కాటన్ చీరలంటే చాలా మంది మహిళలకు ఎక్కవ ఇష్టం. ముఖ్యంగా మన భారతీయులు చాలా మంది కాటన్ చీరలను, కాటన్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూసిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్ దుస్తులు. ఆ మాటకొస్తే ఏడాది పొడవునా కాటన్ దుస్తులు ధరించడానికి అనువుగానే ఉంటుంది. మన దక్షిణ భారతంలో వాతావరణం మిగతా కాలాల్లో ఎలా ఉన్నా వేసవి నాలుగు నెలలూ కాటన్ దుస్తులు మాత్రమే వాడుతుంటారు చాలా మంది. ఎండవల్ల కలిగే ఉక్కపోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించుకోవటానికి కాటన్ దుస్తులని ధరించడం ఎక్కువ.
టీనేజ్ నుండి మధ్య వయస్సు వారికీ వయస్సు మళ్లిన వారికీ అందరికీ అన్ని సమయాల్లో నచ్చేవి కాటన్ డ్రస్లులే. అందులోనూ వేసవిలో ప్రతి ఒక్కరి చూపూ కాటన్ దుస్తులవైపే. లైట్ వెయిట్, క్రేప్, డెనిమ్, స్టోన్ వాష్ డ్రస్ లిచ్చే అందం ఒక ఎత్తయితే, కాటన్ తో వచ్చే అందం దానికిదే సాటి. కాటన్ దుస్తులలోనే హుందాతనం లభిస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
అయితే కొంత మంది మాత్రం వాటిని మెయింటై చేయడం కష్టమని ఇష్టం ఉన్నా వాటిని వినియోగించుకోలేక పోతున్నామంటారు. కొంత మంది అభిప్రాయం ప్రకారం కాటన్ చీరలను తీసుకొచ్చినప్పుడు ఉండే లుక్ ఒక్క వాష్ తోటే పొతుందని వాటిని ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఏమీ జరగకుండా జాగ్రత్తలను పాటిస్తే కాటన్ చీరను కూడా స్టిఫ్ గా ఎప్పుడూ కొత్తవాటిలా మెరిపించవచ్చు. అదెలాగో చూద్దాం...
ముందుగా ఒక కాటన్ డ్రస్ లకు కొన్నంత డబ్బు మొయింటెనెన్స్ కు ఖర్చు చేయాలన్న భయాన్ని మనుస్సులోంచి తొగిలగించాలి. ఉతకడం, ఐరన్ చేయడం అన్నీ ఇక తేలికే. మొదటగా కాటన్ బట్టలను ఉతికేటప్పుడు చిన్న చిట్కా పాటించండి. బకెట్ గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు కొద్దిగా వేసి ఒకేసారి మూడు కాటన్ చీరలను నానబెట్టాలి. ఎక్కువ సేపు నానబెట్టకుండా పది, పదిహేను నిమిషాలకే ఉతికేయాలి. దాంతో కాటన్ చీరలకున్న అందం, రంగు పోవు. మొదటి సారి ఇలా చేయడం వల్ల తర్వాత తర్వాత ఉతుకులకు ఎటువంటి హానీ జరగకుండా కాటన్ చీరను కాపాడుకోవచ్చు.
సోప్ నట్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించడం వల్ల కూడా కాటన్ చీరలు ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. సోప్ నట్స్ నీళ్లలో వేసి అందులో చీరలను నానబెట్టి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. మార్కెట్లో లభించే లిక్విడ్ స్టార్చ్ లో కాటన్ చీరలను నానబెట్టుట వల్ల అవి ముడతలు లేకుండా స్టిఫ్ గా ఉంటాయి.
చీరలను ఉతికి శుభ్రపరిచిన తర్వాత స్టార్చ్(గంజి) పెట్టి ఎండలో కొద్దిసేపు మాత్రమే ఆరబెట్టి ఆరిన వెంటనే తీసేయాలి. ఇక కాటన్ బట్టలు స్టిఫ్ గా ఉండాలంటే ఐరనింగ్ ముఖ్యం. ఐరన్ చేసే ముందు కాటన్ దుస్తులపైగల లేబుల్ ఒకసారి పరిశీలించండి. సాధారణంగా కాటన్ గుడ్డను ఐరన్ చేయవచ్చు. కాని చేసేముందు ఒకసారి చూడటం మంచిది. కాటన్ చీరలను కానీ కాటన్ ఏ ఇతర వస్త్రాలు కానీ ఐరన్ చేసే ముందు ఆ వస్త్రంపై కొన్ని నీళ్ళు చిలకరిస్తే కాటన్ వస్త్రాలు త్వరగా ముడుతలు లేకుండా ఐరన్ చేయవచ్చు.
స్టీమ్ ఐరన్ కనుక మీరు ఉపయోగిస్తున్నట్లయితే, గుడ్డ ఆటోమేటిక్ గా తేమను పీల్చుకుంటుంది. వేరుగా నీరు గుడ్డపై చిలకరించనవసరంలేదు. గుడ్డలకు గంజి పెట్టినట్లయితే కాటన్ గుడ్డలు దళసరిగా వుంటాయి. వాష్ చేసిన తర్వాత, ఐరన్ చేసే ముందు కొద్దిపాటి గంజిని గుడ్డలకు పట్టించటం మంచిది.
No comments:
Post a Comment