all

Wednesday, June 12, 2013

చినుకు రాలే సాయంత్ర వేళ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని రోజూ బజ్జీలు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లంటున్నారు. మరి అటువంటి సమయంలో తేలికగా తయారుచేసుకుని ఇంటిల్లిపాది తినే ఆరోగ్యభరిత ఛాట్స్‌ ఈవారం రుచిలో మీకోసం...



భేల్‌పూరి
కావలసినవి
మరమరాలు-100గ్రాములు
ఉడకబెట్టిన బంగాళాదుంపల ముద్ద-పావు కప్పు
చింతపండు-50గ్రా.
బెల్లం-50గ్రా
సన్న కారప్పూస-50గ్రా
పుదీనా ఆకులు-ఒకకట్ట
ఛాట్‌ మసాలా-ఒక టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర-ఒకకట్ట
పచ్చిమిర్చి-3
ఉప్పు-తగినంత



తయారుచేసే విధానం
బెల్లాన్ని నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మరిగించిన తరువాత చింతపండును కప్పు వేడినీటిలో వేసి కొద్దిగా చిక్కబడేవరకూ మరిగించి పక్కన పెట్టుకోవాలి. దీనికి పచ్చిమిర్చి ముక్కలను, పుదీనా ఆకులను కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన బంగాళా దుంపలను తీసుకుని దానికి ఛాట్‌మసాలా వేసి బాగా కలపాలి. మరమరాలను ఒక బౌల్‌లోకి తీసుకుని పుదీనా పేస్ట్‌ను కలపాలి. దీనిపై చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయముక్కలు, చింతపండు వాటర్‌, సన్నకారప్పూస, బంగాళాదుంపల ముద్దను వేసి బాగా గరిటెతో కలపాలి. భేల్‌పూరి తయారైనట్టే. తక్కువ కేలరీల ఆహారం ఇది. రుచికరమైనది కాబట్టి పిల్లలకు తినడానికి ఎంతో ఇష్టపడతారు.

దహీ పూరి
కావలసినవి
గోల్‌గప్పా-20
పెరుగు-పావు కప్పు
బఠాణీ గింజలు-పావు కప్పు (ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టినవి)
ఉడకబెట్టిన బంగాళాదుంపల ముద్ద- పావుకప్పు
జీలకర్ర-పావు టేబుల్‌స్పూన్‌
పసుపు-పావు టేబుల్‌ స్పూన్‌
గరం మసాలా పౌడర్‌-పావు టేబుల్‌ స్పూన్‌
కారం -ఒక టేబుల్‌ స్పూన్‌
తీపి చింతపండు చట్నీ-నాలుగు టేబుల్‌స్పూన్లు
ఉప్పు-తగినంత
నూనె-తగినంత
పైన అలంకరించడానికి
తాజా కొత్తిమీర
జీలకర్ర పౌడర్‌
పచ్చికారం
బ్లాక్‌ సాల్ట్‌
ఉప్పు
సన్న కారప్పూస


తయారుచేసే విధానం
స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి. అందులో జీలకర్రను వేసి చిటపటలాడాక ఉడికిన బంగాళాదుంప ముద్దను వేయాలి. దీనికి పసుపు, కారం, గరంమసాలా పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. సన్నని మంటమీద కొద్దిసేపు ఉడకనిచ్చి స్టవ్‌ మీద నుంచి దించేయాలి. పెరుగును ఒక బౌల్‌లో వేసుకుని చిక్కగా కవ్వంతో చిలకాలి. ఒక్కొక్క పూరీని తీసుకుని మధ్యలో రంధ్రం చేసి అందులో ఉడికిన బఠాణీ గింజల ముద్దను, బంగాళాదుంపల మిశ్రమాన్ని, స్వీట్‌ చట్నీని, రెండుస్పూన్ల పెరుగు వేసి ప్లేటులో పెట్టుకోవాలి. ఇలా కావలసినన్ని పూరీలను పెట్టాక పైన కొత్తిమీరను, బ్లాక్‌ సాల్ట్‌పౌడర్‌ను, సన్న కారప్పూసను, రెండు స్పూన్ల పెరుగును వేసుకుంటే దహీ పూరీ రెడీ. చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. రుచి కూడా వెరైటీగా ఉంటుంది.

కచోరి
కావలసినవి
గోధుమపిండి-ఒక కప్పు
పెసరపప్పు-అరకప్పు
శనగపిండి-పావుకప్పు
సోంపు-పావు టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర-పావు టేబుల్‌ స్పూన్‌
గరంమసాలా-పావు టేబుల్‌ స్పూన్‌
పచ్చికారం-అర టేబుల్‌స్పూన్‌
బేకింగ్‌ పౌడర్‌-పావు టేబుల్‌ స్పూన్‌
నూనె-తగినంత
ఉప్పు-తగినంత



తయారుచేసే విధానం
పిండిలో ఉప్పు వేసి బాగా కలపాలి. పెసరపప్పును నానబెట్టి బాగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌ మీద కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి దానిలో ఈ రుబ్బిన ముద్దను కూడా వేసి పదినిమిషాలు ఉడికించాలి. దీనికి అన్ని రకాల మసాలా పౌడర్లను వేసి బాగా కలిపి పొడిగా మారేవరకు వేయించాలి. దీనికి శనగపిండిని కలిపి కొద్దిసేపు ఉడికించాలి. కచోరీలో మిక్స్‌ చేసే స్టఫ్ఫింగ్‌ రెడీ అయినట్టే. గోధుమపిండి ముద్దను బాల్స్‌లా చేసుకుని దానికి మధ్యలో రంధ్రం చేసి స్టఫ్ఫింగ్‌ మిశ్రమాన్ని అందులో కూర్చి పైన కవర్‌ చేసుకోవాలి. వాటిని నూనెలో వేసి బ్రౌన్‌ రంగులోకి వచ్చే వరకూ వేయించుకోవాలి. వీటిని పచ్చిమిరపకాయల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

మసాలా పూరి
కావలసినవి
ఉడకబెట్టిన బఠాణీ గింజలు - రెండు కప్పులు
పచ్చిమిర్చి-3
వెజిటబుల్‌ ఆయిల్‌-ఒక టేబుల్‌స్పూన్‌
పచ్చికారం-ఒక టేబుల్‌ స్పూన్‌
గరం మసాలా-ఒక టేబుల్‌ స్పూన్‌
ఛాట్‌ మసాలా-ఒక టేబుల్‌ స్పూన్‌
బ్లాక్‌, రాక్‌ సాల్ట్‌-అర టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర పొడి- అరటేబుల్‌ స్పూన్‌
మిరియాలపొడి-అర టేబుల్‌ స్పూన్‌
తీపి చింతపండు చట్నీ- రెండు టేబుల్‌ స్పూన్లు
పెరుగు-అరకప్పు
ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగినది)
టమాటా- ఒకటి (చిన్నముక్కలుగా తరిగినది)
పూరీలు-పదిహేను
సన్నకారప్పూస-ఒక కప్పు
ఉప్పు-తగినంత



తయారుచేసే విధానం:
ఉడికించిన బఠానీలను మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. దానికి కొద్దిగా నీళ్లను చేర్చి జారుగా చేసుకోవాలి. స్టవ్‌ మీద కళాయి పెట్టి దానిలో ఈ ముద్దను వేసి కొద్దిసేపు ఉడికించాలి. దీనికి పచ్చికారం, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి, జీలకర్ర పొడి కలపాలి.
అన్నింటిని వేసి బాగా కలిపి ఐదునిమిషాలు ఉడికించాలి. కొద్దిగా జారుగా అవడానికి కావలసినంత నీటిని పోయండి.
దీనిని తినే ప్లేటులోకి తీసుకుని దీనిమీద వేయించిన పూరీలను ముక్కలుగా చేసి వేయాలి. దీనిపై చింతపండు చట్నీ, ఛాట్‌మసాలా, బ్లాక్‌ సాల్ట్‌, పెరుగు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, సన్నకారప్పూసతో సర్వ్‌ చేయండి. రుచి అమోఘంగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
 

నిద్రలేమిని అధిగమించడమెలా?

 

ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక పోవడాన్ని నిద్రలేమి (ఇన్‌సోమ్నియా) అంటారు.

కారణాలు
పని ఒత్తిడి

హృదయ, శ్వాససంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడటం వలన

విపరీతమైన ఆలోచనలు

శక్తికి మించిన పని చేయటం, కోపం, చిరాకు పడటం

మానసిక ఆందోళన

దాంపత్య జీవితం సరిగా లేకపోవటం

ఆహార విహారాలు మొదలగునవి.

లక్షణాలు
కారణం లేకుండా నిద్రపట్టకపోవటం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢనిద్రలోకి చేరుకోలేకపోవడం

కొంతమందికి తొందరగానే నిద్రపడుతుంది కాని అర్ధరాత్రి మెలకువ వస్తుంది.

చాలామంది నిద్రపోయిన తర్వాత నిద్రలేచే సమయానికంటే చాలా ముందరే మెలుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఎంత ప్రయత్నించినా వీరికి నిద్రరాదు.

మగవారిలో కన్నా ఆడవారిలో నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ వ్యాధి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం వలన నిద్రలేమి వ్యాధి వస్తుంది.

వాత వ్యాధి వలన వచ్చే నిద్రలేమి
భయం, ఉద్వేగం అనే లక్షణాలు ఉంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు
-రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి
-పడుకునే ముందు పాలు త్రాగాలి.
-వేడి ఆహరం తినటం మంచిది
-ఒత్తిడితో కూడిన పని చేయరాదు.

పిత్తదోష జనిత నిద్రలేమి
నిద్ర త్వరగా వస్తుంది. కాని మధ్యలో చాలా సార్లు మెలకువ వస్తుంది. శరీరం నొప్పులు, భయం, కోపం, బాధ మొదలగునవి లక్షణాలుంటాయి.

దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు:

-మసాలా పదార్థాలు తీసుకోకపోవటం మంచిది.

- ఉపవాసం చేయరాదు.

కఫదోష జనిత నిద్రలేమి
తెల్లవారు త్వరగా నిద్రలేవటం జరుగు తుంది. అలసట ఉంటుంది. సమయానికి ముందే మెలకువ వస్తుంది. దీనిని నివారించుకోవటానికి
-వ్యాయామం చేయటం
-గోరు వెచ్చని నీరు త్రాగాలి.
-తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిద్రలేమి వ్యాధిని ఔషధ సేవనం ద్వారా, పంచకర్మ చికిత్సల ద్వారా పూర్తిగా నివారణ చేయవచ్చును. ప్రాణాయామం చేయటం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చును. ఒత్తిడి తొలగి పోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఆయుర్వేద వైద్యనిపుణుల పర్యవేక్షణలో రోగ నిర్ధారణ చేసుకుని ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో తగ్గించవచ్చు.

నిద్రలేమి అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరు...
-వ్యాయామం చేయాలి.
- కెఫిన్ లాంటి పదార్థాలు తీసుకోకూడదు.
-మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.
- ఒత్తిడి తగ్గించు కోవాలి.
- పగటి నిద్ర మంచిది కాదు.
-ఆహార విహారాలు మార్చు చేసుకోవాలి.
-పడుకునే ముందు పాలు త్రాగాలి.
-కడుపును ఖాళీగా ఉంచకూడదు. అలాగని మరీ మితిమీరి కూడా తినకూడదు.

డాక్టర్ రమణ రాజు,
ఎం.డి (ఆయుర్వేద),
స్టార్ ఆయుర్వేద,
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
రాజమండ్రి, కర్ణాటక
ph: 7416 101 101 / 7416 102 102
 

నువ్వులు ,.,.,కమ్మటి కొసర్లు

 



ఉండలు - నువ్వుండలు...
అరిసెలు - నువ్వరిసెలు...
తేడా పట్టేసే ఉంటారు!
నువ్వులు మిక్స్ ఐతే ‘స్వీట్ నథింగ్స్’ అయినా సరే సమ్‌థింగ్ స్పెషల్ అయిపోతాయి!
జంతికలు, పొడులు...
పులగాలు, చికెన్లు - మటన్లు ఏవైనా నువ్వుల టచ్ పడితే చాలు
హై పిచ్‌లోకి వెళ్లిపోతాయి!
విడిగా నువ్వులు...
కలివిడిగా కమ్మటి కొసర్లు.



కమ్మటి కొసర్లు

కావలసినవి:
నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; ఏలకులపొడి - తగినంత; పుట్నాలు - 2 టీ స్పూన్లు; మైదాపిండి - 2 కప్పులు; నూనె - సరిపడా; ఎండుకొబ్బరి తురుము - 4 టీ స్పూన్లు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు.

తయారి:
నువ్వులలో కొద్దిగా నీరు చల్లి బట్టపై పోసి, బియ్యప్పిండి వేసి చేతితో బాగా రుద్ది, చెరిగితే పొట్టు పోతుంది


తరవాత బాణలిలో పోసి స్టౌ మీద ఉంచి, మంట తగ్గించి కలిపి, బాగా వేగాక స్టౌ ఆపేయాలి నువ్వులలోనే బెల్లంతురుము కూడా వేసి బాగా కలపాలి

చల్లారాక పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి, పుట్నాలు, కొబ్బరితురుము, ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి

మైదాలో... టీ స్పూను నూనె, నీరు పోసి చపాతీపిండిలా తడిపి గంటసేపు నాననివ్వాలి

చిన్న ఉండగా పిండిని తీసుకొని పొడిపిండి అద్దుతూ పూరీలాగ పల్చగా ఒత్తాలి

తగినంత నువ్వుల మిశ్రమం ఉంచి అంచులను చేత్తో నొక్కాలి. చక్రం ఉండే స్పూనుతో రోల్ చేస్తూ అంచులను తీసేయాలి. ఇలా చేసి కాగిన నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీయాలి. ఇవి వారం పదిరోజుల వరకు నిల్వ ఉంటాయి.

కీమా - నువ్వులు రోల్స్

కావలసినవి:
కీమా (మటన్) - 200 గ్రా;
ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; పసుపు - చిటికెడు; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; ఉల్లితరుగు - కప్పు;
పెరుగు - పావు కప్పు; ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క (అన్నిటినీ పొడి చేయాలి) - టీ స్పూను; మైదా - అర కిలో; డాల్డా లేదా నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు; కోడిగుడ్లు - 2; నూనె - వేయించడానికి సరిపడా; బేకింగ్ సోడా - పావు టీ స్పూను


తయారి:

మైదాలో బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి కరిగించిన నెయ్యి లేదా డాల్డా, గిలక్కొట్టిన కోడిగుడ్డు తెల్లసొన పిండిలో వేసి కలపాలి కొద్దిగా నీరు జతచేస్తూ మైదాపిండి మిశ్రమాన్ని చపాతీపిండిలా కలిపి నాలుగైదు గంటలు నాననివ్వాలి

ఒక పాత్రలో కీమా తీసుకుని, అందులో పసుపు, కారం, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాపౌడర్, కొద్దిగా పెరుగు అన్నీ కలిపి అరగంటసేపు నాననిచ్చి, మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా అయ్యేలా చేయాలి

స్టౌ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి

తయారుచేసి ఉంచుకున్న కీమా మిశ్రమం, ఉప్పు జత వేసి బాగా వేయించాలి

మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కో ఉండను పల్చగా చపాతీలా ఒత్తి, నలుచదరంగా ఉండేలా చాకుతో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి

తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని సన్నగా పొడవుగా రోల్‌లా తయారుచేసి చపాతీ మీద ఉంచి నెమ్మదిగా రోల్ చేయాలి

ఇలా ఒకదాని మీద ఒకటి మూడు చపాతీలను పొరలుగా రోల్ చేయాలి అప్పడాల పీట మీద నువ్వులు చల్లి, మరొక పొర తీసుకుని అప్పడాలకర్రతో ఒత్తి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న రోల్‌ను ఈ పొర పై ఉంచి మరోమారు రోల్ చేయాలి

ఫొటోలో చూపిన విధంగా కట్ చేసి, చివర్లు విడిపోకుండా లవంగం కాని టూత్ పిక్ కాని ఉంచాలి

స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక వీటిని ఒకటొకటిగా వేస్తూ డీప్ ఫ్రై చేయాలి

సాస్ కాంబినేషన్‌తో స్నాక్‌లా తింటే రుచిగా ఉంటాయి.

నువ్వుల రొట్టెలు

కావలసినవి:
బియ్యప్పిండి - 4 కప్పులు; నువ్వులు - కప్పు లేదా ఒకటిన్నర కప్పులు; ఉప్పు - తగినంత

తయారి:
ఒక కప్పు పిండిని పొడిపిండి కోసం వేరే గిన్నెలో ఉంచుకోవాలి

ఒక గిన్నెలో మూడుకప్పుల నీరు, తగినంత ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి

ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, మరిగించిన నీరు పోసి చపాతీపిండిలా కలపాలి

చల్లారాక నీళ్లు అద్దుకుంటూ ముద్దగా చేసుకోవాలి

జామకాయ సైజులో పిండిని తీసుకుని నువ్వులను రెండువైపులా, చుట్టూరా పట్టేలా అద్ది, పొడిపిండి వేసుకుని చపాతీలా (చేతితోకాని చపాతీకర్రతో కాని) పెద్దదిగా ఒత్తుకోవాలి

స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక ముందుగా తయారుచేసి ఉంచుకున్న రొట్టెను వేసి రెండుమూడు నిముషాలయ్యాక కొద్దిగా నీళ్లు జల్లి, మరో రెండునిముషాలయ్యాక తిరగ తిప్పాలి

బాగా కాలిన తరవాత తీసేయాలి

పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, వంకాయ చట్నీ కాంబినేషన్‌తో ఈ రొట్టెలు బాగుంటాయి

(ఈ రొట్టెలను నిల్వ చేసుకోవాలంటే, చిన్న మంటపై గట్టిగా కాల్చి, చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి. నెలరోజుల దాకా నిల్వ ఉంటాయి)

నువ్వుల సకినాలు

కావలసినవి:
బియ్యం - 4 కప్పులు; నువ్వులు - 2 కప్పులు; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడినంత; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; నెయ్యి - 2 టీ స్పూన్లు

తయారి:
బియ్యంలో నీళ్లు పోసి మూడు గంటలు నాననివ్వాలి

బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు వంపేసి పొడి వస్త్రం మీద పోసి ఆరనివ్వాలి కొద్దిగా తడిగా ఉండగానే బియ్యాన్ని గ్రైండ్ చేసి పిండిని జల్లించుకోవాలి

ఈ పిండిలో నువ్వులు, ఉప్పు, నెయ్యి, అల్లంవెల్లుల్లిముద్ద వేసి కలపాలి

నీళ్లు పోస్తూ ముద్దగా చే యాలి

సకినాల మాదిరిగా చుట్టి, పొడివస్త్రం మీద పెట్టుకోవాలి మొత్తం పిండిని ఈ విధంగా తయారుచేసి పక్కన ఉంచుకోవాలి

స్టౌ మీద బాణలి ఉంచి, నూనె పోసి కాగనివ్వాలి

తయారుచేసి ఉంచుకున్న సకినాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి బంగారువర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి. (ఇష్టపడేవారు కారం కూడా వేసుకోవచ్చు)

నువ్వుల పులగం

కావలసినవి:
బియ్యం - కప్పు; నువ్వుపప్పు - అర కప్పు;
బెల్లం - ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి - చిటికెడు;
పాలు - 2 కప్పులు; డ్రైఫ్రూట్స్ - తగినన్ని;
నెయ్యి - 5 టీ స్పూన్లు; బియ్యప్పిండి - పావు కప్పు.

తయారి:
బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి మెత్తగా అన్నం వండాలి



నువ్వులను ఇసుక లేకుండా చూసుకొని కొన్ని నీళ్లు చల్లి బట్టపై పోసి, బియ్యప్పిండి వేసి చేతితో బాగా రుద్దాలి

పొట్టును విడదీసి, నువ్వులను బాణలిలో పోసి స్టౌ పై పెట్టి చిన్నమంటపై ఉంచి, వేగిన తరువాత దించాలి

చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి

బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి

ఈ నేతిలోనే ఉడికించిన అన్నాన్ని, నువ్వలపొడిని కూడా వేసి పాలు పోసి ఉడకనివ్వాలి

ఐదు నిముషాల తర్వాత బెల్లం వేసి ఉడికిన తర్వాత ఏలకులపొడి కూడా వేసి కలిపి దించాలి

డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి

(అన్నం ఉడికించేటప్పుడు రెండుకప్పుల పాలు, రెండు కప్పుల నీరు కూడా పోసుకోవచ్చు)

నువ్వులపొడి

కావలసినవి:
ఇనువ్వులు - పావుకేజీ; ఎండుమిర్చి - 50 గ్రా.; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత

తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నువ్వులు వేసి దోరగా వేయించి దించేయాలి

అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఎండుమిర్చి కూడా వేసి వేయించి దించేయాలి

చల్లారాక మిక్సీలో ముందుగా పోపు వేసి గ్రైండ్ చేయాలి

నువ్వులు, ఉప్పు, ఇంగువ కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి

ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.

నువ్వుల ఉండలు

కావలసినవి:
నువ్వులు - కప్పు; బెల్లంతురుము - ఒకటిన్నర కప్పులు; ఏలకులపొడి - అర టీ స్పూను; జీడిపప్పు, కిస్‌మిస్‌లు - రెండు టీ స్పూన్లు; నెయ్యి - రెండు టీ స్పూన్లు

తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి కాగాక నువ్వులు వేసి వేయించి దించి, చల్లారనివ్వాలి.
మిక్సీలో నువ్వులు వేసి మెత్తగా చేయాలి

బెల్లం తురుము, ఏలకులపొడి వేసి అన్నీ కలిసేలా బాగా తిప్పాలి

ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని చేతికి నెయ్యి చేసుకుంటూ ఉండకట్టాలి

పైన జీడిపప్పు, కిస్‌మిస్‌లను అద్దాలి

రోజుకొక ఉండ తింటుంటే శ రీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది.

కర్టెసీ: పి.సాయిజ్యోతి,
అచ్చంపేట, మహబూబ్‌నగర్ జిల్లా


నువ్వుల చరిత్ర

నువ్వులు... పూలమొక్క జాతికి చెందినది. ఇది అతి ప్రాచీనమైన పంట. సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంటను పండిస్తున్నారు. పంటలు పండటానికి అనువుగాని ప్రదేశాలలో కూడా ఈ పంట చక్కగా పండుతుంది. ఈ పంటకు నీరు ఎక్కువగా అవసరం లేదు. ఇది బర్మా, ఇండియా, చైనా, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలో ఎక్కువగా పండుతుంది. నువ్వులను గింజల కోసం, నూనె కోసం అధికంగా పండిస్తారు. ప్రపంచంలోకెల్లా నువ్వులను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతదేశం అయితే, అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం జపాన్. ఈ దేశస్థులు తమ వంటకాలలో నువ్వులనూనెను ఎక్కువగా వాడతారు. ఇది అధిక లాభాన్ని తీసుకువచ్చే వాణిజ్యపంట.
 
ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించాలి కదా! ( కాదు కాదు. అనుభవించాల్సిందే)
ఇది ఎవరిని కించపరచడానికి చెప్పడం లేదు!

మన దివంగత ముఖ్యమంత్రి అకాల మృత్యువు పాలయ్యారు!, (మాంసపు ముద్ద లా తెచ్చుకోవాల్సి వచ్చింది), కొడుకు జగన్ మోహన్ కటకటాలు వెనక్కి వెళ్ళిపోయాడు! వాళ్ళ కుటుంబం ఇంకా అధికారం మీద వ్యామోహంతో రోడ్లమీద తిరుగుతుంది! వీళ్ళ పాపంలో పాలు పంచుకున్నవాళ్ళు ఏమయ్యారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు! అందరికి తెలిసిందే! అలాగే కొండల్ని పిండి చేసి 'భూమిని' ఇష్టారాజ్యంగా త్రోవ్వేసిన గాలి జనార్ధనరెడ్డి కటకటాల పాలయ్యాడు, ఇలా చెప్పాలంటే మన కళ్ళ ఎదురుగానే ఎన్నో ఘోరాలు చూస్తూనే ఉన్నాం! కాబట్టి జాగ్రత్తగా వుందాం! అందరి సౌక్యమ్ కోరుకుందాం!