all

Wednesday, December 12, 2012

చీరకట్టు మేడీజీ........ఫ్యాషన్

 
 
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు.
తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు.
తెలుగింటి సింగారాలు... సిరులొలికించే చీరలు.
వేడుక ఏదైనా... వేదిక ఏదైనా...
తెలుగింటి గుమ్మానికి తోరణపు కళ తెచ్చి
ఆనందాల వెల్లువను ఎద నిండా నింపేవి కోటి వరాల చీరలు.
‘చీరకట్టుకోవాలా...! నాకు రాదు’ అనే నేటితరం అమ్మాయిల నోట‘చీరకట్టుకోవడం అంటే ఇంత ఈజీనా!’
అనిపించే రెడీమేడ్ చీరలు ఈవారం...


1- పచ్చ, గోధుమరంగుల కలయికతో రూపుదిద్దుకున్న ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఇది. బెనారస్, జార్జెట్‌తో ఈ చీరకు కొత్త వన్నెలు అద్దారు. మెరూన్, వెల్వెట్ రంగుల్లో మెరిసిపోతున్న పువ్వుల ప్యాచ్‌లు ఈ చీరకు ఆకర్షణీయంగా మార్చాయి.

2- ఎరుపు, పసుపు, పచ్చరంగుల్లో మెరిసిపోతున్న రెడీమేడ్ నెట్ శారీ ఇది. వెల్వెట్ బార్డర్, కుందన్ మెరుపులు, పువ్వుల డిజైన్.. చూపు తిప్పుకోనివ్వని అందాన్ని ఈ చీరకు తీసుకువచ్చాయి. ఫిష్ కట్ , గ్రీన్ కలర్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఈ చీరను ప్రత్యేకంగా చూపుతున్నాయి.

3- గులాబీ, పచ్చ, వంగపండు రంగుల నెటెడ్ మెటీరియల్‌తో తీర్చిదిద్దిన మయూరపు రెడీమేడ్ చీర ఇది. వంగపండు రంగు బార్డర్, పువ్వుల ప్యాచ్‌వర్క్ చేసిన ఈ చీర వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.


4-నీలాకాశాన్ని వంచి ఎరుపు, మెరుపులను అద్దినట్టున్నది ఈ నెటెడ్ రెడీమేడ్ చీర. కుందన్, జర్దోసీ పనితనం ఈ చీరను ఆకర్షణీయంగా మార్చాయి.

No comments: