పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె సమభాగాలుగా తీసుకొని, అందులో ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది.
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Saturday, December 1, 2012
నాకున్న వైకల్యం...నాలో కసి పెంచింది-అనంత్ శ్రీరామ్;-)
కార్కుతో ఓపెన్ చేసి తాగేందుకు కాదు మార్కులు
ఫోర్కుతో పొడిచి తినడానికి పనికిరావు మార్కులు స్పార్కు ఏదైనా ఎవరిలోనైనా ఉంటే దాన్ని గుర్తించడానికి ఉపయోగపడే స్కేలు మీద ఉండే మార్కింగులే మార్కులు. అందుకే ప్రహ్లాదుళ్లా చదువుల్లోని సారాన్నే చదివారాయన. తన మార్కు కనపడేలా కళారంగంలో కుదురుకున్నారు. సోడాబుడ్డి కళ్లద్దాలంటూ ఎగతాళి చేశారు కొందరు ఫ్రెండ్స్. కళ్లద్దాల మందం పెరుగుతుందంటే పవరూ పెరిగిందని కదా అర్థం. అంటే తనకు పవరెక్కువని భాష్యం చెప్పుకున్నారాయన. అక్షరాలు సాఫీగా సాగితే అది మాట. మాట మెలికలు తిరిగితే అది పాట. అవును... వైవిధ్యం ఎప్పుడూ వర్కవుటువుతుంది. ఆ వైభవానికి సమాజం సాగిలపడుతుంది. అనంత్ శ్రీరామ్‌లోని మెలికలు తిరిగిన అభిప్రాయాలను అక్షరాలా ఆవిష్కరించే అక్షరాలే ఆయనలోని ‘అదర్‌సైడ్’. పాట రాయాలంటే మీకు ఉత్ప్రేరకంగా నిలిచేది ఏది? స్మోక్, డ్రింక్... చాలామంది రచయితలు అవి లేకుండా రాయరని అనుకుంటూ ఉంటారు? అనంత్ శ్రీరామ్: మా తాతయ్య లాయరండీ. ఆయన తాగేవారట. ఆ కారణంగా మా కుటుంబం చాలా నష్టపోయిందని విన్నాను. అలాగే మా మేనమామ కూడా డ్రింక్ చేస్తారు. ఆయన్ను కూడా చాలాసార్లు గమనించాను. ఈ అనుభవాల వల్ల నాకు తెలిసిందేంటంటే. తాగిన మనిషి ఆ క్షణాల్లో విచక్షణను కోల్పోతాడు. అతను ఎంతటి ప్రజ్ఞావంతుడైనా తాగిన క్షణాల్లో అతని గొప్పనంతా సమాజం మరిచిపోతుంది. తిట్టడం మొదలుపెడుతుంది. అన్ని గొప్ప గుణాలను ఆభరణాలుగా చేసుకొని, కేవలం ఓ చిన్న దురలవాటు వల్ల సమాజానికి చులకన అవ్వడం అవసరమా? దాంతో మందునూ ఇతర ఏ వ్యసనాన్నీ దరి చేరనివ్వలేదు. మరి పాట రాయడానికి కావలసిన మూడ్ కోసం ఏం చేస్తారు? అనంత్ శ్రీరామ్: మంచి ఆలోచనల కోసం మొదట్లో పాట రాస్తున్నప్పుడు బబుల్‌గమ్ నమిలేవాణ్ని. అప్పుడెవరో శ్రేయోభిలాషులు చెప్పారు అది తింటే కేన్సర్ వస్తుందని. వెంటనే మానేశాను. అసలు ‘అలవాటు’ అనేది నెగిటీవ్‌దే ఎందుకు అయ్యుండాలి. పాజిటివ్ అలవాట్లను ఎందుకు అలవరచుకోకూడదు అనిపించింది. ఆ ఆలోచన రాగానే నాకు దొరికిన పరిష్కారం ‘మెడిటేషన్’. ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువైతే.. నాలుగైదు నిమిషాలు మెడిటేషన్ చేస్తా. అంతే ఒత్తిడంతా దూది పింజలా ఎగిరిపోతుంది. సిగెరెట్, మందు, పేకాటా వీటన్నింటికీ జనం అలవాటు పడేది కూడా ఒత్తిడి తగ్గించుకోడానికే. మెడిటేషన్ ద్వారా ఇప్పుడు అంతకంటే రిలాక్సేషన్, అంతకంటే కిక్కు నాకు దొరికింది. అసలు ఇంతటి సాహిత్యాభిలాష ఎలా అబ్బింది మీకు? అనంత్ శ్రీరామ్: చిన్నప్పట్నుంచీ ఉందండీ. కారణం మా నాన్నగారే. ఆయన పద్యాలు బాగా పాడతారు. పద్యాలంటే... సంప్రదాయ పౌరాణిక పద్యాలు కాదు. జంధ్యాల పాపయ్యశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్లు.. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి, చరిత్ర ఔన్నిత్యం గురించి రాసిన పద్యాలవి. వాటిని ఆయన పాడుతూ ఉండేవారు. ఆస్వాదించే కొలదీ సాహితీ పరిమళాలు వాటినుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. కాలక్రమంలో అవి నాపై చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన బుక్? అనంత్ శ్రీరామ్: ‘వేదం జీవన నాదం’. దాశరధి రంగాచార్య రాసిన బుక్ అది. ఆ పుస్తకం గురించి పూర్తిగా విపులీకరించలేను కానీ.. కొన్ని విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం చాలామంది తమ టాయిలెట్స్‌లో వెస్ట్రన్ కమోడ్‌లనే వాడుతున్నారు. అది మన భారతీయ విధానానికి విరుద్ధం. మన విధానంలో విరేచనం సాఫీగా అవ్వడానికి ఇచ్చిన ఆసనం ఎంత గొప్పదో చెప్పారు. మన తొడలు పొట్ట కండరాలను నొక్కిపడుతాయ్. తద్వారా పొట్ట కండరాలు వ్యాకోచించి సుఖ విరేచనం అవుతుంది. ఈ విషయం తెలీక టాయిలెట్‌లలో వెస్ట్రన్ కమోడ్‌లకు అలవాటు పడిపోతున్నాం. వాటిలో టాయిలెట్‌కి వెళితే కిడ్నీలు త్వరగా పాడవుతాయి. మన సైన్స్ ఎంత గొప్పదంటే... మగవాళ్లతో గర్భం దాల్పించారు. భరద్వాజ మహర్షి చేసిన ప్రయోగమది. అయితే... అది ప్రకృతి విరుద్ధం కాబట్టి ఆ ప్రక్రియకు అప్పుడే స్వస్తి పలికారు. టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ ఓ పాతికేళ్ల కిందట వచ్చింది. కానీ మన చరిత్రలో కౌరవులు ఎవరు? టెస్ట్ ట్యూబ్ బేబీలు కారా? విశ్చిన్నమైన పిండాన్ని భద్రపరచి కౌరవుల జన్మకు కారకుడవ్వలేదా వ్యాసుడు. అయితే... ప్రకృతి విరుద్ధంగా పుట్టారు కాబట్టి కౌరవులు దుర్మార్గులయ్యారు. అందుకే ఆ ప్రక్రియకు అప్పుడే మంగళం పలికారు మనవాళ్లు. విజ్ఞానం అసలు ఎప్పుడు పుట్టింది? ఎలా అభివృద్ధి చెందింది? భారతీయ విజ్ఞానం ఎంతగొప్పది? ఈ విశేషాలన్నీ ‘వేదం జీవన నాదం’ పుస్తకంలో ఉంటాయ్. అలాగే గీత రచయితగా జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పద్యాలు నాకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు. అసలు మీరేం చదివారు? అనంత్ శ్రీరామ్: ఇంజనీరింగ్ డిస్‌కంటిన్యూ చేశాను. ఎందుకు? అనంత్ శ్రీరామ్: ఇష్టం లేదు. మన విద్యావ్యవస్థ పరమ అసమర్థమైన వ్యవస్థ. ముఖ్యంగా మన రాష్ట్ర విద్యావ్యవస్థ. మరొక్కసారి చెబుతున్నాను వినండి.. మన రాష్ట్ర విద్యావ్యవస్థ పరమ అసమర్థమైన, స్వార్థపూరితమైనది. ఎందుకంత ఆవేశం? అనంత్ శ్రీరామ్: మార్కులకు తప్ప మనసులకు విలువివ్వని విద్యావిధానాలు. విజయాలకు తప్ప విజ్ఞతలకు విలువివ్వని విద్యాసంస్థలు మన విద్యా వ్యవస్థను నడిపిస్తున్నాయి. అందుకే అంత ఆవేశం. మీ ఆవేశానికి కారణం వివరంగా చెబుతారా? అనంత్ శ్రీరామ్: తప్పకుండా... ముందు నాకు టెన్త్ క్లాస్‌లో జరిగిన కొన్ని అనుభవాలు చెబుతాను. హిందీ సబ్జెక్ట్‌కి వచ్చేసరికి ‘వీజీఎస్’ అని ఓ గైడ్ ఉండేది. దాన్నే ఎక్కువ మంది విద్యార్థులు చదివేవారు. అధ్యాపకులు కూడా విద్యార్థులకు ఆ గైడ్‌నే సూచించేవారు. నాకు మాత్రం హిందీ గైడ్ ‘సుకుమార్’ బాగా నచ్చింది. అందుకే ఆ గైడ్‌ని అనుసరించి పరీక్షలు రాశాను. అయితే... నాకు హిందీలో 42 మార్కులే వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో మాత్రం 85కి పైగానే వచ్చాయి. దీంతో నాకు స్కూల్ ఫస్ట్ పోయింది. దాంతో రీ వాల్యుయేషన్ కోసం పోరాడాను. చివరికి రీ కౌంటింగ్ పెట్టారు. దాంట్లో కేవలం బిట్ పేపర్‌కే 25కి 24 మార్కులొచ్చాయి. కొశ్చన్ పేపర్‌కి మాత్రం 18 మార్కులే వేశారు. నాకు జరిగిన అన్యాయంపై వాళ్లను నిలదీస్తే... వాళ్లు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? (ఆ గైడ్‌లో నేను చదివిన) సమాధానాలు చిన్నవిగా ఉన్నాయట. నా అక్షరాలే చిన్నవిగా ఉంటాయి. అది నా పాపమా. సమాధానాలు సరైనవా? కావా? అని మాత్రమే వాళ్లు చూడాలి. కానీ సమాధానాలు జానాబెత్తలతో కొలిచి 42 మార్కులు ఇచ్చారు. ఇంత కష్టపడి చదివిన తర్వాత కూడా నాకు రావాల్సిన మార్కులు రాకుండా చేసిన ఈ విద్యావ్యవస్థను నేనెందుకు గౌరవించాలి. ఇంటర్ నేను ‘గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజ్’లో చదివాను. వారానికి ఓ పరీక్ష పెట్టేవారు. వారం వారం పరీక్షలంటే... ఏదో ఒకవారం ఎవడికో ఒకడికి ఒంట్లో బావుండదు. ఆ ఒంట్లో బాగుండని వాడికి తక్కువ మార్కులొస్తే.. వాడ్ని అందరి ముందు అవమానంగా మాట్లాడేవారు. చివరకు విద్యార్థులు కూడా ఈ విధానానికి ప్రభావితం అయిపోయారు. మార్కులు తినేద్దాం, మార్కుల్ని తాగేద్దాం అన్నట్టుగా వుండేది ఇలా కడలిలాంటి ఆ కళాశాలలో ఓ కొబ్బరి తెడ్డులా సంస్కృతం మాస్టారు కోటేశ్వరరావుగారు కనిపించారు. ఆయన మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. అందరూ స్కోరింగ్ కోసం సాంస్క్రిట్ తీసుకునేవారు. నేను మాత్రం ప్రేమించి తీసుకున్నాను. మాస్టారు చెప్పే కాళిదాసు కవితలు, ‘సుధీక్షణాదేవి చూపులతోనే తాగింది’ అనే భావాలు నాలో భావుకతను పెంచాయి. ఇంజనీరింగ్‌లో ఏం జరిగింది?.... అనంత్ శ్రీరామ్: ఇంజనీరింగ్ కాలేజ్‌లో మన ఆసక్తితో ఎవరికీ పనిలేదు. దేనికి డబ్బొస్తే దానికే విలువ. వాళ్ల దృష్టిలో గొప్ప పెళ్లికొడుకు, గొప్ప పెళ్లి కూతురు ఎవరంటే... ఎంబీబీఎస్, బీటెక్ చేసిన వాళ్లే. అలా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. పైగా కళలు కూడు పెడతాయా? అని ఎప్పటికప్పుడు నిరుత్సాహానికి గురిచేసేవారు. అప్పుడే నాకు కసి పెరిగింది. ‘ర్యాంకులు మీకు గొప్పేమో... కళ నాకు గొప్ప’ అని అప్పుడే వారితో వాదించాను. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఉపయోగపడదని నిర్ణయించుకున్నాను. కళలు మనిషిని మహనీయుడ్ని చేస్తాయని నిరూపించాలనుకున్నాను. మరిప్పుడు గేయరచయితగా మీరు ఓ మంచి హోదాలో ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని రగిలించిన వాళ్ళెవరైనా మీకు తారసపడటం జరిగిందా? అనంత్ శ్రీరామ్: అప్పుడు మాకు పాఠాలు చెప్పిన ఏ ఉపాధ్యాయులు ఇప్పుడు అక్కడ లేరు. ఎక్కడెక్కడ ఉన్నారో నాకే తెలీదు. అసలు మనల్ని పట్టించుకునే టైమ్ కూడా వాళ్లకు ఉండదు. ఇదంతా నా ఆత్మసంతృప్తికోసం చెబుతున్న విషయాలే. మరి మీ ఫ్రెండ్స్ కలుస్తుంటారా? అనంత్ శ్రీరామ్: కాలేజ్ టైమ్‌లో వంశీ, వరుణ్, ప్రియాంక నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లందరూ అమెరికాలో ఉన్నా ఇప్పటికీ వారిని నేను వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను కనుక్కుంటూనే ఉంటాను. ఇటీవలే మీ పెళ్లయింది. జీవితం ఎలా ఉంది? అనంత్ శ్రీరామ్: మొదట అసలు పెళ్లంటేనే భయపడేవాడ్ని. ఇంట్లో వాళ్లు చూస్తామన్నా వద్దనేసేవాడ్ని. అమ్మానాన్న మా ఊళ్లో ఉంటారు. ఇక్కడ మొన్నటిదాకా నేనొక్కడ్నే. హోటల్‌లో భోంచేసేవాడ్ని. దానికి తోడు ఇంటి అద్దె. ఖర్చు చాలా ఎక్కువ అయ్యేది. ‘తను దూర సందు లేదు. మెడకో డోలు’ అన్న చందాన, భార్య కూడా వస్తే ఇక ఆ భారం భరించడం కష్టం అని ముందు వద్దన్నాను. కానీ ఆమె వచ్చాక తెలిసింది నా అభిప్రాయం తప్పని. ఇప్పుడు నా ఖర్చులు 30 శాతం తగ్గిపోయాయి. ఇంటి భోజనం వల్ల డబ్బు చాలా ఆదా అవుతోంది. పైగా టైమ్ ప్రకారం భోజనం చేస్తుండటంతో నా ఆరోగ్యం కూడా బలపడింది. గతం కంటే వేగంగా పాటలు రాయగలుగుతున్నాను. దీన్ని బట్టి మీరు చాలా పొదుపరి అన్నమాట? అనంత్ శ్రీరామ్: అలాంటిదేం లేదండీ... అవసరానికి తగ్గట్టు ఖర్చు కచ్ఛితంగా ఉంటుంది. మీ భార్యాభర్తల్లో ఎవరి డామినేషన్ ఎక్కువ? అనంత్ శ్రీరామ్: ఇంటి వరకు అయితే... ఆమే రాణి. అయితే.. నా వృత్తి విషయాల్లో మాత్రం అస్సలు జోక్యం చేసుకోదు. నేనూ అంతే... ఇంటి వ్యవహారాలన్నీ ఆమెకే వదిలేస్తా. ఎంత కట్నం తీసుకున్నారూ? అనంత్ శ్రీరామ్: (నవ్వుతూ) అనవసరంగా అబద్ధాలాడటం నాకు ఇష్టం ఉండదండీ. నేను కట్నం తీసుకోలేదు. ఇది పచ్చినిజం. అసలు నా దృష్టిలో కట్నం తీసుకోవడం దుర్మార్గం. తమ కూతురికి వాళ్లు ఎంతిచ్చినా తప్పుకాదు. అయితే... మా అబ్బాయి అంత చదివాడు, ఇంత చదివాడు. ఇన్ని లక్షలిస్తే తప్ప మీ అమ్మాయిని చేసుకోం అనడం తప్పు అంటున్నాను. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించింది? అనంత్ శ్రీరామ్: కట్నం తీసుకోవడం... వ్యభిచారం చేయడం నా దృష్టిలో ఒక్కటే. అందుకే తీసుకోలేదు. కట్నం తీసుకొని డాబుగా తిరిగే పెళ్లి కొడుకుల్ని నేను చాలామందిని చూశాను. ఒక జీవితాన్ని ఇద్దరు కలిసి పంచుకోవడమే పెళ్లి. మగాడి శక్తిసామర్థ్యాలు సంపాదనలో కనిపిస్తాయి. ఆడదాని శక్తి ఇంటిని చక్కదిద్దుకోవడంలో కనిపిస్తుంది. ఇలా రెండు బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నప్పుడు పర్టిక్యులర్‌గా అబ్బాయే ఎందుకు డబ్బులు తీసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తింది. అందుకే ఆస్థిపాస్థుల గురించి పట్టించుకోకుండా, పెళ్లి ఖర్చు కూడా నేనే భరించి, నా భార్యను తెచ్చుకున్నాను. మీ శ్రీమతికి మీరు రాసిన పాటల్లో ఏ పాటంటే ఇష్టం? అనంత్ శ్రీరామ్: ఆమెకు ఫిమేల్ సోలోసాంగ్స్ అంటే ఇష్టం. ‘మిస్టర్‌పర్‌ఫెక్ట్‌లో ‘చలిచలిగా అల్లింది...’ పాటను బాగా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్‌గా ‘జీనియస్’ అనే సినిమాలో ఓ పాట రాశాను. ‘ఏవేవో కలలు...’ అనే పల్లవితో ఆ పాట సాగుతుంది. ఆ పాట కూడా ఆమెకు బాగా ఇష్టం. ‘అసలు అమ్మాయిల మనసులో భావాలు మీకెలా తెలుస్తాయి?’ అని అడుగుతుంటుంది నన్ను. అదే ప్రశ్న నేనూ అడుగుతున్నాను చెప్పండి? అనంత్ శ్రీరామ్: దానికి కారణం ఏంటంటే... నా కాలేజ్ టైమ్‌లో నా ఫ్రెండ్సందరూ లవర్సే. ఈ కారణంగా వాళ్లు ప్రేమించే అమ్మాయిలు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయేవారు. ఆ అమ్మాయిలతో గడిపిన క్షణాలు ఫ్రెండ్స్ నాతో పంచుకునేవాళ్లు. అలాగే నా ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలు ఆ అమ్మాయిలూ నాతో పంచుకునేవారు. నేనేమో న్యూట్రల్ పర్సన్‌లా ఉండేవాడ్ని. ఈ కారణంగా ప్రేమ గురించి వారికంటే నాకే ఎక్కువ అవగాహన పెరిగేది. ముఖ్యంగా అమ్మాయిల మనోభావాలు మాత్రం చాలా సున్నితంగా అనిపించేవి. ప్రేమ విషయంలో నేను గమనించిన గమ్మత్తు ఏంటంటే... అబ్బాయ్ అగ్రెసివ్ అయితే... అమ్మాయి సాఫ్ట్‌గా అనిపించేది. అబ్బాయ్ సాఫ్ట్ అయితే.. అమ్మాయి వాగుడుకాయ్ అయ్యుండేది. అబ్బాయి చాలా అందగాడైతే... అమ్మాయి ఓ మాదిరి అందగత్తె అయ్యుండేది. ఇలా వ్యతిరేక లక్షణాలున్న వారే జంటగా మారడం నేను గమనించాను. కలవని తీరైనా.. తలపులు వేరైనా.. పరిచయం బలపడిపోతుంది. ఆ మేజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాదు... అదే ‘ప్రేమ’ అని నేను గ్రహించాను. నేనే గనుక ప్రేమిస్తే ఒకే అనుభవంతో సరి పెట్టుకోవలసివచ్చేది. అయిదారు ప్రేమకథలు చూశా కదా... అందుకనే ఇంత అవగాహన. నిజంగా మీరెవర్నీ ప్రేమించలేదా? అనంత్ శ్రీరామ్: నా మొహం చూసి ఏ అమ్మాయి లవ్ చేస్తుందండీ. అమ్మాయిలు డైనమిక్‌గా ఉండేవాళ్లనే ఇష్టపడతారు. కాగితాలపై పాటలు రాసుకుంటూ తిరిగే నాలాంటివాణ్ని వాళ్లు లైక్ చేయరు. మీకు సైట్ ఎప్పట్నుంచి ఉంది? అనంత్ శ్రీరామ్: బై బర్త్. నా మూడు నెలల వయసులో కుడి కన్నుకూ తొమ్మిదో నెలలో ఎడమ కన్నుకూ ఆపరేషన్లు జరిగాయి. మూడో నెలలో సైట్ అన్న విషయం ఎలా కనిపెట్టారు..? అనంత్ శ్రీరామ్: కళ్లు తేడాగా కదుపుతుంటే... వాళ్లకు అనుమానం వచ్చిందంట. ఈ సమస్య వల్ల మీరెప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అనంత్ శ్రీరామ్: శారీరక సమస్య ఉన్నవాళ్లు దురదృష్టవంతులు అంటుంటారు. నేను ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు బ్లాక్‌బోర్డ్‌పై రాసే అక్షరాలు కనిపించేవి కావు. ‘సార్...నాకు రెండు కళ్లు కాస్త తేడా అండీ... ఎడమ కన్నుకు లేట్‌గా ఆపరేషన్ చేయడం వల్ల ఆ కంటితో చూడ్డం కష్టం అవుతుంది. కుడి కంటితో బాగా చూడగలను. కుడి నుంచి ఎడమకు కళ్లు తిప్పుతుంటే... బాధగా ఉంది. మేటర్‌ని బోర్డ్ మధ్యలో రాస్తారా’ అని అధ్యాపకుడ్ని బతిమాలితే... ఓ రెండుసార్లు నాకోసం రాశాడు. తర్వాత కుదరదని ఖరాకండీగా చెప్పేశాడు. చాలా బాధ అనిపించింది. ఫిజికల్‌గా నేను మైనస్ అన్న సంగతిని మరిచిపోయి, సైకలాజికల్‌గా నేనెక్కడ స్ట్రాంగో గ్రహించి ముందుకు సాగాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు ఎవరైనా మీ కళ్లు చూసి ఎగతాళి చేసేవారా? అనంత్ శ్రీరామ్: చాలామంది. ‘సోడాబుడ్డి అద్దాలు’ అని హేళన చేసేవారు. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా పట్టించుకొనేవాడ్ని కాదు. ఎందుకంటే నాకు ఏడవడం అలవాటు లేదు. కన్నీళ్లు చాలా విలువైనవని నా అభిప్రాయం. నాలో కసి రేకెత్తించడానికి నాకున్న వైకల్యం కూడా ఒక కారణం అయ్యింది. అందుకే దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మరి మీ ఆవిడ ఎలా ఫీలవుతారు? అనంత్ శ్రీరామ్: నేను పెళ్లప్పుడే వాళ్ల ఫ్యామిలీ మొత్తానికి చెప్పాను. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం కరెక్ట్ కదా. ఏ గేమ్స్ అంటే ఇష్టం? అనంత్ శ్రీరామ్: క్రికెట్. నేను మంచి బౌలర్‌ని, బ్యాటింగ్ అయితే రాదు. మీరు శాకాహారా? మాంసాహారా? అనంత్ శ్రీరామ్: మా ఇంట్లో అందరూ మాంసాహారులే. నేను శాకాహారిని. చిన్నప్పుడు పెట్టడానికి ట్రై చేశారట. కానీ నా శరీరానికి అది పడేది కాదు. ఇన్ని అనుభవాలు చవిచూసిన అనంతశ్రీరామ్ లక్ష్యం ఏంటి? అనంత్ శ్రీరామ్: నేను కళను శ్వాసిస్తానండీ.. నా లక్ష్యం కళాకారునిగా ఎదగడమే. ఇప్పటికీ నేను పూర్తి స్థాయి గేయరచయిత అయ్యానని భావించడం లేదు. ఎప్పుైడె తే నా పాట ఎదుటివారిలో మార్పు తెచ్చిందో అప్పుడే నేను గీత రచయితగా ఎదిగినట్లు. నా లక్ష్యం కూడా అదే. సంభాషణ: బుర్రా నరసింహ కట్నం తీసుకోవడం... వ్యభిచారం చేయడం నా దృష్టిలో ఒక్కటే. అందుకే తీసుకోలేదు. ఒక జీవితాన్ని ఇద్దరు కలిసి పంచుకోవడమే పెళ్లి. మగాడి శక్తిసామర్థ్యాలు సంపాదనలో కనిపిస్తాయి... ఆడదాని శక్తి ఇంటిని చక్కదిద్దుకోవడంలో కనిపిస్తుంది. ఇలా రెండు బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నప్పుడు పర్టిక్యులర్‌గా అబ్బాయే ఎందుకు డబ్బులు తీసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తింది. అందుకే ఆస్థిపాస్థుల గురించి పట్టించుకోకుండా, పెళ్లి ఖర్చు కూడా నేనే భరించి, నా భార్యను తెచ్చుకున్నాను. | |
Subscribe to:
Posts (Atom)