all

Wednesday, November 21, 2012

ప్రతిరోజూ ఖచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైనటువంటి 7 పనులు...!?

సాధారణంగా మనం వేసుకునే దుస్తులు మనల్ని ఇతరులకి ఎలా పరిచయం చేస్తాయో, మనం నివసించే చోటు కూడా మనల్ని గురించి ఇతరులకు చెప్పకనే చెబుతుంది. శుచి శుభ్రంగా ఉండే పరిసరాలు మంచి ఆరోగ్యాన్ని మనకు అందించటమే కాదు మనకు అందించటమే కాదు మనసుకి ప్రశాంతత చేకూరస్తాయి.
ఇంటిని చూసి, ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఎందుకంటే ఇంటి శుభ్రత ఎక్కువగా ఇల్లాలికే తెలుసు, ఎక్కువ ఇల్లాలిపై ఆధారపడిపడి వుంటుంది. ఏ వస్తువు ఎక్కడ వుండాలి ఏది ఎంత శుభ్రంగా వుంచుకోవాలి అనే అంశంపై ఆధారపడి వుంటుంది. కనీసం వారానికో, నెలకొక్కసారైన ఇంటిని శుభ్రపరుస్తున్నారా? పనిచేసే మహిళలైనా..ఇంట్లో ఉన్న వారైనా సరే ఇంటి పరిశుభ్రత గురించి శ్రద్ద తీసుకోవాల్సిందే. ఇంట్లో ప్రతి రోజూ శుభ్రపరచాల్సినటువంటివి కొన్ని ప్రదేశాలను ఖచ్చితంగా శుభ్రపరచాలి. అందుకోసం కొత్తసమయాన్ని కేటాయించక తప్పదు. దాంతో ఒక్కసారిగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అందుకు కొన్ని ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటే ఇల్లు ను శుభ్రం చేయడానకి సులభతరమౌతుంది.
1. దుమ్ము-ధూళి: ప్రతి ఒక్కరి ప్రణాళికలో ముఖ్యంగా లిస్ట్ లో ప్రధానంగా దుమ్ము ధూళి దులిపడం ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఇల్లల్లోనికి దుమ్ము ధూళి చేరుతుంటుంది. పొడి వాతావరణం వల్ల ముఖ్యంగా ఇంటి తలుపులు, మరియు డోర్లు తెరిచి ఉంచడం వల్ల దుమ్ముధూళి చేరి, తలుపులపై, కిటికీలపై తిష్టవేస్తుంది. దాంతో అలర్జీకి దారితీసే ప్రమాదం ఉంది.
2. ఎలక్ట్రానిక్ పరికరాలు: ఎలక్ట్రికల్ వస్తువులైనటువంటి ఫ్యాన్స్, ఎల్ సిడిలు, సిడి డ్రైవ్, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ టీవీ, లు, కంపూటర్, మ్యూజిక్ సిస్టమ్, శుభ్రం చేసిన కొన్ని రోజులకే దుమ్ము నిండిపోయి ఉంటుంది. ఈ గ్లాస్ పరికరాలపై దుమ్ము చేరడం బాగా కనబడుతుంటుంది. కాబట్టి ఇంతటి విలువైన వస్తువులను ప్రతి రోజూ శుభ్రం చేసుకోవడం మంచిది. అందుకు సున్నితమైనటువంటి డస్టర్, క్లాత్ తో తుడుస్తుండాలి.
3. వంటసామాగ్రి: వంటసామాగ్రి ఇంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం. వంటగదిలో వంటసామాన్లను ప్రతి రోజూ శుభ్రపరచాల్సిందే. వంట సామాగ్రిపై దుమ్మ ధూళి పేరుకోవడం వల్ల, ఎక్కువగా అనారోగ్యానికి దారితీస్తుంది.
4. డైనింగ్ టేబుల్: ప్రతిరోజూ ఇట్లో వారందరూ కలిసి భోజనం చేసే ప్రదేశం భోజనశాల. డైనింగ్ టేబుల్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొన్నిరకాలైనటువంటి కూరలు, సాస్ లు, నెయ్యి, నూనెలు వంటి మరకలు డైనింగ్ టేబుల్ పై నిల్వఉన్నట్లైతే, అక్కడ దుమ్ము చేరికి అతి త్వరగా క్రిమికీటకాలు నివాసం ఏర్పరచుకొంటాయి. కొన్ని రోజుల తర్వాత శుభ్రం చేయడం కష్టమౌతుంది. కాబట్టి భోజనం అయిన వెంటనే తడి బట్ట తీసుకొని తుడిచేస్తే శుభ్రతతో పాటు ఆరోగ్యం కూడా..
5. కిచెన్ షింక్: ప్రతి రోజూ వంటగదిలో చేతులు, కూరలు, వంటసామాన్లు శుభ్రం చేసుకొనే ప్రదేశం వంటగదిలో ఉండే షింక్. అక్కడ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. షింక్ శుభ్రత కూడా రోజూ చేయాల్సిన పనిలో భాగమే..అప్పుడే ఆ ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు.
6. వంటగది స్లాబ్ మరియు ఓవెన్: ప్రతి రోజూ శుభ్రం చేసుకోవాల్సినటువంటి మరొక ముఖ్య ప్రదేశం వంటి చేసే ప్రదేశం. స్టౌ ఉన్న ప్రదేశం, ఓవెన్, మిక్సర్ పెట్టే ప్రదేశం. ఎందుకంటే ఆహార పదార్థాలను తయారు చేసే ప్రదేశం అక్కడే కాబట్టి పదార్థాలు క్రిందపడి...బాక్టీరియాలకు ఆవాసలవుతాయి. అవి తయారు చేసినటువంటి పదార్థాలపై వ్యాప్తి చెంది ఆరోగ్యానికి హాలికలిగిస్తాయి.
7. బెడ్: మీరు ఎక్కువగా విశ్రాంతి తీసుకొనే ప్రదేశం పడకగది. పడుకొనే మంచం. ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి రోజూ శుభ్రం చేయకపోయినా మంచం మీద ఉన్న బెడ్ షీట్లను దులిపేసి, ముడతలు లేకుండా పరచుకోవాలి. బెడ్ షీట్లు ఫోడ్ చేసి ఒక ప్రక్కగా సర్ధుకోవాలి. అలాగే తగడలు కూడా వాటివాలి స్థానంలో అమర్చుకోవాలి. ఇలా చేస్తే శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
ఈ సులభమైన చిట్కాలను ప్రతిరోజూ ఆచరించినట్లైతే శుచి శుభ్రతతో పాటు, ఆరోగ్యం కూడా

హుందాతనాన్నిచ్చే కాటన్ చీరలు..మెరుపు తగ్గక..స్టిఫ్ గా ఉండాలంటే..!

చీర కట్టు కోవడంలోఉన్న సౌందర్య రహస్యం ఏమిటంటే సన్నగావున్న వాళ్ళను, లావుగా వున్న వాళ్ళను కూడా ఆకర్షణీయంగా చూపించేది చీరే. సన్నగా వున్న స్త్రీ మందంగా వుండే చీరలు, గంజిపెట్టిన కాటన్ చీరలను కట్టుకుంటే సమంగా, అందంగా కనిపిస్తారు. లావుగా వుండే స్త్రీ తేలికైన సింథటిక్ చీరలను కట్టుకుంటే పొందికగా కన్పిస్తారు . అందాలను దాస్తూనే వెల్లడించగల ఒడుపు ఒక్క చీర కట్టులోనే సాధ్యమౌతుంది. చీర కట్టుకోవటంలో కూడా కాస్తంత నేర్పు వుండాలి. చీరేల ఎంపికలోనూ అవగాహాన కలిగి ఉండాలి.
కాటన్ చీరలంటే చాలా మంది మహిళలకు ఎక్కవ ఇష్టం. ముఖ్యంగా మన భారతీయులు చాలా మంది కాటన్ చీరలను, కాటన్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూసిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్‌ దుస్తులు. ఆ మాటకొస్తే ఏడాది పొడవునా కాటన్‌ దుస్తులు ధరించడానికి అనువుగానే ఉంటుంది. మన దక్షిణ భారతంలో వాతావరణం మిగతా కాలాల్లో ఎలా ఉన్నా వేసవి నాలుగు నెలలూ కాటన్‌ దుస్తులు మాత్రమే వాడుతుంటారు చాలా మంది. ఎండవల్ల కలిగే ఉక్కపోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించుకోవటానికి కాటన్‌ దుస్తులని ధరించడం ఎక్కువ.
టీనేజ్ నుండి మధ్య వయస్సు వారికీ వయస్సు మళ్లిన వారికీ అందరికీ అన్ని సమయాల్లో నచ్చేవి కాటన్ డ్రస్లులే. అందులోనూ వేసవిలో ప్రతి ఒక్కరి చూపూ కాటన్ దుస్తులవైపే. లైట్ వెయిట్, క్రేప్, డెనిమ్, స్టోన్ వాష్ డ్రస్ లిచ్చే అందం ఒక ఎత్తయితే, కాటన్ తో వచ్చే అందం దానికిదే సాటి. కాటన్ దుస్తులలోనే హుందాతనం లభిస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
Easy Tips Maintain Cotton Sarees

అయితే కొంత మంది మాత్రం వాటిని మెయింటై చేయడం కష్టమని ఇష్టం ఉన్నా వాటిని వినియోగించుకోలేక పోతున్నామంటారు. కొంత మంది అభిప్రాయం ప్రకారం కాటన్ చీరలను తీసుకొచ్చినప్పుడు ఉండే లుక్ ఒక్క వాష్ తోటే పొతుందని వాటిని ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఏమీ జరగకుండా జాగ్రత్తలను పాటిస్తే కాటన్ చీరను కూడా స్టిఫ్ గా ఎప్పుడూ కొత్తవాటిలా మెరిపించవచ్చు. అదెలాగో చూద్దాం...
ముందుగా ఒక కాటన్ డ్రస్ లకు కొన్నంత డబ్బు మొయింటెనెన్స్ కు ఖర్చు చేయాలన్న భయాన్ని మనుస్సులోంచి తొగిలగించాలి. ఉతకడం, ఐరన్ చేయడం అన్నీ ఇక తేలికే. మొదటగా కాటన్ బట్టలను ఉతికేటప్పుడు చిన్న చిట్కా పాటించండి. బకెట్ గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు కొద్దిగా వేసి ఒకేసారి మూడు కాటన్ చీరలను నానబెట్టాలి. ఎక్కువ సేపు నానబెట్టకుండా పది, పదిహేను నిమిషాలకే ఉతికేయాలి. దాంతో కాటన్ చీరలకున్న అందం, రంగు పోవు. మొదటి సారి ఇలా చేయడం వల్ల తర్వాత తర్వాత ఉతుకులకు ఎటువంటి హానీ జరగకుండా కాటన్ చీరను కాపాడుకోవచ్చు.
సోప్ నట్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించడం వల్ల కూడా కాటన్ చీరలు ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. సోప్ నట్స్ నీళ్లలో వేసి అందులో చీరలను నానబెట్టి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. మార్కెట్లో లభించే లిక్విడ్ స్టార్చ్ లో కాటన్ చీరలను నానబెట్టుట వల్ల అవి ముడతలు లేకుండా స్టిఫ్ గా ఉంటాయి.
చీరలను ఉతికి శుభ్రపరిచిన తర్వాత స్టార్చ్(గంజి) పెట్టి ఎండలో కొద్దిసేపు మాత్రమే ఆరబెట్టి ఆరిన వెంటనే తీసేయాలి. ఇక కాటన్ బట్టలు స్టిఫ్ గా ఉండాలంటే ఐరనింగ్ ముఖ్యం. ఐరన్ చేసే ముందు కాటన్ దుస్తులపైగల లేబుల్ ఒకసారి పరిశీలించండి. సాధారణంగా కాటన్ గుడ్డను ఐరన్ చేయవచ్చు. కాని చేసేముందు ఒకసారి చూడటం మంచిది. కాటన్ చీరలను కానీ కాటన్ ఏ ఇతర వస్త్రాలు కానీ ఐరన్ చేసే ముందు ఆ వస్త్రంపై కొన్ని నీళ్ళు చిలకరిస్తే కాటన్ వస్త్రాలు త్వరగా ముడుతలు లేకుండా ఐరన్ చేయవచ్చు.
స్టీమ్ ఐరన్ కనుక మీరు ఉపయోగిస్తున్నట్లయితే, గుడ్డ ఆటోమేటిక్ గా తేమను పీల్చుకుంటుంది. వేరుగా నీరు గుడ్డపై చిలకరించనవసరంలేదు. గుడ్డలకు గంజి పెట్టినట్లయితే కాటన్ గుడ్డలు దళసరిగా వుంటాయి. వాష్ చేసిన తర్వాత, ఐరన్ చేసే ముందు కొద్దిపాటి గంజిని గుడ్డలకు పట్టించటం మంచిది.

మసాలా దినుసులతో గుమగుమలాడే రుచులు...!

సాధారణంగా భారతీయు వంటగది సుగంధ పరిమళాలతో నిండి వుంటుంది. ఎందుకంటే మసాలా, స్పైసీ ఎక్కువగా వండుతారు. తింటారు కాబట్టి. మీరు కొత్తగా వంటగదిలోకి అడుగు పెడుతన్నా లేదా వంటల గురించి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నా ముఖ్యంగా వంటకు ఉపయోగించే వస్తువులపై అవగాహన కలిగి వుండాలి. కొన్ని సాధారణంగా అందరికీ తెలిసి ఉంటాయి. అయితే మరికొన్ని స్పైసీ వస్తువులు కొంతమందికి తెలిసి ఉండవు. కాబట్టి వంటగదిలో ఎలాంటి స్పైసీ ఐటమ్స్ ను నిల్వచేసుకోవాలో తెలుసుకోవాలి. ఇండియన్ ఫుడ్ తయారు చేయడంలో వంటకు ఉపయోగించే వస్తువులు కొన్ని వందల్లో ఉన్నాయి. కొన్ని వస్తువులు లేకుండా వంట అనేది పూర్తి కాదు. అందుకోసం ఇక్కడ కొన్ని స్పైసీ వంట దినుసులను మీకోసం తెలియ చేస్తున్నాం. అలాగే వాటి వల్ల ఉపయోగం ఏమిటి వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం...


must have spices an indian kitchen

జీలకర్ర(Cumin Seeds): భారతీయ వంటకాల్లో అత్యంత తరచుగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది ఒకటి. ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు(మసాలా) దినుసులలో ఒకటి. జీలర్రను వంటల్లో పొడి రూపంలోనూ, గింజల రూపంలోనూ ఉపయోగిస్తాచు. ఇది రుచి మరియు సువాసన ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో బద్రపరచుకోవాలి. దీన్ని తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధ వ్యాదులకు, నీరసము తగ్గుటకు, గర్భాశక బాధలు, పేగులు శుభ్రపరచుట, పైత్యం నివారించుటకు వాంతులు తగ్గుటకు, కడుపులో నులిపురుగుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
మిరియాలు(పెప్పర్): మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రారాజు. పదార్ధాలపై కొంచం మిరియాలపొడి వేసి తింటుంటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. మిరియాలు రుచికి ఘాటుగానూ, కారంగానూ వుంటాయి. ఆయుర్వేద ఔషధాలలో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు. అతి చవకగా లభించే మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి.
పచ్చిమిర్చి/ఎండు మిర్చి(Green Chilli or Red Chillies): మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది.. కాని మిరప లేకుండా వంట సాగదు, పచ్చి, పండు, ఎండు మిరప లను మనము వాడుతాం. ఇవి శారీరక బరువును తగ్గించడానికి దోహందం చేస్తాయి. వీటిలోని రసాయనిక పదార్థం కాస్పైసిన్ జీర్ణరసాన్ని క్రియాశీలం చేస్తూ జీర్ణకోశం లోపలి భాగాల్ని కాపాడుతుంది. కాలేయం పనితీరును మరింతగా మెరగుపరుస్తుంది.
కొత్తిమీర: ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్, కూరల వంటి వాటికి చేర్చుతుంటారు. అయితే కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీరను ఫ్రెష్ గా ఉంచేందుకు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదా ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పెట్టుకోవచ్చు
యాలకులు: సుగంధ ద్రవ్యాలలో రారాణి అయిన యాలకుల్ని తినడము వల్ల నోటిదుర్వాసన తగ్గిపోతుంది. కాలేయ, జీర్ణసంబంధిత రుగ్మతలకు మంచి చికిత్స. దృఢమైన డిటాక్షిఫికేషన్‌ కారకము గా గుర్తింపు పొందినది.
లవంగాలు: లవంగాలు చప్పరించడము వల్ల గొంతు మంట తగ్గుగుంది. దీనిలో యాంటీస్పాస్ మోడిక్ గుణాలు ఉన్నాయి. కండరాలు పట్టేసినప్పుడు లవంగ తైలము రాస్తే ఉపశమనము గా ఉంటుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
పసుపు, మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పిప్పళ్ళు, దాల్చిన చెక్క, జీలకర్ర మొదలగునవి మనము రోజూ వాడే సుగంధ ద్రవ్యాలు. ఉదాహరనకు పసుపును తీసుకుంటే పపంచము అంతాసుగుణాలను గుర్తిస్తున్నది. పసుపులో యాంటిసెప్టిక్, యాంటి ఇంఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. గాయాలు మానడానికి పసుపు వాడుతారు. పాలలో కొద్దిగ పసుపు కలుపుకొని తాగుతుంటే జలుబు, దగ్గు తగ్గుముఖము పడతాయి. పసుపులో ఉండే "కర్ కర్మిన్‌" అనే పదార్ధము క్యాన్‌సర్ నుండి కాపాడుతుంది అని తాజా పరిశోధనలలో గుర్తించారు.
 

డెలివరీ తర్వాత బ్రెస్ట్ కేర్ తో తల్లి బిడ్డ క్షేమం...

ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్‌ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్‌ చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్‌ నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవడం, పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.
బ్రెస్ట్‌ సమస్యల్లో అక్యూర్డ్‌ మాస్‌టైటిస్‌ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, బ్రెస్ట్‌ ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పడే రిట్రాచ్‌ నిప్పల్‌, క్రాక్‌ నిప్పల్‌ సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి. వీరికి యాంటిబయాటిక్స్‌ ఇస్తారు. కొందరు మహిళలకు బ్రెస్ట్‌లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది. ఇటువంటి వారికి ఎక్స్‌ట్రా మిల్క్‌ను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు బ్రెస్ట్‌ సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. హై ఫీవర్‌ ఉంటుంది. బిపి ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి బ్రెస్ట్‌ సమస్యలు ఏర్పడతాయి. పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్‌ చేయాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం తెలుసుకోవాలి.
బ్రెస్ట్ వాపు ఉన్నప్పుడు మాయిస్ట్ హీట్ ను పపయోగించడం వల్ల నొప్పి నివారించవచ్చు. శిశువుకు తరచూ పాలు పట్టడం వల్ల కూడా నొప్పి తగ్గవచ్చు. డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అనేది సాధరణ సమస్యగా తీసుకొని, ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం తల్లి బిడ్డకు క్షేమం. నిప్పల్స్ సలపడం, నొప్పిగా ఉన్నప్పుడు శిశువు పాలు పట్టడం కరెక్ట్ గా ఉండాలి. శిశువు పాలు పట్టిన ప్రతి సారీ పాలు పట్టడానికి ముందు తర్వాత బ్రెస్ట్ ను శుభ్రం చేసుకోవాలి.
బ్రెస్ట్ బాగా గాలి ఆడేలా వదులైనటువంటి బ్లౌజులను వేసుకోవడం మంచి పద్దతి. దాంతో ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. స్థనాలు శుభ్రపరచుకోవడానికి ఆల్కహాల్ వంటి ఉత్పత్తులు, రసాయనిక సోప్స్, సెంట్ కలిగిన క్లీనర్స్ తో ఉపయోగించకూడదు. వీటిని ఉపయోగించడం వల్ల నిప్పల్స్ పొడి బారీ , క్రాకర్స్ ఏర్పడం జరుగుతుంది. డెలివరీ తర్వాత కరెక్ట్ సైజు కలిగినటువంటి బ్రాను ధరించడం చాలా ముఖ్యం. బ్రా టైట్ గా ఉన్నట్లైతే స్థనాలు అదిమి పెట్టబడి బరువుగా ఉండి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బ్రాలను  కొనేటప్పుడే సైజును ఎంపిక చేసుకోవాలి. అవి కూడా కాటన్ తో తయారు చేసినవైతే మంరి సౌకర్యంగా ఉంటాయి.

ప్రసవం తర్వాత అధికంగా రాలే జుట్టును అరికట్టుట

సాధారణంగా నేటి యువతీ యువకుల్లో జుట్టు (వెంట్రుకలు) రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది. అలాగే మరికొందరికి జట్టు పలచబడడం, బట్టతల రావడం ఉంటుంది. నిజానికీ జట్టు రాలడం శారీరక, మానసిక ఒత్తిడికి లోనుకావడమే ఏకైక కారణమని పెక్కుమంది వైద్యులు చెపుతుంటారు. మరికొందరిలో దీర్ఝకాలిక జబ్బులు, తీవ్రమైన అంటు వ్యాధులు, ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా జుట్టు రాలిపోవచ్చన్నారు. హార్మోనుల అసమతుల్యం మూలంగా, మహిళల్లో ప్రసవం తర్వాత జట్టు ఎక్కువగా రాలిపోతుంది.
How Prevent Hair Loss After Pregnancy
గర్భిణి సమయంలో తగినంత పోషకాహారం తీసుకుంటారు. పుట్టబోయే బిడ్డకోసమైనా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. విటమిన్ సప్లిమెంట్లు వాడుతుంటారు. వీటన్నింటి వల్ల జుట్టు చాలా తక్కువగా రాలుతుంటుంది. అదే ప్రసవం అయిన తర్వాత విపరీతంగా జుట్టు రాలిపోతుంటుంది. ‘బిడ్డ బయటకు వచ్చేసింది కదా! ఇంకా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం' అనుకుంటారు. సమతుల ఆహారం, సరైన శుభ్రత పాటించకపోవడం, ఈ సమయంలో ఎదురయ్యే మానసిక మార్పుల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకని గర్భిణి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటివే పాటిస్తే సమస్య ఉత్పన్నం కాదు.
ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందికి జుట్టు ఊడిపోతుంటుంది. మీరూ గమనించి ఉంటారు. ప్రసవం తర్వాత కూడా కొందరిలో కంటిన్యూ అవుతుంది. ఇందుకు కాల్షీయం లోపం కూడా కారణమే. దీంతోపాటు జుట్టు బిరుసు ఎక్కడం. చివర్లు రెండుగా చీలిపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. దీన్ని నివారించాలంటే......
1. మొదట ప్రధానంగా మానసిక ఒత్తిడి తగ్గించుకొని, పౌష్టికాహారం తీసుకోవాలి.
2. తర్వాత మాయిశ్చరైజర్ ఉన్న కండిషనర్ ఉపయోగించాలి. జుట్టు దువ్వుకునే సమయంలో జాగ్రత్తలు పాటించడం.
3. మీ గైనిక్ డాక్టర్ సలహా పై జుట్టు రాలిపోవడానికి కారణమైన మందులను మార్చడం.
4. ఎండుగా, జిడ్డు లేకుండా ఉంచుకోవడం. ప్రెగ్నెన్సీ సమయంలో సింపుల్ హెయిర్ స్టైల్స్ కలర్ వేసుకోవడం మొదలెట్టవచ్చు.
5. ప్రెగ్నెన్సీ సమయంలో సమయలో సింపుల్ హెయిర్ స్టైల్ బెస్ట్. పైన చెప్పినవన్నీ క్రమం తప్పకపాటిస్తే మిమ్మల్పి చూసిన వారు ప్రెగ్నెన్సీ బ్యూటీ అని పిలుస్తారు.
6. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం ఎలా తీసుకుంటామో, జుట్టు రాలిపోకుండా కూడా తగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, జింక్, పొటాషియం, విటమిన్ ‘ఎ', ‘ఇ', ఆకుకూరలు, పండ్లు, పాల ఉత్పత్తులు సమతూకంలో తీసుకోవాలి.
7. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 7-8 గంటలు నిద్రపోవడం, 8-10 గ్లాసుల నీరుతాగడం, మానసిక ఒత్తిడిని తగించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.


‘తల్లిపాల’ను పెంచే 7 అద్భుతమైన ఆహారాలు...

చాలా మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేన్ని పాలు ఇవ్వలేక పోతున్నామని మధనపడిపోతుంటారు. పోతపాలకు అలవాటు చేస్తుంటారు. బిడ్డకు పోతపాలు పడక తల్లి పడే ఇబ్బందులు చాలా ఇళ్ళలో నిత్యకృత్యాలే. అందుకు కారణం ఒత్తిడి, బాడీ డీహైడ్రేషన్, ప్రసవం తర్వాత ఎక్కువగా నిద్రపోవడం మొదలగునవి. ఇలాంటి సమయంలో పాలిచ్చే తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమృద్ధిగా పాలు పడతాయి. తల్లిపాల పెంచడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అందుకు రసాయనాలతో కూడిన మందులు మాత్రలు మింగడం కంటే, కొన్ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే చాలా తల్లి పాలు సంవద్దిగా పడుతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కాబట్టి ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంతో పాటు అటువంటి ఆహారాన్ని చేర్చుడం కూడా చాలా మంచిది.
Foods Increase Breast Milk
1. మొంతులు: చిన్న పిల్లల తల్లులలో పాల ఉత్పత్తికి మెంతులు చాలా ఉపయోగపడుతాయి. బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం ఆరోగ్యకరం. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి, తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.
2. తులసి: తులసిలో ఔషదగుణాలు మాత్రమే కాదు, తల్లిలో పాల ఉత్పత్తి పెంచే గుణం కూడా కలిగి ఉన్నది. తులసిలో ఉన్న విటమిన్ కె పాలఉత్పత్తులను బాగా పెంచుతుంది. కాబట్టి తులసి ఆకులను సూపులతో చేర్చి ఇవ్వడం లేదా అలాగే పచ్చి ఆకులను, తేనెతో కలిపి తినడం వల్ల కూడా తల్లిలో పాలు బాగా పడుతాయి.
3. వెజిటేబుల్స్: కొన్నరకాల వెజిటెబుల్స్ అంటే కాకర కాయ, బీరకాయ వంటివి తల్లిలో పాలు పడేందుకు బాగా ఉపయోగడుతాయి. ఈ కూరగాయల్లో అధికంగా విటమిన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ బాగా ఉండికించి కారం లేకుండా తల్లి తీసుకొన్నట్లైతే బిడ్డకు సరిపడా పాలు పెరుగుతాయి.
4. పాలు: పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి. ఆవుపాలు, నెయ్యి, బట్టర్, వంటి వాటితో పాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే వీటిని పచ్చిగా అలా తీసుకోవడం కంటే వాటిని కర్రీస్ లో చేర్చి అందించడం మంచిది. కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర. బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి.
5. వెల్లుల్లి: వెల్లుల్లి పురాతన కాలం నుండి బాలింతలకు ఎక్కువగా తినిపిస్తుంటారు. వెల్లుల్లిని పచ్చిగా తినడం కంటే పొడులతో చేర్చి లేదా కర్రీస్, మటన్, వెజిటేబుల్స్, తో చేర్చి ఇవ్వొచ్చు. ఇది రెగ్యులర్ గా తిన్నా ప్రమాదం ఉండదు.
6. బాలింతలకు బొప్పాయి కల్పతరువులాంటిది. బొప్పాయి దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూరవండుకుని తిన్నట్లయితే స్తన్యవృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయనుగానీ పండునిగానీ తీసుకోవడం మంచిది.
7. వాము: బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. అంతే కాదు గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. గర్భాశయంలో నొప్పి తగ్గుతుంది. మైల త్వరగా పడిపోతుంది. శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, అప్పుడు కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి.మంచి రక్తాన్ని పుటిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి.
 

కొత్త తల్లిలో సమృద్ధిగా పాలు పడేలా చేసే సూపర్ ఫుడ్స్

తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది. చాలా మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేన్ని పాలు ఇవ్వలేకపోతున్నామని మధన పడిపోతుంటారు. పోతపాలకు అలవాటు చేస్తుంటారు. వారికి పోతపాలు పట్టక పడే ఇబ్బందులు చాలా ఇళ్ళలో నిత్యకృత్యాలే. ఇలాంటి సమయంలో పాలిచ్చే తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమృద్ధిగా పాలు పడతాయి. చిన్న పిల్లల తల్లులలో పాల ఉత్పత్తికి మెంతులు చాలా ఉపయోగపడుతాయి.



వెజిటేబుల్స్: కొన్నరకాల వెజిటెబుల్స్ అంటే కాకర కాయ, బీరకాయ వంటివి తల్లిలో పాలు పడేందుకు బాగా ఉపయోగడుతాయి. ఈ కూరగాయల్లో అధికంగా విటమిన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ బాగా ఉండికించి కారం లేకుండా తల్లి తీసుకొన్నట్లైతే బిడ్డకు సరిపడా పాలు పెరుగుతాయి.



పాలు: పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి. ఆవుపాలు, నెయ్యి, బట్టర్, వంటి వాటితో పాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే వీటిని పచ్చిగా అలా తీసుకోవడం కంటే వాటిని కర్రీస్ లో చేర్చి అందించడం మంచిది. కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర. బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి.



నట్స్: బాదం, జీడిపప్పు, వంటివి బ్రెస్ట్ మిల్క్ ను పెంచడంలో చాలా అద్భుతంగా పాత్ర వహిస్తాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండి.



ఫైబర్ ఫుడ్స్/జ్యూసులు: గ్రీన్ వెజిటేబుల్స్ మరియు రెడ్ వెజిటేబుల్స్ లో ఎక్కువ శాతం ఫైబర్ కలిగి ఉంటుంది. ఆకుకూ0రలు, బీన్స్, స్వీట్ పొటాటో మరియు దుంపలు బ్రెస్ట్ మిల్క్ ను పెంచడంలో చాలా ఉపయోగపడుతాయి. కాబట్టి వీటిలో ఏదో ఒకటి ప్రతి రోజూ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. లేదా వీటిని జ్యూసుల రూపంలో తీసుకోవడం చాలా ఆరోగ్యకరం శిశువుకు కావల్సినన్ని పాలను ఉత్పత్తి చేయడంలో బాగా ఉపయోగపడుతుంది.



వెల్లుల్లి: వెల్లుల్లి పురాతన కాలం నుండి బాలింతలకు ఎక్కువగా తినిపిస్తుంటారు. వెల్లుల్లిని పచ్చిగా తినడం కంటే పొడులతో చేర్చి లేదా కర్రీస్, మటన్, వెజిటేబుల్స్, తో చేర్చి ఇవ్వొచ్చు. ఇది రెగ్యులర్ గా తిన్నా ప్రమాదం ఉండదు.



మొంతులు: చిన్న పిల్లల తల్లులలో పాల ఉత్పత్తికి మెంతులు చాలా ఉపయోగపడుతాయి. బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం ఆరోగ్యకరం. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి, తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు




తులసి: తులసిలో ఔషదగుణాలు మాత్రమే కాదు, తల్లిలో పాల ఉత్పత్తి పెంచే గుణం కూడా కలిగి ఉన్నది. తులసిలో ఉన్న విటమిన్ కె పాలఉత్పత్తులను బాగా పెంచుతుంది. కాబట్టి తులసి ఆకులను సూపులతో చేర్చి ఇవ్వడం లేదా అలాగే పచ్చి ఆకులను, తేనెతో కలిపి తినడం వల్ల కూడా తల్లిలో పాలు బాగా పడుతాయి.



బొప్పాయి: బాలింతలకు బొప్పాయి కల్పతరువులాంటిది. బొప్పాయి దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూరవండుకుని తిన్నట్లయితే స్తన్యవృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయనుగానీ పండునిగానీ తీసుకోవడం మంచిది.



వాము: బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. అంతే కాదు గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. గర్భాశయంలో నొప్పి తగ్గుతుంది. మైల త్వరగా పడిపోతుంది. శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, అప్పుడు కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి.మంచి రక్తాన్ని పుటిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి.



కాకరకాయ: కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ కూడా సమృద్ధిగా లభిస్తాయి, జీర్ణ శక్తిని వృద్దిచేస్తుంది. స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు కాకరకాయను ఎటువంటి రూపంలోనూ తీసుకోకూడదు. అయితే ప్రసవం తర్వాత కాకరకాయను తీసుకోవడం వల్ల శిశువుకు
సరిపడా పాలు పడుతాయి.

తల్లిపాల పెంచడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అందుకు రసాయనాలతో కూడిన మందులు మాత్రలు మింగడం కంటే, కొన్ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే చాలా తల్లి పాలు సంవద్దిగా పడుతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కాబట్టి ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంతో పాటు అటువంటి ఆహారాన్ని చేర్చుడం కూడా చాలా మంచిది.
మీ పసిపిల్లలకు ఆహారాన్ని తినపించండం మొదలు పెట్టగానే ఒకే సారి ఘనాహారం ఇవ్వడం లేదాప్యాక్ చేసిన ఆహారాలు, మరియు బార్లీ వంటి మాత్రమే వారికి అందివ్వకూడదు. భారత దేశంలో పిల్లలు తినే ఆహారంపైన చాలా రీసెర్చ్ లే చేసి పసిపిలల్లకు సరైనటువంటి పౌష్టికాహారం అందడం లేదని తేల్చారు. తల్లి గర్భవతిగా ఉన్నప్పుటి నుండి తల్లితో పాటు లోపల పెరిగే బిడ్డకు కావల్సిన పౌష్టికాహారాన్ని తీసుకోవల్సి ఉంటుంది. అయితే తల్లి ప్రసవించిన మొదటి సంవత్సరం, లేదా రెండేళ్ళ పాటు తల్లి పాలను అందించిన తర్వాత పసిపిల్లలకు ఘనాహారాన్ని తినిపించడం మొదలు పెడుతారు. ఆ ఆహారంలో కూడా పిల్లలకు కావల్సిన ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్, మినిరల్స్, ఫైబర్స్, కొవ్వులు అందేలా చూసుకోవాలి. ప్రస్తుతం బయట మార్కెట్స్ లో పసిపిల్లలకు పెట్టే ఆహారం దొరుకుతోంది. అయితే వాటిని ఉపయోగించడం వల్ల ప్రయోజనం వుండదు

సాధారణంగా అన్న ప్రాశన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజ ధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమవుతాయి. పుట్టిన మొదటి కొన్ని సంవత్సరాలలో, మానవ శరీరం అతి త్వరిత గతిన పెరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు సగటున 3 కిలోల బరువు తూగిన పసిపాప తనకు 6 నెలలు వచ్చేసరికి ఆ బరువు రెండింతలు పెరుగుతుంది. అలాగే, ఒక ఏడాది నాటికి ఆ బరువు 9 కిలోలు అవుతుంది. శిశువులు మరియు పిల్లలు చాలా చురుగ్గా ఉండడమే కాక వారు తమ శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుచేత, వీరికి శరీర పెరుగుదలకు మరియు అధికశక్తినిచ్చే ఆహారపదార్ధాలు అంటే మాంసకృత్తులు, పిండిపదార్ధాలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లో స్వయంగా తయారు చేసి పసిపిల్లకు అందించాలి. అలాంటి ఆహారాలు పిల్లల కోసం కొన్ని....


మొదటగా పసిపిల్లలకు ఘనాహారాన్ని మొదలు పెట్టే సమయంలో మెత్తగా ఉన్న పెరుగన్నాన్ని తినిపిస్తుంటారు బామ్మలు. మెత్తగా ఉడికించిన అన్నంకి, కొద్దిగా పెరుగు, పంచదార కలిపి బాగా మెత్తగా చేసి పెడుటుంటారు. పిల్లలకు తినిపించే ఆహారాల్లో ఇదొక బెస్ట్ ఫుడ్ అని చెప్చొచ్చు. ఎందుకంటే ఇది కారం,ఉప్పు అనేవి లేకుండా పిల్లలు కమ్మగా తినగలిగేటటువంటి ఆహారం. అంతే కాదు పిల్లలు నోట్లో సులభంగా పెట్టడానికి చాలా బాగుంటుంది. దీని వల్ల పిల్లలకు కావల్సినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు కావల్సిన శక్తి అందుతుంది.


 
నెయ్యి లేదా ప్యూర్ వెన్న ను పిల్లల ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగుతాయి. సాధారణంగా భారత దేశంలో పిల్లల పెరుగుదలకు నెయ్యితో కూడిన ఆహారాన్ని తినిపిస్తుంటారు. పెరుగుదలకు మాత్రమే కాకుండా శక్తి, ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. నెయ్యిని బయట తెచ్చుకొన్న మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీది లేదా ఇంట్లో స్వయంగా తయారు చేసినది మాత్రమే పిల్లలకు అందించాల్సి ఉంటుంది.



ఇండియన్ డైయట్ చాలా సాధారణంగా సింపుల్ గా ఉంటుంది. రైస్ లేదా రోటితో పప్పు వంటివి మనకు కావల్సినది తినవచ్చు. కాబట్టి పిల్లలకు తినిపించే ఆహారంలో కూడా ఇండియన్ స్ట్రక్చర్ ఉండాలనుకొంటే కారం లేకుండా మిక్క్ క్రీమ్, పెరుగు తో తయారు చేసి వంటలు చాలా ఆరోగ్యకరం. అంతే కాదు వెజిటేబుల్ లేదా చికెన్ తినిపించాలనుకొన్నప్పుడు అందులో పెప్పర్ ను చేర్చడం వల్ల కావల్సినన్ని న్యూట్రిషియన్స్ అంధిస్తాయి.


పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అంధించే విధానం..

పిల్లలు బరువు క్రమ పద్ధతిలో పెరుగున్నారా లేదా అనే విషయాన్ని తల్లదండ్రులకు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అతి బరువు, అతి తక్కువ బరువుతో గనుక పిల్లలు పెరగుతుంటే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అతి బరువు, అతి తక్కువ బరువుతో గునుక పిల్లలు పెరుగుతుంటే ప్రత్యేక శ్రద్ద వహించాల్సి వుంటుంది. పిల్లలు చురుకుగా ఆటల్లో పాటలో పాల్లొంటున్నారా లేదా? యాక్టివ్ గా ఉన్న పిల్లలు ఆరోగ్యంగా వున్నట్టు పిల్లలకి బాగా ఆకలి వేస్తోందా లేదా? రోజూ విరేచనం సాఫీగా ఉంటోందా లేదా?అనే విషయాలు తప్పకుండా గమనిస్తుండాలి. ఆకలి వేస్తుందీ లేనిది వారు తీసుకునే ఆహార క్రమాన్ని బట్టి అర్థమౌతుంది. జలుబు, దగ్గు వగైరాలు వంటి చిన్నా చితక నలతలు కనుక ఎక్కువగా వస్తుంటే వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని అందించాలి. అంటే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్....
Age By Age Guide Feeding Your Baby

అలాగే ఆటల్లో పాల్గొంటే శక్తిని పొందగలుగుతారు. పిల్లలకి ఎప్పుడూ ఏ కొత్త ఆహారం యిచ్చినా అవి ఎంత వరకు శరీర తత్వాతనికి పడుతున్నదీ లేనిది ఒకటి రెండు రోజుల పాటు గమనిస్తుండాలి. కొందరికి కొన్ని రకాల పదార్థాలు, వస్తువులు పడవు. అప్పుడు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. విరోచనాలు అవడం, వొంటి మీద దద్దుర్లు లేదా దురద, వాపు వంటి రావడం జరగొచ్చు. లేదంటే వాంతులు కావచ్చు. ఇలాంటి లక్షణాలను వెంటనే గమనించి వెంటనే డాక్టర్ కి చూపించి మందులు వాడాలి.
ముఖ్యంగా ఇలాంటి సింప్టమ్స్ నెలల పిల్లల్లో కనిపిస్తే వెంటనే మొలకువతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల వయసు క్రమానుసారం ఆహార పట్టిక ..
0-3 నెలల పిల్లలకి: డిమాండ్ ఫీడింగ్ చేయాలి. అంటే బేబీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లి పాలు ఇవ్వాలి. తల్లిపాలు సరిపోకపోతే పోతపాలు పట్టించాలి.
ఎలా అంటే: 0-15 రోజుల బేబీకి: ఒక పాళ్ళు పాలు, రెండు పాళ్ళు నీళ్ళు. రెండు వారాల పాపాయికి : రెండు పాళ్ళు పాలు, ఒక పాలు నీళ్ళు. 6 వారాల నుంచి 3 నెలలపాపాయికి మూడు పాళ్ళు పాలు. ఒక పాలు నీళ్ళు. 3 నెలల నుంచి నీళ్ళు కలపని చిక్కటి పాలు పట్టొచచు. ఒక వేళ పాప సరిగ్గా జీర్ఝం చేసుకోవడం లేదని అనిపిస్తే తగినంత నీళ్ళు కలిపి, తర్వాత నీటి శాతాన్ని తగ్గించాలి.
3-6నెలల పాపాయికి ఇవ్వవలసిన ఆహారం: తల్లిపాలు, పోతపాలు, మెత్తగా వండిన అన్నం లేక ఉప్మా రవ్వ, లేదా సగ్గుబియ్యం, కొద్దిగా పప్పు కూడా కలపాలి. మెత్తగా ఉడికించిన బంగాళా దుంప, టమోటో, గుజ్జు, అరటి పండు. 1-2 టీస్పూన్లు, ఉడికించిన మెత్తని గుడ్డు.
6-9 నెలల పాపాయికి: తల్లిపాలు, పోతపాలు, ఇంకా పైన పేర్కొన్న ఆహారంలో అరకప్పు వరకూ ఇవ్వొచ్చు.
9- 1 సంవత్సరాల పిల్లలకి: పోతపాలు, పైన చెప్పిన ఆహారంలో బ్రెడ్, చపాతీ, జావ... వండిన మెత్తటి కూరగాయలు మెత్తగా వుడికించిన వండిన మాంసాహారం సూప్స్ ఇవ్వొచ్చు.
2-5 సంవత్సరాల పిల్లలకి: బ్రేక్ ఫాస్ట్: ఇడ్లీ, రాగి జావ, బ్రెడ్ వీటిలో ఏదో ఒక దానితో పాటు పాలు ఒక గ్లాసు, మధ్యలో ఒక పండు, లంచ్ లో అన్నం లేక చపాతీ, పప్పు కూరగాయలు, పెరుగు, సాయంత్రం పాలు, వేయించిన పల్లీలు, లేదా ఉడకబెట్టిన శనగలు, లేక గుడ్డు లేక అరటిపండు. రాత్రి భోజనానికి అన్నం లేక పెరుగు, కూరగాయలు, రాత్రి పడుకోబేయే ముందు పాలు ఇవ్వొచ్చు.



 

అన్నప్రాసం తర్వాత పసిపిల్లలకు ఎటువంటి ఆహారానందించాలి..

అమ్మపాల నుంచి... అన్న ప్రాశనలోకి అడుగుపెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి ఏ పోషకాలు అందించాలి? ఈ సందేహాలు తరచూ తల్లులని తికమక పెడతాయి. ముఖ్యంగా ఏడాదిలోపు బిడ్డ ఎదుగుదలకి అవసరం అయిన పోషకాలని ఎలా సులువుగా అందించాలో చెబుతున్నారు నిపుణులు..
Types First Food Offer Baby

అమ్మపాలు: తొలినాళ్లలో అంటే ఆరు నెలల వరకూ బిడ్డకు కావాల్సిన సమస్త పోషకాలు అమ్మ పాల నుంచే అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల భారిన పడకుండా చేస్తాయి. ఇక ఆర్నెల్ల తర్వాత నుంచీ ఎదిగే చిన్నారులకు వారి అవసరాలరిత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగ్గా అందించాలి. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు మూడు కేజీల వరకు బరువుండాలి. ఐదు నెలలకి అది రెట్టింపు అవ్వాలి.
తొలి ఘనాహారం: సాధారణంగా అన్న ప్రాశన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజ ధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమవుతాయి.
శుభ్రం చేసిన కిలో పెసలని పదిహేను గంటలపాటు నానబెట్టి వాటిని తడి వస్త్రలో మూటకట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి పొట్టు, మొలకలు తొలగించిన తర్వాత దోరగా వేయించి, చల్లార్చి పిండి పట్టించుకొని పిల్లలకు ప్రతి రోజూ తినిపించాలి.
అదేవిధంగా శుభ్రం చేసిన కేజీ రాగులని పదిహేను గంట పాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో మూడు రోజుల పాటు మూటకట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ, మొలకలు వచ్చిన తర్వాత తీసి ఎండబెట్టాలి. తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలి. మొలకలని తొలగించి, పిండి పట్టించుకొని గాలిచోరని డబ్బాలో భద్రపరచుకొని ప్రతి రోజూ తినిపించాలి.
ఏడు, ఎనిమిది నెలల్లో ఈ పిండితో పాటు ఆహారానికి తోడుగా బాగా ఉడికించిన మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డలోని పచ్చసొన, అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపొచ్చు. అధిక శక్తికోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థఆలని కలపడం వల్ల రెట్టింపు శక్తి అందుతుంది.
పసిపాపల ఆహారంలో గట్టిగా ఉండే పదార్థాలని, పొట్టు ఉన్నవాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే అజీర్తి చేస్తుంది. ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలని పరిచయం చెయ్యాలి....

గొప్ప దానం ‘ర‌క్తదానం’

ప్రతి జీవికి రక్తం ప్రాణాధారం. లోకంలో నీళ్ళు లేకపోతే ఎలా మనుగడ కష్టమౌతుందో, శరీరంలో రక్తం తక్కువైతే ప్రాణానికే ముప్పు. సమయానికి రక్తం దొరకక పోవడం వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతి రెండున్నర సెకన్లకు ఒకరికి రక్తం అవసరం పడుతోంది. ప్రతి రక్తపు బొట్టు మరొకరి ప్రాణానికి ఆధారమవుతోంది. వందలో ఒకరు రక్తం దానం చేస్తే చాలు మనిషి ప్రాణాలను కాపాడుకోవచ్చు. కానీ రక్తదానం అవసరానికి సరిపోయేంతగా జరగడంలేదు. అందువల్ల రక్తం అవసరమైనపుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.
అన్ని దానాల్లోకెల్లా మిన్న రక్తదానం. ఎందుకంటే ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే అంతకన్నా పరోపకారం ఏముంటుంది? అన్నదానం, విద్యాదానం మొదలైన… ఏ దానం చేయాలన్నా ప్రాణమున్న మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో ఏటా సుమారు 80 లక్షలకు పైగా యూనిట్లు రక్తం కొరత ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలోనైనా రక్తం దొరకటం కొంచెం కష్టంగానే ఉంటోంది. ఇక అరుదైన గ్రూప్ రక్తం అయితే చెప్పాల్సిన పనిలేదు. డోనర్స్ కోసం వెతుక్కోవల్సిందే. దాంతో ఆస్పత్రుల్లో రక్తం అవసరం అయితే వారి బంధువుల్లో ఒకరు బదులుగా రక్తం ఇస్తేనే బ్లడ్ బ్యాంకులో వారికి అసవరం అయిన రక్తం ఇస్తామని నిబంధన పెట్టారంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా ప్రతి మూడు నెలలకొక సారి రక్త దానం చేయవచ్చు. ఈ లెక్కన నిరంతరాయంగా 42 సంవత్సరాల పాటు రక్త దానం చేస్తే ఒక్కొక్కరు సుమారు 500 మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు. ఒకసారి రక్తన్ని దానం చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు.
రక్తం తయారు చేసే పదార్థం కాదు కాబట్టి… కేవలం మానవత్వం మీద ఆధారపడి ఉండే ఒకే ఒక్క దానం రక్తదానం. రక్తదానం చేయటం ద్వారా మరొకరికి ప్రాణదాత అవుతారు.

విన‌డం అంటే… నేర్చుకోవ‌డ‌మే

ఎదుటి వారు చెప్పే ముందు జాగ్రత్తగా విన‌డం వ‌ల్ల చాలా ల‌భాలున్నాయి. మ‌న‌లో చాలా మంది ప‌ట్టించుకోరు కానీ..నిజంగా విన‌డం వ‌ల్ల
చాలా జ్ఞానం వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.
ఎదుటి వ్యక్తి చెప్పే విష‌యం మీద దృష్టి కేంద్రీక‌రించ‌డం అభ్యసించాలి.అత‌ని ముఖ క‌వ‌లిక‌లు గ‌మ‌నిస్తూ, సూటిగా ఆ వ్యక్తినే చూస్తూ అత‌డు చెప్పేది విన‌డం, అర్థం చేసుకోవ‌డం అల‌వ‌రుచుకోవాలి. అప్పుడ‌ప్పుడూ ఎంతో ఇష్టమైన సంగీతాన్ని శ్రద్ధతె వినాలి. అలా విన‌డం వ‌ల్ల ఏకాగ్రత పెరుగుతుంది.ఏదైనా వినేట‌ప్పుడు అందులోని స‌మాచారాన్ని తెలుసుకునేలా విన‌డానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప‌రాయి భాష‌లో ఏదైనా వినాల్సిన‌ప్పుడు, ప్రతి మాట‌కు అర్థం వెతికే బ‌దులు ఆ భాష మాట్లాడుతున్న వ్యక్తి భావం, సారాంశం ఏమై ఉంటుందో అర్థం చేసుకోవాలి.
ఒక్కటి మాత్రం నిజం..శ్రద్ధ గా విన‌డం అనేది గౌర‌వ‌నీయ వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తుంది.

చూస్తే త‌రిగిపోతాది…


ప్రస్తుత స‌మాజంలో ప్రతి ఇంటిలోను టీవీ ఒక క‌నీస వ‌స్తువుగా మారిపోయింది. టీవీలు లేని ఇళ్ళు చాలా అరుదు ప్రపంచ న‌లు మూల‌ల నుంచి స‌మాచారాన్ని ప్రత్యక్షంగా మ‌న క‌ళ్ళకు క‌ట్టి చూపడంలో టీవీల‌కు సాటి మ‌రోటి లేదనుకోండి. కానీ ఇలా టీవీల గురించి గొప్పలు చెప్పుకుంటూ తీరిక దొరికితే టీవీల‌కు అతుక్కుపోయేవారికి ఈ వార్త కాస్త మింగుడు ప‌డ‌ని విష‌య‌మే.. ఎందుకంటే ఎక్కువ సేపు టీవీల‌కు అతుక్కుపోవ‌టం మ‌ధ్యపానం, ఊబ‌కాయం కంటే భ‌యంక‌ర‌మైన రోగ‌మ‌ని ప‌రిశోద‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే ఈ రోగానికి గురయ్యే వారిలో మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఉన్నార‌ట‌. అవును మ‌రి ఇంటిప‌ని మంట ప‌ని పూర్తయ్యాక మొగ‌లిరేకులు, పూత‌రేకులు అంటూ టీవీసీరియ‌ల్స్‌కు అతుక్కుపోతారు క‌దా? టీవీ ఛాన‌ళ్ల వారుకూడా వారికి సీరియ‌ల్సనీ అవ‌నీ ఇవ‌నీ ర‌క‌ర‌కాల మ‌హిళ‌ల కార్యక్రమాల‌తో తీరిక లేకుండా చేస్తున్నారు పాపం. ప్రత్యేక టీవీ ఛాన‌ళ్లను కూడా ఏర్పాటుచేస్తూ వారిని ఇంకా బాగా ఎంక‌రేజ్ చేస్తుంటే వారు మాత్రం ఏంచేస్తారు. అందుకే అన్ని రంగాల‌తో పాటు ఈ విష‌యంలో కూడా వారే ఫ‌స్ట్.

అస‌లు విష‌యానికి వ‌స్తే టీవీల‌కు అతుక్కుపోయి గంట‌ల త‌ర‌బ‌డి క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం వ‌ల్ల అనారోగ్య ఆహారం తీసుకోవ‌డం పెరుగుతుంద‌ని ఒక ఆస్ట్రేలియ‌న్ స‌ర్వే చెబుతుంది. ఇందులో నిజం లేక‌పోలేదు. ఎందుకంటే మ‌నం టీవీల‌ను చూస్తూ అన్నం తినే వారిని చాలామందిని చూస్తుంటాం. సినిమా చూస్తూ కొంచెం స‌స్పెన్స్ వ‌స్తే చాలు దానికి అతుక్కుపోయి తినేదాన్ని ప‌క్కన పెడ‌తాం. ఆ సీన్ అయ్యే వ‌ర‌కు మ‌న భోజనం ఎలా పెట్టింది అలానే ఉంటుంది. టీవీ చూస్తూ ఎంత తిన్నామో తెలియ‌కుండా తినే వాళ్లు చాలామందే ఉన్నారు. టీవీ చూస్తూ కొంద‌రు అతిగా తింటారు, కొంద‌రు త‌క్కువ తింటారు, కొంద‌రు గంట‌లు గంట‌లు తింటారు. కొంద‌రు ఏంతిన్నారో తెలీకుండా తింటారు. మ‌రి ఇలా చేస్తే రోగాలు రాక మ‌రేం వ‌స్తాయ్‌.
శాస్త్రవేత్తులు చెబుతున్నదాని ప్రకారం ఒక్క గంట‌సేపు టీవీ చూస్తే 22 నిమిషాల ఆయుష్షుకు సున్నా చుట్టిన‌ట్లేన‌ట. ఏంటీ ఇవ్వాల్టినుంచి మీ పిల్లల్ని టీవీలు చూడ‌కుండా క‌ట్టడి చేద్దాం అనుకుంటున్నారా…? ఆ శాస్త్రవేత్తల అధ్యాయ‌నాలు చెబుతున్నది కార్టూన్ నెట్వ‌ర్క్‌లు చూసే బుడ‌త‌ల గురించి కాదు 25 సంవ‌త్సరాలు పైబ‌డిన వారి గురించే. ”25 సంవ‌త్సరాలు పైబ‌డిన వారు రోజూ ఆరు గంట‌ల‌పాటు టీవీల‌ను చూస్తే, వారు ఒక్కోగంట‌కు 22 నిమిషాల చొప్పున ఆయుష్షును కోల్పోయిన‌ట్లే” అని వారంటున్నారు.
టీవీ చూడ‌టం వ‌ల్ల ఏమాత్రం వినోదం పొందుతారోగానీ నిజంగానే ఇది ధూమ‌పానం క‌న్నా భ‌యంక‌ర‌మైన‌దే.. ధూమ‌పానం, మ‌ధ్యపానం లాగే ఈ టీవీ రోగం బారిన ప‌డ్డవారు కూడా అంత తేలిగ్గా బ‌య‌ట‌కు వ‌స్తారంటారా..? ఏంటీ… చెప్పేవాళ్లు ఏమైనా చెప్తార‌ని వెళ్లి మ‌ళ్లీ టీవీ ఆన్ చేస్తున్నారా..? ఇలాగే రోజుకు ఆరు గంట‌లపాటు టీవీల‌కు అతుక్కుపోయారో మీ జీవిత కాలంలో 4.8 గంట‌లు కోల్పోయిన‌ట్లే మ‌రి చూస్కోండి.

పాలూ క‌ల్తీయే..!

చిన్న పిల్లల‌కు, ఎదిగే వారికి ఎలాంటి వారికైనా పాలు చాలా ఆరోగ్యక‌రం అని డాక్టర్ చెప్తారు. ఇది మ‌న‌కంద‌రికి తెలుసిన విష‌య‌మే. పాల‌లో చాలా విట‌మిన్లు, పోష‌కాలు ఉన్నాయ‌ని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఎదిగే పిల్లల‌కు ఖ‌చ్చితంగా ఒక గ్లాసు పాలు తాగించాల‌ని చెప్తారు. ఇవ‌న్నీ నిజ‌మే కానీ పాలు కూడా క‌ల్తీగా త‌యార‌వుతూ ఉంటే అప్పుడు ఆరోగ్యం కోస‌మే పాలు తాగుతున్న వారి ఆరోగ్యం ఏం కావాలి. చిన్నపిల్లల ద‌గ్గర‌నుండి పెద్దల వ‌ర‌కు రోజూ పాలు తాగేవారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. మ‌రి ఆ గ్లాస్ పాలే ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మారిస్తే ప‌రిస్థితి ఏంటి ? పాల వ‌ల్ల అనారోగ్యమేంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ! అవునండీ.. మ‌న ప్రపంచం అంతా దాదాపు క‌ల్తీతోనే సాగుతుంది క‌దా! ఇప్పుడు ఆ క‌ల్తీ పాల‌కు అంటుకుంది. దేశంలో 68 శాతం పాలు కల్తీయేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.


హానికారక పదార్థాలతో పాలను యథేచ్చగా కల్తీ చేస్తున్నారని.. దీన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ.. స్వామి అచ్యుతానంద లోగడ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో కేంద్రంలో కదలిక వచ్చింది. కేంద్రం తరపున ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ కమల్ కుమార్ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
ఇందులో 2011లో తమ సంస్థ దేశవ్యాప్తంగా పాల నాణ్యతపై నిర్వహించిన సర్వే ఫలితాలను పేర్కొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల(గ్రామాలు, పట్టణాలు) నుంచి 1791 పాల నమూనాలను సేకరించి పరీక్షించారు. వీటిలో కేవలం 565 నమూనాలే ప్రమాణాల ప్రకారం ఉన్నాయి. మిగతా 1,226 ప్రమాణ రహితంగానే ఉన్నట్లు తేలింది. ఈ కల్తీ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 88శాతం పాలు కల్తీమయం అని రుజువైంది. సబ్బు ద్రావకం, నీరు, గ్లూకోజ్, పాలపొడి ఇలా పలు రకాల పదార్థాలను కూడా వర్తకులు పాల కల్తీ కోసం వినియోగిస్తున్నారని ఈ సర్వేలో బయటపడింది. కల్తీకి వినియోగించేది కలుషిత జలమైతే తాగేవారి ఆరోగ్యం గుల్లేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఇక పాలలో కలిపే సబ్బుద్రావకం వల్ల అవి తాగడానికి సురక్షితం కాదని.. పాకెట్ పాలను వాడుకోవడం ఒకింత మంచిదని సూచించింది
సాధార‌ణంగా పాకెట్ పాలలో ఏం క‌లిపి ప్యాక్ చేస్తారో తెలియ‌ద‌ని చాలా మంది విడిగా పోసే పాలే న‌య‌మ‌ని అనుకుంటూ ఉన్నారు. కాని ఆ విడి పాలే మ‌న కొంప‌లు ముంచుతోంది. పాల సేక‌ర‌ణ అపరిశుభ్ర ప్రాంతాల‌లో జ‌రుగుతుంద‌నీ.. దూర ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం వ‌ల్ల పాల నాణ్యత తగ్గిపోవడమే కాకుండా.. పాడైపోయే ప్రమాదముంటుందని పాల నిపుణులు చెప్తున్నారు.
మొత్తం పాల కల్తీ.. గ్రామీణ ప్రాంతాల్లో 31శాతంగా ఉంటే.. పట్టణాల్లో అది 69శాతంగా ఉంది. ముఖ్యంగా, కల్తీలో విడిపాలదే అగ్రస్థానంగా ఉంది. వర్తకులు ఇంటి ఇంటికీ తిరిగి పోసే పాలల్లో 66శాతం కల్తీవే. అదే సమయంలో 33శాతం ప్యాకెట్ పాలు కల్తీకి గురవుతున్నాయి. స్కిమ్డ్, టోన్డ్, డబుల్ టోన్డ్ అంటూ రకరకాల పాలకోసం కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలు.. ఆచరణలో అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. మ‌రి విడిగా పాలు పోయించుకునే వాళ్లు కాసింత‌ జాగ్రత్తలు పాటించండి..

 

ఛాట్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

సిటీ లైఫ్ కి అలవాటు పడ్డవారు రోడ్డుపక్కనే ఛాట్ తినేస్తుంటారు. ఫ్రూట్ జ్యూస్ తాగేస్తుంటారు. చైనీస్ ఫుడ్స్ సంగతి సరేసరి. అయితే, ఇలాంటివి లాగించేయడం వల్ల రోగాలు కొనితెచ్చుకోవడమే అవుతుందా? అవుననే అంటున్నాయి తాజా సర్వేలు. రోడ్డు పక్కన చైనీస్ ఫుడ్ లేదా ఛాట్ ఘుమఘుమలు ముక్కుకు తాకగానే అటుగావెళ్ళి ఫాస్ట్ ఫుడ్ లాగించేయాలని ఎవరికి అనిపించదు. అయితే, అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. రోడ్డు పక్క ఛాట్ తో రోగాలొచ్చే ఛాన్స్ అధికంగా వుంది.
ఈమధ్య ముంబయిలోని ఐఐటీ క్యాంపస్ క్యాంటీన్ లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 600 మంది విద్యార్థులు అనారోగ్యంపాలయ్యారు. దీంతో కాలేజీ క్యాంటిన్ల పరిశుభ్రత పెద్ద చర్చనీయాంశమైంది. కాలేజీలు, ఆఫీస్ ల్లోని క్యాంటిన్లు చాలా చోట్ల అపరిశుభ్రంగానే ఉంటున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఆహారపదార్ధాలను సరిగా వండకపోవడం, లేదా, సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోవడం, వంటకు ఉపయోగించే నీరు పరిశుభ్రమైనది కాకపోవడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. నీటివల్ల వ్యాపించే రోగాలకు క్యాంటీన్ నిర్వాహకులే పరోక్షంగా కారణమవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?



కూరగాయలను బాగా కడగాలి

ఉపయోగించే నీరు పరిశుభ్రంగా ఉండాలి

ఫ్రిజ్ లోనుంచి తీసిన చికెన్ ను 600 డిగ్రీల సెల్సియస్ దాకా ఉడకబెట్టాలి

అనేక కంపెనీల్లోనూ, కాలేజీల్లోని క్యాంటీన్లలో, సబ్సిడీ రేట్లకే ఫుడ్స్ అమ్ముతుంటారు. దీంతో ఎక్కువ మంది క్యాంటీన్లమీదనే ఆధారపడుతుంటారు. ఎక్కువ మంది తరచూ అస్వస్థులు కావడానికి ఇది కూడా ఒక కారణమని తాజా సర్వేలు తేల్చిచెప్పాయి. మరి మనజాగ్రత్తలో మనముండాల్సిందే.

కాకరకాయ – మిస్టరీ

కాకరకాయ చేదుగా ఉంటేఉండవచ్చు. కానీ శరీరానికి మేలు చేస్తుందన్న నమ్మకం మనదేశంలో చాలామందిలో ఉంది. షుగర్ వ్యాధికి దివ్యౌషధంగా పనికొస్తుందాలేదా అన్నది తేల్చడం కోసం ఇప్పుడు మూడు దేశాల శాస్త్రవేత్తలు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాకరలోని కెమికల్ మిస్టరీ ఏమిటి అన్నది తెలుసు కుందాం..!

తింటే గారెలేతినాలని అన్నారేగానీ, కాకర తినమని ఎవ్వరూ చెప్పలేదని అనుకుంటున్నారా…? అలా ఫిక్సైపోకండి. ఎందుకంటే, డయాబెటిక్ పేషెంట్స్ కాకర తినాలంటూ శాస్త్రీయంగా చెప్పేరోజు త్వరలో వచ్చేటట్టే ఉంది. ఎందుకంటే, ఈ దిశగా తాజా పరిశోధనలు జోరుజోరుగా సాగిపోతున్ాయి.
మనదేశంలో ఎక్కువగా దొరికే కాకరకాయలోని ఔషధగుణాలపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.


షుగర్ వ్యాధికి చేదుమందు ఇస్తారు.. అంటే కాకరకాయ తింటే వ్యాధి తగ్గిపోతుందా? అన్నది తెలుసుకోవ‌డానికి `ప్రాజెక్ట్ బిట్టర్ గార్డ్’పేరిట పరిశోధనలు జ‌రుగుతున్నాయి, త్వర‌లోనే కాక‌ర‌కాయ‌లోని కెమికల్ మిస్టరీని శాస్త్రవేత్తలు చేధించబోతున్నారు.. దీనికోసం భారత్, టాంజానియా, థాయిలాండ్ దేశాలు సంయుక్తగా కృషి చేస్తున్నాయి.
మనదేశంలో మధుమేహవ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోతోంది. మరీ మఖ్యంగా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండటంతో ఇక్కడే ఈ ప్రాజెక్ట్ నిర్వహించాలనుకుంటున్నారు. కాకరకాయలోని చేదు మధుమేహం వ్యాధికి విరుగుడని మనదేశంలో చాలామంది నమ్ముతుంటారు. హెర్బల్ వైద్యంలో కాకరకాయది కీలకమైన స్థానమే. ఔషధాల తయారీ కోసం ప్రత్యేకంగా కాకర తోటలు కూడా పెంచుతున్నారు.
అయితే, కాకరకాయల్లో నిజమైన కాకరకాయ వేరయా -అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, వీరు చెప్పేదీ నిజమే. హైబ్రీడ్ కాకరకాయలు వచ్చేసరికి అసలు కాకర పంట తగ్గిపోతోంది. తరతరాలుగా షుగర్ వ్యాధికి ఔషధంగా వాడుతున్న కాకరకాయకీ, నేటి హైబ్రీడ్ కాకరకాయకీ పోలికే లేదు. హైబ్రీడ్ కాకరకాయల్లో చేదు తక్కువగా ఉంటుంది.. అవి వైద్యానికి పనికిరావు.. అఆగే కాకరలో 10 హైబ్రీడ్ రకాలు ఉంటాయి.. వీటిలో కాకుండా కేవ‌లం నాటు కాకరలోనే ధీటైన ఔషధ గుణాలు క‌లిగి ఉంటాయ‌ని నిపుణులు భావిస్తున్నారు.
కారకాయలోని జర్మోప్లాసమ్ ను పరిశీలించి రసాయనాలేమిటో తేలితే అది ఏమేరకు డయాబెటిస్ కు ఔషధంగా పనికొస్తుందన్నది తేల్చిచెప్పొచ్చు. మొమొర్డిసిన్ అనే రసాయనపదార్ధం ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా ఔషధ గుణాలు పెరుగుతాయి. కాకారలో అనేక రకాలున్నాయి. ఏ రెండు రకాలు ఒకే మోస్తరుగా రసాయన పదార్ధాలను కలిగిఉండవు. ఈ కారణంగానే మధుమేహానికి దివ్యౌషధంగా పనికొచ్చే కాకర ఏమిటో తేల్చాల్సిఉంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. సో…త్వరలోనే డయాబిటిస్ పేషెంట్స్ మరో శుభవార్త వినబోతున్నారనే అనుకోవాలి.






 
 
 


హెయిర్ డై ప్రాణాలుతీస్తుందా?

వయసు పెరుగుతున్నా అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. అయితే, ఇందుకోసం ఉపయోగించే ప్రాడెక్ట్స్ లో కెమికల్స్ ప్రభావం ఏమిటో ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే, హెయిర్ డయిస్ లోని కెమికల్స్ యమడేంజర్ అని తేలిపోయింది. కాబ‌ట్టి హెయిర్ డై చేయించుకోవాల‌నుకున్న‌ప్పుడు త‌స్మాత్ జాగ్ర‌త్త‌..

జుట్టు నెరవడం ఓల్డ్ ఏజ్ కు గుర్తని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసుపైబడుతున్నా జుట్టు నెరవడంలేదు. ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించడంలేదు. ఇదేదో ప్రకృతిచేసిన మాయాజాలం అనుకుంటే పొరపాటే. కెమికల్స్ చేస్తున్న ఇంద్రజాలం. అవును, ప్రపంచమంతటా కోట్లాదిమంది వాడుతున్న హెయిర్ డైయిస్ లోని రసాయనాలే జుత్తు రంగును చిటికలో మార్చేస్తున్నాయి. అయితే, కోట్లాది మంది వాడుతున్న కెమికల్ రసాయనాలతో తయారయ్యే హెయిర్ డయిస్ వాడటం మంచిదేనా? శరీరానికి ఎలాంటి హానీ చేయవా? అన్న ప్రశ్న‌ల‌కు హెయిర్ డ‌యిస్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌నే జ‌వాబు వ‌స్తుంది.. హెయిర్ డయిస్ ను ఉత్పత్తి చేస్తోన్న వందలాది కంపెనీలు క‌నీస భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటించ‌కుండా విచ్చ‌ల‌విడిగా కెమిక‌ల్ ని ఉప‌యోగిస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ హెయిర్ డ‌యిస్ ద్వారా ఏటా కోట్లాది డాల‌ర్ల బిజినెస్ జ‌రుగుతుందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు..
అది బాలనెరుపుకావచ్చు, వృద్ధుల ముగ్గుతల కావచ్చు. ఎక్కడా ఎవరికీ తెలియనంతగా యవ్వనశోభతో కేశాలు నిగనిగలాడుతుంటాయి. దీంతో ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే ఆడామగా మార్కెట్ కి వెళ్ళి హెయిర్ డయిస్ కొనేస్తున్నారు. అవి ఏమేరకు సురక్షితమన్నది ఆలోచించడంలేదు. ఫలితంగానే ఇంగ్లండ్ లోని ఓ 38 ఏళ్ల మహిళ కోమాలోకి వెళ్ళిపోయింది. అంటే… హెయిర్ డయిస్ వాడితే కోమాలోకి వెళ్ళిపోతారా ? మెదడు పనిచేయడం ఆగిపోతుందా ? బతికిబట్టకట్టినా మతిస్థిమితముండదా ? హెయిర్ డయిస్ కిల్లర్ కెమికల్సేనా ? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.



హెయిర్ వేసుకోగానే ఎలర్జీ వచ్చినా, లేదా అంతకంటే ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు కనిపించినా అదంతా హెయిర్ డైలోని రసాయనాలవల్లనే అని గుర్తించాలి. అనేక కంపెనీల హెయిర్ డయిస్ ప్రాడెక్ట్స్ లో PPD అనే రసాయనం ఉంటుంది. దీని పూర్తి పేరు – పారా ఫినైలైన్ డయామిన్ . ఈ రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. 99 శాతం హెయిర్ డయిస్ లో ఈ కెమికల్ ఉంటోంది. ఇది అత్యంత ఘాటైన కెమికల్.
మరి ఇంతటి ప్రమాదకరమైన రసాయనంపై నిషేధం లేదా? ప్రపంచదేశాలు దీన్ని యథేచ్ఛగా ఎందుకు వాడనిస్తున్నాయి ? నిజమే, పిపిడీ అత్యంత ప్రమాదకరమైనదన్న సంగతి తెలుసు. అయినా దీనిపై ఎక్కడా నిషేదం లేదు. ఈ రసాయనాన్ని కలర్ ఫిల్మ్ డెవలప్ మెంట్ లోనూ, రబ్బర్ ఆక్సిడేషన్ లోనూ వాడుతున్నారు.
జట్టుకు రంగేసుకోవడం ఇప్పుడు ఓ సాధారణమైన చర్యగా మారిపోయింది. సునాయాసంగా కేశాలకు రంగు పట్టించుకునే అవకాశం రావడంతో క్రేజ్ పెరిగిపోయింది. జుట్టు రంగు ఏమాత్రం మారినా వెంటనే హెయిర్ డై వాడేస్తున్నారు. మనం వాడే హెయిర్ డైలో విషతుల్యమైన పీపీడీ ఉన్నట్టు ఎలా గుర్తించడం ? హెయిర్ డై ప్యాక్ లో రెండు సీసాలున్నాయా ? అయితే, తప్పనిసరిగా అందులో ఒకటి పీపీడీ అయి ఉంటుంది పీపీడీ తెల్లగా ఉండే ద్రావకం.. దీని గురించి జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే.. పీపీడీ వల్ల ఆస్తమా రావచ్చు. కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడవ్వొచ్చు. సెలూన్లలో పనిచేసేవారు రోజూ పీపీడీ ఘాటు పీల్చడంవల్ల త్వరలోనే అస్వస్థులు కావచ్చు. అయితే, హెయిర్ డయిస్ కంపెనీలు మాత్రం తామ ఉత్పత్తుల వల్ల హాని కలగదనే అంటున్నాయి. మరి ఇదే హెయిర్ డయిస్ లోని రసాయనాలు చేస్తున్న మాయాజాలం మాటేమిటి?

makeup tips

చలికాలం చర్మ తత్వాన్ని బట్టి ఆరోగ్యపరంగానే కాకుండా, మేకప్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

పొడిచర్మం: మేకప్‌కిముందుగా ముఖమంతా మాయిశ్చరైజర్ రాయాలి. టిష్యూపేపర్‌తో అదనపు మాయిశ్చరైజర్‌ని తీసేయాలి. వీరు ఫౌండేషన్‌ని అస్సలు ఉపయోగించకూడదు. వాడితే చర్మం ఇంకా డ్రై అయిపోతుంది. కన్సీలర్, ఆయిల్ మేకప్ వాడాలి. వీటి వల్ల ముఖం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. మస్కారా, లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పెదవులకు లిప్ లైనర్, లిప్ గ్లాస్‌ను ఉపయోగించాలి. బుగ్గలకు బ్లష్‌ను అద్ది, టిష్యూ పేపర్‌తో టచ్ చేస్తూ అదనపు రంగును తీసేయాలి. తర్వాత మ్యాచ్ అయ్యే బిందీ, ఇతరత్రా అలంకరణ జాగ్రత్తలు తీసుకోవచ్చు.



జిడ్డు చర్మం: చలికాలంలో జిడ్డు చర్మం కూడా కొద్దిగా పొడిబారుతుంది. అలాగని వీరు మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్‌ను ముఖానికి ఉపయోగించకూడదు. మేకప్‌కు ముందు ప్రైమర్‌లోషన్(మార్కెట్లో లభిస్తుంది)ను ఉపయోగించాలి. దాని మీద కాంపాక్ట్, ఫౌండేషన్ వాడకుండా వాటర్ బేస్డ్ పాన్‌కేక్స్ కొద్దిగా నీళ్లు కలిపి వాడాలి. తప్పనిసరిగా బ్రష్‌తోనే మేకప్ చేసుకోవాలి. చేత్తో చర్మం త్వరగా జిడ్డు అయి మేకప్‌ను డల్ చేస్తుంది. తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలు తీరుగా తీర్చిదిద్దుకోవాలి.

సాధారణ చర్మం: వీరిది కాంబినేషన్ స్కిన్ అనవచ్చు. వీరికి నుదురు, గడ్డం జిడ్డు అవుతుంది. మిగతా చర్మం పొడిబారుతుంది. అందుకని వీరు మేకప్‌కు ముందు నుదురు, గడ్డం మినహా మిగతా భాగానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నుదురు, గడ్డానికి ప్రైమర్ లోషన్‌ని బేస్‌గా వాడాలి. కళ్లు, పెదవులు, బుగ్గలను అందంగా తీర్చిదిద్దుకోవాలి.

విశేషాలవిందు - వనభోజనం

భారతీయ సంస్కృతి ప్రణాళిక, విస్తరణ క్రమపద్ధతిలో జరిగినట్లు పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల ప్రయోజనాలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. గుడ్డిగా వాటిని ఆచరించటం కాక వాటిలోని పరమార్థాన్ని తెలుసుకుంటే వ్యక్తిత్వవికాసానికి, క్రమశిక్షణకు, సామాజిక వికాసానికి అవి ఎలా పనికి వస్తున్నాయో భావితరాలకు తెలియచేయగలుగుతాం. అటువంటి వాటిలో ఒకటి కార్తిక వనమహోత్సవం.

మాసాలలో ఎన్నో ప్రత్యేకతలు గలదిగా కార్తికమాసానికి విశిష్టస్థానం ఇచ్చారు మనవారు. నెలంతా పాటించవలసిన కొన్ని నియమాలను స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు... అన్నివర్గాలవారికీ సమానంగా నిర్ణయించారు. ఇంతటి సామాజిక సమన్వయం మరే మాసంలోనూ కనపడదు. మతపరమైన భేదాలు లేకుండా శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన నెల కార్తికం. సూర్యోదయానికి ముందు స్నానం, తరవాత ఉపవాసం, దైవదర్శనం, దీపారాధన, వనసమారాధన ధర్మాలు, పురాణశ్రవణం... ఇవన్నీ ప్రధానమైన కార్తిక వ్రతనియమాలు. అన్నీ ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు, సామాజిక సమైక్యతకు పనికివచ్చేవే. ముఖ్యంగా అందరూ వనభోజనాలకు వెళ్లటం ఈ నెల ప్రత్యేకం. అయితే అదొక ఆటవిడుపుగా, సరదాగా యువతరం భావిస్తోంది.

వనభోజనాలు ఎందుకు ఏర్పడ్డాయో, ఎలా చెయ్యాలో తెలుసుకోవటం అవసరం. లేకపోతే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు, వారికి తమ వైభవం చూపి ఏడిపించటానికి వనభోజనాలకు వెళ్లిన కౌరవులు గంధర్వుని చేతిలో చిక్కుకొని పాండవుల ముందు అవమానాలపాలైనట్లు కథ విషాదభోజనం అవుతుంది. సద్బుద్ధితో, భక్తి శ్రద్ధలతో వనభోజనాలకు వెళితే ‘విశేషభోజనంబు’ అవుతుంది. కార్తికమాసంలో తోటలకు వెళ్లాలి. ఉసిరిచెట్టు కింద శివకేశవులను పూజించాలి. అంతా కలసిమెలసి... అక్కడ వండుకున్న వంటలను ఉల్లాసంగా భుజించాలి. ఆటలు, పాటలు, పురాణశ్రవణం వంటివి చేయాలే తప్ప చెడ్డపనులు ఏవీ చేయకూడదు. దుస్సాహసాలు చేసి కౌరవుల్లాగ ప్రాణాలమీదికి తెచ్చుకోకూడదు.

వృక్షాలలో దైవత్వాన్ని చూసి, పూజించాలి. ప్రకృతితో మమేకం కావాలి. భ్రాతృత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా జరుపుకోవాలి. కక్షలు, కార్పణ్యాలకు వనాలు కేంద్రాలు కాకూడదు. స్కాందపురాణంలో కార్తిక మాహాత్మ్యంలో వనభోజనాల వల్లనే పోయే కొన్ని పాపాలు చెప్పారు. పూజ, ధ్యానం, జపం, తపం చేసేటప్పుడు మధ్యలో ఆపి ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా చేసి ఉంటే దాని కారణంగా వచ్చిన పాపం పోవాలంటే కార్తికంలో వనభోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు, పితృకార్యం చేసేటప్పుడు, అశుచిగా ఉన్నవాళ్లతో... మాట్లాడకూడదు. తెలిసీతెలియక అలా వచ్చిన పాపం ఈ వనభోజనంతో పోతుంది. అందరూ తప్పనిసరిగా వన భోజనాలకు వెళ్లితీరాలనే నిబంధన వల్ల ప్రకృతి పరిశీలన, సామాజిక అవగాహన, వినోదం, విహారం వంటి లాభాలు తప్పక కలుగుతాయి. ఏకాగ్రతతో పని చేసేటప్పుడూ మధ్యలో మాట్లాడకూడదు. వృత్తి, ప్రవృత్తి వ్యవహార దక్షతల్లో ఫోన్ మాట్లాడటం, టీవీలు చూడటం వంటివి తెలిసిందే. అందువల్లే వనభోజనాలు అందరికీ అత్యవసరం.

- డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్
చలికాలమైనా సరే రోజూ గంట సేపు జిమ్‌లో వ్యాయామం చేస్తాను లేదా స్విమ్మింగ్‌పైన దృష్టిపెడతాను. నా భోజనాన్ని మూడు పూటలా కాకుండా, రోజులో కొద్దికొద్దిగా ఆరుసార్లు తింటాను. ఏడుగంటలు నిద్రకు కేటాయించుకుంటాను. ఆరోగ్యానికి తీసుకునే జాగ్రత్తలే నా అందాన్ని కాపాడుతున్నాయి.

 - బిపాసాబసు, బాలీవుడ్ నటి
బ్యూటీ టిప్స్
మేకప్ పూర్తిగా తొలగించిన తరువాత గోరువెచ్చటి నీటిలో దూది లేదా మెత్తని కాటన్ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.

మేకప్ తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ని తప్పక రాసుకోవాలి. దీనివల్ల ముఖ చర్మం పొడిబారకుండా, నిస్తేజంగా మారకుండా ఉంటుంది.

మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్-అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. అప్పుడు మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా  తడుముకోవాల్సిన అవసరం ఉండదు

manchi maata

 

టీనేజ్ లో జుట్టు రాలే సమస్య, చుండ్రుకు అడ్డుకట్ట..

ఈ మధ్య కాలంలో జుట్టు సమస్యలతో తరచూ బ్యూటీక్లినిక్‌లకు, డాక్టర్ల వద్దకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్, డిగ్రీ చదివే అమ్మాయిలలో సైతం జుట్టు రాలిపోవడం ఒక సమస్యగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జుట్టు అంటే.. గోళ్ల మాదిరిగానే వెంట్రుకలు లేదా కేశాలు అనేవి చర్మం అనుబంధ నిర్మాణాలు అనవచ్చు. చర్మం కింది పొరను ఎపిడెర్మిస్ అంటారు. ఈ ఎపిడెర్మిస్‌లో రక్తనాళాలు ఉండవు. స్వేద గ్రంథుల నాళాలు, కేశాలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకుని చర్మంపైకి వస్తాయి.
కేశాల విషయంలో శ్రద్ద తీసుకోకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియల్లో స్తబ్ధత. కొన్ని రకాల ఇన్ఫక్షన్లు, చుండ్రుకు కారణమవుతాయి. అదిక చెమట, అపరశుభ్రత, అలర్జీ, ఒత్తిడి, ఆందోళన, అధిక తీపి, కొవ్వు పధార్థాలను తినడం. పోషకాహారలోపం వంటివి చుండ్రు సమస్యకు దారితీస్తాయి. శిరోజాలకు సౌందర్య ఉత్పత్తులను అధికంగా వినియోగించడం, ఎలక్ట్రిక్ మెషియన్లను ఉపయోగించడం చుండ్రు సమస్యకు దారితీస్తాయి. చుండ్రును నివారించాలంటే కుదుళ్లలో ఉండే అసిడీక్ ఫీహెచ్ స్థాయి సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి.
Hair Care Tips Preventing Hair Loss Teenagers
1. అరకప్పు నీళ్ళల్లో రెండు స్పూన్ల వెనిగర్ తో కలిపి దూదితో శిరోజాల మొదళ్లలో చర్మం పై రాసుకోవాలి. ఇలా వారనికో రోజు నిద్రించడానికి ముందుగా రాసుకుని మార్నాడు ఉదయం వెనిగర్ కలిపిన నీటితో తలస్నానం చేయాలి. ఇలా కనీసం మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.

2. రెండు గుడ్ల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కలుపుకోవాలి. తలను నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని తలపై రాసుకుని మర్థన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలేసమస్య తగ్గిపోతుంది.

3. గోరువెచ్చని కొబ్బరి నూనె లేక ఆముదాన్ని వారానికి రెండుసార్లు రాత్రి నిద్రించడానికి ముందుగా తలకు పట్టేంచుకోవాలి. తర్వాత వేళ్లతో తలపై గుండ్రంగా మర్ధన చేసుకోవాలి. ఇలా అరగంట పాటు చేసి మర్నాడు ఉదయాన్నే షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తలపొడిగా మారకుండా ఉంటుంది. చుండ్రు తగ్గిపోతుంది.

4. కొబ్బరినూనెకు ఆలీవ్ నూనెను కలిపి తలస్నానం చేయడానికి అర్థగంట ముందు తలకు రాసుకుని తేలికగా మర్థన చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేస్తే సరి.

5. హెన్నా కూడా చుండ్రుని నివారించడంలో చక్కగా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు హెన్నాని తలకు పట్టించి మార్నాడు తలస్నానం చేయండి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వెనిగర్ కలిపి దాన్ని తలపైన రాసుకుని మర్ధన చేసుకోవాలి. అర్థగంట తర్వాత తలస్నానం చేయాలి.

6. ఎండిన నారింజ పండు తొక్కలు, ఉసిరికాయ పెచ్చలు, కుంకుడుకాయలు, శీకాయలను సమంగా కలిపి నీళ్లకు చేర్చి మరిగించి తలస్నానం కోసం వాడాలి. దీనికి ముందు పుల్లని మజ్జిగను తలకుపట్టించాలి. ఇలా చేస్తే తప్పకుండా ఫలితం కనుబడుతుంది.


 

అందమైన ‘కళ్ళు’.. సౌందర్యం వీటితో సొంతం..

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారు క్రమం తప్పకుండా కళ్లను రెప్పలాడిస్తూ ఉండాలి. అలా చేయకపోతే కళ్లు పొడిబారిపోయి కంటిచూపుపై ప్రభావం పడుతుంది. కళ్లపై మరీ ఎక్కువ లైటింగ్ పడకుండా చూసుకోవాలి. అలాగే చదువుతున్నప్పుడు సరిపడా కాంతి ఉండేలా జాగ్రత్తపడాలి. లేకుంటే కళ్లు అధిక శ్రమ, ఒత్తిడికి లోనై చూపు మందగిస్తుంది. కళ్లకు సరైన విశ్రాంతి లేకపోయినా, ఎక్కువ అలసట, ఒత్తిడికి లోనైనా కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మూడు బాదం గింజలను పాలతో కలిపి పేస్ట్‌లా చేసి కంటికింది భాగంలో రాసుకుని కొంచెంసేపు ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా కళ్లకింద ఏ క్రీమునైనా ఉంగరం వేలుతో రాసుకోవడం మంచిది.
కళ్లు దురదపెట్టినా, మంటపెట్టినా ఎట్టిపరిస్థితుల్లోనూ నలపకూడదు. దానివల్ల కళ్లల్లోని సున్నితత్వం దెబ్బతింటుంది. చేతులకున్న బ్యాక్టీరియా కళ్లలోకి చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. టీవీని కనీసం పది అడుగుల దూరం నుంచి చూడడం క్షేమకరం. చదివే పుస్తకాన్ని కళ్లకు రెండు అడుగుల దూరం పెట్టుకోవడం మంచిది. గోరువెచ్చటి పాలలో దూదిని ముంచి రెండు కళ్లపై పెట్టుకుని పదిహేను నిమిషాలపాటు ఉంచుకోవాలి. అలసిన కళ్లకు విశ్రాంతికోసం చల్లటి పాలలో దూదిని ముంచి రెండు కళ్లపై పదినిమిషాలపాటు ఉంచుకుంటే మంచిది.

రాత్రి నిద్రించడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎటువంటి క్రీము రాసుకోకపోవడమే మేలు. కళ్లు అలసటకు లోనైనప్పుడు విశ్రాంతి కోసం కనుగుడ్లను కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అలా తిప్పుతూ ఉండమని యోగా నిపుణుల సూచన. కళ్లకు, కళ్లచుట్టూ ఉండే కండరాలకు తగినంత విశ్రాంతి కోసం కళ్లు మూసుకుని ప్రశాంతమైన మనస్సుతో నచ్చిన విషయాలను గుర్తుచేసుకోవాలి.
తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి దూరంగా చూడాలి ఇలా నాలుగైదు సార్లు చేస్తే కళ్లకు ఎంతో ఆరోగ్యం. చేతిలో ఓ పెన్సిల్‌ను పట్టుకుని దాన్ని నెమ్మదిగా ముక్కు దగ్గరకు తీసుకురావాలి. ఆ సమయంలో కంటిచూపును పెన్సిల్‌మీద కేంద్రీకరించాలి. ఇలా పలుమార్లు చేయడంవల్ల కళ్లకు మంచి వ్యాయామం అవుతుంది. దీనివల్ల కంటిచూపు మసకబారకుండా నివారించుకోవచ్చు.
క్రమం తప్పకుండా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. తలనొప్పి రావడానికి ఒత్తిడి, కంటి చూపులో తేడాలు. మైగ్రేయిన్, నరాల సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో కారణాలు దోహదం చేస్తాయి. కళ్లు పొడిబారుతున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. దీనికి పలు ఆరోగ్య సమస్యల నివారణ కోసం వేసుకునే మందులు కారణమవుతాయి. కంటికి సంబంధించి ఏ సమస్య లేకపోయినా ప్రతి ఆరునెలలకోసారి కంటిడాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.
ఐ మేకప్ కోసం పౌడర్ కంటే క్రీము వాడుకోవడం మంచిది. పౌడర్ అయితే కంట్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కళ్లకు ఆరోగ్యకరం. బొప్పాయి, గుడ్లు, చేపలు, పాలు, క్యారట్, కొత్తిమీరలో విటమిన్-ఎ ఎక్కువగా లభిస్తుంది. ఒక ఉసిరికాయను రాత్రంతా నీళ్లలో నానవేసి ఉదయం లేచిన తర్వాత ఆ నీటితో కళ్లను కడుక్కుంటే చాలా మంచిది.

బొప్పాయి


బొప్పాయి: బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.



క్యారెట్


క్యారెట్: క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చరమ సౌందర్యాన్ని పెంచుతుంది. క్యారట్లలో ఉండే ఫాల్ కారినాల్ .. కాన్సర్ ను నిరోదిస్తుంది ,-- ఉడక బెట్టి తినాలి . యాంటి ఆక్షిదేంట్ గా పనిచేసి శరీరము లోని చెడు పదార్ధాలను (FreeRadicles) తొలగిస్తుంది , శరీర వ్యాదినిరోధక శక్తి ని పెమ్పొందిస్తుడి.



గుడ్డు


గుడ్డు: ఇది శాకాహారం కాదు. గుడ్డులోని తెల్ల సొన చర్మ సంరక్షణకు ఒక మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగ పడుతుంది. పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది . పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు . మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి . కండపుష్టికి , కండర నిర్మాణానికి ఎంతో మేలు. కళ్ళు కావలసిన పోషణను అందిస్తుంది.



పాలు


పాలు: పాలు శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. మూడు ప్రోటీనులూ, ఆరు విటమినులూ, ఇరవై ఐదు ఖనిజాలు గల ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంది. శ్వాస సంబంధిత వ్యాధులను తొలగిస్తాయీ. స్తన్యములను వృద్ధిచేయును. శరీరానిని కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడములో పాలు తోడ్పడుతుంది



చేపలు


చేపలు: చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. కాబట్టి కళ్ళు ఉపయోగ పడే విటమిన్ ఎను పుష్కలంగా అందిస్తుంది.


కురుల సౌందర్యానికి కావాలి మెరుగైనా వంటింటి చిట్కాలు

జుట్టు మెరుస్తూ.. అందంగా కనబడాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మహిళల కంటే పురుషులే ఎక్కువ కేర్ తీసుకొంటుంటారు. ఎందుకంటే స్త్రీల కంటే పురుషుల్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం, ఆహారం, హార్మోన్లు, వాతావరణం, కాలుష్యం, జీన్స్ కారణంగా హెయిర్ ఫాల్ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంటుంది. వాటికోసం చాలా రకాల కండీషనర్స్ ను, షాంపూలను తరచూ మార్చుతుంటారు కూడా.. అయితే వాటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇంటి చిట్కాలను పాటించినట్లైతే తప్పకుండా ఫలితం ఉంటుంది.

. డైయట్: అందంగా హెయిర్ ఉండాలనుకొనే వారికి తీసుకొనే ఆహారంలో మార్పులు తప్పనిసరి. మీరు తీసుకొనే ఆహారం బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో.. అలాగే మీరు తీసుకొనే ఆహారం బట్టే కేశసౌందర్యం ఆధారపడి ఉంటుంది. అందుకు పండ్లు, కూరగాయలు, పోటీన్లు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కురులకు కావలసినంత తేమను అందించడమే కాకుండా అవసరమైన పోషకాలను అందించి మీ జుట్టును ఆరోగ్యంగా మృదువుగా ఉంచుతుంది.


2. గుడ్డులోని పచ్చసొన:
జుట్టు రాలడానికి అరికట్టుటలో ఇది ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. గుడ్డులోని పచ్చసొనను తలమాడుకు బాగా మర్ధన చేయడం వల్ల హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. గుడ్డులోని పచ్చసొనను తలకు బాగా పట్టించి అర గంట నుండి గంట పాటు అలాగే వదిలేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే చాలు మీరు మంచి ఫలితాన్ని పొందవచ్చు.


3. ఆయిల్ మసాజ్: వేడి నూనె శరీరారనికే కాదు తలకు కూడా పట్టించి మన పూర్వీకుల తలంటు పోసుకొనేవారు. ఇలా చేస్తే చర్మ వ్యాదు దరిచేరవని తలకు శాంతం చేకూరుతుందని వారి నమ్మకం. కాబట్టి తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగాలున్నాయి. అందుకు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా కాస్ట్రాల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మరసం, కొద్దిగా వెనిగర్ కలిపి తలకు పట్టించి కొద్ది సేపటి తర్వాత తలస్నానం చేయడం వల్ల తలలోని చుండ్రు వదిలిపోతుంది.

4. ఆమ్లా(ఉసిరి): హెయిర్ కేర్ లో ముఖ్యంగా ఉపయోగించేది ఆమ్లా (ఉసిరి). దీన్ని ఆనాది కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఉసిరి రసాన్ని లేదా ఉసిరితో తయారు చేసినటువుంటి నూనె కానీ జుట్టు ఆరోగ్యానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఇది ఎర్రగా ఉన్న జుట్టుకు మాత్రమే కాదు కురులకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుంది.

5. నీమ్(వేప): జుట్టు సంరక్షణలో వేప కంటే మంచి ఔషదం మరికటి ఉండదనే చెప్పాలి. ఎందుకంటా చాలా మంది తలలో చుండ్రు, దురద, పేను సమస్యతో బాధపడే వారికి వేప చాలా బాగా పనిచేస్తుంది. వేప ఆకును మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. అలాగే వేప నూనెను కూడా అప్పుడప్పుడు తలకు పట్టించడం వల్ల తలలోని ఏదేని బ్యాక్టీరియాను నశింపచేసి, కురులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. అలోవెరా(కలబంద): అలోవెరా చర్మ సౌందర్యానికే కాదు జుట్టు పోషణకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది ప్రకతి సిద్దంగా లభించే సహజ పదార్థం. ముందుగా తలను చల్లటి నీటితో శుభ్రం చేసుకొని తర్వాత అలోవెరా జెల్ ను కురులకు పట్టించాలి. ఇది జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది.

7. మయోనైజ్: మార్కెట్లో దొరికేటటువంటి మయోనైజ్ ను తీసుకొచ్చి దీన్ని కొబ్బరి నూనె, లేదా బాదాం నూనె లేదా ఆలివ్ నూనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ నేచురల్ కండీషనర్ ను పది నుండి ఇరవై నిముషాల పాటు ఉంచి తర్వాత తలస్నానం చేస్తే కురులు మెరుస్తూ ఉంటాయి.


8. బీర్: నేటి జనరేషన్ లో హెయిర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ముందకాలం నాటి పదార్థాలే కాదు కొత్తగా జుట్టుకు సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి బీర్. బీర్ ను తలకు పట్టించడం మంచి మంచి లుక్ ఇవ్వడమే కాకుండా మంచి షైనింగ్ తో సిల్కీగా మారుతాయి.
కురుల సంరక్షణలో ఈ చిట్కాలను పాటించి, కురులకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా కృత్రిమ మరియు రసాయన పదార్థాలకు దూరంగా ఉంటూ డబ్బును ఆదా చేయవచ్చు....