all

Wednesday, July 10, 2013

బీర్ లో దాగున్నాయి జుట్టు పెరుగుదల రహస్యాలు..!

బీర్ త్రాగడం వల్ల రిలాక్స్ అవొచ్చు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. ఇది శరీరంలోని టాక్సిన్స్ (విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది . మరియు కిడ్నీ స్టోన్స్ ను తొలగిస్తుందని గట్టి అభిప్రాయం ఉంది.

అయితే మీరు బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్యపడక మానరు. బీర్ తీసుకోవడం వల్ల మరియు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. అంటే బీర్ త్రాగడం వల్ల మరియు బీర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి మంచిదని అర్థం.బీర్ వల్ల చర్మానికి మాత్రమే సంబంధించి ఉపయోగాలు మాత్రమే కాదు. బీర్ వల్ల కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది . బీర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా మనకు అందుబాటులో ఉంది. అందువల్ల బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ మెండుగా ఉండటం వల్ల పూర్తి శరీర ఆరోగ్యానికి ఉపయోగించబడుతున్నది. చర్మానికి మరియు కేశాలకు బీర్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు .

బీర్ బాత్ వల్ల ముఖంలో గ్లో వస్తుంది,వృద్ధాప్యంతో పోరాడుతుంది, చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తుంది మరియు మరియు మొటిమలకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది.బీర్ వల్ల కేశాలకు కూడా అనేక ప్రయోజనాలున్నాయి. బీర్ తో హెయిర్ వాష్ చేయడం వల్ల కేశాలకు తగినంత పోషణ అందుతుంది. కేశాలకు నేచురల్ కండీషనర్ గానే కాకుండా, సహజంగా కేశాలు మందంగా మరియు పొడవుగా పొందడానికి బీర్ ను కేశ సంరక్షణలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. కాబట్టీ మీకు జుట్టు చాలా పల్చగా ఉన్నట్లైతే వాటిని మందంగా మరియు బలమైన జుట్టును పొందడానికి మీ కేశాలకు బీర్ వాష్ చేయడం మంచిది.బీర్ బబుల్ బాత్ వల్ల అనేక బ్యూటీ బెనిఫిట్స్ పొందడం వల్ల ఎంజాయ్ చేయవచ్చు.

ఈ ఆల్కహాల్ మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీన్ని మీరు కేశసంరక్షణకు ఉపయోగించవచ్చు.ఆరోగ్యకరమైనకేశాలను పొందడానికి బీర్ ఏం చేస్తుంది? బీర్, ఈ ఆల్కహాల్ పానీయంలో ఫాస్పరస్, మెగ్నీషియం, మరియు మాల్టోస్ వంటి పోషకాంశాలుండి జుట్టు సంరక్షణలో గొప్పగా సహాయపడుతుంది. జుట్టులో ఉండే బయోటిన్ జుట్టు నష్టాన్ని నిరోధిస్తుంది. మరియు చుండ్రును నిరవారిస్తుంది. మరి ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు?బీర్ వల్ల హెయిర్ బెనిఫిట్స్ పరిశీలించి? ఎలా పనిచేస్తుందో చూడండి...


హెయిర్ కండీషనర్: బీర్ బెస్ట్ హెయిర్ కండీషర్ . తలకు షాంపూ చేసిన తర్వాత బీర్ తో తలను వాష్ చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మరియు షైనింగ్ తో మెరుస్తుంటాయి


నిమ్మరసం మరియు తేనెతో బీర్: ఈ మూడు వస్తువులను ఒకటిగా మిక్స్ చేసి, తలస్నానం పూర్తిచేసిన తర్వాత చివరగా మీ జుట్టును వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సున్నితంగా మరియు మంచి షైనింగ్ ను నేచురల్ గా పొందవచ్చు.


జుట్టు చివర్ల చిట్లకుండా పోరాడుతుంది: బీర్ తో హెయిర్ కేర్ చాలా సులభం. రాత్రిపూట బీర్ ఓపెన్ గా వదిలి, ఉదయం నీటితో కలిపి వేడి చేయాలి. తర్వాత అందులో తేనె మరియు నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్లకు పట్టించి పదిహేను నిముషాలు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.


జోజోబో ఆయిల్ తో మిక్స్ చేయండి: జోజోబ ఆయిల్ తో బీర్ ను మిక్స్ చేసి జుట్టును సంరక్షించుకోవచ్చు. ఈ రెండింటి మిశ్రమాన్ని హేయిర్ రూట్స్ కు పట్టించి, కొంత సమయం అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.


హేయిర్ ఫాల్ ను అరికడుతుంది: బీర్ ను కేశాలకు పట్టించడం వల్ల, కేశాలకు ఇదొక ప్రయోజనం. బీర్ తలకు పట్టించడం వల్ల జుట్టు మూలాలను పటిష్టపరిచి మరియు జుట్టు పెరుగుదల పెంచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బీర్ లో ఉన్న బోయోటిన్ జుట్టు రాలడానికి బాగా సహాయపడుతుంది.


నాణ్యమైన కేశాలను పొందడానికి: మందపాటి మరియు భారీ జుట్టు పొందడానికి, తలస్నానం చేసిన తర్వాత, చివరగా మీ కేశాలను గోరువెచ్చని బీర్ తో వాష్ చేయండి.


ప్రకాశించే జుట్టు: బీర్ మీ కురుల విలువను పెంచుతుంది: మీ కేశాలను బీర్ తో శుభ్రం చేయడం వల్ల కురులు ఒత్తుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి. బీర్ హెయిర్ క్వాలిటీని పెంచుతుంది.


చిక్కును నిరోధిస్తుంది: చిక్కబడిన మీ జుట్టును దువ్వాలంటేనే మీరు భయపడుతున్నారా?సరే, ఇలా చిక్కుబడకుండా నునుపైన జుట్టును పొందడానికి బీర్ తో కేశాలను వాష్ చేయండి. చిక్కుముడులను తొలగించడంలో బీర్ హెయిర్ కండీషనర్ గా బాగా సహాయపడుతుంది.


ట్రీట్ ఫ్రిజ్జీ హెయిర్: బీర్ తో కేశాలకు వాష్ చేయడం వల్ల, జుట్టు పొడిబారడాన్ని మరియు ఫ్రిజ్జీ హెయిర్ ను నివారించడానికి చికిత్సగా సహాయపడుతుంది.


బీర్ బబుల్ బాత్: మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నా..అధికంగా బీర్ కొనే సామర్థ్యం ఉంటే బీర్ ను కొని స్విమ్మింగ్ పూల్ లో వేసి బబుల్ బాత్ చేయడం వల్ల చర్మానికి అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది . బీర్ తో ఇటు చర్మ మరియు అటు హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్ ను పొంది మీ సౌందర్యాన్ని పదింతలు రెట్టింపు చేసుకోవండి...

అందమె ఆనందం

 
     
పాల మీది మీగడలో కొన్ని చుక్కల తేనె, చిటికెడు చాయపసుపు వేసి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతం అవుతుంది.

కాయధాన్యాల కమ్మటి రుచులు

 
     
మాంసం, చేపలు, గుడ్లు, పాలు... ఫస్ట్ క్లాస్ ఫుడ్. ఆకులు, కాయలు, దుంపలు, పప్పులు... ఇవీ ఫస్ట్ క్లాసే! రెండూ బలాన్నిచ్చేవే. రెండూ ‘బిల్డప్’కి పనికొచ్చేవే. తేడా ఏంటంటే... ఒకటి మాంసాహారం, ఇంకోటి శాకాహారం. ఇంకో తేడా ఏంటంటే... మాంసాహారంలో ఒక ఐటమ్‌తో వచ్చే శక్తి , శాకాహారంలో అన్నిటినీ కలిపి కొడితే కానీ రాదు. మరేం చేయాలి? సింపుల్. కాయధాన్యాలను శాకాహారంలో మిక్స్ చేస్తే సరి. చాలినన్ని ‘మాంస’కృత్తులు! వెజ్‌కి ఇలా ఎక్స్‌ట్రా దమ్మునిచ్చే కాయధాన్యాలే ఈవారం మన కమ్మటి ‘రుచులు’.

ప్రొటీన్ పులావ్


కావలసినవి:
బాస్మతి బియ్యం - 120 గ్రా.
ఎండు బఠాణీ - 20 గ్రా; రాజ్మా - 20 గ్రా.
సోయాబీన్స్ - 20 గ్రా; క్యారట్ తరుగు - 40గ్రా., ఉల్లితరుగు - కప్పు; టొమాటోలు - 3
ఉప్పు - తగినంత; నూనె - 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు

పేస్ట్ కోసం: అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - 4; వెల్లుల్లి రేకలు - 6
కొత్తిమీర - చిన్న కట్ట; లవంగాలు - 2
ఏలకులు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క
షాజీరా - టీ స్పూను; పసుపు - కొద్దిగా

తయారి:
బఠాణీ, రాజ్మా, సోయా గింజలు, బియ్యం... వీటిని విడివిడిగా రెండు గంటలపాటు నానబెట్టి, నీరు ఒంపేయాలి.

బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి.

టొమాటో తరుగు, మసాలా పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.

బియ్యం, నానబెట్టుకున్న గింజలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి.

తగినంత నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో సుమారు పది నిముషాలు ఉడికించి దింపేయాలి.

అప్పడం, రైతాలతో సర్వ్ చేయాలి.

రాజ్మా కర్రీ

కావలసినవి:
రాజ్మా - రెండు కప్పులు
రిఫైన్‌డ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను; ఉల్లితరుగు - కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; పసుపు - కొద్దిగా
టొమాటో ముక్కలు - కప్పు; ఉప్పు - తగినంత
గరంమసాలా - టీ స్పూను; ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
ధనియాలపొడి, జీలకర్రపొడి - 2 టీ స్పూన్ల చొప్పున
కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారి:
బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి.

ఉల్లితరుగు వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి.

అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించాలి.

పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా పొడి వేసి నూనె వేరు పడేవరకు వేయించాలి

రాజ్మా, మూడు కప్పుల నీరు, ఇంగువ, ఉప్పు వేసి సుమారు 10 నిముషాలు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి

(కొన్ని రాజ్మా గింజలను మెత్తగా చేసి జత చేస్తే గ్రేవీలా ఉంటుంది)

చిక్కుడుగింజల కూర

కావలసినవి:
తాజా చిక్కుడుగింజలు - కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు; పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
పల్లీలు - కొద్దిగా; ధనియాలు - టీ స్పూను
ఎండుకొబ్బరి - చిన్నముక్క; వెల్లుల్లి రేకలు - 3
ఉప్పు - తగినంత; ఆవాలు - అర టీ స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూను
కొత్తిమీర - చిన్న కట్ట; నూనె - 2 టీ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి:
చిక్కుడుగింజలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కలిపి కుకర్‌లో ఉడికించాలి.

పల్లీలు, ధనియాలు వేయించి చల్లారాక, ఎండుకొబ్బరి, వెల్లుల్లిరేకలు జత చేసి మిక్సీలో వేసి పొడి చేయాలి.

ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి.

కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.

చిక్కుడుగింజలు, పసుపు, కారం వేసి బాగా కలిపి, గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి జల్లి మూత పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి, దించే ముందర కొత్తిమీర చల్లాలి.

సోయా - టొమాటో కర్రీ

కావలసినవి
నానబెట్టిన సోయాబీన్స్ - కప్పు
టొమాటో తరుగు - కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
ఉల్లితరుగు - అర కప్పు; సోంపు - 2 టీ స్పూన్లు
పుదీనా ఆకులు - అర కప్పు
వెల్లుల్లి రేకలు - 3; పచ్చిమిర్చి - 6
జీడిపప్పు పలుకులు - 10; బాదంపప్పులు - 6
ఏలకులపొడి, పసుపు, కారం, గరంమసాలా- టీ స్పూను చొప్పున; కొత్తిమీర - కొద్దిగా
నానబెట్టిన మీల్‌మేకర్ - అరకప్పు

తయారి:
ఒక పెద్ద పాత్రలో సోయాబీన్స్, తగినంత ఉప్పు, నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో ఉంచి, పది విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి.

పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు, బాదంపప్పు, సోంపు, ఏలకుల పొడి వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.

సగం ఉల్లితరుగు వేసి వేయించాక, సగం టొమాటో తరుగు జత చేసి బాగా కలపాలి.

చల్లారాక పుదీనా ఆకులు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి.

బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, మిగిలిన ఉల్లితరుగు, టొమాటో తరుగు, క్యాప్సికమ్ తరుగు, మీల్‌మేకర్ వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.

కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలపాలి. ముందుగా చేసి ఉంచు కున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి.

కొద్దిగా నీరు జతచేసి ఐదు నిముషాలు ఉడికించిన తరువాత, సోయాబీన్స్‌ని వేసి నాలుగైదు నిముషాలు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.

వంకాయ - చిక్కుడుగింజల కూర

కావలసినవి:
వంకాయలు - పావు కిలో
చిక్కుడు గింజలు - పావు కప్పు
పసుపు - చిటికెడు;
జీలకర్రపొడి, కారం - పావు టీ స్పూను చొప్పున
ధనియాలపొడి - టీ స్పూను; నూనె - ఒకటిన్నర టీ స్పూన్లు
అల్లంవెల్లుల్లిపేస్ట్ - టీ స్పూను; కొత్తిమీర - చిన్నకట్ట
పచ్చిమిర్చి - 3; జీలకర్ర - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి:
చిక్కుడు గింజలకు కొద్దిగా నీరు, ఉప్పు జతచేసి ఉడికించాలి.

బాణలిలో నూనె కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి రెండు నిముషాలు వేయించాలి.

ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి నాలుగైదు నిముషాలు వేయించాక, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి.

వంకాయముక్కలు, కొద్దిగా నీరు వేసి బాగా కలిపి, సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాక, చిక్కుడు గింజలు జత చేసి, మరో ఐదు నిముషాలు ఉంచి, దించేయాలి.

న్యూట్రీషియస్ దోసె

కావలసినవి:
మినప్పప్పు - అరకప్పు; బార్లీ - అరకప్పు
బియ్యం - కప్పు; పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు, సోయాబీన్స్ - అర కప్పు చొప్పున
నానబెట్టిన మెంతులు - టేబుల్ స్పూను
అటుకులు - పావుకప్పు; జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత; చీజ్ తురుము - 50 గ్రా.
కొత్తిమీర - చిన్న కట్ట; నూనె - కొద్దిగా
క్యారట్ తురుము - 4 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను;
ఉల్లితరుగు - పావు కప్పు

తయారి:
అన్నిరకాల పప్పులు, బియ్యం, బార్లీ, సోయాబీన్స్‌ని ఆరు గంటలసేపు నానబెట్టాలి.

నీరు వడకట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచుకోవాలి.

తగినంత నీటిలో అటుకులను పావుగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.

రుబ్బి ఉంచుకున్న పిండి మిశ్రమంలో అటుకుల పిండి కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచాలి. జీలకర్ర వేసి కలపాలి.

స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక పిండిని దోసెలా వేసి, పిండి పచ్చిగా ఉండగానే, పైన క్యారట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు కొద్దికొద్దిగా వేసి బాగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.