all

Friday, March 15, 2013

అపార్ట్‌మెంట్‌ జీవితం...

 

ఈరోజుల్లో సొంతిల్లు, అదీ ఇండిపెండెంట్‌ ఇల్లు అంటే కలల్లోనూ కష్టసాధ్యమైన పనైపోయింది. అందుకే అపార్ట్‌మెంట్లకు ఆదరణ ఎక్కువైంది. అనుకున్న బడ్జెట్‌లో, కావలసిన సదుపాయాలుండి, రక్షణతో వుండే అపార్ట్‌మెంట్లే నేడెక్కడ చూసినా! అపార్ట్‌మెంట్‌ అనగానే పదిమందితో కలిసి జీవించడం. అపార్ట్‌మెంట్‌ వాసులు వేసుకునే జోక్‌ ఏంటంటే... 'ఇది మన సొంతమే. కానీ గోడ మనది కాదు, నేల మనది కాదు, పైకప్పు మనది కాదు' అని! అది నిజమే! అంటే ఓరకంగా సర్దుబాటు జీవితం అన్నమాట!
పదిమందితో కలిసి నివసించా లనుకుంటే అందుకు అను గుణం గానే ప్రవర్తించాలి. అలా కాకుండా ప్రతిదానికీ ఆగడం చేసుకునే వారు తామూ ప్రశాంతతగా ఉండలేరు, తోటివారినీ ఉండనివ్వరు.
గోటితో పొయ్యేదానికి...
పిల్లలన్నాక ఆడతారు. కేకలేస్తారు. మెట్లపై పరుగులు తీస్తారు. దానికే హైబీపి తెచ్చేసుకుంటే అవో పెద్ద తగాదాలుగా మారతాయి. సరిగ్గా మనం పార్క్‌ చేసేచోటే మరొకరు బండి పార్క్‌చేస్తారు. వాళ్లింటి ఎదురుగా కుండీలు పెట్టుకుంటారు. ఓకే! కానీ, అందులోని నీరు కాలువలా మన గుమ్మంలోకి వచ్చేస్తోందే! అంతేనా! లేచింది మొదలు పడుకునేదాకా కుక్కరు కూతలు, టివి మోతలు ఇవన్నీ అపార్ట్‌మెంట్లలో సహజాతి సహజం. వాటిని భూతద్దంలో చూస్తే మనశ్శాంతి దొరకదు. ఇబ్బందిని సున్నితంగా చెప్పి సరిచేసుకోవాలి. మెల్లగా నచ్చ చెప్పాలి. అంతే తప్ప గొడవ చేయాలని చూస్తే సంబం ధాలు దెబ్బతింటాయి. ఒక చోట వుంటున్నప్పుడు సత్సం బంధాలు చాలా ముఖ్యం.
ఇల్లన్నాక విందులు, వినోదాలు జరుగుతాయి. పుట్టినరోజులు, సందళ్లు ఉంటాయి. ఆ హడావిడి, హంగామా మన ఇంటికి మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఉత్సాహం అత్యుత్సాహంగా మారితే ఇబ్బందే! పాటలు పెద్దగా పెట్టడం, స్పీకర్లతో హోరెత్తించడం పక్కింటివారికి కునుకు లేకుండా చేస్తుంది. ఆ ఇంట్లో చదువుకునే పిల్లలుండొచ్చు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులుండొచ్చు. ఇవన్నీ మనం అర్థంచేసుకోవాలి. అదే పరిస్థితిలో మనం ఉంటే ఎంత విసుక్కుంటామో, అచ్చం వారికీ అలానేగా! ఇక ఇబ్బంది మనకు వచ్చినపుడు వెళ్లి మెల్లగా చెప్పాలి. అంతేతప్ప, అరుస్తూ చెబితే అయిపోదు. మర్నాటినుండి ముఖాముఖాలు చూసుకోవాలనేది గుర్తుంచుకోవాలి.
అపార్ట్‌మెంట్లో అంతా కలిసికట్టుగా వుండటం అన్నివిధాలా శ్రేయస్కరం. ఉన్నట్లుండి పిల్లాడికి జ్వరం వచ్చింది. సమయానికి శ్రీవారు లేరు. అప్పుడు తోడుగా వచ్చేదెవరు? అదనే కాదు, ఏ కష్టంవచ్చినా బంధుమిత్రులకన్నా ముందు ఆదుకునేది మన ఇరుగు పొరుగువారే. అలాంటి వారిని చిన్న చిన్న మనస్పర్థలతో దూరం చేసుకోవడం సరికాదు.
ఆచితూచి...
పిల్లలు ఒకరితో ఒకరు ఇట్టే కలిసిపోతారు. పిల్లల గొడవల్లో పెద్దలు తల దూర్చకూడదు. వాళ్లు అప్పటికప్పుడు కలహించుకున్నా, వెంటనే మరిచిపోతారు. కానీ, అందులో పెద్దలు జోక్యం చేసుకుంటే చిలికి చిలికి గాలివానవుతాయి. అందుకే, పెద్దలు ఈ విషయంలో దూరంగా ఉండటమే బెటర్‌!
అపార్ట్‌మెంట్లో వున్నవారికి పరస్పర సాయాలు అవసరమవుతాయి. కొందరికి ఇతరుల సహాయం తీసుకున్నప్పుడు ఉండే కలివిడితనం, వారికి సాయం చేయాలనేసరికి మాయమవుతుంది. అది సరికాదు. అవసరాన్ని బట్టి సాయం చేయాలి. అయితే, అపాత్రదానాలు మంచివికావు. చేయలేని సాయాన్ని ముందే చెప్పేయాలి. మొహమాటాలకు పోయి ఇక్కట్లపాలు కాకూడదు.
ఆరాలు- బేరాలు
ఆసక్తి సహజం. కానీ, కొందరికి ప్రతిదీ ఆరానే. వ్యక్తిగత విషయాలు, ఆదాయాలు, అప్పులు, విమర్శలు... ఇలా వాటికి అంతుండదు. అనవసర జోక్యాన్ని వెంటనే ఖండించాలి. చనువు మితిమీర కూడదు. అలాగే, ఇరుగింటి పొరుగింటి ముచ్చట్లు విన డానికి బాగానే ఉంటాయి. రేపు వాళ్లు మన గురించీ అలాగే మాట్లా డొచ్చు. అందుకే, వీటికి ముందే ఫుల్‌స్టాప్‌ పెట్టే యాలి. చెవులు కొరుక్కోవ డాన్ని కట్‌చేయాలి.
ఒక పనిమనిషి రెండిళ్లలో పనిచేసినపుడు మా ఇంట్లో ముందంటే మా ఇంట్లో ముందని పోటీపడ కూడదు. అవసరాన్ని బట్టి ఇద్దరూ సర్దుబాటు చేసు కోవాలి. అనవసరంగా గొడవలు పడితే అసలుకే మోసం. అలాగే, పనిమనుషులను ఇరుగుపొరుగు గురించి ఆరాతీయడం సభ్యత కాదు. మనం అడుగుతున్నట్లే పక్కింటివాళ్లూ మన గురించి అడగొచ్చు. చిలవలు పలవలుగా కల్పించుకుని చెప్పుకుంటే ఆ క్షణానికి సరదాగానే వుంటాయి. కానీ, అవే ఏదో ఒకరోజు పీకకు చుట్టు కుంటాయి.
వాచ్‌మెన్‌ ఉన్నాడు కదాని ప్రతి పని అతనికే చెబితే అందరికీ నష్టం! అసలే రక్షణ కరువైన రోజుల్లో ఉన్న వాచ్‌మెన్‌ అటూ ఇటూ తిరుగుతుంటే... ఆనక జరగ రానిది జరిగితే ఎవరు బాధ్యులు?
కొందరు మిగతా సరదాలేమీ ఆపుకోరు. కానీ, మెయింటెనెన్స్‌ సమయానికి కట్టరు. వాచ్‌మెన్‌ జీతం, కరెంటు బిల్లులు, వాటర్‌ బిల్లులు... వీటన్నింటికీ మెయిం టెనెన్స్‌ ఆధారం.
ఒకరికొకరుగా...
స్నేహభావంతో మెలగాలన్నది కరెక్టే! కానీ, అది సాకుగా చేసుకుని చీరలు, నగలు అడగడం సరికాదు. ఎదుటివారితో పోల్చుకుని వస్తు వులు అమర్చుకోవాలనుకుంటే అప్పుల పాలవడమే కాదు, సంతృప్తి అనేది వుండదు. ఇవే కాదు, పక్కింటివారి వద్ద అప్పులు చేయడం అసలే కూడదు. అంతా కలిసి వేడుకలు, పిక్నిక్‌కు ఏర్పాటు చేసుకోవడంవల్ల ఒకరికొకరు పరి చయం అవుతారు. తలా ఒక వంటకం వండుకుని కలిసి తింటే సరదాగా ఉంటుంది. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. పండుగల్లో మిఠాయిలు ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరి కూరలు మరొకరు రుచి చూపించుకోవడం ఆప్యా యతలు పెంచుతాయి. ఎదురైనపుడు నవ్వుతూ పలకరించుకుంటే మనసుకు ఆహ్లాదంగా వుంటుంది. ఇరుగు పొరుగు సాంగత్యం హాయిగా వుంటుంది. మానవ సంబంధాలు అరుదైపోతున్న ఈ రోజుల్లో... బతుకు తెరువుకోసం ఉన్న ఊరికి, కన్నవారికి ఆమడ దూరంలో జీవిస్తున్న ఈ కాలంలో... గిరిగీసుకుని పెంచుకున్న నిస్తేజాన్ని పారద్రోలాలంటే నలుగురితో కలవాలి. అపార్ట్‌మెంట్‌ జీవితం అందుకు దోహద పడుతుంది. సంతోషాలను పెంచి సంఘజీవిగా మార్చుతుంది.

కమలా కాదనలేం..!

రంగు, రుచి, చిక్కదనం... మూడు కలగలిసింది త్రీ రోజెస్‌ మాత్రమే కాదు! కమలా కూడా! ఎందుకంటే, నారింజ రంగు వెంటనే ఆకట్టుకునే రంగు. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా నోరూరించే రుచి. ఆపై రసం చిక్కగానేగా వుండేది. సో, కమలాను కాదనడం భావ్యంకాదు. ఆపై సుగుణాల మూటకట్టిన ఫలంకూడాను! చైనాలో కమలాపండును శుభాలు కలిగించే ఫలంగా అభివర్ణిస్తారట. ఆ మెప్పుకోళ్లకు కమలా తగినదే అనిపించదూ!
కమలా కాయగానే కాదు, జ్యూస్‌లానూ లాగించెయ్యొచ్చు. అయితే, తొనలుగా తింటేనే మంచిది. ఇక ప్లమ్‌కేక్‌ చేయడానికి కమలారసంలో డ్రైఫ్రూట్స్‌ను నానబెడితే ఆ రుచే వేరు. దానికి కమలా తొక్కల పొడి జోడిస్తే... అబ్బో... ఇక స్వర్గం దిగిరాదూ! అన్నట్లు... కమలాతొక్కలు సౌందర్యానికి వారధులు. చర్మరోగాలకు విరుగుడు. వీటన్నింటికీ ఇందులోని పోషకాలే కారణం. మరవేంటో తెలుసుకుంటే పోలా?


- ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.
- ఇందులో విటమిన్‌ సి మాత్రమే కాదు. విటమిన్‌ ఎ, బిలు, ఎమినో యాసిడ్లు, బీటా కెరోటిన్‌, పెక్టిన్‌, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కేల్షియం, అయొడిన్‌, సోడియం, జింక్‌, ఐరన్‌... వగైరా వగైరాలన్నీ కొలువుతీరాయి!
- రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా చేయడంలో ఇది బాగా కృషిచేస్తుందిట!
- కేన్సర్‌ను అధిగమించడంలో కమలా పాత్ర ఎక్కువేనట. కణాలను రక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందిట.
- కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి కమలా తన శ్రాయశక్తులా ప్రయత్నిస్తుందిట.
- ఇది రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుందని వైద్య పరిశోధకులు సెలవిచ్చారు.
ఇందులో పీచు అధికమని అందరికీ తెలుసు. దానివల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుందని మళ్లీ చెప్పాలా?!
- గుండె సమస్యలూ రాకుండా చేయడంలో కమలాను మించింది లేదట.
- కమలా రోగనిరోధకశక్తిని పెంచే సాధనం.
- కమలాకు మారుపేరు సౌందర్యం. చర్మానికి మేలుచేసే సుగుణాలెన్నో దీనిలో వున్నాయి.
- కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడే వనరు కమలా.
- ఇందులోని విటమిన్‌ సి పెప్టిక్‌ అల్సర్‌ను నివారిస్తుంది. తద్వారా కేన్సర్‌ రాకుండా చూస్తుందిట.
- వైరల్‌ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కమలాఫలం సఫలం.
అదీ కమలా చరిత్ర. రుజువైన వాస్తవాల చరిత్ర. అంటే, కమలా ఆరోగ్యానికి సోపానమనేగా అర్థం!

వెరైటీ గుమ్మడి......!


స్వీట్
కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ (క్యూబ్స్) - అరకేజి, కొబ్బరిపాలు - 160 మి.లీటర్లు, బ్రౌన్ షుగర్ - 80 గ్రా.
తయారుచేసే విధానం:గుమ్మడి ముక్కల్ని ఆవిరిపై మెత్తగా ఉడికించి మెదపాలి. ఒక లోతైన స్టీల్ పాత్రలో గుమ్మడి గుజ్జు, కొబ్బరిపాలు, బ్రౌన్ షుగర్ కలపాలి. వెడల్పాటి పాత్రలో మూడొంతులు నీరుపోసి, మధ్యలో గుమ్మడి మిశ్రమం పాత్రను ఉంచి, మిశ్రమం చిక్కబడేవరకు నీటిని మరిగించాలి. చల్లారిన తర్వాత ఒక పొడి సీసాలోకి తీసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. పిల్లలు బాగా ఇష్టపడే స్వీట్ ఇది.

సూప్
కావలసిన పదార్థాలు: బటర్ - 1 టీ స్పూను, చిన్న ఉల్లిపాయ - 1, వెజిటెబుల్ స్టాక్ - 3 కప్పులు, గుమ్మడికాయ గుజ్జు - 1 కప్పు, సోయాసాస్ - 1 టీ స్పూను, కొబ్బరిపాలు - 1 కప్పు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారుచేసే విధానం: బటర్‌లో ఉల్లితరుగు వేసి 3 నిమిషాలు వేగించాలి. ఇప్పుడు వెజిటెబుల్ స్టాక్, గుమ్మడి గుజ్జు, సోయాసాస్ కలిపి చిన్నమంటపై 15 నిమిషాలు మరిగించాలి. కొద్దికొద్దిగా కొబ్బరిపాలు కలుపుతూ 20 నిమిషాలు ఉంచి, ఉప్పు, మిరియాలపొడి కలిపి దించేయాలి. సర్వ్ చేసేముందు కొత్తిమీరతో అలంకరించాలి.

దోశ
కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ గుజ్జు - అరకప్పు, మైదా - 1 కప్పు, బ్రౌన్ షుగర్ - 1 టేబుల్ స్పూను, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, వంటసోడా - చిటికెడు, ఉప్పు - అర టీ స్పూను, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను, జాజికాయ, మిరియాల పొడి - పావు టీ స్పూను చొప్పున, గుడ్డు - 1, మజ్జిగ - 1 కప్పు, నూనె - కాల్చడానికి సరిపడా, బటర్ - 1 టీ స్పూను.
గ్రేవీ కోసం :ఒక పెద్ద గిన్నెలో మైదా, బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, వంటసోడా, ఉప్పు, మిగిలిన పొడులు వేసి కలపాలి. మరో గిన్నెలో గుడ్డు గిలకొట్టి కరిగించిన బటర్, గుమ్మడి గుజ్జు, మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాలో పోస్తూ ఉండలు చుట్టకుండా జారుగా కలిపి 10 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత దళసరిగా దోశల్లా పోసుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. వీటిని ఉదయం ఫలహారంగా చేసుకోవచ్చు.

మీ పిల్లల ఆహారంలో పోషకాలున్నాయా?


 
NewsListandDetailsపిల్లలు చాలా పీలగా ఉన్నారు... ఎంత తిన్నా తిండికి లేనివాళ్లలాగే ఉసూరుమంటున్నారని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు.
అయితే తినే పరిమాణం సంగతి పక్కనపెట్టి వాళ్లకు సరిపడిన కేలరీలు అందుతున్నాయా?
అని ఆలోచిస్తే సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది. అయితే ముందుగా ఎందులో ఎన్ని కేలరీలున్నాయో తెలియాలి కదా! అలాంటి కొంత సమాచారం...

ఉడకబెట్టిన ఒక కోడి గుడ్డు సుమారు 80 కాలరీల శక్తి నిస్తుంది. ఇందులో 6గ్రాముల ప్రొటీన్‌, 590 యూనిట్ల విటమిన్‌ ఎ ఉంటుంది.
గుడ్డు తినని కుటుంబాలలోని పిల్లలకు రోజూ 8 జీడిపప్పులు ఇస్తే, అందులో 95 కాలరీలు, 3గ్రాముల ప్రొటీన్‌ ఉంటాయి.

స్కూలుకి వెళ్ళే పిల్లలకు రోజూ సాయంత్రం 3 బ్రెడ్‌ స్లయిసులు ఇస్తే 150 కాలరీలు, 6 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది.

ఇక ఫ్రూట్స్‌ విషయానికి వస్తే, ఒక బత్తాయి(ఆరంజ్‌) 50 కాలరీలనిస్తే ఒక పెద్ద యాపిల్‌ లేదా అరటి పండు 80 కాలరీలను ఇస్తాయి.
ఆలుగడ్డలు (పొటాటో) కూడా మంచి పోషక విలువలు కలిగివున్నాయి.

100గ్రాముల ఉడికిన పొటాటోలలో 85కేలరీలు, 3గ్రాముల ప్రొటీన్‌ లభిస్తాయి.

ఫ్రూట్స్‌, ఆకుకూరలు, కూరగాయలలో ఫైబర్స్‌, మినరల్స్‌ ఎక్కువ. ఐరన్‌, కాల్షియం ఉంటాయి. తొందరగా జీర్ణమవుతాయి. మలబద్దకం ఉండదు.
ఇవి ఎక్కువగా తినే పిల్లల్లో డైవర్టిక్యులైటిస్‌, ఎపెండిసైటిస్‌ వ్యాధులు కూడా చాలా అరుదుగా వస్తాయి.

స్కూలుకు వెళ్ళే పిల్లలకు సీజనల్‌ ఫ్రూట్స్‌ ప్రతి రోజూ ఒక కాయైనా పూర్తిగా ఇవ్వటం మంచిది. పళ్ళలోని ఫైబర్‌ జీర్ణశక్తిని పెంచుతుంది. పండుగా తినడానికి ఇష్టపడని పిల్లలకు జ్యూస్‌గా అయినా ఇవ్వండి.

5 సంవత్సరాల లోపు పిల్లలకు 150మి.లీ(ఒక కప్పు) సరిపోతుంది.
పెద్ద పిల్లలకు 1 1/2-2 కప్పుల వరకు ఇవ్వవచ్చును. మామిడి, ద్రాక్ష, వాటర్‌మిలాన్‌ ముక్కలతో ఫ్రూట్‌ సలాడ్‌ చేసి పెట్టండి.
వెజిటబుల్స్‌ తక్కువగా తినే పిల్లలకు రోజుకో రకం సూప్‌గా చేసి ఇస్తే ఆనందంగా తాగుతారు. అలాగే వెజిటబుల్స్‌ని ఆమ్లెట్‌లో కలిపి ఇవ్వవచ్చు.

పెద్దలూ! ఇలా ప్రవర్తించవద్దు


 
NewsListandDetails-ప్రతిచిన్న విషయానికి వ్యతిరేకధోరణిలో విపరీతమైన ఒత్తిళ్లతో ఉండకూడదు. మీరే అలా ఉంటే మిమ్మల్ని వారు గమనించినపుడు అలాగే ఉండాలేమో, ఏ విషయానికైనా అలాగే స్పందించాలేమో అనుకొనే అవకాశం కూడా ఉంది.

-పిల్లల్ని చదువు, చదువు అని పోరుపెట్టడం వారికి చదువుపట్ల అయిష్టత ఏర్పడేలా చేయవచ్చు. అలా వారికి మాటిమాటికీ చెప్పడంతో చదవడం వారి బాధ్యత అనేదానికంటే ముందు చెప్పడం మీ బాధ్యత అన్నట్లుగా అర్థం చేసుకుంటారు.

అయితే మీరు వారి ఎదురుగా ప్రతిరోజూ కొంతసమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తే మీకు వారిని చదువుకోమని చెప్పే అవసరం చాలావరకు తగ్గినట్లే అవుతుంది.

చదువుకోవడానికి సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి అనేది వాళ్లు మీనుంచి నేర్చుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది.

-క్రమశిక్షణ, బాధ్యత ఇవి కూడా మిమ్మల్ని గమనించడం ద్వారానే పిల్లలు నేర్చుకుంటారు. మీరు మీ పెద్దవాళ్ళతో నడుచుకునే తీరు, తల్లిదండ్రుల మధ్య ఉండే సత్సంబంధాలు, మాట్లాడుకునే విధానం ఇవన్నీ పిల్లలు గమనిస్తూనే ఉంటారు. చాలా కుటుంబాల్లో పిల్లలు పెద్దవాళ్ళ మాటలను లెక్కచేయకుండా ఉండటమనేది చాలావరకు ఆయా కుటుంబాల తీరు అయిఉంటుంది.

-మీ పిల్లలకు మంచి క్రమశిక్షణ రావాలని, తోటి కుటుంబ సభ్యుల పట్ల, తాము చేయవలసిన పనుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని మీరు కోరుకోగానే సరిపోదు, అవన్నీ నేర్చుకోవడానికి వారు మిమ్మల్నే పాఠశాలగా ఎంచుకుంటారనే విషయాన్ని మరచిపోకండి.

-మీరు పిల్లలతో మాట్లాడే తీరు ఎంత ముద్దుగా, కచ్చితంగా, ప్రేమగా, ఆప్యాయంగా ఉంటుందో వారు అంత మంచివారుగా, మంచి మాటలు మాట్లాడేవారుగా, మంచి సంబంధబాంధవ్యాలు నెరపే వారుగా తయారవుతారు.

-పిల్లలు మీ మాటతీరును గమనిస్తూనే ఉంటారు. అదే ఎదుటివారితో ఎలా మాట్లాడాలి అనేదానికి వారు ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి పిల్లల ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనం వారికి చెప్పే పాఠాలుగానే తీసుకోవాలి.

పిల్లల ఏకాగ్రత...


 
NewsListandDetailsఏకాగ్రత ఒక గొప్పశక్తి. దీనివలన ఎన్నో ప్రయోజనాలున్నాయని గ్రహించండి.
ఈ ప్రశ్నను మీరు మీకై వేసుకోవచ్చు.
''నా పిల్లవానికి ఏకాగ్రత ఎందుకంత చాలా ముఖ్యమైనది?" అని స్వతహాగా, సహజంగా పిల్లలు చక్కని ఏకాగ్రత కలిగినవారు.
ఈ ఏకాగ్రత వలన వారిలో ఉత్తమమైన గ్రహణశక్తి ఏర్పడుతుంది.

ఏ విషయం మీద పిల్లవాడు ఎక్కువ ఏకాగ్రత కలిగి ఉన్నాడో గ్రహించాలి.

ఈ ఏకాగ్రత వలన పిల్లవాడు మంచి అనుభవము, అనుభూతిని అవగాహన పొంది, పెద్దయిన తరువాత జీవితంలో అన్ని విషయాలపై పట్టు, విజయాన్ని సాధిస్తారు.
కాబట్టి పిల్లల అభివృద్ధికి ఏకాగ్రత ఎంతో అత్యవసరమైనవి. అద్భుతమైనది కూడా.

పిల్లలకు చెప్పవలసిన విషయాన్ని సూటిగా, అర్థం చేసుకొనే రీతిలో చెప్పండి. ఉద్రేకపూరితంగా తొందరపాటుతనంతో చెప్పకూడదు. ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకొంటే చక్కగా విపులంగా మృదువుగా, క్లుప్తంగా అర్థవంతంగా చెప్పాలి.

ఫ్లవర్‌వాజ్‌ అందంగా...



అప్పుడే విరిసిన పూలతో ఫ్లవర్‌వాజ్‌ను అలంకరించి హాలులోని టేబుల్‌పై పెడితే ఇంటికి అందంగా ఉండడమే కాదు మనసుకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి అటువంటి అలంకరణలో ఏ పువ్వులు వాడాలి, ఎలా అలంకరించాలన్నది తెలుసుకుందామా!

- ఫ్లవర్‌వాజ్‌లో పువ్వులు అలంకరించాలంటే సూర్యోదయానికి ముందే పువ్వులు కోసి పెట్టుకోవాలి. వీటిని కోసేటప్పుడు పదునైన చాకును ఉపయోగించాలి. నీటితో కడిగి ఫ్లవర్‌వాజ్‌లో పువ్వులు అలంకరించాలి.

- పువ్వులతో పాటు మధ్యమధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్లలో మునగకూడదు. అదే పూల ఆకులు కాకుండా వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్‌వాజ్‌ అందంగా ఉంటుంది.

- బాగా వికసించిన ముదురురంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి.

- ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకేచోట కాకుండా మ్యాచింగ్‌ ఉండేలా చూడాలి.
- పువ్వుల రంగు గది కర్టెన్‌ రంగుతో మ్యాచ్‌ అయితే ఆనందానుభూతి ఎక్కువ.

- ఫ్లవర్‌వాజ్‌ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్లల్లో కాస్తంత ఉప్పు కలిపితే పువ్వులు ఎక్కువ కాలం ఉంటాయి.

- ఫ్లవర్‌వాజ్‌ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట పెట్టకుండా తాజా గాలి వచ్చే చోట పెట్టాలి.

- ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్స్‌, మనీప్లాంట్స్‌ కొన్ని రకాల క్రోటన్‌ మొక్కలు కుండీలో వేసి గదుల్లో డ్రాయింగ్‌రూంలో అలంకరించుకోవచ్చు.



- మొక్కలు మనకు ఆక్సిజన్‌ ప్రసాదించి, మనం వదిలిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ తీసుకుని ఎంతో మేలు చేస్తాయి.

- వేప యూకలిప్టస్‌ మొదలైనవి క్రిమిసంహారిణిగా ఉపయోగపడతాయి. కనుక స్థలం ఉన్న వారు బద్ధకించకుండా మొక్కలు పెంచడం వల్ల ఆదాకి ఆదా, ఆరోగ్యానికి ఆరోగ్యం. మొక్కలకి నీరు పోయడం వల్ల శరీరానికి వ్యాయామం కూడా.

కర్తవ్యపాలనలో మహిళ.............


 
NewsListandDetails మహిళలు పురాణకాలం నుండి వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. కైకేయి దశరథుని వెంట ఉండి ఆయన యుద్ధభూమిలో గాయపడిన తరువాత వేరొక చోటికి తీసుకువెళ్లి సపర్యలు చేసి సేదదీర్చింది.

భర్త విజయానికి కారణం అయ్యింది. శ్రీరామునికి స్వయంగా యుద్ధవిద్యలు నేర్పింది. చంద్రునికి గ్రహణం పట్టినట్లు ఆమె బుద్ధి మంథర వల్ల ప్రేరేపింపబడి, శ్రీరాముని అడవికి పంపడం, భరతుని రాజ్యాభిషేకం వరాలు దశరథుని కోరింది.

కాని శ్రీరాముడు అడవిలో రాక్షసులను సంహరించడం విని సంతోషించింది. తాను అపనిందలు పాలయినా, శ్రీరాముడు లోకరక్షకుడయినందుకు తాను నేర్పిన యుద్ధవిద్యలు లోకకల్యాణానికి కారణం అయినందుకు ఎంతగానో ఆనందపడింది.

మహాభారతంలో కుంతీదేవి తనకొరకు కాక ఇతరులకొరకు మాత్రమే జీవించింది. పెంపుడు తండ్రి కుంతి భోజుడు దుర్వాసుని సేవకు నియోగించగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆయనకు సేవచేసింది. ఆయన వలన ఎంతో విజ్ఞానాన్ని పొందింది. ఆయన సంతోషించి మంత్రాన్ని ఉపదేశించాడు.
ఒంటరిగా ఉన్నప్పుడు బాల్యచాపల్యంతో ఉదయిస్తున్న సూర్యుని చూసి మంత్రాన్ని పఠించింది. ఫలితంగా కర్ణునికి జన్మను ఇచ్చింది. ఈ చిన్న తప్పు ఆమె జీవితాన్ని మార్చివేసింది. పాండురాజుతో వివాహం ఆమెకు బాధ్యతలను మాత్రమే పెంచింది. వంశము కొరకు దేవతలను ఆహ్వానించి, తాను పుత్రులను పొంది, మాద్రి కూడా సంతానయోగం కలగజేసింది.

గాంధారి వివాహము ధృతరాష్ట్రునితో భీష్ముని అధికారము వలన జరిగింది. హస్తినాపురాన్ని ఎదిరించే ధైర్యము గాంధార దేశానికి లేదు. శతపుత్రవతిగా, శంకరుని వరము పొందిన ఆమెను భీష్ముడు ధృతరాష్ట్రునికి ఇచ్చి చెయ్యమని కోరాడు. ఎదిరించే ధైర్యము లేక గాంధారి తండ్రి సుబలుడు అందుకు అంగీకరించాడు.
కాని శకుని గుండెలో జ్వాల మహాభారత యుద్ధానికి కారణం అయింది. భర్త అంధుడని ఆమె కూడా కళ్లకు గంతలు కట్టుకుంది. ఆమె ఏనాడు సత్యాన్ని వీడలేదు. బాధ్యతలను విస్మరించలేదు. హస్తినాపురంలో ఉన్నంతకాలం కుంతిని, పాండవులను ఆదరించింది. దుర్యోధనుని దుష్ప్రవర్తనను గురించి ధృతరాష్ట్రునితో పలుమార్లు చర్చించింది. చివరికి యుద్ధములో ధర్మానికి మాత్రమే విజయము కలగాలని కోరుకుంది.
ఈవిధముగా గాంధారి ఆకాలంలో స్త్రీలకు మార్గదర్శకం అయింది.



ఊర్మిళ లక్ష్మణుని భార్య రామాయణంలో ఈమె ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. నిజానికి, నిజమైన వనవాసం ఊర్మిళ అనుభవించింది. శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లాడు.
మాండవి భరతునితో శృతకీర్తి శతృఘ్నునితో సుఖముగానే ఉన్నారు. రామునితో సీత అడవికి వెళ్లవచ్చును కాని, ఊర్మిళ లక్ష్మణునితో వెళ్లకూడదా!
ఈ ప్రశ్న ఆమె మనస్సులో నుండి బయటకు రాలేదు. దానికి ఆమె చింతించలేదు. ఊర్మిళ మిథిలానగరంలో రసాయనిక శాస్త్రాన్ని అభ్యసించింది.

దండకారణ్యంలో ఎక్కడెక్కడ, భూమిలో గంధకము పొరలుగా ఉందో నిపుణులను పంపి విషయాన్ని సేకరించింది. వారు చెప్పగా ఎప్పటికప్పుడు ఆ విషయం రామలక్ష్మణులకు తెలియజేసింది. శ్రీరాముని ఆశయం దండకారణ్యం నుండి రాక్షసులను సంహరించడం లేదా, వారిని అక్కడ నుండి తరమికొట్టడము. ఖర-దూషకాదులతో సహా పధ్నాలుగు వేలమంది రాక్షసులు అక్కడ ఉన్నారు.
వారినందరిని శ్రీరాముడు ఒక్కడే సంహరించాడు. వారంతా భూమిలో గంధకము పొరలు ఉన్న ప్రాంతానికి రాగా, ఒక్కసారిగా ఆగ్నేయాస్త్రముతో వారిని అందరిని సంహరించాడు. అనగా గంధకము నుండి వారంతా మాడి మసిఅయ్యారు.
ఈవిధముగా ఊర్మిళ శ్రీరామలక్ష్మణులు దండకారణ్యంలో రాక్షసులను సంహరించడానికి కారణం అయ్యింది.





నేటికాలంలో మహిళలు ఎన్నో రంగాలలో ప్రముఖస్థానాలలో ఉన్నారు.
మేడం క్యూరీ నుండి సునీతా విలియమ్స్‌ వరకు ఖ్యాతిని గడించారు.
మహిళలకు అన్యాయం జరిగినప్పుడు సంఘీభావంతో వారే ఏదోరకంగా ఎదుర్కొంటున్నారు.
కాని ఆత్మరక్షణ కూడా ఎంతో అవసరం.

ఎవరో వచ్చి ఏదో చేస్తారని రక్షిస్తారని ఆశించక, ఆడపిల్లలు కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి. సామాజిక స్పృహ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మహిళలు ముందుకు సాగగలరు. 
  - ర్యాలీ రమాసీత

మంచి ఆలోచనలతోనే మనసుకు హాయి


 
NewsListandDetails మన ఉన్నతిని ఆశించేవాళ్లు, శ్రేయోభిలాషులు, పెద్దవాళ్లు, మనం పూజించే దైవంనుంచి లభించే దీవెనలే కాదు, మనం ఆలోచించే విధానం కూడా మనల్ని చక్కగా దీవిస్తుంది. మంచి ఫలితావైపు పరిగెత్తేలా చేస్తుంది, నిత్యం ఆనంద డోలికల్లో తేలియాడే ఉత్సాహాన్ని ఇస్తుంది, మేధస్సును పెంచుతుంది...అంటున్నారు మానసిక నిపుణులు, పరిశోధకులు.
అలాంటి మేలును చేసిపెట్టే దీవెనలందించే పది ఆలోచనా తీరులివిగో...





- నిన్న ఎందుకు నాపట్ల ఆమె అంత దారుణంగా ప్రవర్తించింది? అనే ఆలోచనను పక్కన పెట్టేసి ఆ స్థానంలో... ఈరోజుకి నేను ఏమి ఇవ్వగలను, ఈ రోజు ఏమి చేయగలను అని ఆలోచించడం ఎంతో మేలు చేస్తుంది.

- నాకెప్పుడూ ఇలాంటి చెడ్డ ఆలోచనలే, నెగటివ్‌ ఆలోచనలే వస్తాయనుకుంటూ మీ పట్ల మీరు నిరాశను, నిరుత్సాహాన్ని ప్రదర్శించుకోకూడదు. అప్పుడప్పుడూ మీకు మంచి ఆలోచనలు వస్తుంటాయి. వాటిని రిపీట్‌ చేసుకుంటూ ఉంటే, ముందు ముందు ఎప్పుడూ మీకు మంచి ఆలోచనలే స్వాగతం పలుకుతాయి.

- మంచి ఫీలింగ్స్‌ను బాగా ఆనందించడం, ఉత్తేజపరచుకోవడం, ప్రేమించడం, ఉత్సాహాన్ని నింపుకోవడం, చేయాలి. ఒక మంచి అనుభూతినుంచి ఇంతకన్నా ఎక్కువే దొరుకుతాయి.

- ఎంత చెడ్డ స్నేహానికి నేను దగ్గరయ్యాను అనుకుంటూ మీ స్నేహితుల గురించి ఆలోచించడానికి బదులుగా... మీకు మీరుగా ఎంత మంచి నేస్తంగా ఉండగలరు. ఇంకా ఎంత స్నేహపూర్వక గుణాలను మీకు జతచేసుకోగలరు? అని ప్రశ్నించుకోవడం చేయాలి.

- ఫీల్‌ గుడ్‌ గానే ఉండండి. ప్రతి క్షణం ఆనందాన్ని ఆహ్వానిస్తూ, ఆనందాన్ని చూస్తూ ఉంటే మీరు ఒక్క ఫీల్‌గుడ్‌ను మాత్రమే సృష్టించినట్లు కాదు. మంచి భవిష్యత్తును కూడా సృష్టించుకున్నవాళ్లు అవుతారు మరి.
- ఊహించుకోండి. మీ పట్ల మీకున్న ప్రేమతో మీరు బంధించబడినట్లుగా ఊహించుకోండి. అసలు ఆ ఆలోచనే ఒక గొప్ప దీవెన...మనసుకు...శరీరానికి, ఆత్మకు కూడా.

- మీకు బాధను కలిగించిన, కష్టాన్ని రుచిచూపించిన గతం గుర్తుకొచ్చినపుడు...ఇప్పటి ఆనందాన్ని... పరిస్థితులను, మార్పును, మీ చుట్టూ ఉన్న మంచి సహోద్యోగులు, ప్రకృతి, మీకిష్టమైన సంగీతం వీటన్నింటినీ దానికి జత చేయండి. ఆనందం తప్ప ఏమీ మీచుట్టూ నిలవదు.



- జీవితం చాలా మంచిది...జీవితం చాలా గొప్పది...ఈ అద్భుతాలన్నీ నా కోసమే సృష్టించబడ్డాయి, ఏర్పడ్డాయి... ఈ మాటల్ని ప్రతిరోజూ ఒకటి రెండుసార్లయినా రిపీట్‌ చేసుకోండి. ఈ మాటలు హద్దులు దాటిన ఆనందాన్ని ఇస్తాయి. అదే సమయంలో జీవితం విలువను...దాన్ని సార్థకం చేసుకునేందుకు చేయాల్సిన కృషిని గుర్తుకుతెస్తాయి. అలా కృషిచేయడంలోనూ ఆనందించడాన్ని నేర్పుతాయి.

- ధ్యానం చేస్తూ అందులో ఉన్న బ్యూటీని ఆస్వాదించండి. ఇది మనుషుల్లో కొత్త కణాలను పుట్టిస్తుంది. అలాగే మెదడులో సినాప్సెస్‌, నెరాన్స్‌లను పుట్టిస్తుంది. ఈ పరిణామాలన్నీ మీకు జీవితంలో ఒక నిర్దుష్టమైన అభిప్రాయాన్ని కలుగజేసుకోడానికి సహకరిస్తాయి.

- ఎలాంటి కలతలులేని గాఢనిద్రను ఆస్వాదించండి. మెదడులో ఎలాంటి పాత బరువులు లేని కొత్త ఉదయాన్ని స్వాగతించండి. కదిలే జీవితంలోకి ఎప్పటికప్పుడు తాజా రంగుల కలల్ని నింపండి. పసి మనసులంత స్వచ్ఛతలోకి వెళ్లి మీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోండి.

చిరిగిపోయిన పాత కార్పెట్‌తో...


 
NewsListandDetails-బరువైన ఫర్నిచర్‌ పెట్టినప్పుడు కార్పెట్‌ మీద గుంతలు పడతాయి. ఫర్నిచర్‌ వాటి చోట్లు మార్చిన తరువాత ముందు ఏర్పడిన గుంతల మీద ఐస్‌క్యూబ్స్‌ ఉంచండి. ఐస్‌ కరిగి కార్పెట్‌ ఆరిపోయినాక గుంతలు వాటంతట అవే పూడిపోతాయి.

-కార్పెట్‌ అనుకోకుండా కాలితే వెంటనే ఆలుగడ్డ ముక్కవేసి గట్టిగా రుద్దండి. నల్లమరకలు పోతాయి.

-కార్పెట్‌ మరకలు పడి పాతగా కనిపిస్తుంటే పచ్చి ఆలుగడ్డ ముక్కతో మరకలు ఉన్నచోట రుద్ది వేడినీళ్లలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒత్తితే మళ్లీ కార్పెట్‌ కొత్తదానిలాగా కనిపిస్తుంది.

నాజూకుతనానికి నడకే మార్గం


 
NewsListandDetails విమాన ప్రయాణాలు చేస్తున్నా సమయంతో పరుగులు తీయలేకపోతున్న స్పీడు యుగంలో ఉన్నాం మనం. ఇంటిదగ్గర మోపెడ్‌ ఎక్కితే మళ్లీ సాయంత్రం మోపెడ్‌ దిగడమే...మధ్యలో కంప్యూటర్‌ ముందు కుర్చీ కదలని ఉద్యోగం.

ఇక ఇంటికి చేరిన వెంటనే అలసటతో బెడ్‌పైకి చేరటం! ఈ క్రమంలో కాస్త నడిచే ఖాళీ ఎక్కడ? రకరకాల పనివేళల్లో మార్నింగ్‌ వాక్‌ అనే మాట మరిచిపోయినవారు ఎందరో? ఆటో..! అని పిలవకుండా నాలుగడుగులు వేయవీలులేకపోవడం ఇప్పుటికి బిజీ అయితే రేపటికి అనారోగ్యం. అంతే.
అందుకే ఇన్ని గందరగోళాల మధ్య కూడా నడకను నిర్లక్ష్యం చేయొద్దని మొరపెట్టుకుంటున్నారు పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు. మరి మీరు రోజులో ఎంత సేపు నడుస్తున్నారు?...

శారీరక వ్యాయామం గొప్పతనాన్ని ఇలా చెప్పవచ్చు. 'శారీరక వ్యాయామం వలన జీవితకాలం పెరగడమే కాదు, పెరిగిన జీవితకాలానికి జీవమూ వస్తుంది' అంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు అని. శారీరక వ్యాయామం వలన శరీరం తేలిక పడుతుంది. పనిచేసే శక్తి, కష్టాలను ఎదుర్కొనే శక్తీ పెరుగుతాయి.

ఈ మధ్యకాలంలో వాకింగ్‌కు సమయం కేటాయించుకునే వారి శాతం కాస్తయినా మెరుగు పడిందంటే దానికి కారణం పెరుగుతున్న ఆరోగ్య సమస్యలే. నగరాల్లో, పట్టణాల్లో ఇప్పుడు ఉదయంపూట రోడ్లమీద, పార్కుల్లో నడిచేవారి సంఖ్య బాగానే కనిపిస్తున్నా అది చాలా తక్కువ శాతమనే చెప్పాలి.

నడిస్తే చాలు
శారీరక వ్యాయామాల్లో నడక అంత సులువైనది మరొకటి లేదని చెప్పవచ్చు. ఎలాంటి ఖర్చూ ఉండదు. జిమ్‌కి వెళ్లక్కర్లేదు, వ్యాయామ సామగ్రి అక్కర్లేదు, శిక్షణ అవసరం లేదు.
ఉదయం పూట నడవటం వలన ప్రయోజనం అధికంగా ఉంటుంది. అదీ అవకాశం ఉంటే చెట్ల గాలి పీలుస్తూ నడవటం మరింత ఆరోగ్యకరం. ట్రాఫిక్‌ పెరిగిన తరువాత సాగించే నడక వలన వాహనాల నుంచి వెలువడిన కాలుష్యాన్ని పీల్చాల్సివస్తుంది.

పది నిమిషాలతో మొదలు
నడక పూర్తిగా అలవాటు లేని వారు ఒక్కసారిగా నడవటం మంచిది కాదు. మొదట పది నిముషాలు, పావుగంటతో మొదలుపెట్టి తరువాత పెంచుతూ పోవాలి. వారానికి ఒకసారి ఈ కాలపరిమితిని పెంచుతూ పోవచ్చు.
రోజుకి నాలుగయిదు కిలోమీటర్ల వరకు నడవవచ్చు. వారానికి 30 కిలోమీటర్లు, నెలకి 100 కిలోమీటర్ల వరకు వాకింగ్‌ చేయవచ్చు. ప్రతిరోజు ఎంత దూరం నడుస్తున్నారో రాస్తుండండి.

ఒకవారం తక్కువ దూరం నడిచినట్టుగా గుర్తిస్తే ఆ కొరతని తరువాత వారంలో పూర్తి చేయండి. అలాగే ఒక నెలలో తక్కువ నడిస్తే తరువాత నెలలో పెంచవచ్చు. మొత్తం మీద సంవత్సరానికి 1000 కిలోమీటర్ల వరకు నడిచేలా ప్రణాళిక వేసుకోండి.

ఎలా నడవాలి
-బ్రిస్క్‌వాకింగ్‌ మొదలుపెట్టే ముందు కండరాల సడలింపుకి చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. దీనివలన అవి గాయాలకు గురికావు.

-నడకని మొదలు పెట్టేటపుడు ముందు కొద్ది నిముషాలపాటు నెమ్మదిగా నడవాలి. తరువాత నడకలో వేగం పుంజుకోవాలి. నడిచేటపుడు చాలా నిటారుగా ఉండాలి. శరీరాన్ని ఎక్కడా వంచకూడదు. అలాగే తలను కూడా.

-భుజాల్లో ఏమాత్రం పట్టులేకుండా చూసుకోండి. అలాగే చేతులు కూడా శరీరానికి వేలాడుతున్నట్టుగా వదిలేయాలి. రెండుకాళ్లు ఒకే తరహాలో అడుగులు పడేలా- లయబద్ధంగా కదలాలి. శరీరంలో ఏ భాగమూ హెచ్చుతగ్గులతో ఒంగకుండా నిటారుగా ఉండేలా చేతులు ఊగేలా నడవాలి.

-అడుగుల దూరంలో తేడా ఉండకూడదు. ప్రతి అడుగుకి మధ్యదూరం ఒకేలా ఉండాలి. మోకాలు, తొడల ప్రాంతంలో కదలిక తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి.

-నడిచేటపుడు ముందు కాలిమడమ నేలమీద ఆనాలి. తరువాత పాదం అడుగుభాగం మీద, ఆ తరువాత వేళ్లమీద శరీరం బరువు పడేలా నడవాలి.

-తలను మరీ కిందికి వాల్చేయకుండా నిదానంగా అడుగుకు తగినట్టు కదపాలి.

-నడకను ఆపేటపుడు కూడా మొదలుపెట్టిన విధంగానే నిదానంగా నడుస్తూ ఆపాలి.

నవయవ్వనానికి...

 
NewsListandDetailsఎప్పటికైనా అన్ని వయసులూ దాటుకుని వృద్ధాప్యంలోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వృద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు' అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది.
ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్‌ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దామా!

చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి.

ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది. మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జత చేసుకుంటే 'మీరే కాలేజి' అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచేవే కాక జీర్ణక్రియ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మీ ఆహారంలో అవి ఎంత శాతం ఉంటున్నాయో ఒకసారి చెక్‌ చేసుకోండి.

ప్రకృతి ప్రసాదితాలు పళ్లు-కూరలు :
క్యాబేజీ, బ్రొకొలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్‌ ఇవన్నీ విటమిన్లు సమృద్ధిగా గల కూరగాయలు.
విటమిన్‌ ఎ, సిలు కంటి చూపుకు, కంటికి సంబంధించిన జబ్బులనుంచి రక్షణనిస్తాయి.

పాలకూర లేదా ఇతర ఆకుకూరలన్నీ శరీరానికి కావలసిన ఐరన్‌ను అందించి అనీమియా బారినపడకుండా చేస్తాయి. సమృద్ధిగా పోషకాలను అందించే కళ్లకింపైన రంగులున్న కూరగాయలు గుండె జబ్బులను, మానసిక వత్తిడి, డిజార్డర్స్‌ వంటి జబ్బుల నుంచి రక్షణనిస్తాయి.

ఇంకా క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇక పళ్ల విషయానికొస్తే బొప్పాయి, అరటిపండు, సపోటాల్లో ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ 'ఇ' ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపునిచ్చి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

కూరగాయలు ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలు, ఖనిజాలు నష్టపోతాం.

టమాటా: అధిక రోగనిరోధకశక్తి గల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు క్యాన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ', 'ఇ' విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీపార్లర్‌లో ఫేస్‌ మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

ఎండుఫలాలు: బాదం, పిస్తా, జీడిపప్పుల్లో విటమిన్‌ ఇ, ఐరన్‌, పొటాషియమ్‌, జింక్‌, ఒమెగా-3 ఫాటీ ఆసిడ్స్‌ ఉంటాయి. ఇవన్నీ శరీర సౌందర్యాన్ని పెంచేవి. ఇందులో ఉండే నూనెలో ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపకరిస్తాయి.




పెరుగు-తేనె: పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది అరుగుదలను మెరుగుపరిచే ఆహారం. తేనె శక్తినిచ్చే ఔషధం. తేనె వత్తిడిని తగ్గించడమే గాక మతిమరుపును కూడా అరికడుతుంది.

బెర్రీస్‌: స్ట్రాబెర్రీస్‌, నల్లద్రాక్ష, బ్లూబెర్రీస్‌, నేరేడు పండ్ల వంటి వాటిలో సైటో కెమికల్స్‌ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. నేరేడుపండ్లలో విటమిన్‌ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెరవ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగుదలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.

సోయాబీన్స్‌: ఇవి హార్మోన్‌ ఇంబాలెన్స్‌ను అరికడుతుంది. బ్రెస్ట్‌, పేగు, ఉదర క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. వయసు పైబడనీయకుండా ఇందులో ఉన్న సైటిక్‌ యాసిడ్స్‌ ఉపయోగపడతాయి. హార్ట్‌, అల్జీమర్‌ జబ్బులను, ఈస్ట్రోజన్‌ను అరికడుతుంది. మెనోపాజ్‌ దశను దరిచేరకుండా నిరోధిస్తుంది.

నీళ్లు-పళ్లరసాలు: శరీరం మెరుస్తూ ఉండాలంటే రోజూ ఎంత ఎక్కువ నీరుతాగితే అంత మంచిది. ఒకటి, రెండు కూరగాయల, లేదా పళ్లరసాలు తీసుకోవడం చాలా మంచిది. సొరకాయ, దోసకాయ, ఆరెంజ్‌, బత్తాయి, నిమ్మరసం మంచిది. కొబ్బరి నీళ్లలో కూడా అందాన్ని పెంచే గుణాలు అధికం.

పుచ్చకాయ: పుచ్చకాయ చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ఇందులో ఎ, బి, సి విటమిన్‌లు పుష్కలంగా ఉండి చర్మాన్ని పునరుజ్జీవింప చేస్తాయి. గింజల్లో ఉన్న సోడియం, జింక్‌, విటమిన్‌-ఇ గుణాలు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

కొకోవా: ఇందులో ఫ్లేవనాయిడ్స్‌ సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతమైన రక్తప్రసరణకు సహకరిస్తాయి. లో, హై బ్లడ్‌ప్రెషర్స్‌ను నివారిస్తుంది. దీన్ని కేకుల్లో, మిల్క్‌షేక్స్‌లో వాడడం మంచిది. ఇక చాక్లెట్స్‌ అయితే బిట్టర్‌ చాక్లెట్స్‌ ఉపయోగించాలి.

ఇతర చాక్లెట్లలో ఉన్న ఫాట్‌ ఇందులో ఉండకపోవడం వల్ల ఇవి అందాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి.
ఇక్కడ ఇచ్చిన ఆహారపు సూత్రాలన్నీ పాటిస్తే ఇంతకు మించిన ఆరోగ్య, సౌందర్య సాధనాలు ఇక వేరే ఏమీ ఉండవనేది మీరే గ్రహిస్తారు.

ఇవి కాకుండా కొద్దిపాటి వ్యాయామం సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజే ఈ ఆరోగ్య సూత్రాల్ని పాటించి నవయవ్వనం సొంతం చేసుకోండి మరి.

క్రమశిక్షణ అవసరమే...


 
NewsListandDetailsజీవితంలో ఎవరైనా సరే అత్యున్నత స్థాయిలో ఎదిగారు అంటే దానికి కారణం వారిలో సెల్ఫ్‌డిసిప్లిన్‌ ఉన్నదన్నమాటే. ఇంట్లో పెద్దవాళ్లుగానీ, స్కూలులో టీచర్లు కానీ, పిల్లలకి, విద్యార్థులకి ఎప్పుడూ చెప్పే మాట ఒకటే.

''మీరంతా డిసిప్లిన్‌గా ఉండాలి. అపుడే మీరు జీవితంలో దేన్నైనా సాధించగలుగుతారు" అనేవారి నోటి వెంట ''డిసిప్లిన్‌" అనే మాట వినగానే ఎవరికైనా ఒకింత ఒళ్లు మండే మాట నిజమే కానీ, ఆ మాట విలువ, దాని ప్రభావం మన జీవితాలపై ఎంత ఉంటుందో ఆ దశలో, ఆ వయసులో ఎవరూ అర్థం చేసుకోరు. ఎవరికీ తెలియదు.

డిసిప్లిన్‌ అనే మాట చాలా కఠినంగాను, రాక్షసంగానూ కనిపించడమే కాకుండా, క్లాసు కొస్తూనే ఈ మేడమ్స్‌ ఏంటి బాబూ ''డిసిప్లిన్‌-డిసిప్లిన్‌" అంటూ కాల్చుకుతింటారు. ఎంచక్కా ఎంజాయ్ చేయనీయకుండా, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే వయసైపోయాక ఎంజాయ్ చేస్తామా అంటూ ఎకసెక్కాలాడేస్తుంటారు.

అసలు 'డిసిప్లిన్‌' విషయంలో ఈ చతుర్లు, హాస్యాలు కూడదు. డిసిప్లిన్‌ అనేది కూడా ఓ ఎడ్యుకేషన్‌లా భావించాలి. డిసిప్లిన్‌ అంటే క్రమశిక్షణ. ఓ పద్ధతిగా నడచుకోవడం, విజ్ఞతగా వ్యవహరించడం తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. అది చాలా అవసరమైన విషయం. ఇందులో అసంగతమైనది, అనవసరమైనది అంటూ ఏమీ లేదు.

ప్రతి ఒక్కరికి డిసిప్లిన్‌ అవసరం ఉంది. ఇందులో ఎటువంటి మినహాయింపులు, సడలింపులు ఉండవు. అన్ని వయసుల వారికి చిన్న, పెద్ద, మగ, ఆడ తేడా లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ మంచి నడవడికతో, క్రమశిక్షణతో నడచుకోవడం వల్ల సర్వవిధాల శ్రేయస్కరమే అవ్ఞతుంది. ఒకరితో ఒకరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవ్ఞ.
సమస్యలు రావ్ఞ. అపోహలు ఉండవ్ఞ. క్రమశిక్షణ వల్ల మానసిక పరిపక్వత ఏర్పడుతుంది. ఆలోచనా పరిణతి పెరుగుతుంది. సమాజశ్రేయస్సుకు దోహదమవుతుంది. చక్కటి క్రమశిక్షణ కలిగి ఉన్నవారు ఎక్కడ ఉన్నా రాణించగలుగుతారు. నలుగురికీ విజ్ఞానాన్ని పంచగలుగుతారు.

అందుకే ఇంట్లో పెద్దలు తమ పిల్లలకి చిన్న నాటి నుంచే మంచి నడవడికను అలవాటు చేయడానికి కృషి చేస్తుంటారు. మంచి అలవాట్లు నేర్పించడానికి కష్టపడుతుంటారు. మంచి అలవాట్లు కూడా మంచి నడవడికలో అంటే డిసిప్లిన్‌లో భాగమే కదా.



డిసిప్లిన్‌ అంటే...
ఎవరికీ హాని చేయకుండా ఉండటం, కీడు తలపెట్టకుండా ఉండటం.
అన్ని విషయాలలో నిబద్ధతతో, ప్రణాళికతో నడుచుకోవటం
మాట్లాడే మాట, చేసేపని, చూసే చూపులో మంచిగా వ్యవహరించటం
కఠినంగా కాకుండా సానుకూలతతో స్పందించడం
ప్రతి విషయానికి ఎదురు పుల్లలు వేయకుండా ఎదుటివారు ఎందుకు చెప్తున్నారో, ఆ పరిస్థితులేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.
పెద్దవారి పట్ల గౌరవంగా, చిన్నవారిపట్ల ప్రేమగా, తోటివారిపట్ల స్నేహంగా మసలుకోవడం ఇలాంటి వన్నీ డిసిప్లిన్‌లో భాగమే సుమా.

మెచ్చుకోలు పొగడ్తలు

 
NewsListandDetails 





పొగడ్తల స్వభావం ఎప్పుడూ మనం తీసుకునే విధానం బట్టే ఉంటుంది. పూర్తిగా అతిశయోక్తితో ఉండి, పొందుతున్న వారికి వాటివల్ల సమాజంలో మరింత ఒత్తిడి కలుగజేసే పొగడ్తలు కొన్ని ఉంటాయి. వీటినుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇటువంటివి అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నవారికి చాలా హాని చేస్తాయి. పొగడ్త చాలా తీయగా ఉంటుంది. ఒక అభినందన, మెచ్చుకోలు మనిషికి ఇచ్చే స్ఫూర్తి ఇంతా అంతా అని చెప్పలేము. మనుష్యుల మధ్య అనుబంధ మాలికలు అలవోకగా అల్లగలిగే చాతుర్యం, శక్తి పొగడ్తకి ఉన్నాయి.

మనకున్న ఆప్తుల లిస్టులో తప్పకుండా మనల్ని వెన్నుతట్టి అభినందించిన ఉన్నత హృదయాలు తప్పకుండా ఉంటాయి. ఒక రకంగా ఇది కొన్నిసార్లు ప్రాణవాయువులా పని చేస్తుంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న పొగడ్తని పొందినపుడు దానిని యథాతథంగా తీసుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అంత పొగడ్తకి అర్హులమా? అనే అనుమానం, సిగ్గుబిడియాలు మనసులో దూరి నసపెడుతుంటాయి. అపుడు అభినందనని అందుకోవటం కూడా పెద్ద బరువుగానే ఉంటుంది. అటువంటపుడే పొగడ్తలకు ప్రతిస్పందన, పొగిడిన వారిని చిన్నబుచ్చేదిలా కూడా ఉంటుంది.
మరి పొగడ్తల అగడ్తలు ఎలా దాటాలో చెప్పాలంటే...

- ఎవరినుంచైనా పొగడ్తని పొందినపుడు ముందు చేయవలసిన పని వారికి 'థాంక్స్‌' అంటూ కృతజ్ఞత చెప్పడం. ఆ అభినందనని మీరు వ్యతిరేకించదలుచుకున్నా సరే ముందు వారికి కృతజ్ఞతలు తెలపండి.

- వారు చేసిన పొగడ్త పట్ల మనసులోనే ఒక నిర్ణయానికి రండి. మీరు చేస్తున్న కృషికి, సాధిస్తున్న విజయాలకు అది నిజంగా తగినది అనిపిస్తే ఆ ఆనందాన్ని వ్యక్తం చేయండి. 'నేను సాధించిన ఈ చిన్న విజయాన్ని మీరు గుర్తించినందుకు నాకు నిజంగా ఆనందంగా ఉంది' అని గానీ లేదా 'మీ ప్రోత్సాహం నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తోంది' అని గానీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి.

- ఒకవేళ అవతలి వారి పొగడ్త చాలా ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపిస్తే, అంటే మీకు అంత అర్హతలేదు అనిపిస్తే ముందు కృతజ్ఞతలు చెప్పి తరువాత మీ మనసులో ఉన్నది రెండు రకాలుగా వ్యక్తం చేయవచ్చు. మొదటిది, అవతలివారు మీపై ఉదారంగా పెద్ద మనసుతో పొగడ్తలు కురిపించినట్టు చెప్పండి. అంటే అంతటి అభినందనకి 'నేను తగను' అని పరోక్షంగా చెప్పండి. అలాగే అవతలివారు చేసిన అభినందన స్థాయిని అందుకునేందుకు తప్పకుండా కృషి చేస్తానని వారికి మాట ఇవ్వండి. అలా పరోక్షంగా వారికి మీరు, అంతటి పొగడ్తలు మిమ్మల్ని కొంత బిడియానికి గురి చేస్తున్నట్టు చెప్పినట్టే అవుతుంది.

- అవతలి వారి పొగడ్తలు మరీ శృతి మించితే, అంటే అవి బాగా అతిశయోక్తులు అయితే వాటిని మృదువుగా ఖండించవచ్చు. ఉదాహరణకి- ఒక రచయిత్రి పుస్తకావిష్కరణ సభ జరుగుతోంది. అందులో ఒక వక్త ఆమె గొప్ప రచయిత్రి అనీ ఎన్నో పుస్తకాలు రాశారని శృతిమించే పొగుడుతున్నాడు. ఇవతల ఈవిడకి చాలా సిగ్గుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆమె రాసింది ఒకే పుస్తకం మరి. ఆవిడ తాను మాట్లాడే వంతు వచ్చినపుడు ఆ వక్త వ్యక్తం చేసిన అతిశయోక్తులను సరిచేసి తాను రాసింది ఒకే పుస్తకం అనీ, సదరు వక్త పొరబడినట్టు మృదువుగా చెప్పుకుంది. అయితే ఈ సందర్భంలో ఆ పొగిడిన వ్యక్తి కొంత చిన్నబుచ్చుకోవటం మామూలే. అయితే ఇలాంటపుడు ఆ అతిశయోక్తులు ఎవరికీ హాని చేయనివి, మరీ నవ్వులపాలు చేయనివి అయితే వదిలి వేయవచ్చు. లేకపోతే చాలా మృదువుగా, సమయస్ఫూర్తిగా వాటిని ఖండించవలసి ఉంటుంది.

- అసలు పొగడ్తలంటేనే చాలా చిరాకు పడుతుంటారు కొందరు. ఇటువంటి వారు తమని పొగిడేవారంతా తమనుంచి ఏదో ఆశిస్తున్నారు అనే దురభిప్రాయంతో కూడా ఉంటారు. ఇటువంటపుడు కొన్నిసార్లు తమ ప్రగతిని, అభివృద్ధిని సూచిస్తూ వచ్చే మెచ్చుకోళ్ళని కూడా తిరస్కరిస్తుంటారు. ఇది ఏమంత మంచిపని కాదు. ఎందుకంటే వాటిని తిరస్కరించడం అంటే మన పట్ల మనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా కాదనడం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ- ఒక ఇన్సూరెన్సు ట్రైనింగు క్లాసులో ఆ శిక్షకుడు ఒక అమ్మాయిని నువ్వు చాలా తెలివిగలదానివని పొగిడాడు. నిజంగానే ఆ అమ్మాయికి ఆ పొగడ్తని పొందే అర్హత ఉంది. కానీ దానిని ఆమె సక్రమంగా తీసుకోలేకపోయింది. వెంటనే 'మీరన్నంత కాదు' అంటూ తన వ్యతిరేకతని తెలిపింది. ఆ శిక్షకుడు అక్కడితో ఆగకుండా-

'అదే నిజం అయితే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే రూపుదిద్దుకుంటాము' అన్నాడు. అలా పొగడ్తలను ఖండించే నేపథ్యంలో మనకున్న అర్హతలను తగ్గించుకోవలసిన పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇది మన ఆత్మ విశ్వాసాన్ని తగ్గించుకోవడమే అవుతుంది.

- పొగడ్తలను నిర్ధాక్షిణ్యంగా ఖండించడం అంటే అది ఎల్లప్పుడూ మనలో ఉన్న నిగర్వాన్నే సూచించదు. మనపై మనకి కచ్ఛితమైన అంచనా లేకపోవటం అవుతుంది. మన శక్తి సామర్ధ్యాలను చిన్నబుచ్చుకోవటం కూడా అవుతుంది. అందుకే నిజాయితీగా మనల్ని అభినందించిన వారి నుంచి వాటిని స్వీకరించి కృతజ్ఞతలు చెప్పాలి. అభినందనలో ఉన్న గౌరవాన్ని కాదనడం మూర్ఖత్వం అవుతుంది.

- పొగడ్తలను ఎప్పుడూ మన విజయాలకు మెట్లుగానే తీసుకోవాలి. అంతేకానీ వాటిని బాగా తలకెక్కించుకుని చేసే పనిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేయకూడదు. అంటే పొగడ్తల స్వభావం ఎప్పుడూ మనం తీసుకునే విధానం బట్టే ఉంటుంది. పూర్తిగా అతిశయోక్తితో ఉండి, పొందుతున్న వారికి వాటివల్ల సమాజంలో మరింత ఒత్తిడి కలుగజేసే పొగడ్తలు కొన్ని ఉంటాయి వీటినుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. గుర్తించకపోతే ఇటువంటివి అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నవారికి చాలా హాని చేస్తాయి.

- పొగడ్తలు మనుషుల వ్యక్తిత్వాలను జీవితాలను నిర్మించగలుగుతాయి. వారిచేత ఎన్నో ఘనకార్యాలు చేయిస్తాయి. అయితే ఇదంతా వాటిని స్వీకరించే వారి మనస్తత్వాలను బట్టే ఉంటుంది. కాబట్టి పొందుతున్న మెప్పుతో భవిష్యత్తుకి ముప్పు మాత్రం తెచ్చుకోకూడదు.

- పొగడ్తలు ఒక్కోసారి మనుషులకు లేని సామర్ధ్యాలు కూడా తెచ్చి పెడతాయి. అందమైన ఆ మాటలు, భావాలు, నలుగురిలో ఆపాదించబడే గొప్పదనం ఇవన్నీ పొందిన వారిని నిద్రపోనివ్వవు. ఒకవేళ ఆ అభినందనలకు అప్పుడు అర్హత లేకపోయినా వాటి కోసం తరువాతైనా కష్టపడటం, తపించడం చేస్తారు. ఇలా కొన్ని సందర్భాల్లో పొందే అర్హతలేని పొగడ్తలు తరువాత కాలంలో ఆ అర్హతని అవే ఇస్తాయి.

- మొత్తం మీద పొగడటం ఒక కళ అయితే వాటిని సవ్యంగా స్వీకరించడం, వాటినుంచి సరైన ఉత్తేజం, ఉత్సాహం పొందటం, ఆ పొగడ్తలు చేసిన వారిని తృప్తి పరచడం అంతకంటే పెద్ద కళ. మనం పొందిన మెప్పుకి అర్హత ఉన్నవారమైతే వాటిని చక్కని కృతజ్ఞతా భావంతో స్వీకరించడం, లేకపోతే ఆ స్థాయికి చేరేందుకు కృషి చేస్తామని మరింత సున్నితంగా అవతలివారికి మీ సంతోషాన్ని, కృతజ్ఞతని వ్యక్తం చేయటం ముఖ్యం.     

మంచి ప్రవర్తనకు ప్రోత్సాహం ఇలా...


 
NewsListandDetailsప్రోత్సాహపు మాటలకు ప్రత్యేక భాష, పదజాలం ఉంది. పిల్లలు వారి వారి కార్యక్రమాలను సక్రమంగా నెరవేరుస్తున్నప్పుడు మీ తీర్పులను ఎంతో జాగ్రత్తగా వెలువరించాలి. వారు చేసిన ఘనకార్యాల గురించి అట్టే పొగడకూడదు. అనేక సందర్భాలలో మనం వారిని అతిగా ప్రశంసిస్తూ ఉంటాం. మనం చేసే ప్రశంసలు ప్రోత్సాహకరంగా ఉండాలి. కాని వారి స్వాతిశయాన్ని పెంచరాదు.
ప్రోత్సాహకరపు మాటలు ఇలా ఉంటాయి. నీకు ఈ పని బాగా నచ్చిందనుకుంటాను. చాలా బాగుంది. నువ్వు కొత్త విషయాలను నేర్చుకుంట్నూవు. నీకది ఏవిధంగా అనిపిస్తూ ఉంది?
ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాటలు ఇవే. నీ సంగతి నాకు బాగా తెలిసే నీకు ఈపనిని అప్పగించాను. నువ్వీ పని బ్రహ్మండంగా చేస్తావు. అది కొంచెం కష్టమైన పని అయినా నువ్వు తప్పక చేయగలవు.
ప్రశంసాపాత్రమైన మాటలు: థాంక్యూ నువ్వు చేసిన పని నిజంగా బాగుంది. నా పనిని తేలిక చేసింది. నీ సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నీ అవసరం నాకెంతో ఉంది. నీ సహాయం నాకెప్పటికీ అవసరమే.

మహిళ చేతుల్లో, చేతల్లోనే అభ్యుదయం

 

 
NewsListandDetailsనాడు, నేడు, ఏనాడు మహిళ మహోన్నత పాత్ర వహిస్తుంది. కాని కాలవైపరీత్యం వల్ల పాలనా (గృహ, సమాజపాలన)లోపాల వలన మహిళలు తీవ్ర అన్యాయానికి బలౌతున్నారు.
ఇందుకు మగవారు, మహిళలు, పెద్దలు, అందరూ పూనుకుని పరిస్థితులను చక్కదిద్దాలి. కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకొనడం సరికాదు. రాజారామ్మోహన్‌రాయ్, విలియం బెంటిక్స్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, కందుకూరి వీరేశలింగం గారు వంటి ఎందరో మహానుభావులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వంటి మహిళామణులు, మహిళల్ని చైతన్య పరచారు.
కాని నేటి మహిళలు చాలా మంది అమాయకులు, విద్యావంతులు కూడా ఒకే రీతిగా, తమ స్వాతంత్య్రాన్ని తామే వినియోగించుకునే సామర్థ్యాన్ని గుర్తించుకోవడం లేదు. కారం పొట్లాలు, కరాటే వంటివి స్వీయరక్షణ పద్ధతులను సూచించడం కంటే ముందుగా వారి ఆలోచనల్ని, ధైర్య మనస్తత్వాన్ని ప్రోది చేసి, ప్రోత్సాహించాలి.


 ఉదాహరణకు రాష్ట్ర ఆర్‌టిసి బస్సులలో ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లను పురుషులు ఆక్రమించి, స్త్రీలు, పసిపిల్లల్ని ఎత్తుకుని నిలబడినా, వారి సీట్లను వారికివ్వరు. ఈ స్త్రీలు కూడా కనీసం మాట వరసకైనా అడగరు. ఒకవేళ ఎవరైనా అడిగితే కండక్టర్లు కూడా ఖాతరు చేయడం లేదు. సాటి మహిళలు కూడా ప్రశ్నించిన స్త్రీని విపరీతంగా భావిస్తున్నారు కాని, తెలిసి కూడా మాటసాయం చేయరు. కొంతమంది మహిళలు తమకు సంబంధించిన పురుషులను స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చుని, ఫ్యామిలీ కదండి అంటారు. గంటల తరబడి, తమ హక్కైన సీటు వదులుకుని పిల్లలతో వేళ్లాడుతూ ఒరుగుతూ ప్రయాణిస్తారు తప్ప నోరు మెదపరు.


ఇంత ఒదిగి ఉండాల్సిన అవసరం లేదు. తలవంచి హక్కులను వదలుకొనే మనస్తత్వం మార్చుకోవాలి. ''స్వాతంత్య్రం నా జన్మ హక్కు" అని నినదించిన దేశంలో స్త్రీలు స్వచ్ఛందంగా కూడా హక్కులను వదులుకుంటున్నారు.
బస్సుల్లో-టిక్కెట్టు లేని ప్రయాణం నేరం అందుకు జరిమానా 500రూ. అని ఖచ్చితంగా వ్రాస్తారు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని ఉంటుంది.
మహిళలూ మీ సీటు మీ హక్కు ఉల్లంఘిస్తే వారికి శిక్ష జరిమానా అని ఎందుకు వ్రాయరు.
మహిళలు చిన్న విషయాల్లో సైతం ఉదాసీనంగా చైతన్యరహితంగా ఏదో పోనీయమనే ధోరణిని విడనాడి, తమ ఆలోచనావిధానాన్ని హక్కుల పరిరక్షణకై కేంద్రీకరిస్తే ఆ ధైర్య స్థైర్యాలతో మహిళాభ్యుదయం మహిళల మానసికా సామర్థ్యంతో, మహిళ చేతుల్లో, చేతల్లో చైతన్యంలో ప్రకాశింపగలదని విశ్వసిస్తున్నాను.

- అద్దేపల్లి విద్యావతీ దేవి

మహర్షిజం

 

వరం

ఇద్దరు రాజకీయనాయకులకు శివుడు ప్రత్యక్షమై చెరో వరం కోరుకోమన్నాడు.
మొదటి నాయకుడు - నన్ను ముఖ్యమంత్రిని చేయండి సామీ!
రెండో నాయకుడు - ఎట్టి పరిస్థితుల్లోనూ అతణ్ని సీఎం చేయకండి సామీ!

శివుడికి, రాజకీయనాయకుడికి తేడా...

1. శివుడు బూడిద పూసుకుంటాడు, నాయకుడు ప్రజలకు బూడిద పూస్తాడు.
2. శివుడు వరాలిచ్చి కష్టాలు పడతాడు, నాయకుడు వరాలిచ్చి అవి తీర్చకుండా ప్రజల్ని కష్టపెడతాడు.
3. శివుడికి కోపమొస్తే డ్యాన్స్ చేస్తాడు, నాయకుడికి కోపమొస్తే ప్రజలతో డ్యాన్స్ చేరుుస్తాడు.

కై‘లాస్’

ఒక నాయకుడు చచ్చిపోరుు పొరపాటున కైలాసానికి వెళ్లాడు.
‘‘పాపులకు ఇక్కడ స్థానం లేదు. వెళ్లిపో’’ అని కోపంగా చెప్పాడు శివుడు.
‘‘చలిగావుంది, తెల్లారేవరకూ ఇక్కడే వుండి వెళతాను’’ అన్నాడు నాయకుడు. సరేనన్నాడు శివుడు.
తెల్లారేసరికి నాయకుడు కనిపించలేదు. శివుడి పులిచర్మం, త్రిశూలం కూడా కనిపించలేదు.

పదవి వుంటే దీపావళి (అంతా వెలుగే)
పదవి పోతే శివరాత్రి (ఉపవాసం, జాగరణ)
 

భక్తవత్సలుడు

 

చిట్టికథ
అర్జునుడు మహా పరాక్రమశాలి. విలువిద్యలో ఆరితేరినవాడు. దుష్టులు, దుర్మార్గులు అయిన కౌరవులపై గెలుపొందాలంటే ఎన్నో శస్త్రాస్త్రాలు అవసరం. అన్నింటిలోనూ పాశుపతాస్త్రం చాలా శక్తిమంతమైనదని, అది పరమేశ్వరుడి వద్ద తప్ప వేరెవరి వద్దా ఉండదు కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని తపస్సు చేయడం ప్రారంభించాడు. అర్జునుడి తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాలనుకున్నాడు. అయితే అర్జునుడి పరాక్రమాన్ని కూడా పరీక్షించాలనుకున్నాడు.

పరమేశ్వరుని ఆజ్ఞతో మూకాసురుడనే రాక్షసుడు పందిగా మారి అర్జునుడి మీదికి వచ్చాడు. అర్జునుడు ఆ పంది మీదికి బాణాన్ని ప్రయోగించాడు. సరిగ్గా అదే సమయానికి ఓ కిరాతకుడు అంటే బోయవాడు వెనకాలనుంచి ఆ పందిమీద బాణం వేశాడు. పంది చచ్చిపోయింది. దాన్ని తీసుకెళ్లడానికి బోయవాడు రాగానే ఏ జీవిపైనైనా సరే, వెనకనుంచి బాణం వేయడం తప్పంటూ అర్జునుడు అతణ్ని మందలించాడు. బోయవాడు కోపంతో మండిపడి దుర్భాషలాడాడు. అర్జునుడికీ కోపం వచ్చింది. ఇద్దరూ కలబడ్డారు. అర్జునుడి పట్లన్నింటినీ కిరాతకుడు చిత్తు చేసేస్తున్నాడు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ కిరాతకుణ్ని జయించలేకపోతుండంతో ఎదుటివాడు సామాన్యుడు కాడని గ్రహించాడు అర్జునుడు. దాంతో ఆ బోయవాడి కాళ్లు పట్టుకున్నాడు.

వెంటనే ఆ బోయవాడు మాయమై, శివుడు పార్వతీ సమేతంగా అర్జునుడికి దర్శనమిచ్చాడు. పరమేశ్వరుణ్ణి చూసిన అర్జునుడు ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేసి, స్తోత్రం చేశాడు. శివుడు అర్జునుని బలపరాక్రమాలను మెచ్చుకుని, అతను కోరిన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. శివుడికి భక్తులంటే అంత ప్రేమ!

- బాచి
 

విష్ణురూపాయ నమశ్శివాయ

 

ఇన్నర్‌వ్యూ
శివుడూ, విష్ణువూ వేర్వేరు కాదు. శివుడు పురుషరూపం. విష్ణువు స్త్రీరూపం. ఈ మాటని వినగానే విభేదించాలనే ఆలోచన కలుగవచ్చేమో కానీ, సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులోని అంతరార్థం అవగతమౌతుంది.

లోకంలో కనిపించే ఏ పురాణాన్నైనా ఇతిహాసాన్నైనా కొందరు కేవలం భక్తి పరంగానే చదువుకుంటూ వెళ్లిపోతారు. కొందరు సాహిత్యదృష్టితో చదివేసుకుంటూ పురాణం చివరివరకూ సాగిపోతారు. ఇంకొందరు దానిలో దాగిన వైజ్ఞానిక విశేషాలను వెతుక్కుంటూ కదిలిపోతారు. అయితే ఒకే దృష్టితో చదివినందువల్ల వచ్చే చిక్కుల్ని రెండుమూడింటిని స్థూలంగా అనుకుని అప్పుడు మహాశివరాత్రి పర్వదినం గురించి రెండు మాటలనుకుందాం!

శంకరుడు సుందరుడు, యువకుడూ అని అనుకునేలోగా ఆయన లింగాకారుడంటారు. ఆయన తన తలమీద రాగిజుట్టుని ధరిస్తాడని చెప్పుకునేలోగా ఆయన ఐదుతలలువాడు అని చెప్తారు. ఆయన పరమ ధర్మమూర్తి అని వింటుండగానే బ్రహ్మతలనీ, నలుగు వినాయకుని తలనీ నరికాడంటారు. తన లయకార్యమనే పనిని సక్రమంగా నిర్వహిస్తాడని తెలుసుకునే లోగానే మార్కండేయుణ్ణి మృత్యువు నుండి తప్పించాడంటారు. ఇక అన్నిటినీ మించి ఎక్కడా విననీ చూడనీ రీతిలో ఆయన్ని అర్ధనారీశ్వరుడంటారు. ఇలా ఒకటేమిటి? వింటున్న కొద్దీ సందేహాలే. దీనంతటికీ కారణం పైన అనుకున్నట్టుగా పురాణాన్ని ఒకే ఒక దృష్టితో చూడడమే. అలా కాకుండా ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక దృక్కోణాలతో పరమశివుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి.

అర్ధనారీశ్వరరూపం

ప్రపంచంలో దేనికీ ఏకత్వం లేదు. రెండు కలిసి ఒకటిగా అయినవే. సూర్యోదయం సూర్యాస్తమయం కలిసి పగలు. చంద్రోదయం + చంద్రాస్తమయం కలిసి రాత్రి. పగలు+రాత్రీ కలిసి రోజు. ఉత్తరాయనం+దక్షిణాయనం కలిసి సంవత్సరం. ఈ కాలవిభాగంలో స్త్రీ+పురుషుడూ కలిసి సృష్టి.

ఇలా రెండ్రెండు ఒకటిగా అయ్యే విధానాన్ని పరిశీలించిన మీదట ప్రాచీన ఋషులకి ఓ అద్భుత ఆలోచన కలిగింది. ప్రపంచమనేది ఇలా, ఎవరూ తనకి ఏమీ చెప్పకుండా, ఎవరూ తనని మందలించకుండా, ఎవరూ ఏ సూచనైనా పర్యవేక్షణా చేయకుండా ఎలా ఏర్పడుతోంది? సరైన కాలం ప్రకారం ఎలా నడిచిపోతుంది? అని.

అంతే! అప్పుడు వాళ్లకి అర్థమైంది. ఓ పదార్థం+ దానిలోని చైతన్యం (శక్తి) అనేవే ఈ కదలికలూ మార్పులూ గమనాలూ... అన్నిటికీ కారణమని.

ఆ పదార్థాన్నే శివుడన్నారు. ఆ చైతన్యాన్నే శక్తి అన్నారు. ఇది శాస్త్రం ప్రకారం (భౌతికశాస్త్రం) చెప్పిన మాట అయితే, కేవలం భక్తి ప్రధానంగా దీన్ని భావించిన భాగవతులు శంకరుడూ ఆయన భార్య పార్వతీ ఈ ఇద్దరూ కలిసి ఉండే రూపమే అర్ధనారీశ్వరం అన్నారు. ఈ రూపాన్నే ఇప్పుడు ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక దృష్టితో చూద్దాం!

ఆధ్యాత్మికంగా

శివుడూ, విష్ణువూ వేరు కాదు నిజానికి. శివుడు పురుషరూపం. విష్ణువు స్త్రీరూపం. దేవతలందరిలో మీసాలున్నది శివుడికే. మీసాలుండడం పురుషలక్షణం. ఒయారంగా ఉండడం స్త్రీ లక్షణం. కృష్ణ విగ్రహాన్ని చూస్తే త్రి-భంగి’గా (మెడ దగ్గర ఒక వంపూ, నడుం దగ్గర రెండో వంపూ, పాదాల వద్ద మరో వంపూ... ఇలా మూడు సుందర భంగులతో కన్పించే విగ్రహం) ఉంటుంది. అందుకే ‘శ్రీకృష్ణ శ్యామలాదేవీ’ అంటూ కృష్ణుణ్ణి స్త్రీ దేవతగా శాస్త్రమే అంగీకరించింది.

శివుడు అభిషేక ప్రియుడైతే, నిత్యం ఆభరణాలు పుష్పాలూ వస్త్రాలు నిత్యసేవలూ అన్నిటికీ మించి తన సౌందర్యాన్ని చూసేందుకు వస్తున్న బంధుజనాన్ని చూసి మురిసిపోయే లక్షణం ఆయనలోని స్త్రీ గుణానిది. అందుకని స్త్రీ రూపం విష్ణువే. (కేవలం భక్తి దృష్టితో చూస్తే మరి విష్ణువుకి భార్యలున్నారుగా! అన్పిస్తుంది).

శివుడూ విష్ణువూ ఏక రూపంలో ఉంటారు. ఆ రూపంలో కూడా కుడిభాగం శివుడైతే ఎడమభాగం విష్ణువౌతాడు. ఆ కారణంగానే అనాలోచితంగా శివుడు వరాలనిచ్చేస్తూ ఉంటే విష్ణువు శివుణ్ని రక్షిస్తూ ఒడ్డున పడేస్తూ ఉంటాడు.
శివుడు కుడివైపున ఉంటాడనుకున్నాం కదా! మెదడులోని కుడిభాగం ఆలోచనకి స్థానం. అందుకే సర్వజ్ఞుడు అనే పేరు శంకరునికే ఉంది. ఈ కారణంగానే శిశువుకి అక్షరాభ్యాసం చేయించే వేళలో విద్యలకి అధిష్ఠాత్రి అయిన సరస్వతి పేరుని గాని, కోరిన విద్యలకెల్ల ఒజ్జ (ఉపాధ్యాయుడు) అయిన వినాయకుని పేరుని గాని రాయించకుండా ‘నమశ్శివాయ సిద్ధం నమః’ అనే రాయిస్తారు. (అయితే మనవాళ్లు నమశ్శివాయః అని మాత్రమే రాయిస్తుంటారు. అంటే అక్షరాభ్యాసకాలం నుండే తప్పు రాయిస్తున్నామన్నమాట!).

సరే, విష్ణువుని ఇక్కడ స్త్రీగా చెప్పుకుంటుండడమనేది ఆయనని తక్కువ చేయడానికి కానే కాదు. సీతమ్మ శ్రీమద్రామాయణంలో స్వయంగా విష్ణుతత్త్వాన్ని ప్రతిపాదిస్తూ నర్మగర్భంగా ‘రామచంద్రమూర్తీ! నన్ను అడవులకి తీసుకుపోవడానికి భయపడుతున్నావు.

మా నాన్న నిన్ను పురుషుడనుకుని పెళ్లిచేసాడు నాతో. అవునుమరి! నువ్వు పురుషరూపాన్ని ధరించిన స్త్రీవి (స్త్రీయం పురుష విగ్రహమ్) కదా!’ అంటుంది.

ఇక ఉత్సవాల విషయానికొచ్చినా ఆశ్వీయుజమాసంలో శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకూ ఇటు బ్రహ్మోత్సవాలు అటు దశహోరా (నవరాత్రోత్సవాలు) ఉత్సవాలు జరుగుతాయి. ఎప్పుడూ చుట్టాలతో పక్కాలతో పట్టుచీరల రెపరెపలతో బంగారు ఆభరణాల అలంకరణలతో బంధువుల గలగల మాటలలో ఉండడం స్త్రీలకిష్టం కాబట్టే విష్ణువుకి నిత్యోత్సవ పక్షోత్సవ ఆయనోత్సవ సంవత్సరోత్సవాలు సాగుతాయి. ఇంట్లో స్త్రీలందరూ ఉత్సవం చేసుకుంటుంటే పురుషుడు అలా దాదాపు మౌనసాక్షిగా ఉంటాడు కాబట్టే శివాలయాలు భక్తసంఖ్య విషయంలో తక్కువగానే కన్పిస్తాయి.

విష్ణువు స్త్రీ కాబట్టే ఆయన రూపంలో తలమీద శిరోజాలు కన్పిస్తూ, ‘కేశవు’డన్పించుకుంటున్నాడు ఒక అర్థంలో. లోకంలో వరాలనిచ్చేదీ, చనువుతో దగ్గరికి చేర్చుకునేదీ అమ్మ కాబట్టే విష్ణువు వర-ద (వరాల నిచ్చే చేయి) హస్తంతో ఉంటాడు. శివుని రూపాన్ని చూడనూ చూడలేం - ఆయన వరద హస్తాన్ని గమనించనూ గమనించలేం - ఆలయంలో... లింగరూపంలో ఉంటాడు కాబట్టి.

ఇద్దరూ ఒకే శరీరం కలవాళ్లు కాబట్టే ఇద్దరూ శంఖదారులే. ఇద్దరూ గంగమ్మతో బంధం (శంకరుని తలమీద అంది పురాణం. విష్ణువుకి పాదం నుండి అంది పురాణం) కలిగి ఉన్నవాళ్లే. అన్నవర క్షేత్రంలో ఆ ఇద్దరి రూపమూ కన్పిస్తుంది, అదీ ఒకే పీఠం మీద. విష్ణువు, పైగా మీసాలతో (అందుకే శ్రీ ‘వీర’ వెంకటసత్యనారాయణస్వామి అయ్యాడు) వీర లక్షణాన్ని చూపిస్తూ లక్ష్మితో దర్శనమిస్తూ -మా రూపమే ఈ అర్ధనారీశ్వరమంటూ - లింగాకారంలో ప్రాణపట్టంతో కన్పిస్తూ ఇదో తీరు (శివశక్త్యైరూపం) అర్ధనారీశ్వరమని సూచిస్తాడాయన.

లౌకికంగా

పై తీరు అర్ధనారీశ్వర రూపాన్ని కాకుండా సాధారణంగా మనకి కన్పించే పార్వతీ పరమేశ్వరుల్ని అర్ధనారీశ్వర రూపంలో లౌకిక దృష్టితో చూస్తే - ఇటు చుట్ట చుట్టుకుని కేశ సంస్కారం లేని జుట్టుముడి ఉన్న తల శంకరునిదైతే, అటు అమ్మ చక్కని కొప్పూ, చంపక అశోక పున్నాగ సౌగంధిక పుష్పాల అమరికతో కన్పిస్తుంది. ఇటు అయ్య తన కంఠానికి పాముని ధరిస్తే, అటు అమ్మ రత్నాల కంఠహారాన్ని వేసుకుని దర్శనమిస్తుంది. ఇటు అయ్య ఒళ్లంతా భస్మాన్ని పూసుకుంటే, అటు అమ్మ చందనాన్ని (చందన ద్రవ దిగ్ధాంగీ) లేపనంగా (దూదూగ్గా రాసుకోవడమన్నమాట) చేసుకుని సాక్షాత్కరిస్తుంది. అయ్య తాండవం చేస్తే, అమ్మ లాస్యాన్ని చేస్తుంది. అయ్య వ్యాఘ్రచర్మంలో రుద్రరూపంలో భయం కొల్పుతూ ఉంటే, అమ్మ పట్టు వస్త్రంతో (పట్టుచీర) ప్రసన్న ముఖంతో (వక్త్రలక్ష్మీ .... మీనాభలోచనా) చక్కని కన్నులతో అనుగ్రహిస్తూ ఉంటుంది.

ఇక్కడి లౌకిక రహస్యమేమంటే నేనిలా ఉంటే నువ్వు అలా ఉండడం నాకు నచ్చలే దని ఏ ఒకరూ మరొకరితో అనకపోవడం. లోకంలో కూడ మనం చూస్తుంటాం ఆయన ఒకలా ఉంటే ఆమె ఆయనకి పూర్తి విరుద్ధంగా -అలంకార విధానంలో- ఉండడం. ఇలాంటప్పుడు ఎవరి ఇష్టాన్ని వాళ్లు పాటించుకునేలా చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకోవడం అన్నది దాంపత్య పదానికి చేయాల్సిన వ్యాఖ్యానంలో మొదటి వాక్యమౌతుంది కదా!

ఇక తల అనేది ఆలోచనకి స్థానమైతే, కాలు ఆచరణకి సంకేతం! ఆ ఇద్దరూ తలనుండి కాలి వరకూ అర్ధనారీశ్వరరూపంతో ఉన్నారంటే ఆ జంట ఏ పనిని చేయదలిచినా ఆలోచన నుండి ఆచరణ వరకూ ఒకలానే (ఇద్దరూ కలిసే) చేస్తారని అర్థమన్నమాట! అందుకే ఎక్కడైనా అన్యోన్యంగా జంట కన్పిస్తే పార్వతీ పరమేశ్వరుల్లా, ఆదిదంపతుల్లా ఉన్నారంటాం గానీ సీతారాముల్ని, రాధాకృష్ణుల్నీ ఆ సందర్భంలో స్మరించం. పైగా ఏ నోముల్లో, వ్రతాలలోనైనా దాంపత్యం సరిలేక ఏ స్త్రీయైనా దుఃఖిస్తూ ఉంటే ఆ చేయబడే వ్రతకథలోని మొదటి వాక్యం - ఓసారి పార్వతీ పరమేశ్వరులు నందివాహనమ్మీద వెళ్తూ దుఃఖిస్తూన్న ఓ స్త్రీని చూసారు - అనేదే! ఆ దుఃఖాన్ని తొలగించి నిత్య సంతోషాన్ని అందించడమే వారి లక్ష్యం కాబట్టే ఎప్పుడూ ఈ ఇద్దరే వ్రతకథల్లో తిరుగాడుతూ ఉంటారు.

శంకరునికి భార్యపట్ల ఎంత మక్కువంటే - ఆమెని చూడాలనే తహతహతో వచ్చే తనని... నలుగుపిండి రూపంతో బాలకునిగా ఉన్న ఒకడు అడ్డగిస్తే అతడి తలను ఖండించి మరీ లోపలికి వెళ్లిపోయాడు తప్ప, మరి దేన్నీ ఆలోచించలేదాయన. విషాన్ని మింగవలసిందని పార్వతి ఆజ్ఞాపించిందనేగానే అది తనకి ఏ కష్టాన్ని కల్గిస్తుందోనని ఆలోచించనే ఆలోచించకుండా ‘మ్రింగుమనె సర్వమంగళ’ - ఆమె తాగవలసిందేనంటే అది ప్రజాక్షేమం (తమ సంతానానికి శుభం కలిగించేదే) కోసమే అయ్యుంటుందనే ఆలోచనే శంకరునిది. తాగేసాడు. పార్వతి మాటమీద అంతటి నమ్మకం ఆయనకి. ప్రాణాన్ని తీసే విషం కూడా (తాగమన్నది పార్వతి కాబట్టి) తనకి ప్రాణాన్ని ఇచ్చేదే అయ్యుంటుందనేది శంకరుని విశ్వాసం. దంపతులకి కావల్సిందిదే. తన భార్యకి అవమానం జరిగిందని తెలిసి మామ తలని నరికించడానిక్కూడా వెనుకాడనంతటి ఇష్టం పార్వతి మీద శంకరునికి.

పిల్లలు తమ ఉత్సవానికి ఎక్కడ రానందుకు, రాలేక బాధపడతారోనని గమనించిన ఆ దంపతులు తమంతతామే వాళ్లు రాలేని చిమ్మ చీకటి ఉండే బహుళ చతుర్దశినీ, చలి వణికించే మాఘమాసాన్ని, చలితో పాటు మంచు బాగా కురిసే అర్ధరాత్రి నుండి తెల్లవారు జామువరకూ లింగోద్భవ అభిషేకాన్ని, వివాహన్నీ ఏర్పాటు చేసుకుని, పిల్లలు రాగానే ‘మీరెలా రాగలరురా? అని తమదే తప్పుగా చెప్పుకునే దంపతులు పార్వతీ పరమేశ్వరులు. అందుకే కాళిదాస మహాకవి వాళ్లని ‘పితరౌ’ (నిజమైన తల్లిదండ్రులు మాతా చ పితా చ) అన్నాడు తన శ్లోకంలో. ఇలా ఎంతైనా లౌకిక దృష్టితో చెప్పవచ్చు.

వైజ్ఞానిక దృష్టితో

శివుడు వ్యోమకేశుడు. ఆకాశమే తల జుట్టుగా కలవాడని దీనర్థం. తల జుట్టు ఎంత సూక్ష్మంగానూ అసంఖ్యాకంగానూ ఉంటుందో అలా ఆకాశంలో రహస్యాలు కూడా సూక్ష్మాతి సూక్ష్మబుద్ధితో చూస్తే తప్ప కన్పించనివీ, పైగా ఎంతకాలం పాటు పరిశీలిస్తున్నా ఇంకా లభ్యమౌతూనే ఉండేవీ అని కూడా దీని భావం. ఎన్ని కనుక్కున్నా ఆకాశ రహస్యాలకి అంతులేదంది భగవద్గీత ఇందుకే. (శ్రుత్వా ప్యేనం వేదన దేహ కశ్చిత్).

శివుడు గంగాధరుడు. జ్ఞానాన్ని గంగతో పోలుస్తారు. కాబట్టి జ్ఞానానికంతకీ ఆధారం శిరోభాగం. అందుకే పంచజ్ఞాన ఇంద్రియాలూ తలలోనే కన్పిస్తాయి. ఇంటికి పైనున్న నీటితొట్టెలో శుభ్రమైన నీరుంటే ఇంట్లోకీ అవే నీళ్లొచ్చి ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు. అదే తీరుగా తల అనేది సరిగ్గా ఆలోచిస్తే శరీరమంతా (కర్మేంద్రియాలు ఐదూ) సక్రమంగానే పని చేస్తుంది. సర్వస్య గాత్రస్య శరః ప్రధానమ్ (శరీరానికి ప్రధానం తల) అనేది ఇందుకే!

శివుడికి కార్తికమాసం ఇష్టమన్నారంటే దానిక్కారణం కృత్తికా నక్షత్రం ఆకాశంలో నిలిచి ఉన్న తెల్లవారుజామున ఆ నెల పొడుగునా చన్నీటి స్నానాన్ని చేస్తే సంవత్సరమంతా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని తెల్పడమే. ఆయనకి సంబంధించిన నమకంలో మొదటిమంత్రమే ‘నీ కోపానికి నమస్కార’ (సమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవే నమః) మంటోందంటే దాని ఆంతర్యం- సకాలంలో నీ బాధ్యతని నువ్వెందుకు నిర్వర్తించకుండా ఉంటావు?’ వని ప్రతివ్యక్తీనీ హెచ్చరించడమే. ఇంట్లో తండ్రి తన పిల్లల్ని కోప్పడేది ఇందుకే!

భక్తిపరంగా...

ఇక కేవలం భక్తి భావంతో చూస్తే శంకరుడు చాలా బోళాబోళీతనంతో ఉండే లక్షణమున్నవాడు. ఏమీ అనుకోడు. తిరిగి ఏమీ అనడు కూడా. అందుకే శంకరాచార్యులంతటి గంభీరులు కూడా ఆయన్ని ఆట పట్టిస్తూ ఇలా అన్నారు.

ఆశనం గరలం ఫణీ కలాపః వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం? కిస్తి శంభో? తవ పాదాంబుజ భక్తి మేవ దేహి’ అని.

‘శంకరా! ఏమైనా తిండి పెడతావేమో ననుకుంటే నువ్వే విషం తిన్నావు! ఆభరణాలనిస్తావేమో ననుకుంటే ఒంటినిండా పాముల్నే ధరిస్తావు! పోనీ తిండీ ఆభరణాల మాటకేం గాని, మంచి బట్టలైనా పెట్టేస్తే వెళ్లి పోదామనుకుంటే పగలు పులిచర్మం, రాత్రి ఏనుగుచర్మం కట్టి కన్పిస్తావు! కనీసం మమ్మల్ని ఈ అడవి చివరి వరకైనా సాగనంపి మా ఊరికెళ్లే తోవ చూపిస్తావేమో ననుకుంటే - నీ వాహనం ఎద్దు. పైగా అది ముసలిది (మహా ఉక్షః) కూడాను. ఔను! ఏమీ అనుకోకు గానీ మాకేం ఇస్తావు? ఇవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలిగా! ఏముంది నీ దగ్గర? అసలుందా? (కిమస్తి?)- అని ఇంత వేళాకోళంగా ఆది శంకరులు ఆటపట్టించారు.
చివరి మాటలో ‘సరేలే! మాకు నీ పాదాంబుజాల యెడ భక్తి ప్రసాదించు చాలు’నన్నారు ఆయనే. ఇలా ఉన్న శంకరుణ్ణి ప్రార్థించాలి కూడానా? అన్పిస్తుంది మనకి. కానీ దాని అంతరార్థం ఇదీ: నువ్వే ఆ కాలకూట విషాన్ని స్వీకరించకుండా ఉండి ఉంటే ఆ విషాగ్ని ఈ ప్రపంచాన్నే మండించి వేసేది. మేం ఉండేవాళ్లమే కాదు! మేమున్నామంటే కారణం నీ విషపానమే. నమస్కారం శివా! లోకం నిండా విషబుద్ధులే ఉన్నారు. అలా విషం నిండి ఉన్న పాముల్ని చుట్టాల్లా ఒంటి నిండా తిప్పుకుంటూ విరోధుల్నీ, హాని చేసే వాళ్లనీ కూడా ఎలా లొంగ తీసుకోవాలో తెలుసుకోమంటున్నావా? ఎంత గొప్ప ఉపదేశం! సాష్టాంగం భవా! రజస్తమో గుణాలకి చిహ్నంగా వ్యాఘ్ర గజ చర్మాలని కట్టావా? అప్పుడప్పుడూ బుస్సుమంటూ ఉంటే గాని లోకవ్యవహారం సాగదంటున్నావా? దండాలు హరా! ధర్మానికి సంకేతం ‘ఎద్దు’ కాబట్టి ధర్మ బద్ధంగానే ఉండమంటున్నావా! దొడ్డ దేవరా వందనం! అందుకే కదయ్యా ఇది శివ (శుభాన్నిచ్చే) రాత్రి! - అని.

-డా॥మైలవరపు శ్రీనివాసరావు