సాధారణంగా మనం ప్రతి నిత్యం వినియోగించే టూత్ పేస్ట్ మన పళ్ళకు రక్షణ కలిగించడమే కాకుండా నోటిలోని క్రిములును, నోటి దుర్వాసన నుండి కాపాడుతుంది. టూత్ పేస్ట్ దంతాల పటిష్టతకు, తెల్లదనం, నోటి పరిశుభ్రతకు బాగా ఉపయోగపడతుంది. టూత్ పేస్ట్ ఒక్క నోటి పరిశుభ్రతకు మాత్రమే కాదు, మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే కొన్ని వస్తువులను మిళమిళ తళతళలాడేలా చేస్తుంది.
1. ఇంట్లోని బంగారు, సిల్వర్ వస్తువును శుభ్రపరచడానికి ఇది ఒక మంచి సాధనం. టూత్ పేస్ట్ ను బంగారు, సిల్వర్ వస్తువుల మీద రాసి, ఐదునిముషాల తర్వాత రుద్ది కడగడంతో కొత్తవాటిలా తళతళ మెరుస్తాయి.
2. టూత్ పేస్ట్ తో లెదర్ షూలను శుభ్రం చేయవచ్చు. లెదర్ షూల మీద ఏదైనే మరకలు పడినప్పుడు, ఒక క్లాత్ మీద టూత్ పేస్ట్ వేసుకొని, లెదర్ షూ మీద మరక ఉన్నచోట రుద్ది తుడిచినట్లైతే, మరక పూర్తిగా తొలగిపోతుంది.
3. డివిడిలు-సీడీలు మనందరికి సుపరిచితమే వాటిని ఎన్ని విధాలుగా భద్రపరచినప్పటికి గీతలు లేదా మరకలు ఎర్పడటం సహజం. మీరు వినియోగించే టూత్ పేస్ట్‌తో మీ సీడీలను క్లీన్ చేసుకోవచ్చు. తరచూ ఇలా చేయటం వల్ల మీ సీడీల మన్నిక రెట్టింపవుతుంది.
4. బాల్ పాయింట్ ఇంకు మరకలు పోవాలంటే టూత్ పేస్ట్ కాని, నిమ్మరసం కాని, బ్రాందీ లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దాలి.
5. బట్టల మీద పండ్ల రసాల మరకలు పడితే మరక పడిన చోట టూత్ పేస్ట్ తో రుద్ది తరువాత సబ్బుతో ఉతికితే మరకలు పోతాయి.
6. లెదర్ బ్యాగులు తూట పేస్ట్ తో రుద్ది పదినిమషాలయ్యాక పొడి వస్త్రంతో తుడిస్తే దుమ్ము, మురికి వదిలి శుభ్రపడతాయి.
7. గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి. అలాగే మిల్క్ బాటల్స్ కూడా.. కొన్ని వారాల తర్వాత మిల్క్ బాటిల్స్ దుర్వాస వస్తుంటాయి. అటువంటప్పుడు టూత్ పేస్ట్ వేసి వేడి నీళ్ళు పోసి బాగా షేక్ చేసి కడిగితే దుర్వాసన దూరం అవుతుంది.
8. ఐరన్ లేదా మెటల్ వస్తువులు తుప్పుపట్టి ఉంటే వాటిని శుభ్రం చేయడానికి టూట్ పేస్ట్ బెస్ట్.
9. డైమండ్స్ తో పొదిగి ఉన్న నగలు కొంత కాలం తర్వాత తిరిగి అదే షైనింగ్ రావాలంటే, వాటి మీద టూత్ పేస్ట్ రాసి, సున్నితమైన టూత్ బ్రష్ తో రుద్ది కడగాలి.
10. వాచ్ బ్యాండ్స్ లేదా బ్యాండ్స్ ప్రతి రోజూ వినియోగించడం వల్ల బాగా మరకపట్టి ఉంటాయి కాబట్టి చిన్న కాటన్ వస్త్రంలో పేస్ట్ వేసి వేడి నీళ్ళలో వేసి అందులో వాచ్ బ్యాండ్స్ ను నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.

No comments:
Post a Comment