
గౌరీపురంలో
హేమంతుడు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద భవంతి, డబ్బు, బంగారం, వస్తువులు,
వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దానధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి.
ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత రమ్మనేవాడు. తర్వాత
వెళితే మళ్లీ ఇంకేదో కారణం చెప్పేవాడు. అంతేగానీ పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఆ
విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డపేరు వచ్చింది.
అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరొక
వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సాయం
చేస్తుండేవాడు. అడిగినవారికి లేదనకుండా తృణమోపణమో ఇస్తుండటంతో ప్రసన్నుడిని అందరూ
మెచ్చుకునేవారు. ఇదిచూసి హేమంతుడికి ఈర్ష్య కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం
ఆలోచించాడు. ‘‘కొంతకాలం ఆగండి. నేను నా ఆస్తి మొత్తాన్నీ ఈ ఊళ్లో బడి, గుడి
కట్టించడానికి, దానధర్మాలకు ఇచ్చేస్తాను’’ అని అందరినీ పిలిచి చెప్పడం
ప్రారంభించాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే
అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్లే పేదపిల్లలకు పలకలు, బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు.
అలాగే గుడికివెళ్లే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచిపెట్టసాగాడు. ఒకరోజు
ప్రసన్నుడికి ఊర్లో ఘనసన్మానం జరిగింది. ‘‘నా ఆస్తిని బడికి, గుడికి ఇస్తానంటే నాకు
గాక ఇతనికి సన్మానం చేస్తారా?’’ అని హేమంతుడు అందరినీ అడిగాడు. ‘‘మీరు ఎప్పుడో
ఇస్తానంటున్నారు. ఆయన ఇప్పుడే ఇస్తున్నారు. అదీ తేడా’’ అన్నారు ప్రజలు. దాంతో తన
తప్పు తెలుసుకుని అప్పటి నుంచి ఉదారంగా ఉండ సాగాడు ప్రసన్నుడు.
No comments:
Post a Comment