all

Tuesday, July 23, 2013

కొలెస్ట్రాల్ గురించి తప్పుగా భావించబడే కొన్ని అపోహలు!

శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే అందుకు ప్రోటీనులు, విటమిన్స్, పోషకాంశాలు ఎంత ముఖ్యమో కొలెస్ట్రాల్ కూడా అంతే ముఖ్యం. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి కొలెస్ట్రాల్ కూడా కావాల్సిన స్థాయిలో ఉండాలి. అదే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అవసరానికి మించి పెరుగుతే అది ఆరోగ్యం మీద తీవ్రంగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. శరీరంలో అధనంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్ (మూర్చవ్యాధికి)కారణం అయ్యే బ్లాకేజ్ లు రక్తం ఏర్పడుతాయి. ఇంకా గుండె సంబంధిత సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం హై కొలెస్ట్రాలే.

కొలెస్ట్రాల్ ను తరచూ అపార్ధం చేసుకొంటాం. మనలో ఉండే కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాలను పెంచుతుందనే సమాచారం కోకొల్లలుగా ఉంది. కాని దీనిలో చాల వరకు కేవలం కల్పితమే. అదెలాగో చూద్దాం..


కొలెస్ట్రాల్ గూర్చి మనలో ఉన్న తప్పుడు అపోహలు! అధిక కొలెస్ట్రాల్ కేవలం మగవారికి మాత్రమే సంబంధించినది- ఆడవారికి కాదు. స్త్రీల దగ్గర ఈష్ట్రోజెన్ ఉంది. ఇది కొలెస్ట్రాల్ మోతాదును సాధారణ స్థాయిలో ఉంచేందుకు సాయపడుతుంది. అయితే మెనోపాజ్ తర్వాత ఈ ప్రయోజనం ఉండదు. 45 దాటిన మగవారు, 55 దాటిన ఆడవారిలో కొలెస్ట్రాల్ వలన ప్రమాదం ఉంది.



కొలెస్ట్రాల్ గూర్చి మనలో ఉన్న తప్పుడు అపోహలు! అధిక కొలెస్ట్రాల్ అనేది జన్యుపరమైనది, దీనికి మనం చేయదగినది ఏది లేదు. జన్యువులు తప్పనిసరిగా తమ పాత్రను పోషిస్తాయి, అయితే ఆహార అలవాట్లు, జీవనశైలి విధానం కొలెస్ట్రాల్ స్థాయిపై ప్రభావం చూపిస్తాయి. మన కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉంటే, మీరు నివారణ చర్యలు చేపట్టి మీ మోతాదు స్థాయి మించకుండా చర్యలు చేపట్టండి.


కొలెస్ట్రాల్ ను విజయవంతంగా ధ్యానం ద్వారా తగ్గించవచ్చు. మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందని తెల్సి నప్పుడు, కారణం తెల్సుకోవడం ముఖ్యం. తరచుగా మీరు కారకాలను సరిచేస్తుంటే, అది సాధారణ స్థితికి చేరుతుంది. కారణాలలో సరైన ఆహారంలేకపోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, అంటురోగాలు, మానసిక ఒత్తిడి, శారీరిక ఒత్తిడి ( సర్జరీ వంటివి) వంటివి ఉంటాయి.


కొలెస్ట్రాల్ తగ్గించే మందులను వాడినప్పుడు ఆహార అలవాట్లను మార్చవలసిన అవసరం లేదు లేదా ఎక్కువ చురుకుగా ఉండక్కరలేదు. కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు కొంత వరకు పనిచేస్తాయి. కాని మన గుండెకు మంచిదనుకొనే ఆహారాన్ని తీసుకొని, మన జీవన శైలిని మార్చినప్పుడు మీ మందులు బాగా పనిచేస్తాయి.


భోజనం గుండెకు - ఆరోగ్యం అంటే అర్ధం "0 మి.గ్రా. కొలెస్ట్రాల్" పోషకాహార జాబితాలో మంచి కొలెస్ట్రాల్ అనే కొలెస్ట్రాల్ భాగం, మీ కొలెస్ట్రాల్ మోతాదును పై స్థాయికి తీసుకొని పోయే విషయమౌతుంది. సాచ్యురేటెడ్ ఫాట్ ( మాంసాహారం, డైరీ ఉత్పత్తులు) ట్రాన్స్ ఫాట్స్ ( ప్యాక్ చేసిన ఆహరంలో ఉండేది) చాల వరకు తక్కువ సాంద్రత లిపోప్రొటీన్ పై పెద్దగా ప్రభావం ఉండదు, చెడు కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్ కంటే అతేరోస్క్లిరోసిస్ కు కారణమౌతుంది


పిల్లలకు అధిక కొలెస్ట్రాల్ ఉండదు అతేరోస్క్లిరోసిస్ - ధమనులు కుచించుకొని పోయి గుండెజబ్బులకు దారి తీయడం - అనేది ఎనిమిదేళ్ళ చిన్న వయసులోనే మొదలు కావచ్చని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అమెరికా పిడియాట్రిక్ అకాడమి వారు పిల్లలు, కొలెస్ట్రాల్ అనే విషయంపై సూచనలు చేస్తూ అధిక బరువు ఉన్న పిల్లలు, అధికరక్తపోటు లేదా కుటుంబంలో గుండెజబ్బుల చరిత్రను ఉన్నవారికి రెండేళ్ళ వయసులోనే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించాలని తెలిపారు. అధిక కొలెస్ట్రాల్ ఉన్న పిల్లలు సంతృప్త కొవ్వు, ఆహార కొలెస్ట్రాల్ వరకు ఆహారపు అలవాట్లను పరిమితం చేసి, మరింత వ్యాయామం చేయమని సూచించారు.


భోజనం గుండెకు - ఆరోగ్యం అంటే అర్ధం "0 మి.గ్రా. కొలెస్ట్రాల్"పోషకాహార జాబితాలో మంచి కొలెస్ట్రాల్ అనే కొలెస్ట్రాల్ భాగం, మీ కొలెస్ట్రాల్ మోతాదును పై స్థాయికి తీసుకొని పోయే విషయమౌతుంది. సంతృప్త కొవ్వు ( మాంసాహారం, డైరీ ఉత్పత్తులు) ట్రాన్స్ ఫాట్స్ ( ప్యాక్ చేసిన ఆహరంలో ఉండేది) చాల వరకు తక్కువ సాంద్రత ఉన్న లిపోప్రొటీన్ పై పెద్దగా ప్రభావం ఉండదు, చెడు కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్ కంటే అతేరోస్క్లిరోసిస్ కు కారణమౌతుంది.


కొలెస్ట్రాల్ ఎల్లప్పుడు చెడ్డది చాలామంది కొలెస్ట్రాల్ అని విన్నప్పుడు అది చెడ్డది అనుకుంటారు. కాని అసలు విషయం చాల క్లిష్టమైనది. అధిక కొలెస్ట్రాల్ ప్రమాదకరం కావచ్చు. కాని కొలెస్ట్రాల్ శరీర ప్రక్రియలు జరగడానికి అత్యవసరం, మెదడు లోని నాడీ కణాలను ఉత్తేజితం చేయడం నుండి కణత్వచాలకు రూపాన్ని ఇవ్వడం వరకు పని చేస్తుంది. గుండె జబ్బులలో కొలెస్ట్రాల్ పాత్రను తప్పుగా అర్ధం చేసుకుంటారు. కొలెస్ట్రాల్ రక్తనాళాల నుండి తక్కువ, ఎక్కువ సాంద్రత ఉన్న లిపోప్రొటీన్ ల ద్వారా రవాణా చేయబడుతుంది. ఎల్ డి ఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఇది అతేరోస్క్లేరోసిస్ కు కారణమౌతుంది అంతేకాని కేవలం కొలెస్ట్రాల్ కాదు.


తక్కువ కొలెస్ట్రాల్ ఎల్లప్పుడు మంచి ఆరోగ్యానికి సంకేతం తక్కువ స్థాయి ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ సాధారణంగా ఆరోగ్యకరమైనప్పటికి, ఒక కొత్త పరిశోధన ప్రకారం సాధారణంగా అసలు క్యాన్సర్ రాని వారి కంటే క్యాన్సర్ వచ్చే వారిలో తక్కువ స్థాయి ఎల్ డి ఎల్ ను క్యాన్సర్ వచ్చే ముందు ఏళ్ళలో ఉన్నట్లు ఒక కొత్త పరిశోధనలో తెల్సుకున్నారు. రక్తంలో తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వారు అనేక వ్యాధులకు కూడా గురి ఔతారు. చాల కాలం వీటితో బాధపడి, ఈ వ్యాధితోనే చనిపోతారు.



అధిక కొలెస్ట్రాల్ ఉన్న లక్షణాలు కనబడటం లేదు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో కొంతమందికి పసుపు - ఎరుపు గ్జంతోమస్ అనే గడ్డలు కనురెప్పలు, కీళ్ళు, చేతులు, శరీరంలోని ఇతర భాగాల మీద వస్తాయి. మధుమేహం లేదా అనువంశికంగా ఫామిలియాల్ హైపర్ కొలెస్ట్రోలేమియా ఉన్నవారిలో ఈ గ్జంతోమస్ సాధారణంగా ఉంటుంది.మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నదా లేదా అనే విషయం తెల్సుకోవడానికి మంచి మార్గం, మీ ఆరోగ్యాన్ని పరిరక్షకులు సలహా ఇస్తే మీకు 20 ఏళ్ళు వచ్చినప్పటి నుండి ప్రతి మూడేళ్ళ కొకసారి కొలెస్ట్రాల్ ను పరీక్షించుకోవాలి లేదా మీ డాక్టర్ సలహా ఇస్తే తరచు పరీక్ష చేయించుకోవాలి.

కొలెస్ట్రాల్ స్థాయి తగ్గితే మందులను వాడటం ఆపేయవచ్చు.మీ కొలెస్ట్రాల్ మందులను వాడటం ఆపేస్తే, మీ చెడు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ బహుశ తిరిగి అది ఉన్న చోటుకే రావచ్చు. మీ కొలెస్ట్రాల్ మోతాదు మించితే, మీ గుండె జబ్బులు, పోటు పరిస్థితి కూడా అంతే. అధిక కొలెస్ట్రాల్ ను నయం చేయలేనప్పుడు, ఇలా వాడకం విజయవంతంగా నిర్వహించవచ్చు. కొలెస్ట్రాల్ నిర్వహణ మీ జీవిత కాలమంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి అవసరం - ప్రతి రోజు వాడే మందులతో సహా.


అధిక కొలెస్ట్రాల్ సన్నగా ఉండే వారిలో పెద్ద సమస్యేమి కాదు సన్నని, అధిక బరువు, లేదా మధ్య రకం ఎవరైనా సరే తమ కొలెస్ట్రాల్ ను తరచూ పరీక్షించుకోవాలి. అధిక బరువు ఉన్న వారు ఎక్కువ కొవ్వు ఉన్న ఆహరం తీసుకోరాదు. అలాగే త్వరగా బరువు పెరగని వారు ఎంత సంతృప్త కొవ్వులు తింటున్నామో చూసుకోవాలి.

వెన్న కాకుండా వనస్పతిని వాడట౦ వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వనస్పతిలో, వెన్న లాగే కొవ్వు ఎక్కువగా ఉంటుంది -మీకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే అన్ని కొవ్వు ఆహారాలు మితంగా తినాలి.చాలావరకు వనస్పతిలో అధిక కొలెస్ట్రాల్ కు కారణమైన ఒక ప్రధాన సంతృప్త కొవ్వులు ఉంటాయి. సూచించబడిన ఎంపికలో ఒక ద్రవరూపంలోని విజిటబుల్ నూనె లేదా ఏ రకమైన ట్రాన్స్ కొవ్వులు లేని నూనె (హైద్రోజనేటేడ్ విజిటబుల్ నూనె) ఉన్నాయి.


మీరు మధ్య వయస్సు వారయ్యే వరకు మీ కొలెస్ట్రాల్ ను చూపెట్టుకొనే అవసరం లేదు పిల్లలు అయినప్పటికీ - గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు - అధిక కొలెస్ట్రాల్ స్థాయిని కల్గి ఉండవచ్చు. చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించుకోవడం ఒక మంచి ఆలోచన.

beauty tip

 
     
టేబుల్ స్పూన్ పచ్చి పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్, తేనె, కొద్దిగా శనగపిండి వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిస్తే ముఖం నిగారిస్తుంది.

వరం పొందిన చిన్నారులు

 
     
దేవుడంటే ఆలకించేవాడు, కరుణించేవాడు, కాపాడేవాడు! అవునూ... అన్నీ దేవుడే ఎందుకు వినాలి? దేవుడే ఎందుకు చేయాలి? సాటి మనిషి ప్రార్థనను మనం వినలేమా? సాటి మనిషికి చేతనైన సాయం చేయలేమా? దేవుడిలా కోరికలను తీర్చలేం సరే, బాధల్ని తీర్చేందుకు చిన్న ప్రయత్నం చేయగలం కదా! ప్రశాంత్‌కుమార్ దంపతుల గురించి విన్నప్పుడు ఎవరి మదిలోనైనా ఇవే ఆలోచనలు కలుగుతాయి. హెచ్.ఐ.వి.పాజిటివ్ చిన్నారులు, అనాథలు... ఓ ముప్పై మంది వరకు వారి దగ్గర పెరుగుతున్నారు. ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఎదుగుతున్నారు. ఆ పసివాళ్లూ ఎవర్నీ ప్రార్థించలేదు. ప్రార్థించే అవసరం రాకుండా చూసుకునే ‘అమ్మానాన్నల’ చేతుల్లో పడ్డారంతే! ఆ ఇద్దరి ప్రేమ, వాత్సల్యాలే... ఈవారం ప్రజాంశం.

చినుకులు చల్లగా మేనిని తడుముతుంటే, రివ్వున వీచే గాలి తలని నిమురుతుంటే పచ్చని ప్రకృతిలో మమేకమవుతూ కనిపించారు పార్క్‌లో ఆడుకుంటున్న చిన్నారులు. తోటిపిల్లలతో ఆటపాటల్లో మునిగి తేలుతున్న చిన్నారులను చూసి ‘ఏదో స్కూల్ పిల్లల్లా ఉన్నారే!’ అనుకుని పలకరిస్తే- ‘‘వీరంతా మా పిల్లలేనండి. మొత్తం ముప్పైమంది. మాది పే...ద్ద కుటుంబం’’ సంబరంగా చెప్పారు ప్రశాంత్‌కుమార్, అతని ఇల్లాలు అపరంజి. ఆసక్తికరంగా అనిపించిన ఈ కథను పిల్లలతో పాటూ ఆడుతూ పాడుతూ కనిపించిన వారి మాటల్లోనే తెలుసుకుంటే...

హెచ్‌ఐవి ఉన్నా..!

ఆధునికంగా ఎంత ప్రగతి సాధించినా మన సమాజంలో ఇంకా హెచ్‌ఐవి బాధితులు వేదనాభరితమైన జీవితాలనే గడుపుతున్నారు. ఉన్న జబ్బును బయటకు చెప్పుకోలేక, అయినవారికి దూరం కాలేక, తెలిసినవారు ఏహ్యంగా చూసే చూపులకు తట్టుకోలేక... వారు పడే యాతన వర్ణించలేము. ‘‘ఇవేవీ తెలియని ఈ పసికందులకు కావలసినది కాసింత ప్రేమ, వేళకు ఇంత తిండి, ఉండేందుకింత నీడ. వీరిలో హెచ్‌ఐవి బాధితులు ఉన్నారు. తల్లిదండ్రులు ఎయిడ్స్ కారణంగా చనిపోతే అనాథలైన పిల్లలూ ఉన్నారు. ఇప్పుడు వీరు అనాథలు కారు. నేనున్నాను. ఇప్పుడు వీరు అనారోగ్యంతో బాధపడటం లేదు. అవసరమైన మందులతో ఆరోగ్యంగా ఎదుగుతున్నారు. వీరికి ఆ అవకాశం కల్పించడానికే దేవుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తాను. వీరంతా ‘అన్న, నాన్న’ అని పిలుస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది’’ తెలిపారు ప్రశాంత్‌కుమార్.

సికింద్రాబాద్ మిర్జాల్‌గూడలో ‘ఫ్యూచర్ తఫౌండేషన్’ పేరుతో ఉన్న మూడుగదుల ఇంటికి వెళితే ఈ చిన్నారులకు చదువు చెబుతూనో, భోజనం పెడుతూనో వారి ఆలనాపాలనా చూస్తూనో ఈ తల్లిదండ్రులు కనిపిస్తారు. ఆదివారాలు, సెలవురోజుల్లోనూ ఇలా దగ్గరలో ఉన్న పార్క్‌లోనూ, ఆరుబయట షికారులోనూ పిల్లల సందడి మధ్య తామూ పిల్లలై తిరుగుతుంటారు.

అనాథలకు నీడ...

ఇక్కడ ఉన్నవారిలో పదిమంది దాకా ఆడపిల్లలూ ఉన్నారు. ‘ఇంత చిన్న ఇంట్లో ఎలా సర్దుకుపోతున్నారు, ఏ అండా లేని పిల్లలను చేరదీయాలనే ఆలోచన ఎలా కలిగింది’ అని అడిగితే ప్రశాంత్‌కుమార్ తన కథ వినిపించారు. ‘‘మా అమ్మనాన్నలకు మేం ముగ్గురం సంతానం. మా చిన్నప్పుడే మరో పెళ్లి చేసుకోవడానికి అమ్మను, మమ్మల్ని వెళ్లగొట్టాడు నాన్న. అమ్మ మనోధైర్యంతో అక్కడా ఇక్కడా పనులు చేసి మమ్మల్ని ప్రయోజకులను చేసింది. అమ్మకు సాయపడేందుకు పదవతరగతి చదువుకునే రోజుల నుంచే ట్యూషన్లు చెప్పేవాడిని. అప్పుడే నిరుపేద పిల్లలు, పుస్తకాలు కూడా కొనలేని స్థితిలో స్కూల్ మానేసిన విద్యార్థులు నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చేవారు. ఆ పిల్లలను ఆదుకోవడానికి ఇల్లిల్లూ తిరిగి పాత న్యూస్‌పేపర్లు సేకరించేవాడిని. ఇందుకు మా స్నేహితులూ సాయం అందించేవారు. మా లంచ్‌బాక్స్‌లూ పిల్లలకు ఇచ్చేవాళ్లం.

ఆ రోజుల్లో మా ఇంటి దగ్గర ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సిస్టర్‌గా పనిచేసే విశాలాక్షి (పేరుమార్చాం)కి హెచ్.ఐ.వి సోకింది. ఎవరికీ చెప్పుకోలేక మా గురించి తెలిసి, తన ఇద్దరు పిల్లలకు ఇంత నీడ కల్పించమని కోరింది. ఆమెను కలిసినప్పుడు ఆమె బతుకుతుందనుకోలేదు. అప్పుడు ఆమె సిడి 4 కౌంట్ 16. ఆమెను ఆసుపత్రిలో చేర్చాను. మందులు, మంచి ఆహారం తీసుకున్నాక ఇప్పుడు బాగా కోలుకుంది. ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు. ఆమె ఓ ఆసుపత్రిలో సిస్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె బాగోగుల గురించి తెలుసుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు హెచ్.ఐ.వి రోగులను, పిల్లలను గమనించాను. అనాథలైన వారికి ఒక నీడ కల్పిస్తే నా జీవితానికో అర్థం ఉంటుందనిపించి, తొమ్మిదేళ్ల క్రితం ఫ్యూచర్ ఫౌండేషన్ పేరుతో ఈ హోమ్‌ని ఏర్పాటు చేశాను’’ అని చెబుతున్న ప్రశాంత్‌కుమార్ కళ్లలో చెప్పరానంత సంతృప్తి కనిపించింది.

పెరిగిన ప్రేమ..

పెళ్లికాక ముందే పదిమంది పిల్లలతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ప్రశాంత్‌కుమార్ ‘‘పిల్లలు ‘అన్న అన్న’ అంటూ నా చుట్టూ తిరుగుతుంటే చాలా ఆనందం వేసేది. ఫొటోగ్రఫీ అంటే నాకు ఎంతో ఇష్టం. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు తీసే ఫొటోలతో వచ్చే ఆదాయం పిల్లల ఖర్చులకు సరిపోయేది. మమ్మల్ని చూసిన వారు కొందరు సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఇక్కడ పిల్లల సంఖ్య పది నుంచి ఇరవైకి పైగా పెరుగుతూ వచ్చింది. కాని ఏనాడూ పిల్లలు భారంగా అనిపించలేదు.

ఐదేళ్లక్రితం మా మేనమామ కూతురినే పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందే తనకు అన్ని విషయాలు వివరించాను. పిల్లలు మనతో ఉంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటానన్నాను. అన్ని షరతులనూ అంగీకరించి, మనస్ఫూర్తిగా నా ఇంట అడుగుపెట్టింది అపరంజి’’ అని ఆగారు ప్రశాంత్‌కుమార్.

అపరంజి మాట్లాడుతూ -‘‘పెళ్లి అవుతూనే పాతికమంది పిల్లలకు తల్లినయ్యాను. తర్వాత మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మరో ముగ్గురు పిల్లలు చేరారు. ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటిది ముప్పైమంది అంటే... రోజూ పండగలాగే ఉంటుంది’’ అని తెలిపారు ఆమె. ‘‘పిల్లలందరూ దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఫీజులు కట్టడంలో ఆలస్యమైనా ఆంక్షలు పెట్టని మంచితనం అక్కడి టీచర్లలో ఉంది’’ అని వివరించారు ప్రశాంత్‌కుమార్

పట్టించుకోని సలహాలు..

‘‘పెళ్లి అయ్యింది మొదలు వీరిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉన్నది లేదు. పెద్ద పిల్లలకు బాధ్యతలు అప్పజెప్పి, ఎక్కడైనా వెళ్లి నాలుగురోజులు ఉండి రావచ్చుగా! ’ అని కొందరు సలహా ఇస్తుంటారు. కాని మనసొప్పదు. ఒకసారి వైజాగ్ వెళదామనుకున్నాం. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లాలనిపించలేదు. అందుకే వారందరితో కలిసి బయల్దేరాం. సినిమాకు వెళ్లినా, షికారుకైనా వీరంతా ఉండాల్సిందే!’’ పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ప్రశాంత్ చెబుతుంటే తనలోని తండ్రి మనసు కళ్లకు కడుతుంది.

దొరికిన ఆధారం...

రెండేళ్లక్రితం ఒక ఆడపిల్లను కన్నతల్లి ఆ బిడ్డను వీరి హోమ్‌లో వదిలి వెళ్లింది. ‘హోప్’ అని పేరుపెట్టుకొని కన్నబిడ్డలా అక్కున చేర్చుకున్నారు ఈ దంపతులు. ‘‘ఏడాది క్రితం వరకు అద్దె ఇంట్లోనే ఉన్నాం. దాతలు ఇచ్చిన స్థలంలో రెండుగదులకోసం ఇంటిపని మొదలుపెట్టాను. చేతిలో పైసా లేదు. కాని ఏదో ధైర్యం. అపరంజి తన నగలను ఇచ్చింది. పని మొదలుపెట్టాను. అంతే! ఒకరు సిమెంట్‌బస్తాలకు, ఇంకొకరు స్లాబ్ వేయడానికి... ఇలా స్థానికులు తమకు తోచిన సాయం అందించారు.

మూడుగదులతో సిద్ధమైన ఇల్లు ఇప్పుడు పిల్లలకు ఆధారమైంది. రెండేళ్ల క్రితం వరకు కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవాళ్లం. ఇప్పుడు గ్యాస్ అమరింది. రెండు నెలలకు సరిపడా సరుకులను ముందుగానే సిద్ధం చేసుకుంటాను. పిల్లలను పస్తుపెట్టడమంటే దేవుణ్ని ఆకలితో అలమటించేట్టు చేయడమే అని నా భావన. అలాగని ఎవరిదగ్గరా చేయి చాచి అడిగింది లేదు. నన్నూ, పిల్లలను చూసే తమకు తోచినసాయం చేస్తుంటారు. నేను చేసే ఫొటోగ్రఫీ వర్క్, సిస్టమ్స్ బాగుచేసే పని మాకు ఇంత తిండి పెడుతుంది. మనస్పూర్తిగా చేపట్టిన పనికి తోటివారి అండదండలు అడక్కుండానే అందుతుంటాయనేది నేను నమ్మిన సిద్ధాంతం. వీరికో జీవనాధారాన్ని చూపించాలనేది మా తపన. ఇదే మా లక్ష్యం’’ అని ముగించారు ఈ దంపతులు.

కన్నబిడ్డలను చూసుకోవడానికే ఎన్నో అవస్థలు పడే ఈ కాలపు తల్లిదండ్రులు... ప్రశాంత్, అపరంజిల సేవాభావాన్ని చూసి ఎంతో నేర్చుకోవచ్చనిపించింది. ‘పరిశుభ్రంగా ఉండవలసింది శరీరాలు కాదు, మనసులు!’ అని తమ సేవాదృక్ఫథంతో తెలియజేసే ఈ అమ్మనాన్నలకు హ్యాట్సాఫ్ చెబుదాం. ఇలాంటి ఆపన్నులకు మనమూ ఓ చేయూత అవుదాం.

- నిర్మలారెడ్డి,

ఎవరికెవరూ తీసిపోరు!

‘‘నేను చిత్తూరులో ఉండేవాణ్ణి. అమ్మానాన్న చనిపోయారు. ప్రశాంత్ అన్న దగ్గరికొచ్చి ఏడేళ్లు అయ్యింది. టెన్త్‌క్లాస్ చదువుతున్నాను. పెద్దయ్యాక అటోమొబైల్ ఇంజనీర్‌ను అవుదామనుకుంటున్నాను. మా అన్న నాకు కీ బోర్డ్ కూడా నేర్పిస్తున్నాడు’’ అని సాయిచరణ్ చెబుతుంటే నవ్య వచ్చి ‘నేను పైలట్‌నవుతా! అందుకే ఇప్పుడు బాగా చదువుతున్నాను’’ అంది. ‘‘మా వెంకీ థర్డ్‌క్లాస్ చదువుతుండు. క్రికెట్ మస్తు ఆడతడు’’ అని వెంకటేష్ తల నిమురుతూ చెబుతున్న ప్రశాంత్ దగ్గరకు వచ్చిన అపరంజి ‘‘స్మైలీ, రోజీ, ప్రవల్లిక, కీర్తన, కవిత, నవ్య.. ఎవరికెవరూ తీసిపోరు. చదువులో ఫస్టే కాదు, చిన్నపిల్లల బాధ్యత తీసుకోవడంలోనూ ముందుంటారు. ఇక్కడ కులమతాలకు తావులేదు. అందరూ అన్నదమ్ముల్లా, అక్కచెల్లెళ్లలా కలిసిపోతారు.