all

Tuesday, January 1, 2013

శీతాకాలంలోనూ జిడ్డు చర్మమా...ఐతే ఈ చిట్కాలు మీకే...

చర్మ సౌందర్యానికి మిగిలిన కాలాల్లో తీసుకొనే జాగ్రత్తల కంటే శీతాకాలంలో మరికొంత ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో మార్పుల వల్ల చర్మ పగుళ్ళు ఏర్పడి, తడి ఆరిపోయి, గీతలు ఏర్పడి అందవిహీనంగా కనబడ తారు. అందుకు కొన్ని వింటర్ క్రీములు అప్లై చేయడం వల్ల చర్మ జిడ్డుగా, ఆయిలీగా మారుతుంది. కారణం చాలా సింపుల్! ఎందుకంటే ఈ క్రీములు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. ఇంకా చర్మం పొడిబారనియకుండా చేస్తాయి. శీతాకాలంలో చర్మాన్ని పొడిబారనీయకుండా చేసుకోవడానకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మిగిలిన సీజన్ లో లాగే వింటర్ సీజన్ లో కూడా చర్మం జిడ్డుకలిగి, ఆయిలీగా ఉండటం వల్ల అసౌకర్యంగా, ఉంటుంది. మరియు ఈ ఆయిల్ ను పోగొట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అందువల్లే ఆయిల్ స్కిన్ ఉన్న వారు వింటర్ క్రీమ్స్ కు దూరంగా ఉంటారు. శీతాకాలంలో ఇలా క్రీమ్స్ ను వాడకపోవడం వల్ల చర్మం పొడి బారి, డల్ గా కనబడుతుంది. కాబట్టి ఆయిల్ చర్మాన్ని క్లియర్ గా మర్చి, ముఖ చర్మం అందంగ, తేమగా మార్చే క్రీములు మార్కెట్లో అనేక అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పనిచేయనప్పుడు కొన్ని ఇంట్లోనే కొన్ని వస్తువులతో ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టవచ్చు.

ways avoid oily skin this winter


మిల్క్ మసాజ్:

పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల దుమ్మ, ధూళిని, డెడ్ స్కిన్ ను తొలగించడమే కాదు..
ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. బయట తిరిగి ఇంటికి చేరుకోగానే తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చల్లటినీటితో శుభ్రం చేసుకొని పొడి వస్త్రంతో తుడిచి పొడి ఆరనివ్వాలి.
అలాగే బయటకు వెళ్లే కొన్ని నిముషాల ముందు కూడా పాలతో ముఖానికి మర్ధన చేసుకొని వెళ్ళవచ్చు.
ఇలా మర్ధన చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో జిడ్డు, ఆయిల్ తొలగిపోతుంది.


వేడినీళ్ళను వాడటం మానేయాలి:

వేడినీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మరంద్రాలను తెరుచుకొనేలా చేయడమే కాదు..
ఇది చర్మంలో నూనె గ్రంధులు కూడా తెరచుకొనేలా చేస్తాయి.
కాబట్టి శీతాకాలంలో ఆయిల్ స్కిన్ తొలగించాలనుకొంటే ఎప్పుడూ చల్లటి నీటితోనే ముఖంను శుభ్రం చేసుకోండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను మూసుకొనే చేసి మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

టమోటో మసాజ్:

చర్మంలో అధికంగా పేరుకొన్న ఆయిల్ ను టమోటో జ్యూస్ తొలగిస్తుంది.
టమోటో జ్యూస్ లో కొంచెం నిమ్మరసం కూడా చేర్చి ముఖానికి మర్ధన చేయాలి.
నిమ్మరసం ఎక్సట్రా ఆయిల్ ను, డెడ్ స్కిన్ తొలగిస్తుంది. అప్లై చేసిన రత్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి ఇదొక మంచి మార్గం.

ఎక్స్ ఫోయిలేట్:

ఆయిల్ చర్మాన్ని తొలగించడానికి వారంలో కనీసం రెండు సార్లు ఎక్స్ ఫోయిలేట్ చేయడం అవసరం.
అందుకు అనేక స్ర్కబ్ లు అందుబాటులో ఉన్నాయి.
శీతాకాలంలో ఆయిల్ చర్మాన్ని పోగొట్టడానికి ఓట్ మీల్ లేదా బాదాం స్ర్కబ్ లు బాగా పనిచేస్తాయి.
అందుకు ముఖాన్ని నీటితో శుభ్రం చేసి తర్వాత ఈ స్ర్కబ్ ను అప్లై చేయాలి.


స్ర్కబ్ అప్లై చేసిన రెండు మూడు నిముషాల తర్వాత మర్ధన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ముఖంలో ఏర్పడ్డ ఆయిల్ ను తొలగిస్తుంది.

 

‘వీపు’ భాగం అందంగా...కాంతివంతంగా మెరిసిపోవాలంటే...?

మహిళలకు పురుషుల కంటే సౌందర్య ప్రజ్ఝ అధికంగా ఉంటుంది. అందుకు ఫాషనబుల్ డ్రెస్ ధరించడానికి తమ ఆకృతి బట్టి ఎంచుకోవడం మంచిది. డీప్ నెక్ డ్రెస్ ను ధరించడం ఈప్పుడు ఫ్యాషన్ అయింది. సెలబ్రెటీలను గమనించినట్లైతే వారు ధరించే చీరల్లోని బ్లౌజులు, గౌనుల్లో కూడా వారి వీపు భాగం ఎంత అందంగా క్లియర్ గా మెరిసే చర్మం కనబడుతుంటుందో.

చీరలో బ్లౌజ్ కుట్టించుకోవడానికి టైలర్ కు కొలతలు ఇచ్చేటప్పుడే వారికి నచ్చిన విధానంలో కుట్టమని డీప్ నెక్ ను పెట్టమని టైలర్ కు ఎక్కువగా సలహాలిస్తుంటారు.

మరి చీరలో నైనా... డ్రెస్ కైనా డీప్ నెక్ పెట్టించుకొనే ముందు తమ శరీర సౌందర్యం, ఆకృతి, వీపు వెనుక వైపు భాగం సౌందర్యంగా ఉందో లేదో అన్న విషయాన్నిగుర్తించాలి. వీపు వెనుకవైపున డ్రెస్ లేదా బ్లౌజ్ డీప్ నెక్ పెట్టించుకునే వారు ముందుగా వీపు బాగం హైలైట్ గా కనబడాలే చూసుకోవాలి. లేదంటే ఆ వేసుకొనే డ్రెస్ ఎంత అందంగా కుట్టించినా దాని అందమే పోతుంది. కాబట్టి డీప్ నెక్ ఒక్కదానికే ప్రాధాన్యతమిస్తే సరిపోదు. వీపు బాగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

డీప్ నెక్ పెట్టించుకొని మీకు ఇష్టమైన డ్రెస్ ను ధరించడానికి ఇటువంటి (వీపు బాగం నల్లగా, మొటిమలు, మచ్చలు)సమస్యలు ఎదురైనప్పుడు చింతించాల్సిన అవసరం లేదు అందుకు కొన్నిచిట్కాలను పాటించినట్లైతే మీకు నచ్చిన డ్రెస్ ను అందంగా అలంకరించుకోవచ్చు.


get clear glowing back

1. స్టీమ్ బాత్:

వేడినీళ్ళ స్నానంతో వీపుబాగం చర్మం శుభ్రపడుతుంది. ఎందుకంటే వేడినీళ్ళ స్నానం వల్ల చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మం లోపలి బాగం నుండి శుభ్రం చేసి కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. వేడినీళ్ళ స్నానానికి వెళ్ళడానికి పదిహేను నిముషాల ముందు వీపు బాగానికి బాడీ ఆయిల్ ను మర్దన చేసుకొని వేళ్ళాలి. దాంతో చర్మం మెత్తబడి చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మంలోపల దాగివున్న దుమ్ము, ధూళి, కణాలను తొలగిస్తుంది. ఒక వేళ వీపు బాగంలో మొటిమలు, మచ్చలు ఉన్నట్లైతే అందుకు ఉపయోగపడే మిడిసినల్ సోప్ ను వాడాలి.

2. స్ర్కబ్బింగ్:

స్ర్కబ్బింగ్ వల్ల చర్మంలో దాగివున్న దుమ్ము, ధూళికణాలను తొలగించడానికి ఈ స్ర్కబ్బింగ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకు లూఫా లేదా బ్యాక్ స్ర్కబ్ ను ఉపయోగించవచ్చు. లూఫా అనేది నేచురల్ స్ర్కబ్ ఇది చర్మాన్ని సహజంగా శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. రక్తప్రసరణను పెంచుతుంది.

3. స్పాంజింగ్:

స్ర్కబ్బర్ కంటే కొంచెం సున్నితమైనది స్పాంజ్ దీన్ని ఉపయోగించడం వల్ల బ్యాక్ పోర్షన్ కాంతివంతంగా మారుతుంది. చర్మమీద పేరుకొన్ని మృతకణాలను తొలగించడానికి స్పాంజ్ తో రుద్దితే సరిపోతుంది. స్పాంజ్ తో రుద్దడం వల్ల చర్మానికి ఎటువంటా హానీ కలగకుండా సున్నితంగా ప్రకాశవంతంగా మారుతుంది.

4. నల్లమచ్చలను కవర్ చేయాలి:

మొటమల తాలుకు మచ్చలు చాలా ఇబ్బంది కరంగా కనిపిస్తుంటాయి. ఈ నల్ల మచ్చలు ఉన్నప్పుడు డీప్ నెక్ డ్రెస్ లు, బ్లౌజులు వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మచ్చలను కనబడకుండా చేయాలంటే కన్సీలర్ ను ఉపయోగించాలి. కన్సీలర్ ను మ్యాజిక్ మేకప్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నల్ల మచ్చలను, చర్మం మీద ఏర్పడ్డ చారలను, గీతలను కనబడనీయకుండా చేస్తుంది. మెడిసినల్ కన్సీలర్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మచ్చలను కనబడనీయకుండా చేయడమే కాకుండా అదే టైంలో మచ్చలకు, మొటిమలకు చికిత్సలా ఉపయోగపడుతుంది.

5. ఆయిల్ మసాజ్:

రెండు రోజులకొకసారి ఆ ఆయిల్ మసాజ్ వీపు బాగానికి చేయడం వల్ల చర్మం మెరవడమే కాకుండా శుభ్రపడుతుంది. అందుకు ఎసెన్సియల్ ఆయిల్స్ ను(బాదాం నూనె, ఆలివ్ నూనె, లావెండర్ నూనె) ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ సీజన్ కూడా చలికాలం కాబట్టి ప్రతి రోజూ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడి మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది.