all

Wednesday, November 21, 2012

టీనేజ్ లో జుట్టు రాలే సమస్య, చుండ్రుకు అడ్డుకట్ట..

ఈ మధ్య కాలంలో జుట్టు సమస్యలతో తరచూ బ్యూటీక్లినిక్‌లకు, డాక్టర్ల వద్దకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్, డిగ్రీ చదివే అమ్మాయిలలో సైతం జుట్టు రాలిపోవడం ఒక సమస్యగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జుట్టు అంటే.. గోళ్ల మాదిరిగానే వెంట్రుకలు లేదా కేశాలు అనేవి చర్మం అనుబంధ నిర్మాణాలు అనవచ్చు. చర్మం కింది పొరను ఎపిడెర్మిస్ అంటారు. ఈ ఎపిడెర్మిస్‌లో రక్తనాళాలు ఉండవు. స్వేద గ్రంథుల నాళాలు, కేశాలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకుని చర్మంపైకి వస్తాయి.
కేశాల విషయంలో శ్రద్ద తీసుకోకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియల్లో స్తబ్ధత. కొన్ని రకాల ఇన్ఫక్షన్లు, చుండ్రుకు కారణమవుతాయి. అదిక చెమట, అపరశుభ్రత, అలర్జీ, ఒత్తిడి, ఆందోళన, అధిక తీపి, కొవ్వు పధార్థాలను తినడం. పోషకాహారలోపం వంటివి చుండ్రు సమస్యకు దారితీస్తాయి. శిరోజాలకు సౌందర్య ఉత్పత్తులను అధికంగా వినియోగించడం, ఎలక్ట్రిక్ మెషియన్లను ఉపయోగించడం చుండ్రు సమస్యకు దారితీస్తాయి. చుండ్రును నివారించాలంటే కుదుళ్లలో ఉండే అసిడీక్ ఫీహెచ్ స్థాయి సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి.
Hair Care Tips Preventing Hair Loss Teenagers
1. అరకప్పు నీళ్ళల్లో రెండు స్పూన్ల వెనిగర్ తో కలిపి దూదితో శిరోజాల మొదళ్లలో చర్మం పై రాసుకోవాలి. ఇలా వారనికో రోజు నిద్రించడానికి ముందుగా రాసుకుని మార్నాడు ఉదయం వెనిగర్ కలిపిన నీటితో తలస్నానం చేయాలి. ఇలా కనీసం మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.

2. రెండు గుడ్ల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కలుపుకోవాలి. తలను నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని తలపై రాసుకుని మర్థన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలేసమస్య తగ్గిపోతుంది.

3. గోరువెచ్చని కొబ్బరి నూనె లేక ఆముదాన్ని వారానికి రెండుసార్లు రాత్రి నిద్రించడానికి ముందుగా తలకు పట్టేంచుకోవాలి. తర్వాత వేళ్లతో తలపై గుండ్రంగా మర్ధన చేసుకోవాలి. ఇలా అరగంట పాటు చేసి మర్నాడు ఉదయాన్నే షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తలపొడిగా మారకుండా ఉంటుంది. చుండ్రు తగ్గిపోతుంది.

4. కొబ్బరినూనెకు ఆలీవ్ నూనెను కలిపి తలస్నానం చేయడానికి అర్థగంట ముందు తలకు రాసుకుని తేలికగా మర్థన చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేస్తే సరి.

5. హెన్నా కూడా చుండ్రుని నివారించడంలో చక్కగా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు హెన్నాని తలకు పట్టించి మార్నాడు తలస్నానం చేయండి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వెనిగర్ కలిపి దాన్ని తలపైన రాసుకుని మర్ధన చేసుకోవాలి. అర్థగంట తర్వాత తలస్నానం చేయాలి.

6. ఎండిన నారింజ పండు తొక్కలు, ఉసిరికాయ పెచ్చలు, కుంకుడుకాయలు, శీకాయలను సమంగా కలిపి నీళ్లకు చేర్చి మరిగించి తలస్నానం కోసం వాడాలి. దీనికి ముందు పుల్లని మజ్జిగను తలకుపట్టించాలి. ఇలా చేస్తే తప్పకుండా ఫలితం కనుబడుతుంది.


 

No comments: