నూనె లేకుండా కూరలు, వినడానికి బాగానే వుంటాయి... తినడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అస్సలు నూనె లేకుండా ఎలా తినలేమో నూనె ఎక్కవయినా తినలేం. వంటలలో ఎంత నూనె వాడాలి అన్నదానికి ఇప్పటి వరకూ కచ్చితమైన కొలమానం ఏదీ లేదు. ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు కూరుల్లో నూనె వేస్తుంటారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు కూడా నేనున్నానంటూ పొరలు పొరలుగా పేరుకపోతుంది. కొవ్వు శరీరానికి ఒక స్థాయి వరకూ అవసరమే. మోతాదు మించితేనే ప్రాణాంతకమవుతుంది.
ఆరోగ్య కర జీవన విధానం ఆచరిస్తూ, శరీర బరువు అధికం చేసుకోకుండా స్లిమ్ గా కూడా ఉండాలంటే, సరైన వంటనూనె ఎంపిక చేయటం కష్టమే. తక్కువ కేలరీలు కల ఆరోగ్యకర ఆహారం ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. మీ బరువును తగ్గించేస్తుంది. కొద్ది పాటి వ్యాయామాలు చేస్తే చాలు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ప్రధానంగా ఆహార తయారీలో వాడే నూనెలు మీ శరీరంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను నియంత్రించేవిగా ఉండాలి. అసలు పూర్తిగా కొవ్వు, నూనెలు లేని ఆహారాలు రుచి పచి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి. ఆరోగ్యకర నూనెలు, కొవ్వులు వాడేందుకు కొన్ని చిట్కాలు పరిశీలించండి.
నూనెలను గాలి చొరని డబ్బాలలో చల్లటి, పొడి ప్రదేశాలలో నిలువ చేయండి. నూనెలను అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేసి నిలువ చేయండి. కొవ్వులు రసాయనాలకు చెందిన లిపిడ్ గ్రూపులో భాగం. ప్రతి ఒక గ్రాముకు 9 కేలరీల ఎనర్జీని ఇస్తాయి. ఇవి ఆహారంలో ఎంతో రుచిని కడుపు నిండటాన్ని, తృప్తిని మీకు కలిగిస్తాయి. విటమిన్లను కరిగించుకొని మీ శరీరానికి అందేలా చేస్తాయి. నూనెల వాడకం శరీర అవయవాలకు మెత్తటి కవచంలా పనిచేస్తుంది. మన శరీరం కొన్ని ఫ్యాటీ యాసిడ్లను అంటే లినోలీక్ లినోలెనిక్ లను తయారు చేసుకోలేదు. కనుక మనం వాటిని బయటి కొవ్వుల నుండి శరీరానికి అందించాల్సిందే.
ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా చెడు: ఆహార తయారీ ప్రక్రియలో ఏర్పడే శాట్యురేట్ కాని కొవ్వులు లేదా సింధటిక్ లేదా ఇండస్ట్రియల్ ట్రాన్స్ ఫ్యాట్ మీ శరీరంలో ఎల్ డిఎల్ అంటే చెడు కొల్లెస్టరాల్ పెంచుతుంది. ఆరోగ్యకరమైన హెచ్ డిఎల్ కొల్లెస్టరాల్ ను తగ్గిస్తుంది. దీనితో గుండె జబ్బులు వస్తాయి. ఆలివ్ నూనె వాడకం మంచిది. దీనిలో మోనో అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్లను తగ్గిస్తాయి. మంచి కొల్లెస్టరాల్ స్ధాయి అలానే ఉంచుతాయి. సాధారణంగా తయారీ దారులు రెండు లేదా మూడు రకాల తయారీ ప్రక్రియతో అంటే, సలాడ్లకు, వంటలకు వివిధ రకాలుగా నాణ్యతను బట్టి తయారు చేస్తారు. ఎప్పటికి వీలైనంతవరకు ఖరీదు అయినప్పటికి నాణ్యతకల వంటనూనెలు మాత్రమే వాడండి.
రైస్ బ్రాన్ ఆయిల్: దీనినే తవుడు నూనె అని కూడా అంటారు. దీనిలో సహజమైన విటమిన్ ఇ ఉంటుంది. ఇది కూడా కొల్లెస్టరాల్ నియంత్రిస్తుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్: దీనిలోని లినోలిక్ యాసిడ్ కొలెస్టరాల్ స్ధాయిలను నియంత్రిస్తుంది. వేరే నూనెలతో చేస్తూ అపుడపుడూ దీనిని వాడవచ్చు.
మస్టర్డ్ నూనె లేదా ఆవ నూనె: దీనిలో మోనో అన్ శాట్యురేటెడ్ మరియు పాలీ అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది తక్కువగా వాడండి.
వేరుశనగ నూనె: ఈ నూనె చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలను మన శరీరంలో తగ్గిస్తూ మేలు చేస్తుంది. మంచి కొల్లెస్టరాల్ తగ్గించదు.
కొబ్బరి నూనె: దీనిలో అసలు కొలెస్టరాల్ ఉండదు. కనుక దీనిని వంటలలో వాడవచ్చు. అయితే మితంగా వాడండి.
ఆలివ్ ఆయిల్: ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దీని వీలువ చాలా ఎక్కువ. పొట్ట తగ్గేందుకు ఇది చాలా ఉపయోగ పడతది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించడం ద్వారా మధుమేహం, హృద్రోగసమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు. హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులతో ఆలివ్ ఆయిల్ పోటీ పడుతుందని, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు ఆలివ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుంది.
కొవ్వును ఏ విధంగా తగ్గించుకోవచ్చు: నూనెను తప్పనిసరిగా వంటలలో వాడవలసి వచ్చినప్పుడు సన్ ఫ్లవర్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇందులో కూడా రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇందులో కూడా రిఫైండ్ ఆయిల్ లభ్యమవుతోంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచింది. మాంసాహారాల్లోనూ నూనెను ఎక్కువగా ఉపయోగించాల్సి రావడం అనివార్యం కాబట్టి, మాంసాహారాన్ని తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. నెలకు ఒకటి రెండు సార్లు తప్పించిమాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అప్పుడు కూడా నూనె కన్నా నీటిని ఎక్కువగా వాడాలి వీటిలో ఉపయోగించే మసాలాలు కూడా తగ్గించాలి. వేపుడు కూరలకన్నా, ఓవెన్ లో ఉప్యోగించన కూరలే మేలు. వేపుడు కూరలు తీసుకోవలసి వస్తే వాటి మీద ఉన్న నూనెను టిష్యూ పేపర్ తో తీసి వేసి ఆ తర్వాతే తినాలి. ఆహార పదార్థాలు వండేటప్పుడు వాటిల్లో కొవ్వు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిన పనిలేదు.

No comments:
Post a Comment