all

Wednesday, November 21, 2012

మగవారి సౌందర్యం పెంపొందిచుకోవడానికి మేకప్ ట్రిక్స్...

సౌందర్యం అనేది ఒక్క మహిళలకు మాత్రమే కాదు. మగవారు కూడా తమ సౌందర్యాన్ని ఆహార్యాన్ని కాపాడుకోగల శక్తిని కలిగి ఉన్నారు. సాధారణంగా మేల్ నటులు, సెలబ్రెటీలు మాత్రమే మేకప్ వేసుకొంటారు అనేది వాస్తవమే అయినా.. సాధారణ వ్యక్తులు కూడా తమ సౌందర్యం పెంపొందించుకోవడానికి మేకప్ వేసుకోవచ్చు. చాలా మంది మేకప్పా అని సిగ్గుపడుతారు లేదా మగవారేంటీ.... మేకప్ ఏంటీ అని వెక్కిరిస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో మహిళలకు ధీటుగా పురుషులు కూడా అందంగా కనబడటానికి కొన్ని కొన్ని మేకప్ చిట్కాలను ఉపయోగిస్తుంటారు. వారు అందంగా కనబడటం కోసం కొన్ని రకాల ఫేయిర్ నెస్ క్రీమును కూడా కొంటుంటారు. అందుకు వారు ఎంత మాత్రం సిగ్గుపడరు. ఈ మాడ్రెన్ యుగంలో కొంత మంది పురుషులు ఫేషియల్స్ మరియు వాక్సింగ్ తో ఉదరభాగంలో నున్న హెయిర్ ను తొలగించుకోవడం వంటి వాటిని కూడా చేయడం మొదలు పెట్టారు. అందరిలో తామూ అందంగా కనబడేందుకు ఇష్టపడుతున్నారు. కాబట్టి పురుషులు కూడా ఎందుకు మేకప్ వేసుకోకూడదు...?
మేకప్ సామాగ్రిలో మహిళలకు సంబంధినవన్నీ పురుషులకు సరిపోవు. ఎందుకంటే వారి చర్మం రఫ్ గా ఉడటం వల్ల వారికోసమనే కొన్ని ప్రత్యేకంగా తయారు చేయబడినవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అందులో కొన్నింటిని మాత్రం వారు సెలక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి పురుషులకు ఉపయోగపడే కొన్ని మేకప్ ట్రిక్స్....
5 makeup tricks that men can use

కన్సీలర్: కన్సీలర్. పురుషులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సాధారణ మేకప్. చాలా మంది టీవీ స్టార్స్, మరియు పిల్మిం స్టార్ అందరూ ముఖం మీద ఉన్న చర్మంలోపాలను దాచడానికి దీన్ని తప్పనిసరిగా వినియోగిస్తులంటారు. సాధారణంగా కళ్ల క్రింద నల్లటి వలయాలు కనిపించకుండా కల్సీలర్లు వాడుతారు. లేత బంగారు రంగు కన్సీలరయితే నల్లటివలయాల్ని బాగా కప్పేస్తుంది. లేతరంగు కన్సీలర్ వాడితే బాగుంటుంది. ఫౌండేషన్ వేసుకున్నా లేకపోయినా కన్సీలర్ వాడొచ్చు. చర్మం అంతా ఒకటే రకంగా కనిపించాలంటే, కన్సీలర్‌ రాయాలి.
ఫౌండేషన్: పురుషులు ఫౌండేషన్ కాస్మోటిక్ వాడటం అనేది... కన్సీలర్ వంటిదే, అయితే శరీరపు ఛాయను బట్టి ఫౌండేషన్ రంగును ఎంచుకోవాలి. అందంగా కనబడాలంటే మేకప్ లో మొదట ఫౌండేషన్ తప్పనిసరి. పౌండేషన్ మృదువుగా వుండేలా చూసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసేటప్పుడు అంతటా సమరీతిగా వుండేలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖంపై మొటిమలు, మచ్చలు, కళ్లకింది నల్లటి వలయాలను కప్పిపుచ్చుకునేందుకు చాలామంది ఫౌండేషన్‌ను మందంగా రాసుకుంటుంటారు. అయితే దీనివల్ల అనుకున్న ఫలితం రాదు. కాబట్టి అలాంటి వారు ఇకమీదట కన్సీలర్‌ను వాడిచూస్తే తేడా ఇట్టే అర్థమవుతుంది. చిన్న మొటిమను కనిపించకుండా చేయాలంటే, ఫౌండేషన్‌కు బదులుగా ముందు కన్సీలర్‌ వాడాలి. ముడతలు కనిపించకుండా ఉండేందుకు మాయిశ్చరెైజర్‌, ఫౌండేషన్‌లను కలిపి రాసుకుంటే సరిపోతుంది.
కోల్: మగవారి కళ్ళ ఆకారాన్ని అందంగా కనిపించేలా చేసే ముదురు రంగులో ఉన్న కోల్. ప్రస్తుత కాలంలో చాలా మంది మోడ్రన్ గా తయారు అయ్యేవారు ఈ కోల్ మైనపు ముక్కను కళ్ళకు అప్లై చేస్తుంటారు. దీన్ని కళ్ళకు రాయడం వల్ల కళ్ళకు ఒక అందమైన ఆకారన్ని ఇస్తుంది.
గోల్డ్ డస్ట్: మహిళలు మేకప్ లో భాగం అయిన గోల్డ్ డస్ట్ మగవారిని మంచి షైనింగ్ తో కనబడేలా చేస్తుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల గ్లాసీ లుక్ తో అందంగా కనబడుతారు.
బాడీ మేకప్: మహిళలతో పోల్చితే పురుషులకు మరింత ఎక్కువగా బాడీ మేకప్ అవసరం. మహిళలు సాధారణంగా బాడీమేకప్ చేసుకొంటే పురుషులు మరికొంత ఎక్కువగా బాడీ బిల్డ్ చేసి శరీర సౌష్టం బాగా దృడం, ఆకర్షనీయంగా కనబడేలా మెయింటైన్ చేయాలి. కాబట్టి పురుషు మేకప్ పరిమితమే అయితే ఇంకా విశ్లేషిస్తూనే ఉన్నారు. కాబట్టి మగవారు కూడా మేకప్ వేసుకోవడానికి సిగ్గు పడనవసరం లేదు సందర్భాన్ని బట్టి లేదా అవసరాన్ని బట్టి మేకప్ వేసుకోవడంతో తమ అందాన్ని పెంపొందించుకోవచ్చు.

No comments: