్‌కి వెనకాల ఉండే గోడకు వాల్ పేపర్‌ని బాస్కెట్‌బాల్ లేదా ఫుట్‌బాల్ థీమ్‌తో ఉన్నది అమర్చుకుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. |
Pages
▼
No comments:
Post a Comment