ఈ సున్నితమైన చర్మం మాయిశ్చరైజర్ తాలూకూ గుణాన్ని గ్రహించదు. ఈ కంటి చుట్టూ ఉండే ప్రాంతాన్ని టిష్యూ పేపర్‌తో పోల్చవచ్చు. మిగతా ముఖంలో ఉండే చర్మాన్ని రైటింగ్ పేపర్‌తో పోల్చవచ్చు. సో... కంటిచుట్టూ ఉండే ప్రాంతంలో వాడే ఏ క్రిములైనా మంచివి, సున్నితమైనవి వాడాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సున్నిత చర్మానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎలాంటి ఐక్రీములు వాడాలో తెలుసుకుందాం. - లైట్ క్రీములు వాడండి. తెలిసి తెలియక మాయిశ్చరైజర్‌లు రాస్తే ఫలితం కనబడదు సరికదా వాపులు లాంటివి రావచ్చు. - పడుకునే ముందు ఐ క్రీములు వాడండి. - కనురెప్పలను చాలా శ్రద్ధగా చూసుకోవాలి. - ఐజెల్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతాయి. అలాంటి వాటితో కంటి క్రింద చారలు, నల్లటి లేయర్లను లేకుండా చేసుకోవచ్చు. - నైట్ క్రీములు చర్మానికి రాసినప్పుడు చర్మకణాలతో కలిసిపోయి చర్మానికి కొత్తదనంతో పాటు పోషకవిలువలు కూడా ఇస్తాయి. - ఎలాంటివి కొనాలి? ఏ వస్తువులు కొనాలి? బ్యూటీ ఉత్పత్తులు కొనటం తలనొప్పిగా ఉందా? - క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ లాంటి అందాన్నిచ్చే సౌందర్య ఉత్పత్తులు కొనే ముందు మీకు కావలసిన పోషక పదార్థాలు ఉన్నాయో లేదో చూడండి. అయితే మీ చర్మ తత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీ చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకుని వాడండి. లేదా బ్యూటీషియన్‌ను సంప్రదించండి. |
Pages
▼
No comments:
Post a Comment