‘ఆడవాళ్లు అబలలు.. బాహ్య ప్రపంచం ఏమీ తెలియని అజ్ఞానులు’-అనుకునే రోజులు పోయ దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయ. అటు చదువుల్లోనూ, ఇటు ఉద్యోగాల్లోనూ కూడా మగవాళ్ళకంటే ఆడవాళ్లే ముందున్నారన్న విషయాన్ని, సంపాదనలో కూడా ఆడవాళ్లే ముందు వరసలో నిలబడ్డారని చార్టడ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన ఆర్థిక, గణాంక నిపుణులు ఓ సర్వేలో తేల్చి చెప్పారు. కొద్దికాలంలోనే ఈ పెరుగుదల మరింత అనూహ్యంగా ఉంటుందని కూడా చెప్పారు. భవిష్యత్‌లో- పురుషులు స్ర్తిలకన్నా ఎక్కువ సంపాదనాపరులనో లేక సరిసమానంగా సంపాదిస్తున్నారనో వింతగా చెప్పుకోవచ్చు. స్ర్తిలే ఎక్కువగా సంపాదిస్తున్నారన్న విషయం బాగా వ్యాప్తిలోకొస్తుంది. నిజంగా అలాగే జరిగితే- పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రభావం పెళ్లిళ్లమీదా పడుతుంది. పెళ్లిళ్ళ తంతులో పెనుమార్పులే రావొచ్చు!
అసలు మహిళల ప్రగతి ఎలా సాధ్యమైందని అని ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయ. సంవత్సరాల తరబడి మహిళా హక్కుల కోసం పోరాటాలు జరిగాయ. విద్యలో ఆడపిల్లలు మగపిల్లలతో పోటీపడడమే కాదు వారికన్నా ఎక్కువ శ్రద్ధతో చదివి, ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులవడం సాధ్యమైంది. మంచి ప్రవర్తనతోనూ, సామర్థ్యంతోనూ, నిజాయితీతోనూ, సరైన వ్యక్తిత్వంతో అమ్మాయలు రాణించగలుగుతున్నారు. ఇక మగపిల్లలు అనేకమంది దురలవాట్లకు లోనవుతున్నారు. ధూమపానం, తాగుడు, హుక్కా, డ్రగ్స్‌వంటి వ్యసనాల్లో పడడం, క్లబ్బుల్లో, పబ్బుల్లో పడి చదువుకునే వయస్సులో చదువునీ, ఉద్యోగం చేసే వయస్సులో ఉద్యోగాన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తూ జల్సాగా తిరగడానికి అలవాటుపడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంచి కుటుంబాల్లో నుంచి వచ్చే పిల్లలు కూడా పిచ్చి పిచ్చి టైటిల్స్‌లో వచ్చే సినిమాలు చూసి ఆ హీరోల్లా (వాళ్లు నిజ జీవితంలో బాగానే వుంటారు, డబ్బు కోసం ఓ వృత్తిగా అలా నటిస్తున్నారని అనుకోకుండా) వుండడానికి ప్రయత్నిస్తూ, పతనమైపోతున్నారు చాలామంది. మరికొందరు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయమని భావిస్తున్నారు. చదువైనా డబ్బు సంపాదనకేగా!- అనే వెర్రి ఆలోచనలతో అదేదో ముందే సంపాదనామార్గం ఎన్నుకుంటే పోలేదూ అని చదువుని నిర్లక్ష్యం చేసి పెడదారులు పడుతున్నారు.
ఆడపిల్లలు బాగా చదువుకుని, చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. పైగా కాలం తెచ్చే మార్పులవల్ల అంటే, మహిళలను ప్రోత్సహించే పథకాలూ, మహిళా సంఘాల ప్రవచనాలవల్ల, కాస్త ఎదిగిన ఆడపిల్లలు మగ పిల్లలంటే భయాన్ని పోగొట్టుకుంటున్నారు. నిర్భయంగా, బాలుర కాలేజీలోనూ ఎలాంటి న్యూనతాభావం లేకుండా ధైర్యంగా చదువుకోగలుగుతున్నారు.
సహజంగా బాలికలలో బాలురకంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మాభిమానమూ ఎక్కువే. పట్టుదల కూడా ఎక్కువే. ఏదైనా సాధించాలనుకుంటే లక్ష్యసిద్ధి కోసం పాటుపడతారు. అందుకే అన్నారు మన పూర్వీకులు- ‘‘ముదితల్ నేర్వగలేని విద్య కలదే, ముద్దార నేర్పింపగన్’’ అని. ఆ రోజుల్లో అనేక అభద్రతా కారణాల వల్ల, అర్థంలేని అనేక ఆచారాల వల్లా, మూఢ నమ్మకాల వల్లా పాటించలేకపోయారు. క్రమేణా అవి తగ్గి, ఆడపిల్లలకు అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి అని చాలామంది విద్యావేత్తలూ, మేధావులూ అభిప్రాయపడుతున్నారు.
ఇలా పరిస్థితులు అనుకూలించడంతో పెరిగిన మహిళల ఆదాయం కనీసం కొన్ని దశాబ్దాలు ఇలాగే సాగుతుందని, చార్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుడు మహేశ్ వాస్వానీ చెప్పారు. మగ పిల్లలు ఈ విషయాన్ని గ్రహించి శ్రద్ధ తీసుకోకపోతే వారి ప్రాముఖ్యం గణనీయంగా పడిపోతుంది కనుక, ఇప్పటినుంచే వారు నైపుణ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉంది. బాధ్యతగల పౌరులుగా వారు మెలగాలని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళల ఆలోచనా ధోరణి, ఆచరణలు చాలా మారిపోయాయి. వారిలో నైపుణ్యం కూడా బాగా పెరిగిపోతోంది. ఈ మార్పు ఇప్పటికే తెలుస్తూన్నా, రాను రాను ఇంకా ప్రస్ఫుటంగా తెలుస్తుందని చెబుతున్నారు పరిశీలకులు. ఈ రీతిలో పురుషులూ పుంజుకుంటే, భారతదేశం అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తుందని వారు అంటున్నారు. ‘‘మేరా భారత్ మహాన్... హై...!