all

Wednesday, November 21, 2012

homemade oils for dandruff,,

చుండ్రు సమస్యను అరికట్టే అద్భుతమైన హెయిర్ ఆయిల్స్...

ప్రస్తుత కాలంలో హెయిర్ జుట్టు రాలడం ఒక సమస్య అయితే. చుండ్రు రెండవ సమస్యగా మారింది. జుట్టు ఊడటం, చివర్లు చిట్లడం కన్నా ఎక్కువగా వేధించేది చుండ్రు. కొందరిని చుండ్రు సమస్య విపరీతంగా బాధపెడుతుంది. కారణం, దీనినుండి ఎదురయ్యే ఇబ్బందే! చుండ్రు శిరోజాల అందాన్ని పాడుచేయడంతోపాటూ, ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మానసికంగానూ చికాకుపెడుతుంది. చుండ్రు వల్ల జుట్టు పెరగకపోగా, ఇంకా ఎక్కువగా ఊడుతుంది. చలికాలం లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

చుండ్రు ఏర్పడటానికి కారణాలు అనేకం. పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, మలబద్దకం, శరీరంలో పేరుకున్న విషపూరిత పదార్థాలు వంటివన్నీ చుండ్రు ఏర్పడటానికి కారణమవుతుంటాయి. తలలో నిలిచే తేమ, సరిపడని కొన్ని షాంపూల వాడకం కూడా చుండ్రు సమస్యను తెస్తుంది. చుండ్రు సమస్యకు మనకు మార్కెట్‌లో ఇప్పుడు ఎన్నో రకాల నూనెలు, షాంపులు, సబ్బులు, క్రీములు, లోషన్‌లు అందుబాటులో ఉంటున్నాయి.
జుట్టు పెరుగుతుందనే ఆశతో వీటిని వాడుతున్నవాళ్లు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిపై సరైన అవగాహన లేక ఎక్కువగా మార్చి మార్చి వాడటం వలన చుండ్రు తగ్గ్గకపోగా సమస్య ఇంకా తీవ్రమై ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుంది. మరి దీనికి ఏం చేయాలో తోచక దిగులు పడుతున్నారా?? అయితే ఇంట్లోనే కొన్ని సహజ పద్దతులను ఉపయోగించడం వల్ల చుండ్రును శాస్వత నివారణ కల్పించవచ్చు. సాధారణంగా మనం రోజూ వినియోగించే హెయిర్ ఆయిల్స్ తోనే చుండ్రును రాకుండా అరికట్టవచ్చు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం....



ఇది చాలా ప్రసిద్ది చెందిన హెయిర్ ఆయిల్ రిసిపి. దీన్ని ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరినూనె పొడిబారిన తల మాడకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తే, నిమ్మరసం చుండ్రును సహజంగా తగ్గిస్తుంది. కాబట్టి ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవాలి. గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టించి, గంట తర్వాత తలారా స్నానం చేయాలి. దాంతో తలకు రక్త ప్రసరణ బాగా జరిగి చుండ్రును పోగొట్టి, జుట్టు పెరిగేలా చేస్తుంది.



చుండ్రును వదలగొట్టడంలో మరో ముఖ్య పదార్థం పెరుగు. అంతేకాదు పెరుగు వల్ల కురులు మంచి షైనింగ్ తో సున్నితంగా మారుతాయి. ఇక బాదాం నూనె మాత్రం తల మాడుకు మాయిశ్చరైజర్ గా పనిచేసి కురులు పెరిగేలా చేస్తుంది. నిమ్మరసం డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. కాబట్టి ఈ మూడింటిని ఒక మిక్సింగ్ బౌల్ లో మిక్స్ చేసి తల మాడికు పట్టించి రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి.

హెయిర్ ఆయిల్ రిసిపిలు శీతాకాలంలో చాలా ప్రసిద్ది. ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకొనే హోం మేడ్ థేరఫీ. దీంతో చుండ్రు సమస్యలు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కాలాన్ని బట్టి కురులు రాలడం జరుగుతుంది. శీతాకాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ నూనెలో శీతాకాలంలో తలకు పట్టించి చుండ్రును వదలగొట్టండి. అందుకు మందార పువ్వులను బాగా మెత్తని పేస్ట్ చేసి, నీటిలో కలిపి, అందులోనే , కొద్దిగా కొబ్బరి నూనె, కాస్ట్రో ఆయిల్ ను కూడా వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత తలకు పట్టించి రాత్రంతా అలాగే పెట్టుకొనే ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


చుండ్రును వదలగొట్టడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే మెత్తని పేస్ట్ లా తయారు చేసి, గోరువెచ్చని కొబ్బరి నూనెతో మిక్స్ చేసి తలకు పట్టించి, రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. దాంతో చుండ్రును తగ్గించి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది. జుట్టు కణాలకు శక్తినిచ్చి జుట్టు స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది.




చుండ్రును పోగుట్టుటలో ఇది కూడా ఒక ఉపయోగకరమైన హోం మేడ్ హెయిర్ ఆయిల్ రిసిపి. చుండ్రును పోగొట్టి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు బ్లాక్ గా ఉండేలా చేస్తుంది. నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి తల మాడుకు పట్టించాలి. కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి తల స్నానానికి రెండు గంటల ముందుగా అప్లై చేయాలి. కాబట్టి జుట్టు ఆరోగ్యానికి ఈ హోం మేడ్ రిసిపిలు బాగా పనిచేస్తాయి.

No comments: