all

Friday, November 30, 2012

మన ఆహారం... మన గొప్పదనం...

(ఇండియన్ డైటేటిక్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘భారత ఆహారాలు-ఆరోగ్యం’పై సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1వరకు హైదరాబాద్‌లో సదస్సు జరుగుతున్న నేపథ్యంలో...)
తిండి కలిగితే కండ గలదోయ్... అన్నాడు మహాకవి గురజాడ. పనిచేయాలంటే తగినంత శక్తి ఉండాలి కదా... అయితే పనిచేయడానికి మాత్రమే కాదు మనిషి మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని కూడా తినే తిండి నిర్దేశిస్తుందని మన వేదాలు ఘోషిస్తున్నాయి. మనిషి వ్యవహారశైలి, పని స్వభావంపై ఆహారం ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో ప్రస్తావన ఉంది. ఆహారం మెదడుపైన ప్రభావం చూపిస్తుంది కనుకనే మనలో సత్వ, రజో, తమో గుణాలు ప్రేరేపణకు గురవుతుంటాయి. మన న్యాయశాస్త్రంలోనూ ఆహార పదార్థాల గురించిన వివరణ ఉంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమావయ, అభవ పదార్ధాలుగా వాటిని వివరించారు. అందుకే వేదకాలానికి పూర్వం నుంచే అన్నం పరబ్రహ్మ స్వరూపమైంది.

వ్యాధులు, ఆరోగ్యంలో ఆహార పదార్ధాల పాత్రపై మన పూర్వీకులకు పూర్తి అవగాహన ఉండేది. ఉప్పు అధికంగా తీసుకంంటే వచ్చే ఎగ్జిమా, అసిడిటీల గురించి, స్వీట్లు ఎక్కువ తింటే పెరిగే కఫ దోషాల గురించి వారికి అనాడే తెలుసు. వాటికి విరుగుడుగా మంచి ఆహార అలవాట్లను, దోషనివారణకు అనువైన సాంప్రదాయ వైద్య ప్రక్రియలను అనాడే అభివృద్ధి చేసుకున్నారు. కానీ కాలం మారింది. నేడు కొత్త తరం ఆహార పదార్ధాలు వచ్చేశాయి. మనదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చాయి. జీవన విధానమూ మారిపోయింది. సాంప్రదాయ భారత ఆహారం గింజధాన్యాలతో నిండి ఉండేది. దంపుడు బియ్యం స్థానంలో బాయిల్డ్ రైస్ వచ్చి చేరాయి. తెల్లబియ్యం వచ్చిన తర్వాత మిగిలిన రకాలను తినడమే మానేశారు.

గోధుమ పరిస్థితీ ఇంతే. చపాతీల స్థానాన్ని రిఫైన్డ్ గోధుమతో తయారయ్యే బ్రెడ్‌లు ఆక్రమించాయి. అమెరికన్లు, యూరోపియన్లు మన వంటకాలు నేర్చుకుని వాటిలో ఉన్న పోషక విలువలను తెలుసుకుని ఆశ్చర్యపోతుంటే భారతీయులు మాత్రం వారి పిజ్జాలు, బర్గర్ల వెంటపడుతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులను పూర్తిగా వదిలేశారు. ఇపుడు తింటున్న రిఫైన్డ్ ఆహారంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉండడం లేదు. దాంతో రోగనిరోధక శక్తి కనుమరుగైపోతున్నది. వ్యాధులు పెరిగిపోయాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్, ఊబకాయం, డయాబెటిస్ వంటివి దాడి చేస్తుండడానికి కారణం మనం తినే ఆహారమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన శరీర తత్వాన్ని, మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అనేక వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. సరిహద్దులో నిరంతరం దేశరక్షణ బాధ్యతలను చూస్తున్న సైన్యాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వారు ఎడారిలో, కొండకోనల్లో, మైదాన ప్రదేశాలలో కాపలా కాస్తుంటారు. అందుకే వారి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నది. సైనికులు దేశాన్ని రక్షిస్తున్నట్టే మనమూ మన దేహాన్ని రక్షించుకోవాలి. ఈ విషయంలో మన పరిశోధనా సంస్థలు తీసుకుంటున్న జాగ్రత్తల నుంచి మనమూ పాఠం తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అపుడే ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతుంది.

రుచుల సోయగం

సోయ... అంటే సో గుడ్.
సోయ... ఉంటే సో హెల్దీ.
సోయ... వండితే సో టేస్టీ.
వీకెండ్‌లో హోటల్‌వైపు పరుగులు తీసే జిహ్వను కట్టిపడేసేలా ‘సోయ’ వంటకాలతో
ఇంటిల్లిపాదికి వెరైటీ విందు ఇవ్వండి.
వీకెండ్‌ను యమ్మీగా మార్చావంటూ కితాబు అందుకోండి.


సోయాబీన్ సటయ్

కావలసినవి

సోయాబీన్స్ - 100 గ్రా.
(సోయాబీన్స్‌ను మిక్సర్ జార్‌లో వేసి, మెత్తగా పొడి చేయాలి.) ఉప్పు - తగినంత
పీ నట్ బటర్ - 100 గ్రా.
సోయ పాలు - తగినన్ని
పై పదార్థాలన్నీ చపాతీ పిండిలా కలిపి, పక్కనుంచాలి.
చాప్ స్టిక్స్ - తగినన్ని
సటయ్ మ్యారినేట్ కోసం...
లెమన్‌గ్రాస్(మార్కెట్లో లభిస్తుంది) - అర కప్పు, ఉల్లిపాయలు - 2 (చిన్నవి), వెల్లుల్లి రెబ్బలు - 4
కారం - అర టీ స్పూన్
అల్లం - చిన్నముక్క
పసుపు - చిటికెడు
ధనియాలపొడి - టీ స్పూన్
సోయా సాస్- 2 టేబుల్‌స్పూన్లు
నూనె - 3 టేబుల్ స్పూన్లు

తయారి

మ్యారినేట్ కోసం చెప్పిన పదార్థాలన్నీ మిక్సర్ వేసి, బ్లెండ్ చేసి పక్కన ఉంచాలి. సోయాబీన్ మిశ్రమాన్ని సమానభాగాలు చేసి, కావలసిన షేప్ చేయాలి. వీటికి పుల్లలు గుచ్చి, వాటిమీద మారినేట్ మిశ్రమాన్ని పోయాలి. అన్నివైపులా తడిసేలా జాగ్రత్త తీసుకొని, ప్లేట్‌పైన మరో మూత పెట్టి లేదా కవర్‌తో మూసేయాలి. దీనిని గంటసేపు బయట ఉంచి, మరో గంట ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తర్వాత ఈ ముక్కలను గ్రిల్ చేయాలి. రెండు వైపులా గ్రిల్ చేశాక, ప్లేట్‌లోకి తీసుకొని గార్నిష్ చేయాలి. పెనం మీద కాల్చుకోవాలంటే సరిపడా నూనెను వాడాలి. వీటిని టొమాటో చట్నీతో సర్వ్ చేయాలి.

టోఫు పీస్ మసాలా

కావలసినవి

సోయాటోఫు (మార్కెట్లో లభిస్తుంది) - 100 గ్రా., పచ్చి బఠాణీలు - అర కప్పు
ఉల్లిపాయలు - 2, టొమాటో - 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
బాదంపప్పు - 4, జీడిపప్పు - 4
ఎండుమిర్చి - 4, ధనియాలు - టేబుల్ స్పూన్, ఏలకులు - 2,
సోంపు - అర టీ స్పూన్,
దాల్చినచెక్క - చిన్న ముక్క
కారం - 2 టీ స్పూన్లు (తగినంత)
ఉప్పు - తగినంత, కొత్తిమీర - తగినంత

తయారి

ఉల్లిపాయలను, టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. టోఫులను నీళ్లలో వేసి, బయటకు తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి. (ఇలా చేస్తే టోఫుల్లోని నీళ్లన్నీ ఇంకిపోతాయి). మెత్తబడిన టోఫులను కావలసిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, టేబుల్‌స్పూన్ నూనె వేసి, సన్నని మంటమీద టోఫు ముక్కలను పది నిమిషాలు రెండువైపులా వేయించాలి. టోఫులను విడిగా గిన్నెలోకి తీసుకొని, చల్లారనివ్వాలి. అదే పాన్‌లో మరొక టీ స్పూన్ నూనె వేసి, దాల్చినచెక్క, ఏలకులు, సోంపు, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్‌లో ఉల్లిపాయముక్కలు వేయించి, దాంట్లో టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఉడికిన టొమాటో ముక్కలను గరిటెతో చిదిమి, చల్లారనివ్వాలి. బాదం, జీడిపప్పులను వేయించి, పేస్ట్ చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించిన దినుసులను మిక్సర్ జార్‌లో వేసి, పొడి చేయాలి. దీంట్లోనే టొమాటో మిశ్రమం వేసి పేస్ట్ చేయాలి. స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడయ్యాక, టొమాటో మిశ్రమం, జీడిపప్పు పేస్ట్ వేసి, కప్పు నీళ్లు పోసి కలపాలి. దీంట్లో ఉప్పు, కారం వేసి మరో పది నిమిషాలు మరిగించాలి. మిశ్రమం బాగా చిక్కబడిన తర్వాత టోఫు ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చివరగా కొత్తిమీర వేసి దించాలి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది.

సోయ కబాబ్

కావలసినవి

సోయాబీన్ పొడి - 100 గ్రా.
బ్రెడ్ క్రంబ్ పౌడర్ - 100 గ్రా.
అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పచ్చిమిర్చి - 4
గరంమసాలా,
జీలకర్ర పొడి -
అర టీ స్పూన్ చొప్పున
ఆమ్‌చూర్ పొడి
(మార్కెట్లో లభిస్తుంది)
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
నూనె - తగినంత

తయారి:

కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ వేయించాక కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిర్చి బజ్జీ అంత సైజు చేయాలి. వీటిని బొగ్గుల మీద లేదా గ్రిల్‌లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేయాలి. వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.

కర్టెసీ: ప్రఫుల్‌కుమార్ నాయక్,
ప్యాపిరస్ రిసార్ట్, తిమ్మాపూర్, మహబూబ్‌నగర్
ఫొటోలు:ఎస్.ఎస్.ఠాకూర్

మీ వివాహబంధాన్ని.. గుర్తుచేసే 10 తీపి గుర్తులు...

జీవితంలో మరుపు రానిది పెళ్లి. వివాహం అన్నది ఆయా మతాలకు, కులాలకు సంబంధించిన సంప్రదాయబద్ధంగా హంగు, ఆర్భాటాలతో చేసుకుని ఆనందం పొందుట సామాజిక లక్షణం. పిల్లలు, ఆస్తిపాస్తుల రక్షణ, వంశాభివృద్ధి కోసమే పెళ్లి అన్నది పూర్వీకుల ఆలోచన. ఒకరికొకరు తోడు నీడగా జీవితాంతం కలిసి మెలసి ధర్మ, అర్ధ, కామ, మోక్ష అనే నాలుగు పురుషార్థాలను పాటించాలంటూ.. మంగళ సూత్ర ధారణ సందర్భంగా మాంగల్యం తంతు నానేనా... అన్న మంత్రాన్ని జపిస్తారు. ఇంతటి బలమైన బంధాన్ని నేటి యువత తెగ తెంపులు చేసుకుంటోంది.గతంలోలా పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు కనుమరుగవుతూ ప్రేమ పెళ్లిళ్లకు ప్రాధాన్యంపెరుగుతోంది. సంసారమంటే అవగాహన లేకపోవడం,చిన్న స్పర్ధలకు జీవితభాగస్వామ్యులు విడిపోతున్నారు. కేవలం ఆకర్షణకు లోనైన యువత ప్రేమ పేరుతో పెళ్లిళ్లు చేసుకునివాటిని పెటాకులుగా మార్చేస్తున్నారు.
భార్యా భర్తలంటే పూర్తి అవగాహనతో మెలగాలి. ఒకరి కష్టాలు మరొకరు తెలుసుకుని, ప్రేమతో పరిష్కరించుకోవాలి. మనస్సు విప్పి మాట్లాడుకుంటే అన్నీ సమస్యలు తీరుతాయి.
ఈ మోడ్రన్ యుగంలో, ప్రతి క్షణం జీవితం ఒత్తిడితో గడపాల్సి వస్తోంది. ఆ ఒత్తిడి కారణంగా శరీరకంగానే కాకుండా.. మానసికంగాను, పర్సనల్ రిలేషన్ షిప్ లోనూ ముఖ్యంగా పెళ్ళి విషయంలోనూ ప్రభావం చూపిస్తున్నాయి. గతంలో పెళ్ళిళ్లు అంటే చాలా స్ట్రాంగ్ గా మంచి, చెడులను చూసుకొని జరిగేవి, జరిపించేవారు పెద్దలు. కానీ ఈ మోడ్రన్ ప్రపంచంలో పెళ్ళిళ్లు రానురాను దానికి విరుద్దగా తయారవుతున్నాయి. ముందు కాలంలోలాగా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లు అరుదుగా జరగుతున్నాయి. పెళ్ళి కుమార్తెను, పెళ్ళి కుమారుల వారికి వారే సెలక్ట్ చేసుకొంటున్నారు. వారికి ఇష్టం వచ్చిన పద్దతుల్లో పెళ్ళిళ్లు జరిపుకుంటున్నారు. సాంప్రదాయ పెళ్ళిళ్లు అరుదైపోతున్నాయి. పెళ్ళిలోని తీపి జ్ఞాపకాలు గుర్తుంచుకోవడానికి ఏమి మిగలడం లేదు. అందుకే ఆ కాలంలోని జరిగే పెళ్ళిళ్లు సంతోషంగా జరిగేవి. భాధలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మీ పార్ట్నర్ మీమీద కోప్పడినప్పుడు, ఒకరికొకరు దూరంగా జీవించేటప్పుడు మీరు సంతోషంగా గడపడానికి బాధను, ఒత్తిడి నుండి బయటపడటానికంటూ కొన్ని తీపి గుర్తులుండాలి.
కానీ అలాంటి తీపి గుర్తులు ప్రస్తుకాలంలో దూరం అవుతున్నాయి. మీ ఒత్తిడిని, బాధలను దూరం చేసుకోవాలంటే పెళ్ళి నాటి ఆల్బమ్స్, లేదా హనీమూన్ పిక్చర్స్ లేదా మీరు ఎక్కువగా సంతోషంగా గడిపిన రోజులను గుర్తు చేసుకోవడం కంటే మీరే ఇతర ఔషదం లేదంటే నమ్మండి. అటువంటి జ్ఞాపకాలు మీ విహహ జీవితాన్ని మరింత బలపడేలా చేయడమే కాకుండా మీ పార్ట్నర్ మిమ్మలి బాధపెట్టేవారు కాదని తెలియజేస్తాయి. కలిసి సంతోషంగా జీవించడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకేముంటుంది చెప్పండి... ఈ తీపి జ్ఞాపకాలేంటో మీ జీవితంలో ఉన్నాయోలేదో.. లేదా ఇలా చేస్తే బాగుండు అనుకొనేవారు ఇవి చూడండి..



మొదటి రోజు


మొదటి రోజు: పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు పార్ట్నర్స్ ఇద్దరు చూపులు కలసినప్పుడు వారిలో కలిగే ఒక అనుభూతి ఒక తీపి జ్ఞాపకం.


స్నేహితుడులా


స్నేహితుడులా: స్నేహం లేదా తమాష పట్టించడం అనేవి ఇద్దరి జీవితంలోనూ చాలా ముఖ్యమైన క్షణాలు. కాబట్టి మీరు కష్టకాలంలో, బాధలో ఉన్నప్పుడు ఇటువంటి జ్ఞాపకాలతో కొంత ఉపశమనం పొందవచ్చు.


ప్రేమలో పడ్డం


ప్రేమలో పడ్డం: ఇద్దరి పార్ట్నర్స్ మద్య ప్రేమ పుట్టిన మొదిటి క్షణాలు జీవితానికి పునాదులు. కాబట్టి ఆ మధుర జ్ఞాపకాలను ఆ ప్రేమను కలకాలం అలాగే భధ్రంగా నిలిచి ఉండేలా చూసుకోవాలి.

మొదటి ముద్దు


మొదటి సారి పలకరింపు/మొదటి ముద్దు: రెండూ ఒక లాంటివే ఎందుకంటే ఆ అనుభూతి చెప్పలేని ఆనందాన్ని, అనుభూతి ఇస్తాయి. అది ఇద్దరి మధ్య వర్జినిటీని తెలియజేస్తాయి.

ప్రపోసల్


ప్రపోసల్: అతడు, ఆమె ఎవరో ఒకరు మొదటి సారి మీరు ఇష్టమని ప్రేమను వ్యక్తం చేసిన క్షణాలు!ఓ మధుర జ్ఞాపకం




వెడ్డింగ్ షాపింగ్


వెడ్డింగ్ షాపింగ్: దాంపత్య జీవితం బలపడటానికి పెళ్ళి. పెళ్లికి ముందు ఇద్దరూ వెడ్డింగ్ షాపింగ్ చేయడం మరో మధుర జ్ఞాపకం. చిరకాలం నిలిచి ఉండి ప్రేమను బలపరచడానికి, ఇద్దరి ఇష్టాఇష్టాలను తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.



పెళ్ళి రోజు


పెళ్ళి రోజు: ఇది జీవితాంత నిలిచి ఉండే మధురమైన జ్ఞాపకం. ఎన్ని సంవత్సరాలు గడిచిని ఎంత వయస్సు వచ్చిన పెళ్ళి రోజు మాత్ర చచ్చేంత వరకూ తీపి జ్ఞాపకంగానే మిగిలిపోతుంది.



హనీమూన్ ట్రావెల్


హనీమూన్ ట్రావెల్: మీ జీవితంలో మొదటి సారిగా కలిసి ప్రయాణం చేసే.. చాలా అందమైనటువంటి విహార యాత్ర. హనీమూన్. ఈ విహార యాత్రలో ప్రతి క్షణం ఓ మధురజ్ఞాపకం.

పోట్లాట


పోట్లాట: పెళ్ళైన మొదటి సారిగా పోట్లాడు కోవడం అనేది జీవితంలో మరువలేని మధుర క్షణం. సంతోషంతో పాటు బాధను కూడా మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలి.



తల్లిదండ్రులైనప్పుడు:


తల్లిదండ్రులైనప్పుడు: ఇద్దరి జీవితంలో ఇదో అధ్భుతమైనటువంటి క్షణం. ఇదో మధుర జ్ఞాపకం.

వృద్ధాప్యాన్ని తరిమికొట్టు.. ఎప్పుడూ యవ్వనంగా ఉండు....

యవ్వనం, జీవితంలో ఒక మధురమైన దశ. మనిషి యవ్వనంగా కనిపించాలని ఎప్పుడూ కోరుకుంటాడు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, దాని కోసం మనుషులు చేసే ప్రయత్నాలే నవ్వు తెప్పిస్తుంటాయి. మానవుడు తన జీవితకాలంలో వృద్ధాప్యాన్ని చూడటం సహజం. ఆ వృద్ధాప్యాన్ని సహజంగా ఎవరూ కోరుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిత్యం యవ్వనస్తులుగానే ఉండాలని కోరుకుంటారు. అయితే నడి వయస్సు నుంచి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టే కాలంలో ఆ వేగాన్ని మనం తీసుకునే ఆహారపానీయాల ద్వారా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  
అలాగే ఈ వయస్సులో తరచూ వచ్చే వ్యాధులను కూడా నియంత్రించగలిగితే శారీరకంగానూ, మానసికంగానూ వృద్ధాప్యాన్ని కొంతకాలం వరకు పొడిగించడానికి వీలవుతుంది. ప్రకృతిపరంగా లభించే ధాన్యాలు, పండ్లు తీసుకోవడం ద్వారా వృద్ధాప్య వేగాన్ని తగ్గించగలిగితే అంతకంటే ఆనందం ఏంవుంటుంది. పండ్లు ఎక్కువసార్లు తీసుకుంటే బరువెక్కిపోతారన్న అపోహవుంది. సహజంగా అతి తక్కువసార్లు తినేవారే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ముడి ధాన్యాలు, చెర్రీపండ్లు, అవకాడో పండ్లు, ఆప్రికాట్లు, ఆపిల్ పండ్లువంటివి ప్రకృతి సిద్ధంగా లభించేవి. సహజసిద్ధమైన ధాన్యాలు పండ్లు వృద్ధాప్యంలో ఎదురయ్యే అతి ప్రధాన సమస్యల నుంచి కాపాడతాయి.
ఆరోగ్యం వ్యక్తిత్వాన్నే కాదు వృద్ధాప్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. రోజవారి జీవితంలో ఎదుర్యే సమస్యలు, మానసిక ఒత్తిడులు మన చర్మంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా చర్మం ముడుతలు పడి, నిర్జీవంగా తయారవుతుంది. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా, మన శరీరంలో చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి సమపాళ్ళలో లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి మెరుగుపడి చర్మం యవ్వనంగా ఉండటమే కాక కాంతిలీనుతూ ఉంటుంది. చర్మం కాంతివంతంగా ముడుతలు లేకుండా యవ్వనంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొన్ని ఆహారాలు తరచూ తప్పని సరిగా తీసుకొంటుండాలి. మరి అవేంటో చూద్దాం...

 
 నట్స్: తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు నట్స్ ను కూడా తరచూ తినడం వల్ల వింటర్ సీజన్ లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్ టైమ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.


బెర్రీస్: ముఖంలో వృద్దాప్య ఛాయలు కనబడనీయకుండా, రానియ్యకుండా చేసే వాటిలో బ్లూ బెర్రీస్ చాలా అద్భుతమైనటు వంటి ఆహారం. బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ 'ఆక్సిడేటివ్‌ ఫైటో కెమికల్స్‌', జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం'' అని, జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ'లో ప్రచురితమైన ఒక వ్యాసంలో, శాస్త్రజ్ఞులు వివరించారు.బ్లూ బెర్రీస్ - వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు, అంథోసియానిన్ అనే ఫ్లావనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలీఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం,పొటాషియం మరియు పీచు పదార్థము ఉన్నాయి . కాబట్టి ఇవన్నీ వయస్సు సంబంధించిన విటమిన్లు, ప్రోటీన్లే కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేదుకు సహాయపడుతుంది.

 
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: ఆకుకూరల్లో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది, అది చర్మం కాంతివంతంగా ప్రకాశించడంలో దోహదపడుతుంది. అంతేకాదు ఆకుకూరల్లో ఉండే క్యారోటినాయిడ్స్ చర్మం ముడతలను తొలగించి, ఆరోగ్యంగా ఉంచుతుంది.




చేపలు: తీరప్రాంతాల్లో నివసించే మహిళలు చాలా అందంగా ఉంటారు. వారి అందానికి ఓ సీక్రెట్ ఉంది? అదేంటంటే తీర ప్రాంతాల్లో నివసించే వారు తరచూ చేపలు, చేపనూనెను ఆహారంగా తీసుకోవడం వల్ల వారి చర్మం దృడంగా, మెరుసేట్లు చేస్తుంది. కోల్డ్ వాటర్ ఫిష్ అంటే సాల్మన్ మరియు తున అనే చేపలు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను అధికంగా కలిగి ఉండటం వల్ల అవి చర్మాన్నికి బాగా ఉపయోగపడుతాయి. చర్మంలో ముడుతలు రాకుండా, కాంతివంతంగా ఉండేందుకు బాగా సహాయపడుతుంది.


తృణధాన్యాలు: తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ మల్టీ గ్రెన్ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందువలన వాటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చు.


గ్రీన్ టీ: మరో యాంటిఆక్సిండెంట్ గ్రీన్ టీ. ఇది కావల్సిన శక్తిని ఇస్తుంది. మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇది కూడా వయస్సు పైబడనీయకుండా ఉంచే వాటిలో ఒక అద్భుతమైనటువంటిదే.



నీళ్ళు: వయస్సును తగ్గించడంలో ప్రతి రోజూ మనం తీసుకొనే డైయట్ లో నీరు కూడా ఒక భాగమే. నీరు ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను మంచి ప్రయోజనకారి. ప్రతి రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది.


చాక్లెట్స్: మీకు చాక్లెట్స్ తినే అలవాటుంటే మరీ మంచిది. చాక్లెట్స్ లో అంత అద్భుతమైన గుణాలున్నాయి. వయస్సును తెలియనియ్యకుండా చేసే లక్షణం చాక్లెట్స్ లో అధికంగా ఉన్నాయి. అనేక అధ్యయనాల ప్రకారం, చాక్లెట్స్ లో ఉపయోగించి కోకో, చాక్లెట్ మిల్క్ చర్మ కణజాలాలు సురక్షింతంగా ఉంచుతాయి. మరియు కణాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దాంతో చర్మంలో గరుకుదనం పోయి, చర్మం సున్నితంగా తయారువుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ఆహారనియమాలను పాటించి వయస్సు మీద పడకుండా.. యవ్వనంగా కనబడేందుకు ప్రయత్నం చేయండి..!



 

కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఆయిల్ అవసరమెంత...?

నూనె లేకుండా కూరలు, వినడానికి బాగానే వుంటాయి... తినడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అస్సలు నూనె లేకుండా ఎలా తినలేమో నూనె ఎక్కవయినా తినలేం. వంటలలో ఎంత నూనె వాడాలి అన్నదానికి ఇప్పటి వరకూ కచ్చితమైన కొలమానం ఏదీ లేదు. ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు కూరుల్లో నూనె వేస్తుంటారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు కూడా నేనున్నానంటూ పొరలు పొరలుగా పేరుకపోతుంది. కొవ్వు శరీరానికి ఒక స్థాయి వరకూ అవసరమే. మోతాదు మించితేనే ప్రాణాంతకమవుతుంది.
ఆరోగ్య కర జీవన విధానం ఆచరిస్తూ, శరీర బరువు అధికం చేసుకోకుండా స్లిమ్ గా కూడా ఉండాలంటే, సరైన వంటనూనె ఎంపిక చేయటం కష్టమే. తక్కువ కేలరీలు కల ఆరోగ్యకర ఆహారం ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. మీ బరువును తగ్గించేస్తుంది. కొద్ది పాటి వ్యాయామాలు చేస్తే చాలు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ప్రధానంగా ఆహార తయారీలో వాడే నూనెలు మీ శరీరంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను నియంత్రించేవిగా ఉండాలి. అసలు పూర్తిగా కొవ్వు, నూనెలు లేని ఆహారాలు రుచి పచి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి. ఆరోగ్యకర నూనెలు, కొవ్వులు వాడేందుకు కొన్ని చిట్కాలు పరిశీలించండి.
నూనెలను గాలి చొరని డబ్బాలలో చల్లటి, పొడి ప్రదేశాలలో నిలువ చేయండి. నూనెలను అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేసి నిలువ చేయండి. కొవ్వులు రసాయనాలకు చెందిన లిపిడ్ గ్రూపులో భాగం. ప్రతి ఒక గ్రాముకు 9 కేలరీల ఎనర్జీని ఇస్తాయి. ఇవి ఆహారంలో ఎంతో రుచిని కడుపు నిండటాన్ని, తృప్తిని మీకు కలిగిస్తాయి. విటమిన్లను కరిగించుకొని మీ శరీరానికి అందేలా చేస్తాయి. నూనెల వాడకం శరీర అవయవాలకు మెత్తటి కవచంలా పనిచేస్తుంది. మన శరీరం కొన్ని ఫ్యాటీ యాసిడ్లను అంటే లినోలీక్ లినోలెనిక్ లను తయారు చేసుకోలేదు. కనుక మనం వాటిని బయటి కొవ్వుల నుండి శరీరానికి అందించాల్సిందే.


ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా చెడు: ఆహార తయారీ ప్రక్రియలో ఏర్పడే శాట్యురేట్ కాని కొవ్వులు లేదా సింధటిక్ లేదా ఇండస్ట్రియల్ ట్రాన్స్ ఫ్యాట్ మీ శరీరంలో ఎల్ డిఎల్ అంటే చెడు కొల్లెస్టరాల్ పెంచుతుంది. ఆరోగ్యకరమైన హెచ్ డిఎల్ కొల్లెస్టరాల్ ను తగ్గిస్తుంది. దీనితో గుండె జబ్బులు వస్తాయి. ఆలివ్ నూనె వాడకం మంచిది. దీనిలో మోనో అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్లను తగ్గిస్తాయి. మంచి కొల్లెస్టరాల్ స్ధాయి అలానే ఉంచుతాయి. సాధారణంగా తయారీ దారులు రెండు లేదా మూడు రకాల తయారీ ప్రక్రియతో అంటే, సలాడ్లకు, వంటలకు వివిధ రకాలుగా నాణ్యతను బట్టి తయారు చేస్తారు. ఎప్పటికి వీలైనంతవరకు ఖరీదు అయినప్పటికి నాణ్యతకల వంటనూనెలు మాత్రమే వాడండి.



రైస్ బ్రాన్ ఆయిల్: దీనినే తవుడు నూనె అని కూడా అంటారు. దీనిలో సహజమైన విటమిన్ ఇ ఉంటుంది. ఇది కూడా కొల్లెస్టరాల్ నియంత్రిస్తుంది.



సన్ ఫ్లవర్ ఆయిల్: దీనిలోని లినోలిక్ యాసిడ్ కొలెస్టరాల్ స్ధాయిలను నియంత్రిస్తుంది. వేరే నూనెలతో చేస్తూ అపుడపుడూ దీనిని వాడవచ్చు.




మస్టర్డ్ నూనె లేదా ఆవ నూనె: దీనిలో మోనో అన్ శాట్యురేటెడ్ మరియు పాలీ అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది తక్కువగా వాడండి.


వేరుశనగ నూనె: ఈ నూనె చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలను మన శరీరంలో తగ్గిస్తూ మేలు చేస్తుంది. మంచి కొల్లెస్టరాల్ తగ్గించదు.



కొబ్బరి నూనె: దీనిలో అసలు కొలెస్టరాల్ ఉండదు. కనుక దీనిని వంటలలో వాడవచ్చు. అయితే మితంగా వాడండి.



ఆలివ్ ఆయిల్: ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దీని వీలువ చాలా ఎక్కువ. పొట్ట తగ్గేందుకు ఇది చాలా ఉపయోగ పడతది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించడం ద్వారా మధుమేహం, హృద్రోగసమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు. హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులతో ఆలివ్ ఆయిల్ పోటీ పడుతుందని, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు ఆలివ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుంది.


కొవ్వును ఏ విధంగా తగ్గించుకోవచ్చు: నూనెను తప్పనిసరిగా వంటలలో వాడవలసి వచ్చినప్పుడు సన్ ఫ్లవర్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇందులో కూడా రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇందులో కూడా రిఫైండ్ ఆయిల్ లభ్యమవుతోంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచింది. మాంసాహారాల్లోనూ నూనెను ఎక్కువగా ఉపయోగించాల్సి రావడం అనివార్యం కాబట్టి, మాంసాహారాన్ని తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. నెలకు ఒకటి రెండు సార్లు తప్పించిమాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అప్పుడు కూడా నూనె కన్నా నీటిని ఎక్కువగా వాడాలి వీటిలో ఉపయోగించే మసాలాలు కూడా తగ్గించాలి. వేపుడు కూరలకన్నా, ఓవెన్ లో ఉప్యోగించన కూరలే మేలు. వేపుడు కూరలు తీసుకోవలసి వస్తే వాటి మీద ఉన్న నూనెను టిష్యూ పేపర్ తో తీసి వేసి ఆ తర్వాతే తినాలి. ఆహార పదార్థాలు వండేటప్పుడు వాటిల్లో కొవ్వు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిన పనిలేదు.

అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. :)


అమ్మంటే...



సృష్టికర్త ఒక బ్రహ్మ... అతనిని సృష్టించినదొక అమ్మ' అన్నాడో కవి. సృష్టికి మూలం ఖచ్ఛితంగా అమ్మే! కడుపులో పిండం తయారైంది మొదలు తన ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో మార్చుకుని పిండం పెరుగుదలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. స్త్రీ. ప్రసవం స్త్రీకి పునర్జన్మతో సమానమంటారు పెద్దలు. కానీ, 'అమ్మా' అని పిలిపించుకోడానికి తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. కడుపులోని పిండం తన చిట్టి పాదాలతో తన్నుతుంటే ఆ కదలికను తనివితీరా ఆస్వాదిస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డకు తొలి రుచిని చూపించేది అమ్మ. ఆ బిడ్డ మాటలు నేర్చి 'అమ్మా' అని పిలిస్తే ఆ పిలుపుకు లోకాన్నే మరిచిపోతుంది. బిడ్డకు చిన్న నలత చేసినా తల్లడిల్లిపోయి తిరిగి కోలుకునేవరకూ తన మనసు కుదురుపడదు. పాపాయి బుడిబుడి అడుగులు వేస్తుంటే తన చేతిని ఆలంబన చేసి బిడ్డకు అడుగులు నేర్పించేది, విద్యాబుద్ధులు నేర్పేది అమ్మే. తన బిడ్డ పెరిగి పెద్దవాడై జీవితంలో తప్పటడుగులు వేస్తుంటే మంచిచెడ్డలు చెప్పి సరైన మార్గంలో నడిపి, వారి భవిష్యత్తుకు తన శక్తికి మించి శ్రమిస్తుంది అమ్మ. బిడ్డలు పుట్టేవరకూ భర్తే లోకమని అనుకునే స్త్రీ తను మాతృమూర్తి అయినాక బిడ్డలే తన లోకం అన్నట్లుగా ఉంటుంది. 'పిల్లలు పుట్టిన తరువాత నీకు నామీద ప్రేమ తగ్గిపోయిందనీ, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావనీ' కినుక వహించే భర్తలు పరిపాటి. కానీ, స్త్రీ భార్యగా, తల్లిగా రెండు పాత్రలను అవలీలగా పోషించి మెప్పిస్తుంది. ఇది స్త్రీకి మాత్రమే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. ఈ ఆధునిక కాలంలో ఉద్యోగిగానే కాదు, ఎన్నో రకాలుగా అష్టావధానం, శతావధానం చేస్తోంది నేటి వనిత. అవనిలోనే కాదు, ఆకాశంలో కూడా(వ్యోమగాములుగా, క్షిపణుల తయారీలోనూ) సగం మేమేనని నిరూపిస్తోంది నేటి ఆధునిక మహిళ.
బిడ్డల జీవితంలో తండ్రి పాత్ర పరిమితమని అనలేం. కానీ, తండ్రి కంటే పిల్లలకు తల్లి దగ్గరే సాన్నిహిత్యం ఎక్కువ. అందుకే, తమకు ఏం కావాలన్నా ముందుగా తల్లినే అడుగుతారు. ఇలా ఎన్నో రకాలుగా బిడ్డల ప్రతి పనిలోనూ అమ్మ సహకారం అనంతం. 'మాతృదేవోభవ' అని తల్లికే మొదటి స్థానాన్నిచ్చారు. అటువంటి అమ్మకు ఇవ్వాల్సినంత విలువను పిల్లలు ఇస్తున్నారా అంటే లేదనే అనుకోవాలి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వృద్ధాశ్రమాలే దీనికి నిదర్శనం. తమ ఎదుగుదలకు తన జీవితంలో విలువైన కాలాన్ని వెచ్చించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలువేసిన అమ్మ స్థానం ఎక్కడీ ఇదంతా ఎందుకంటే బిడ్డల నిరాదరణకు గురైనవాళ్లు ఎక్కువగా అమ్మలే.
'మదర్స్‌ డే'నాడు అమ్మకు బహుమతులు కొనివ్వడమే తమ బాధ్యత అనుకుంటున్నారు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడినవారు. తప్పతాగడానికి డబ్బు ఇవ్వని కారణంగా తల్లి తలను నరికి సైకిల్‌కు కట్టి ఊరేగాడు ఒక కిరాతకుడు. తల్లిపేరున ఉన్న ఆస్థిని తన పేరున రాయలేదని తల్లికి బలవంతంగా విషం తాగించాడో నికృష్టుడు. ఇలాంటి సంఘటనలకు కొదువలేదు. మద్యానికి బానిసలైనవారు ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. మద్యం మనిషిని మృగంలా మారుస్తుందనడానికి ఇలాంటి సంఘటనలే కారణం.
నాగరికులమని చెప్పుకునేవారు తమ మాటలతో, చేష్టలతో కన్నవారికి నరకం చూపిస్తుంటారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేక, వృద్ధాశ్రమానికి వెళితే నలుగురిలో తమ బిడ్డలు ఎక్కడ పలచన అయిపోతారోనని మానసికంగా, శారీరకంగా నలిగిపోతుంటారు. బిడ్డల బాగోగులకోసం అహర్నిశలు కష్టపడి, వారిని ఉన్నత స్థానంలో చూడాలని కలలుకన్న అమ్మకు బిడ్డలు ఎంతవరకూ న్యాయం చేస్తున్నారు? అపురూపంగా చూసుకోకపోయినా, కనీసం వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారా?
డబ్బు వ్యామోహంలో పడి, సంపాదన అనే దీర్ఘకాలిక జ(డ)బ్బు చేసిన బిడ్డలకు ఎలా నయం చేయాలో తెలీక తల్లిదండ్రులు నిస్సహాయంగా నవ్వుకుంటున్నారు. ఆ ఆవేదనను అర్థంచేసుకునేందుకు బిడ్డలు సిద్ధంగా లేరు. అయినా, తన వేదనను ఏమాత్రం బయటకు కనపడనీయక... తన బిడ్డ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది అమ్మ. అందుకే ఆమె 'అమ్మ'.

చిట్కాలు

సులువు!
పొరపాటున నేలపై నూనె ఒలికితే ఆ ప్రాంతంలో మైదా జల్లాలి. అప్పుడది నూనెను సులువుగా పీల్చేసుకుంటుంది. శుభ్రంచేయడమూ సులువు!

పుల్లబడదు!
కొబ్బరిముక్క
పెరుగులో వేస్తే
పెరుగు పుల్లబడదు.
కమ్మగానూ వుంటుంది.

అబ్బా! నడుము నొప్పి!

చాలా నొప్పులు విశ్రాంతి లేక పొజిషన్‌ మార్పుతో తగ్గిపోతాయని తెలుసుకున్నాం. కొందరికి టాబ్లెట్‌ వేసుకోవడం ద్వారా మానసికంగా రిలీఫ్‌ దొరుకుతుంది. బరువులు ఎత్తే సమయంలో జాగరూకత వహించాలి.
ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి?
1. రోజురోజుకూ నొప్పి ఎక్కువైనపుడు
2. కాళ్లలో తిమ్మిర్లు, ఒక కాలిలో తిమ్మిరి లేక నొప్పి ఉన్నపుడు
నడుమునొప్పి ఎలా ఉంటుంది?
నడుమునొప్పి మనిషిని కదలకుండా చేస్తుంది. అప్పటికప్పుడు భలే ఇబ్బంది పెడుతుంది. చాలావరకూ విశ్రాంతితో తగ్గిపోతుంది. కొంతమందిలో పొద్దున్నే లేచినపుడు నడుము పట్టిందనే ఫిర్యాదు ఉంటుంది. చాలావరకూ నొప్పులు కదలికతో ఎక్కువవుతాయి. విశ్రాంతి తీసుకున్నపుడు నొప్పులు చాలావరకూ తగ్గిపోతాయి. కంప్యూటర్‌పై పనిచేసేవారు గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వలన నడుమునొప్పి పెరుగుతుంది. మధ్యమధ్యలో లేచి తిరగడం, సరిగా కూర్చోవడం ద్వారా ఆ నొప్పిని అధిగమించొచ్చు.


కానీ, విశ్రాంతిలో ఉన్నా 'నొప్పి ఉన్నపుడు', పొజిషన్‌ మార్పుతో నొప్పి తగ్గనపుడు, ఎప్పుడూ నొప్పి అలాగే ఉన్నపుడు, రోజురోజుకూ ఆ నొప్పి పెరుగుతున్నపుడు... వైద్యుని సలహా, పరీక్షలు అవసరం. ఆ నొప్పికి కారణం తెలుసుకోవడం అవసరం. అది సరైన చికిత్స కొరకు తీసుకునే చర్య. అది మందులు కావచ్చు, శస్త్రచికిత్స కావచ్చు.
చాలా నొప్పులకు కారణం ఆహారంలో సరైన మాంసకృత్తులు లభించకపోవడం. కండరాల నొప్పి వల్ల కూడా నడుమునొప్పి రావచ్చు. విటమిన్‌ డి లోపం సరైన సమతుల్య ఆహారం అవసరం. పాలు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి. వారానికి రెండు, మూడుసార్లు చేప, మాంసం తీసుకోవడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. అలాంటప్పుడు ఏ 'నొప్పి' మనకు ఉండదు. శాఖాహారంలో పాలు, పప్పుధాన్యాలలో ప్రోటీన్స్‌ ఎక్కువగా దొరుకుతాయి.
మహిళలు అదేపనిగా పనిలోనే నిమగమైపోకుండా మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడం అవసరం. కుటుంబ అవసరాలే ముఖ్యం అనుకోకుండా తనపట్ల కూడా శ్రద్ధ వహించాలి. పోషకాహార ఆవశ్యకతనూ గుర్తించాలి. వ్యాయామానికి తగు సమయం కేటాయించాలి.

దహి కబాబ్‌

కావలసిన పదార్థాలు
వడకట్టిన పెరుగు - 4 స్పూన్లు
దంచిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు
నీటిలో ముంచిన బ్రెడ్‌ - 4 స్లైసులు
ఉడికించిన బంగాళదుంపలు - 2
కొత్తిమీర తరుగు - 2 స్పూన్లు
పుదినా తరుగు - 2 స్పూన్లు
చాట్‌ మసాలా - 1 స్పూన్‌
కారం - 1 స్పూన్‌ ధనియాల పొడి - 1 స్పూన్‌
ఆమ్‌చూర్‌ పౌడర్‌ - అరస్పూన్‌
తురిమిన చీజ్‌ - 1 స్పూన్‌
ఉప్పు - సరిపడా బ్రెడ్‌ పొడి - 1 కప్పు
మొక్కజొన్న పిండి - 2 స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా


తయారీ విధానం
దంచిన మొక్కజొన్న గింజలలో వడకట్టిన పెరుగు, బంగాళాదుంపముద్ద, కొత్తిమీర, పుదీనా తరుగు కలపాలి. అందులోనే మిగిలిన అన్ని పదార్థాలు వేసుకుని బాగా కలపాలి. మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలపాలి. ముందుగా కలుపుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని కబాబుల్లా చేసుకుని మొక్కజొన్న పిండిలో ముంచాలి. తర్వాత బ్రెడ్‌ పొడిలో దొర్లించాలి. వీటిని కాగుతున్న నూనెలో వేయించితే చాలు. వేడివేడిగా సాస్‌తో తింటే భలే రుచిగా వుంటాయి.

బనానా ఫ్రిట్టర్స్‌

కావలసిన పదార్థాలు
అరటి పండ్లు - 4
పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు
కోడిగుడ్లు - 2
పాలు - 2 టేబుల్‌ స్పూన్లు
వెనిల్లా ఎసెన్స్‌ - 1 టీ స్పూన్‌
కార్న్‌ఫ్లోర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు
బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూన్‌
నూనె - సరిపడా


తయారీ విధానం
అరటి పండ్లను మెత్తగా గుజ్జు చేయాలి. అందులో పంచదార, కోడిగుడ్ల సొన, పాలు, వెనిల్లా ఎసెన్స్‌, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరటి పండులా పొడవుగా చేసి కాగిన నూనెలో వేయించాలి. వీటిని వేడివేడిగా తింటే బాగుంటాయి.

కొంగు ముడులు

కావలసిన పదార్థాలు
మైదా పిండి - పావుకిలో
బెల్లం - పావుకిలో
ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
మైదా పిండిలో రెండు స్పూన్ల వేడి నూనె, ఉప్పు, కొద్దిగా నీళ్లతో గులాబ్‌జామూన్‌ పిండిలా కలిపి అరగంట నానబెట్టాలి. తర్వాత చిన్న ఉండలు చేసి పూరీల్లా వత్తుకోవాలి. వీటిని అరంగుళం వెడల్పుతో రిబ్బన్‌లా పొడవుగా కోసుకోవాలి. రెండు రిబ్బన్ల చొప్పున కలిపి మధ్యలో ముడి వేయాలి. ఇలా చేసుకున్న వాటిని కాగిన నూనెలో వేయించుకోవాలి. బెల్లం పొడిలో కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. నూనెలో వేయించిన ముడులను పాకంలో కలపాలి. వీటిని వెంటనే విడివిడిగా తీస్తే ఒకదానికొకటి అంటుకోకుండా వుంటాయి.

ఆనపగింజల మిక్చర్‌

కావలసిన పదార్థాలు
ఆనపగింజలు - 1 కప్పు, కారం - అర టీ స్పూను
వేరుశనగపప్పు - పావు కప్పు
ఉప్పు - తగినంత, నూనె - తగినంత


తయారీ విధానం
ఆనపగింజలను నీళ్లలో రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి గింజలను నలిపి పై పొట్టు తీయాలి. తడి ఆరకుండానే కాగిన నూనెలో వేయించాలి. వీటిని బాండీలో నేరుగా వేయకుండా చిల్లుల గరిటెలో ఉంచే వేయించాలి. మొత్తం వేగాక బాండీలో నూనంతా తీసి అడుగున కొద్దిగా ఉంచాలి. అందులో వేరుశనగపప్పు వేయించాలి. వాటికి ముందుగా వేయించి పెట్టుకున్న ఆనపగింజలు కలిపి వేడి తగ్గకుండానే ఉప్పు, కారం కలపాలి. చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేస్తే 15 రోజులు వరకు నిల్వ ఉంటాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

గుంత పునుగులు


కావలసిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
నానబెట్టిన సెనగపప్పు - 2 స్పూన్లు
క్యారెట్‌ తురుము - 2 స్పూన్లు
పుదీన, కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - 4 రెబ్బలు
అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - 2
జీలకర్ర - 1 స్పూన్‌
ఉప్పు - తగినంత
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు
నూనె - సరిపడా
తయారీ విధానం
బియ్యం, మినప్పప్పు నాలుగు గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి. మర్నాడు ఈ పిండిలో సెనగపప్పు, క్యారెట్‌ తురుము, పుదీన, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియదిప్పాలి. పొంగనాల కళాయి స్టౌ మీద పెట్టి బాగా వేడయ్యాక గుంతల్లో కొద్ది కొద్దిగా నూనె వేయాలి. తర్వాత గరిటలో పిండి వేసి మూత పెట్టాలి. కొద్ది సేపటి తర్వాత వాటిని రెండో వైపు తిప్పాలి. రెండు వైపులా ఉడికితే పొంగనాలు రెడీ. వీటికి కాంబినేషన్‌గా పల్లీచట్నీ, కారం పొడి, టమాట పచ్చిమిర్చి రోటి పచ్చడి... ఇలా ఏదైనా బావుంటుంది.
 

పండ్లతో పంచామృతం

కావలసిన పదార్థాలు
కమలాలు - 2
తర్బూజా ముక్కలు - 1 కప్పు
ఖర్జూరాలు - 12
కిస్‌మిస్‌ - 16
కొబ్బరి కోరు - 5 స్పూన్లు
పెరుగు - 2 కప్పులు
పాలు - 2 కప్పులు
కొబ్బరి కాయనీరు - 1కాయది
తేనె - 5 స్పూన్లు
పంచదార - 5 స్పూన్లు
ఉప్పు - అర స్పూను
అరటిపండ్లు - 2
మిరియాలపొడి - 1 స్పూన్‌
పుచ్చకాయ ముక్కలు - 1 కప్పు


తయారీ విధానం
కమలాపండ్లను తొనలు, తర్బూజా, అరటి పండ్లను ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ ఓ పాత్రలో తీసుకుని వాటిపై ఉప్పు, పంచదార, మిరియాల పొడి చల్లాలి. తర్వాత పాలు, కొబ్బరి నీళ్లు, పెరుగు, తేనె ఒక దాని తర్వాత మరొకటి పోయాలి. అన్నింటినీ కలిపి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. తినేముందు ఖర్జూర ముక్కలు, కిస్‌మిస్‌, కొబ్బరికోరు పైన చల్లుకుంటే చాలు. ఎంతో రుచికరమైన పండ్ల పంచామృతం రెడీ.

చలికాలం- పసితనం


చలికాలంలో ఎక్కువగా ఐదేళ్ల లోపల పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. అవి ఇంట్లో నయమయ్యే జలుబు కావచ్చు. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన నిమ్మోనియా కావచ్చు. 20- 50% శ్యాసకోశ వ్యాధి ఉండొచ్చు. చాలావరకూ వైరస్‌ వల్ల దగ్గు, పడిశం, గొంతునొప్పి, బ్రాంకైటిస్‌, బ్రాంక్యురైటిస్‌, నిమోనియా రావచ్చు. రెండేళ్లలోపు పిల్లల్లో దీర్ఘకాలిక జబ్బులను పిల్లలు, పెద్దల్లో వైరస్‌ మూలంగా ఇబ్బందులు ఉండొచ్చు.
చిన్నపిల్లలు అంటే ఏడాదిలోపు బరువు తక్కువ నెలలు నిండకుండానే పుట్టినవాళ్లు, పుట్టుకతోనే గుండెజబ్బున్న వారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. ఇవి ఎక్కువగా నవంబరు, డిసెంబరులో మొదలై ఎక్కువగా జనవరి, ఫిబ్రవరి వరకూ ఎక్కువ శాతం బాధపడుపెడుతుంటాయి.
వైరస్‌ నుండి ఎలా కాపాడుకోవాలి?

కారణాలు:
1. చిన్న ఇల్లు, ఎక్కువ జనాభా
2. జనాభా గుంపుగా ఉన్నచో దగ్గు త్వరగా వ్యాపిస్తుంది.
3. డే కేర్‌ సెంటర్లు
4. తల్లిపాలు దొరకనపుడు
5. తల్లిదండ్రులకు చదువు లేనపుడు
6. ఇంట్లో పొగత్రాగడం
7. కట్టెల పొయ్యి పొగ

నియంత్రణ:
1. పిల్లలను అందరిలోనూ ఉంచకూడదు. విడిగా ఉండేలా మార్గం చూడాలి.
2. పిల్లను సినిమాలు వంటి సమూహాలు మూగే ప్రాంతాలకు తిప్పకూడదు.
పిల్లలు డే కేర్‌ సెంటర్లో ఉన్నపుడు తొందరగా జలుబు, దగ్గులకు లోనవుతారు. కనుక, ఎక్కువమంది లేని సెంటర్లో పిల్లలను చేర్చాలి. వారికి తినిపించేటప్పుడు చేతులు కడుక్కోవాలి. వంటగదికి దూరంగా పిల్లలను దూరంగా ఉంచాలి.
వచ్చిన తరువాత ఏం చేయాలి:

మూమూలు జలుబు అదే తగ్గిపోతుంది. ఇవి ఎపుడు ప్రమాదకరమో తల్లికి తెలియడం మంచిది.
1. పాలు తాగనపుడు
2. జ్వరాలు ఎక్కువగా ఉన్నపుడు
3. ఆయాసం పడుతున్నపుడు
... జలుబు ఉండి ఇవన్నీ కనిపించినపుడు పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్లడం అవసరం.

డా. శ్యామలాంబ,
శిశు వైద్య నిపుణులు  

ఫ్యాషన్

నెట్ శారీలో న్యూ ఫ్యాషన్ ట్రెండ్ తో మెరిసిపోతున్న సెలబ్రిటీలు...!

పండగ, పార్టీ... సందర్భం ఏదైనా ఆకట్టుకునేవి డిజైనర్ చీరలే. చీర కట్టు మన సంప్రదాయం. అంతేకాకుండా ఇప్పుడు చీర అంటే ఫ్యాషన్‌గా కూడా మారింది. అందుకే- ఇప్పుడు ఆడ వారు కూడా ఏదో ఒక సందర్భంలో చీరకట్టి మన సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలకు చీరల టైపు డ్రస్సులు వేస్తున్నారు. దాంతో పిల్లలు వాటిని చూసి చీరకట్టుపై ఇష్టం పెంచుకుంటున్నారు. నిజం చెప్పాలంటే చీరకట్టు స్త్రీకి గౌరవం తెస్తుంది. అయినా చీరకట్టులో ఉన్న సౌందర్యం డ్రస్సుల్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి...?



ఐశ్వర్య రాయ్: మెరిసిపోయే ఈ ఇండియన్ బ్యూటీ ఈ నెట్ శారీలో మరింత అందంగా మెరిసిపోతోంది. మెరూన్ రేషమ్ జెరీ మరియు శారీ బాడర్ మీద థ్రెడ్ వర్క్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. చీరకు తగ్గట్టు ఫుల్ స్లీవ్ తో ఎంబ్రాయిడర్ చేసి బ్లౌజ్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.


కరీనా కపూర్: కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతరు కరీనా కపూర్ చీరలు కట్టడం అంటే చాలా ఇష్టం. ఈ బ్లాక్ కలర్ నెట్ చీర ఆమె జీరోసైజ్ కు ఫర్ ఫెక్ట్ గా కుదిరింది.

  ప్రీతీ జింటా: జబ్ థక్ హై జాన్ ప్రీమియర్ షోలో అద్భుతమైనటువంటి ఎల్లో కలర్ లంగాఓనీ నెటెడ్ శారీ ఒక మెరుపులా అలా మెరిసిపోయింది.

రాణి ముఖర్జీ: రాణీ ముఖర్జీ ఈ లంగాఓనీ స్టైల్ లో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ నెటెడ్ శారీలో అద్భుతంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్. ముత్యాల హారం, ముఖంలో పెద్దగా ఎర్రగా కనబడే బొట్టు మరింత ఆకర్షణీయంగా కనబడేలా
చేస్తున్నాయి.


కత్రినా కైఫ్: బాలీవుడ్ క్యూట్ డాల్ కత్రినా కైఫ్ ఈ క్యూట్ ఆఫ్ వైట్ శారీలో మరింత క్యూట్ గా కనబడుతోంది. చీర బాడర్ లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ, దానికి ఎరుపు జాకెట్ అద్భుతంగా మ్యాచ్ అయ్యింది.


బిపాషా బసు: బాలీవుడ్ బాంబ్ షెల్ బిపాషా బసు. ఈ పీచ్ కలర్ నెట్ శారీలో మరింత సెక్సీగా కనబడుతోంది. అందమైనటువంటి ఈ నెట్ శారీకి ఓ బికినీ టైప్ బ్లౌజ్ లో తన ఆకతికి, తన స్టైల్ కు తగ్గట్టు వేసుకొన్నది.


దీపికా పడుకొనే: పొడగా ఉండే ఈ స్లిమ్ బాలీవుడ్ బ్యూటీ ట్రెడిషినల్ లుక్ తో అద్భుతంగా ఆకర్షనీయంగా కనబడుతోంది. పీచ్ కలర్ శారీలో చాలా బాగుంది. శారీ మీద వైట్ థ్రెడ్ వర్క్ చాలా క్లాసిక్ గా కనిపిస్తోంది.



జరీన్ ఖాన్: జరీన్ చేప కట్ లో కనిపించే ఈ లంగా ఓనీ శైలిలో వివిధ రంగులతో మిళితమైన ఈ శారీ లో చాలా క్యూట్ గా కనబడుతుందో.

చీరకట్టు భారతీయులకే పరిమితం. ఆరుగజాల చీరను వంటికి చుట్టుకోవడంతో సరిపెట్టుకోక దాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఎలా కట్టుకోవాలో భారతీయ మహిళకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో...! బెంగాలీ, మరాఠీ, తమిళనాడు, ఆంధ్రా.. ఇలా ప్రాంతాలు ఏవయినా, అక్కడి చీరకట్టు వేరయినా అందులోనూ ఓ అందం ఉంటుంది. అందుకే విదేశీయులు సైతం మన భారతీయ మహిళల చీరకట్టు పట్ల మోజుపడుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో చీరకట్టు సైతం కొత్త పుంతలు పోతోంది. ఫ్యాషన్ షోలలో కూడా చోటు దక్కించుకుంటోంది. ఈ అందాల భామల చీర కట్టు చీరకే కాదు, వారికి కూడా కొత్త అందాలను తెచ్చిపెడుతోంది కదూ..!
ప్రస్తుతరం వారు చీర కట్టులో వివిధ రకాలను ఉపయోగిస్తూ.. అందంగా ఇతరులను ఆకర్షిస్తుంటారు. అంతే కాదు ప్రస్తుత ట్రెండ్ లో నెటెడ్ శారీలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నెటెడ్ శారీలు విజిబుల్ గా ఉండి చీరవెనుకున్న అందాలు కనిపించి కనబడనీయకుండా ఎదుటి వారిని ఆకర్షిస్తుంటాయి. అందుకే ప్రస్తుత కాలంలో రెడ్ కార్పెట్ పై, షాషన్ షో, ఈవెంట్ షో, ఇంకా పెళ్ళిళ్లలో ఇటువంటి చీరల ఎక్కుగా దర్శనమిస్తున్నాయి. ఈ నెటెడ్ శారీలు ఇండియన్ స్టైల్ లో కట్టుకోవడం వల్ల మరింత సెక్సీగా కనబడుతారు. నెట్ శారీలు చూడటానికి అందంగా కనబడ్డా వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నెట్ లా చాలా పలుచగా ఉండటం వల్ల ఏదైన తగులుకొన్నా చాలా సులభంగా చిరిగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి నెట్ శారీని ధరించి తర్వాత వాటిని తీసి భద్రగా మడిచి వార్డ్ రోబ్ లో భద్రపరచుకోవాలి. ముఖ్యంగా నెట్ శారీలోకి మీరు ధరించే ఆభరణాలు చాలా షార్ప్ గా ఉండకుండా చూసుకోవాలి. పొరపాటున ఏవైన నెట్ కు పట్టుకొన్న చిరిగిపోయే ప్రమాదం ఉంది.
మీకు నెట్ శారీ ధరించడం చాలా ఇష్టంగా ఉన్నా... అదీ ఇండియన్ స్టైల్ లో ఈ ట్రెండ్ కు సరిపోయే విధంగా ఎలా ధరించాలో ఇక్కడ కొందరు సెలబ్రెటీలు కట్టిన విధానం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో మీరు కూడా నెట్ శారీలో అందంగా.. ఆకర్షణీయంగా కనబడటానికి ప్రయత్నించవచ్చు...

రంగుల హంగులు ఏవైనా...
పువ్వులు, ఆకులు, లతలు...
డిజైన్ల మెరుపులు ఎన్నైనా నెటెడ్ మీద అవి అందంగా ఆవిష్కరించుకుంటాయి.
బెనారస్, టిష్యూ, రా సిల్క్..
మెటీరియల్ ఏదైనా... నెట్‌తో జత కలిసిందంటే డిజైనర్ల ఊహలకు కొత్త రెక్కలు పుట్టుకువస్తాయి.
వేడుక ఏదైనా ‘వల’పు చీరల్లో వనితలు వెలిగిపోయేలా చేస్తాయి.
మగువలు ముచ్చటిపడి మరి మరి కోరుకునే డిజైనర్ నెటెడ్ చీరలు ఈ వారం...


1- ఆకుపచ్చ, వంగపండు రంగుల కాంబినేషన్ గల ఫుల్‌నెట్ శారీ ఇది. బెనారస్ బార్డర్‌ని మల్టీ కలర్ దారాలతో పార్శీ డిజైన్ చేశారు. దీంతో చీర గ్రాండ్‌గా కనువిందుచేస్తోంది. డిజైనర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, టిష్యూపెటీకోట్ ఈ నెటెడ్ చీరకు కొత్త వన్నెలద్దుతున్నాయి.

2- చిలకపచ్చ రంగు ఫుల్ నెట్ శారీకి సెల్ఫ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలిరంగు త్రెడ్ వర్క్, పార్షీ డిజైన్ బార్డర్, ఫ్యాన్సీ బ్లౌజ్ చూడముచ్చటగొలుపుతున్నాయి.

3- క్రీమ్ కలర్ ఫుల్ నెట్ శారీ చూపులను కట్టిపడేస్తోంది. మస్టర్డ్ కలర్ టిష్యూ బార్డర్ , త్రీడీ ఎఫెక్ట్‌తో చేసిన కాపర్‌సల్ఫేట్ డిజైన్, యాంటిక్ బుటా చీరకు సరికొత్త హుందాతనాన్ని తీసుకువచ్చాయి. టిష్యూ క్లాత్‌తో డిజైన్ చే సిన ఫ్యాన్సీ బ్లౌజ్ ధరించడంతో మోడ్రన్ కళ వచ్చింది.



అందమె ఆనందం

ఏదైనా తినే ముందు గ్లాసుడు నిమ్మరసం తాగుతాను. ఏ జ్యూస్ అయినా పంచదార మాత్రం వేసుకోను. చర్మానికి సహజసిద్దమైన మాయిశ్చరైజర్లను వాడతాను. ఆరోగ్యకరమైన ఆహారం, సానుకూల ఆలోచనలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

డాక్టర్‌ని అడగండి - గైనకాలజీ

నాకు వయసు 20. పెళ్లయి ఏడాది అయ్యింది. రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. ప్రస్తుతం గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాం. వీటితో సైడ్‌ఎఫెక్ట్స్ ఏమిటి? వీటిని ఎంతకాలం వాడవచ్చు? వివరంగా చెప్పండి.
- ధనలక్ష్మి, పొద్దుటూరు
ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్ అనే రెండు హార్మోన్ల కాంబినేషన్‌లో వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్ పీరియడ్స్ సరిగ్గా వచ్చేందుకు, ప్రెగ్నెన్సీ రాకుండా నివారించేందుకు, ఓవర్ బ్లీడింగ్, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు వాడుకలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వీటిని హై డోస్‌లో ఇవ్వడం జరిగేది. వీటిని వాడడం వలన తలనొప్పి, వికారం, వాంతులు, బరువు పెరగడం, మొటిమలు రావడం, శరీరంలో నీరు చేరడం వంటి సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చేవి. ప్రస్తుతం ఇవే ట్యాబ్లెట్లను తక్కువ మోతాదులో ఇస్తారు. మోతాదు తగ్గినందు వల్ల వాటి ప్రభావం, పనితీరు హై డోస్ పిల్స్‌కు ఏమాత్రం తగ్గలేదని, సైడ్‌ఎఫెక్ట్స్ ఎదురుకావడం లేదని గమనించారు. వీటిని ఏ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రూపొందించారు. వీటిని రెండు నుంచి రెండున్నర ఏళ్ల వరకు కంటిన్యువస్‌గా వాడవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు వాడాల్సి వస్తే నాలుగు నుంచి ఆరు నెలల వరకు విరామం ఇచ్చి తిరిగి మొదలు పెట్టవచ్చు. వాటికి బదులుగా నేచురల్ మెథడ్స్, కండోమ్స్ వంటివి వాడవచ్చు.

మా వారికి సెమెన్ టెస్ట్ చేసి శుక్రకణాలు లేవని చెప్పారు. అవి పెరగాలంటే ఏం చేయాలి? మా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- చంద్రకళ, నిడమనూరు


శుక్రకణాలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారు. ఈ కండిషన్‌కు ముఖ్యమైన కారణాలు రెండు. మొదటిది హార్మోన్‌లలో అసమతుల్యత, హై ఫీవర్ వంటి కారణాల వల్ల శుక్రకణాలు ఏర్పడటంలోనే లోపం ఏర్పడటం. రెండవది శుక్రకణాలు సరిగ్గానే ఏర్పడినా విడుదల అయ్యే మార్గం సక్రమంగా లేకపోవడంతో వచ్చే అజూస్పెర్మియా. ఈ కండిషన్ ఉన్నవారు యూరాలజిస్ట్‌తో పరీక్ష చేయించుకుని, అందుకు కారణాన్ని కనుక్కోవడం ఎంతో ముఖ్యం. హార్మోన్ అసమతుల్యతకి తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవడం, వేరికోసిల్ వంటి కండిషన్స్‌లో ఆపరేషన్ ద్వారా సరిచేయించుకోవడం, శుక్రకణాల విడుదల మార్గంలో అడ్డంకులు ఉన్నట్లయితే వాటిని ఆపరేషన్ ద్వారా సరి చేయడం... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రీట్‌మెంట్లు. శుక్రకణాలు విడుదల కాకపోయినా, లేదా అవి టెస్టిస్, ఎపిడైడిమిస్, వాస్‌కు పరిమితమైనట్లు గుర్తించినట్లయితే కొన్ని ప్రక్రియల ద్వారా వాటిని సేకరించి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఫలదీకరణం చేయడం జరుగుతుంది. ఇక్కడ పేర్కొన్న ట్రీట్‌మెంట్ ఎంతో నైపుణ్యంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది. ఫెర్టిలిటీ సెంటర్లలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్‌ని కలుసుకుని వారి సలహా మేరకు ముందుకెళ్లండి.

questions & answers

నాకు వచ్చే నెలలో పెళ్లి. చలికాలం వల్ల చర్మం డ్రైగా, పొడిగా ఉంటుందని ఫేషియల్స్ చేయించుకున్నాను. కాని అవి ఏవీ నా ముఖానికి సూట్ కావడం లేదు. వీటి కారణంగా చర్మం ఇంకా నల్లబడింది. మేకప్ క్రీమ్‌లు వాడితే ముఖంపైన ప్యాచ్‌లుగా కనిపిస్తోంది. నా చర్మతత్వం మెరుగుపడటానికి, మృదువుగా, కాంతివంతంగా మారడానికి ఏం చేయాలి?
- పూర్ణిమ, ఈ మెయిల్


డ్రై స్కిన్‌కి ఎలాంటి మేకప్ వాడాలో కిందటి వారాల్లో చెప్పాను. ఆ జాగ్రత్తలు పాటించండి. ఇక చర్మం మృదువుగా మారడానికి మాయిశ్చరైజర్‌ని రాత్రి పూట తప్పనిసరిగా రాసుకోవాలి. మీరు బ్యూటీ నిపుణులచే మాత్రమే ఫేషియల్స్ చేయించుకోండి. ఫేషియల్స్‌లోdermalogica, remy laureబ్రాండ్ గల క్రీమ్‌లనే ఉపయోగించండి. లుక్ బాగుంటుంది. అలాగే డెర్మలాజిక బ్రాండ్‌లో నైట్ రిపేర్ క్రీమ్ ఉంటుంది. దీనిని రాత్రిపూట వాడండి. తేడా మీరే గమనిస్తారు.

నా వయసు 29. రెండేళ్ల క్రితం మలేరియా వచ్చింది. బాగా నల్లబడ్డాను. జుట్టు కూడా బాగా ఊడిపోయింది. ఇంకా ఈ సమస్య ఇలాగే ఉంది. పూర్వపు రంగు రావాలంటే ఏం చేయాలి?
- స్వాతి, ఇ - మెయిల్


మలేరియా వచ్చి రెండేళ్లు అయిందంటున్నారు. మలేరియా వచ్చినప్పటికీ... సాధారణంగా ఏడు నెలల నుంచి ఏడాది లోపు చర్మం, జుట్టు సాధారణ స్థితికి వస్తాయి. మీకు అలా జరగలేదంటే థైరాయిడ్, ఇతర ఆరోగ్యసమస్యలు ఏమైనా ఉన్నాయేమో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోండి. అలాగే చర్మం, జుట్టు రంగు కూడా మారిందేమో చెక్ చేయించుకోండి. చిరాంజి (సారపప్పు. హెర్బల్ షాపులలో లభిస్తుంది)ని పాలలో రాత్రి నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోండి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోండి. రోజూ ఇలా చేస్తూంటే కొన్నాళ్ల కు మీ పూర్వపు రంగు వచ్చేస్తుంది. తలకు వారానికి ఒకసారైనా గుడ్డుతో ప్యాక్ వేసుకోండి. ఇంకా జుట్టు ఊడటానికి కారణమేంటో డాక్టర్‌ని అడిగి, వారు సూచించిన జాగ్రత్తలు పాటించండి.

నేను తలంటుకోవడానికి షికాయి, కుంకుడుకాయలు వాడతాను. వీటి వల్ల జుట్టు బాగా పొడిబారుతోంది. షాంపూలు వాడితే జుట్టు ఊడుతుందేమోనని భయం. జుట్టు పొడిబారకుండా ఏం చేయాలి?
- రోజా, ఇ - మెయిల్


పూర్వకాలంలో షాంపూలు, సబ్బులు లేవు. నూనెలు కూడా బాగా జిడ్డుగా ఉండేవి. పైగా వారానికి ఒకసారి తలంటుకోవడం వల్ల జుట్టు తేమను కోల్పోయేది కాదు. కాని, ఇప్పుడలా కాదు. జిడ్డు తక్కువగా ఉండే నూనెలను వాడుతున్నాం. పైగా వారంలో ఎక్కువసార్లు తలంటుకుంటున్నాం. కుంకుడుకాయలు, షికాయల్లో ఉండే ఆమ్లతత్వం వెంట్రుక తేమను ఎక్కువ తీసేస్తాయి. దీనివల్ల జుట్టు పీచులా తయారవుతుంది. నిపుణులను వద్దకు వెళ్లి జుట్టు తత్వాన్ని పరీక్షించుకోండి. దానికి తగిన చికిత్స తీసుకొని, వారు సూచనలు పాటించండి. ప్రస్తుతం keraspaseవాడండి. దీంట్లో షాంపూ, ఆయిల్, కండిషనర్ అన్నీ ఉంటాయి.