all

Friday, July 12, 2013

అందమె ఆనందం

 
     
నువ్వుల నూనె, ఆప్రికాట్ నూనె, విటమిన్ ‘ఇ’ నూనెలను రెండేసి టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. వీటికి కొద్దిగా అల్లంతురుము జతచేసి మరిగించాలి. అరకప్పు కోకా బటర్‌ను కరిగించి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్‌లో పోసి రోజుకు రెండుసార్లు శరీరానికి మసాజ్ చేసుకోవాలి. పొడి చర్మానికి ఇది మేలైన మిశ్రమం.

టాప్ 5 మిస్టేక్స్,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,బ్యూటీ

 
     
 
ఫ్యాషన్ విషయంలో ఫలానా వారిది గుడ్ టేస్ట్, బ్యాడ్ టేస్ట్ అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ట్రెండ్‌ను సరిగ్గా ఫాలో అవకపోవడమే కాదు తప్పుగా ఫాలో అవడం కూడా అందాన్ని చెడగొడుతుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. సాధారణంగా అతివలు బ్యూటీ విషయంలో చేసే ప్రధానమైన మిస్టేక్స్ ఏంటో చూద్దాం..
1. సరిపోలని ముఖం-మెడ
మేకప్‌లో ఫౌండేషన్‌ని ముఖానికి రాసుకుంటారు సరే, మెడ మాటేమిటి?! ఫౌండేషన్ (బ్యూటీ క్రీములు, ఇతర ప్రొడక్ట్స్ కూడా) ముఖం వరకే వాడి వదిలేయడం వల్ల ముఖం లేత కాంతివంతంగా కనిపించగా, మెడ మాత్రం డార్క్‌గా కనిపిస్తుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ముఖంతో పాటు మెడకూ ఫౌండేషన్‌ని తప్పనిసరిగా అప్లై చేయాలి.

2. పెదవి అంచున లిప్ లైనర్
పెదవుల అందం కోసం కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటున్న రోజులివి. పెదవులకు నప్పే షేడ్ లిప్‌స్టిక్ వేసుకోవడంతోనే సరిపెట్టకూడదు. ముందుగా డార్క్ షేడ్ వచ్చేలా పెదవుల చుట్టూ లిప్‌లైనర్ ఉపయోగించకపోతే మేకప్‌లో ‘అఆ..లు’ తెలియనివారిలా చూపరులకు కనిపిస్తారు. అలాగే పెదవులకు లిప్‌స్టిక్‌ను బాగా పులిమేస్తే డోస్ ఎక్కువై ఎబ్బెట్టుగా కనిపిస్తారు.

3. చేతివేళ్లు
అందం అంటే అందరూ ముఖంపైనే కాన్‌సన్‌ట్రేషన్ చేస్తారే తప్ప చేతివేళ్లను, గోళ్లను, పాదాలను ఏ మాత్రం పట్టించుకోరు. వేలి కొసల్లో ఒదిగి ఉండే గోళ్లు శుభ్రంగా, అందంగా ఉండటం ప్రధానం. అలాగే గోళ్లు పొట్టిగా, పాలిష్ లేకుండా ఉంటే అల్ట్రా ఉమెన్ అనిపించుకోరు. ఒకసారి మీ గోళ్లను పరిశీలించండి. సరిపోలనట్టుగా అనిపిస్తే రెడీమేడ్‌గా దొరికే నెయిల్‌క్లిప్పర్‌తో వాటిని నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు.

4. ఆడంబరం
ఎక్కువ నగలు, మెరుపులతో చేసుకునే అలంకరణ చూపరులకు ఎప్పుడైనా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సింపుల్‌గా, క్లాసీగా ఉండేలా తక్కువ నగలతో మేనికి అందాన్ని తీసుకురావచ్చు.

5. ట్యాన్
బయటకు వెళ్లేప్పుడు చాలామంది మరిచిపోయే విషయం ట్యానింగ్. దుమ్ము, ఎండ వల్ల కమిలే చర్మం పట్ల అజాగ్రత్తగా ఉంటారు. ట్యాన్ అందాన్ని పాడు చేస్తుంది. ఇందుకోసం సెల్ఫ్-ట్యానింగ్ (సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం, గొడుగు, స్కార్ప్ వంటివి వాడటం) పద్ధతులను అవలంబించడం అవసరం.
  

పాపకి పాలపళ్లున్నప్పుడు బాగానే ఉండేవి కానీ...

 
     
డెంటల్
మా పాపకు తొమ్మిదేళ్లు. పాలపళ్లున్నప్పుడు పళ్లెంతో చక్కగా ఉండేవి. ఇప్పుడు పళ్లు చాలా పెద్దవిగా వస్తున్నాయి. ముందుపళ్ల మధ్య సందు కూడా ఉంది. పాపకి ఎందుకిలా వచ్చింది? డెంటిస్ట్‌ని ఎప్పుడు కలవాలి, ఎటువంటి చికిత్స చేయించాలి... సలహా ఇవ్వండి. - జి.బసవరాజు, గంగవరం

పాలపళ్లు ఊడిపోయి, శాశ్వత దంతాలన్నీ రావడానికి సుమారు ఆరేడేళ్ల సమయం పడుతుంది. మొదటి పాలపన్ను ఊడిపోవడం, మొదటి శాశ్వత దంతం రావడమన్నది ఆరేళ్లు దాటిన తర్వాత మొదలవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయేసరికి పిల్లలకి పదమూడేళ్లొస్తాయి. ఈ సమయంలో పళ్లు, దవడలు, వాటి ఎదుగుదల ఎన్నో ఒత్తిళ్లమధ్య జరుగుతుంది. ఎటువంటి దంతసమస్యలు రావడానికైనా, అలాగే అందమైన చిరునవ్వు ఏర్పడడానికైనా బీజాలు పడేది ఈ వయసులోనే. అందుకే ఇది అత్యంత సంక్లిష్టసమయం. తల్లిదండ్రులకు ఎన్నో రకాల అనుమానాలు, భయాలు వచ్చేది ఈ వయసులోనే. అందుకే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలని క్రమం తప్పకుండా ఆరునెలలకొకసారి దంతవైద్యులకు చూపిస్తుండాలి.

డెంటిస్ట్ కొన్ని ఎక్స్‌రేల సాయంతో దవడ ఎముక ఎదుగుదలని, వాటిలో పళ్లు తయారవుతున్న విధానాన్ని, పళ్లు మొలిచే పద్థతులను నిశితంగా పరిశీలించి. ఏదైనా తేడా గమనించిన వెంటనే చిన్న చిన్న చికిత్సలతోనే సమస్యలు పరిష్కరించడం సాధ్యమవుతుంది. చాలాసందర్భాల్లో చికిత్స అవసరం లేకుండానే సర్దుకుపోయే సమస్యలూ ఉంటాయి. అలాంటిదే మీ పాప సమస్య కూడా. కోరపళ్లు మొలిచేటప్పుడు ముందుపళ్లపైన ఉన్న ఒత్తిడి వల్ల అవి ఎడంగా రావడంతోబాటు సందులు వచ్చినట్లు కనిపిస్తాయి. సాధారణంగా పన్నెండేళ్లు దాటిన తర్వాత అంటే కోరపళ్లు రావడం పూర్తయిన తర్వాత సందులు వాటంతట అవే మూసుకుపోతాయి. అదేవిధంగా పిల్లల్లో శాశ్వతదంతాలు వచ్చినప్పుడు వారి ముఖపరిమాణంతో పోల్చుకున్నప్పుడు పళ్లు పెద్దవిగా అనిపిస్తాయి. అదిచూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అదే పిల్లలకు 20 ఏళ్లు వచ్చిన తర్వాత వారి ముఖపరిమాణం, శరీరాకృతితో పోల్చుకుంటే సరిపోయినట్లుగా అనిపిస్తాయి.

నా వయసు 60. నోట్లో చాలా పళ్లు వదులుగా ఉంటే ఈమధ్యనే పళ్లన్నీ తీయించేశాను. పళ్ల సెట్టు చేయించుకుందామనుకుంటున్నాను. ఫిక్స్‌డ్ దంతాలు అమర్చడం సాధ్యమా?- జి.శకుంతల, హైదరాబాద్

అసలు పళ్లే లేనివారికి కూడా రోజూ తీసిపెట్టుకునే పళ్లసెట్టు కాకుండా, ఫిక్స్‌డ్ దంతాలనమర్చే అవకాశం ఆధునిక దంతవైద్యంలో ఉంది. ఇంప్లాంట్స్ అనబడే చిన్నపాటి స్క్రూలను దవడలో బిగించి, వాటి సపోర్ట్‌తో కృత్రిమ దంతాలను అమర్చుతారు. ఏ వయసువారికైనా ఎంతో సులభంగా ఒకటి రెండు పళ్లు బిగించాలన్నా లేదా నోట్లో అన్ని పళ్లూ బిగించాలన్నా కూడా వాటితో సాధ్యమవుతుంది. రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలుస్తూ, బిగించిన కృత్రిమ దంతాలు ఎలా ఉన్నాయో కనీసం సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకుంటుండాలి. వీటితో మామూలుగా అన్ని పదార్థాలనూ కొరకొచ్చు. నమిలి తినొచ్చు.
  

సౌందర్యానికి గ్లిజరిన్ చేసే మ్యాజిక్!స్కిన్ కేర్ టిప్స్

సాధారణంగా మనందరికీ ఫర్ఫెక్ట్ క్లియర్ స్కిన్ ఉండాలని కోరుకుంటాం. అందుకే అనేక రకాలైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏదైతేనేం, అందులో కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే పూర్తి ఫలితాలను అంధిస్తున్నాయి. ఫలితం ఏమీ ఉండదు. అదే చర్మ కాంతి మరియు కంప్లెక్షన్. అందువల్ల, ప్రస్తుత రోజుల్లో కొన్ని హోం రెమడీస్ చాలా సులభ మరియు సింపుల్ గా అందుబాటులో ఉన్నాయి.

అటువంటి సింపుల్ రెమడీస్సే బాగా ప్రసిద్ది చెందాయి.ఇలా సులభంగా, సింపుల్ గా అందుబాటులో ఉండే ఈ వస్తువులు అంత ఖరీదైనవీ కావు!ఉదాహరణకు గ్లిజరిన్. చౌకైన బ్యూటీ ప్రొడక్ట్. ఇది చర్మానికి అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది. ఇది సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు ఉత్తమమైన నివారినిగా పనిచేస్తుంది గ్లిజరిన్.

సౌందర్యానికి గ్లిజరిన్ చేసే మ్యాజిక్!స్కిన్ కేర్ టిప్స్

చర్మ సంరక్షణలో గ్లిజరిన్ మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. మరియు చర్మ సమస్యలకు వినియోగించే మెడిసినల్ ప్రొడక్ట్స్ లోనూ గ్టిజరిన్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే గ్లిజరిన్ ను ఉపయోగించే ముందు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. అదికూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది.

గ్లిజరిన్ స్కిన్ కేర్ లో ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం:

1. గ్లిజరిన్ చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మానికి ఒక టోనర్ గా పనిచేస్తుంది. రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మీ ముఖ చర్మం మీద తుడవడం వల్ల టోనర్ గా మంచి ఫలితాన్ని అంధిస్తుంది.

2. ఈ బ్యూటీ వస్తువు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మాన్ని జిడ్డుగా కూడా ఉండనివ్వదు. పొడిబారిన చర్మం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది.

3. గ్లిజరిన్ మరియు తేనెతో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల చర్మ బిగుతుగా తయారౌతుంది మరియు వృద్ధాప్య యొక్క ప్రారంభ సంకేతాలను నిరోధిస్తుంది.

4. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చర్మ కణాల్లోనికి బాగా గ్రహించబడి, తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది.

5. గ్లిజరిన్ తో మరో బ్యూటీ బెనిఫిట్, చర్మాన్ని రిజొవెనేట్ చేస్తుంది మరియు డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగు చేస్తుంది.

6. మీరు అధిక చెమటకు గురైన మరియు జిడ్డు చర్మం పొదినా, పాలు, తేనె మరియు గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇంకా మీరు గ్లిజరిన్ కు ఓట్ మీల్ చేర్చి స్ర్కబ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్ర్కబ్బింగ్ తో చర్మంలో ఏర్పడ్డ అదనపు జిడ్డును తొలగిస్తుంది.

7. మొటిమలు ఉన్నవారు గ్లిజరిన్ ను చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించవచ్చు. డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగుచేయడంతో పాటు, గ్లిజరిన్ మొటిమలతో పోరాడుతుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

8. మొటిమల నివారణకు గ్లిజరిన్ పీల్ ఫేస్ మాస్క్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ మాస్క్ ను గుడ్డులోని తెల్లని పదార్థానికి తేనె మిక్స్ చేసి ఫేస్ మాస్క్ లా వేసుకోవడం వల్ల, ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

9. చర్మ సంరక్షణలో సమర్ధవంతమైనది పనిచేస్తుంది ఈ గ్లిజరిన్. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా తయారు చేస్తుంది మరియు ముఖంలో కాంతిని తీసుకొస్తుంది.

10. పొడిబారిన పాదులు, మరియు అరచేతులకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను పాదాలకు చేతులకు అప్లై చేయాలి. మంచి ఫలితం కోసం దీని తేనె ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, చర్మాన్నిసున్నితంగా మార్చుతుంది.

చర్మానికి రేడియంట్ లుక్ అంధించే హోం మేడ్ మాయిశ్చరైజర్

ప్రతి రోజూ బహిర్గతమయ్యే మీ చర్మం ప్రస్తుతం ఉండాల్సిన దానికంటే, ఎక్కువగా లేదా వయస్సు మళ్ళినవారిగా కనబడేలా చేస్తోందా? కఠినమైన వాతావరణం కారణంగా మీ చర్మం త్వరగా పొడిబారుతోందా? మరి పొడి చర్మం వల్ల ముఖంలో ముడుతలు మరియు ఫైన్ లైన్స్ ఏర్పడుతాయి. క్రమం తప్పకుండా మీ చర్మాన్నితేమగా ఉంచుకోడం మీ రోజు కార్యక్రమంలో ఒక కీలక భాగం.మాయిశ్చరైజింగ్ వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా, మరియు మెరుస్తుండేలా చేస్తుంది.

కానీ, కఠినమైన రసాయనాలు కలిగిన మాయిశ్చరైజర్ ను బయటకు కొనడం కంటే, మన ఇండియన్ హోం మేడ్ వస్తువులను మాయిశ్చరైజర్ల గా ఎందుకు ఉపయోగించ కూడదు? ఇవి చర్మానికి ఉపశమనం కలిగించడానికి చాలా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అటువంటి కొన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ నేచురల్, ఇండియన్ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ ను మీరు ఉపయోగించి మీ అందాన్ని రక్షించుకోండి..


తేనె -పాలు మాయిశ్చరైజర్: తేనె అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్. ఇది మీ చర్మంన్ని నునుపుగా మరియు, ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఈ తేనెను పాలతో కలపడం వల్ల మీ చర్మం మరింత ఫెయిర్ గా, రేడియంట్ గా కనబడుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి మీ ముఖం మీద అప్లై చేయాలి. అప్లై చేసి 15నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మాన్ని మెరిపిస్తుంది మరియు తేమగల చర్మఛాయను పెంపొందిస్తుంది.



స్ట్రాబెర్రీ -క్రీమ్ మాయిశ్చరైజర్: ఇండియన్ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి రోజీ, పింక్, మరియు తెల్లని చర్మ ఛాయను ఇస్తుంది . కొన్ని స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసుకొని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, మరియు ఒక కప్పు క్రీమ్ ను కలిపి, ఈ మిశ్రమాన్ని15నిముషాలు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి కొంత సేపు అలాగే ఉంచి, తడి ఆరిన తర్వాత చేత్తో రుద్ది కడగడం వల్ల ముఖంలో మెరుపుతో పాటు, మంచి చర్మ ఛాయను ఇస్తుంది.


అలోవెర(కలబంద): మూడు టేబుల్ స్పూన్ల ఆలోవెర జెల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్సూన్ గ్రేప్ సీడ్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు సమంగా తీసుకొని రెండూ బాగా కలిసిపోయేలా మిక్స్ చేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు దీన్ని ఉపయోగించడం చాలా మంచిది. ఈ ఇండియన్ మాయిశ్చరైజర్ నిల్వచేయడం మరియు ఉపయోగించడం చాలా సులభం.


కొబ్బరి నూనె మాయిశ్చరైజర్: కొబ్బరి నూనె మరియు నిమ్మరసం మరియు ఆర్గానిక్ హనీ మూడింటిని సమంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ మాయిశ్చరైజర్ డ్రై స్కిన్ కు బాగా నప్పుతుంది. ఈ మాయిశ్చరైజర్ ను కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఉపయోగించవచ్చు. ఈ నేచురల్ స్కిన్ మాయిశ్చరైజర్ మీ చర్మానికి కొత్త జీవితాన్నందిస్తుంది.


ఆపిల్ మాయిశ్చరైజర్: ఆపిల్ ను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ కు అరకప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ ఇండియన్ మాయిశ్చరైజ్ ఆయిల్ కంప్లక్షన్ ఉన్నవారు ఉపయోగించడం ఉత్తమం. ఇది మీ ముఖాన్ని స్మూత్ గా ఉంచుతుంది మరియు చర్మానికి తగినంత తేమను, పోషణను అంధిస్తుంది.


వాల్ నట్ మాయిశ్చరైజర్: కొన్ని వాల్ నట్ సీడ్స్ ను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ కు కొద్దిగా పెరుగు లేదా క్రీమ్ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి అరగంట పాటు అలాగే వదిలేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం మేడ్ ఇండియన్ మాయిశ్చరైజర్ మీ చర్మంలో చైతన్యం నింపడంతో పాటు ప్రకాశవంతమైన మెరుపును ఇస్తుంది.


అందమైన మరియు మెరిసే చర్మాన్ని కలిగి ఉండటం: ఈ కొన్ని ఇండియన్ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ చర్మానికి కొత్త మెరుపులను అంధించడంలో అద్భుతంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. తర్వాత చర్మాన్ని ది మృదువుగా, తేమగా మరియు కాంతివంతంగా మార్చుతాయి.

హెయిర్‌ డై వేసుకోవడం వల్ల పొంచిఉన్న అనారోగ్యం?

ఫ్యాషన్‌ పేరుతో జుట్టుకు తరుచుగా రకరకాల రంగులు వేసుకోవడం ఈనాటి యువతులకు అలవాటైపోయింది. ఆహార్యంలో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగే మాట ఏలా ఉన్నా ... అన్ని సమయాలలో జుట్టుకు రంగులు వేయటం అంత మంచిది కాదు. అందుకే ఈనాటి యువతులు ఫ్యాషన్‌కు ఎంతగా ప్రాధాన్యత ఇస్తునప్పటికీ... జుట్టుకు రంగులు వేసుకోవడాన్ని మాత్రం కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేయాలి.

లేకపోతే తలకు తరచూ రకరకాల రంగులు వేసుకోవటం వల్ల జుట్టు పొడిబారిపోయే ప్రమాదం పొంచి వుంది.వయసు పెరుగుతున్నా అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. అయితే, ఇందుకోసం ఉపయోగించే ప్రాడెక్ట్‌‌సలో కెమికల్స్‌ ప్రభావం ఏమిటో ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే, హెయిర్‌ డయిస్‌ లోని కెమికల్స్‌ యమడేంజర్‌ అని తేలిపోయింది. కాబట్టి హెయిర్‌ డై చేయించుకోవాల్నుకున్నపుడు తాస్మాత్‌ జగ్రత్తా...జుట్టు నెరవడం ఓల్డ్‌ ఏజ్‌కు గుర్తని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసుపైబడుతున్నా జుట్టు నెరవడంలేదు.

ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించడంలేదు. ఇదేదో ప్రకృతిచేసిన మాయాజాలం అనుకుంటే పొరపాటే. కెమికల్స్‌ చేస్తున్న ఇంద్రజాలం. అవును, ప్రపంచమంతటా కోట్లాదిమంది వాడుతున్న హెయిర్‌ డైయిస్‌ లోని రసాయనాలే జుత్తు రంగును చిటికలో మార్చేస్తున్నాయి. అయితే, కోట్లాది మంది వాడుతున్న కెమికల్‌ రసాయనాలతో తయారయ్యే హెయిర్‌ డయిస్‌ వాడటం మంచిదేనా? శరీరానికి ఎలాంటి హానీ చేయవా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.


హెయిర్‌ డయిస్‌ ను ఉత్పత్తి చేస్తోన్న వందలాది కంపెనీలు సలహాలు పాటించకుండా విచ్చలవిడిగా కెమికల్స్‌ను ఉపయోగిస్తూ ఆనారోగ్యంతో చెలాగాటం అడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.ఈ హెయిర్‌ డైస్‌ ద్వారా ఏటా కోట్లాది బిజినెస్‌ జరుగుతుందంటే ఆశ్చర్యపోనవసరంలేదు. మరి ఇంతటి ప్రమాదకరమైన రసాయనంపై నిషేధం లేదా? ప్రపంచదేశాలు దీన్ని యథేచ్ఛగా ఎందుకు వాడనిస్తున్నాయి ? నిజమే, పిపిడీ అత్యంత ప్రమాదకరమైనదన్న సంగతి తెలుసు. అయినా దీనిపై ఎక్కడా నిషేదం లేదు.

హెయిర్‌ డై వేసుకోవడం వల్ల పొంచిఉన్న అనారోగ్యం?

ఈ రసాయనాన్ని కలర్‌ ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ లోనూ, రబ్బర్‌ ఆక్సిడేషన్‌ లోనూ వాడుతున్నారు. జట్టుకు రంగేసుకోవడం ఇప్పుడు ఓ సాధారణమైన చర్యగా మారిపోయింది. సునాయాసంగా కేశాలకు రంగు పట్టించుకునే అవకాశం రావడంతో క్రేజ్‌ పెరిగిపోయింది. జుట్టు రంగు ఏమాత్రం మారినా వెంటనే హెయిర్‌ డై వాడేస్తున్నారు.

పర్మనెంట్ హెయిర్ కలర్ లేదా డై‌లలో పైరాఫినిలేటిడ్ పిపిడి అనబడే రసాయనాన్ని వీటిలో కలుపుతుంటారు. ఈ పిపిడి వలన వెంట్రుకలపై రంగు చాలా రోజులవరకు ఉంటుందనేది వాస్తవం. కాని మీ వెంట్రుకల పరిస్థితిని కూడా దృష్టిలో వుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వీటివలన చర్మంపై ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. వెంట్రుకలు రాలిపోవడం, కళ్ళు, చెవులు, తలపైనున్న చర్మం, ముఖంపైనున్న చర్మంపై దీని ప్రభావం వుంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

కొన్నిసందర్భాలలో పిపిడి రియాక్షన్‌కు కూడా దారితీస్తుంది. దీంతో రియాక్షన్ బారిన పడినవారిని ఆసుపత్రిలో చేర్పించిన సందర్భాలుకూడావున్నాయి.ఓవైపు హైయిర్ కలర్, హెయిర్ డై తయారు చేసే కంపెనీలు హెచ్చరికల ప్రకటన వారిచ్చే ప్రిస్క్రిప్షన్‌లో పొందుపరిచేవుంటారు. కాని చాలవరకు దీనిని వాడేవారు పెద్దగా పట్టించుకోరు. అలాగే టాటూ లేక కాలీ మెహిందీలో పిపిడి కలిసివుంటుంది. ఇది చాలా హానికారకమైంది.మనం వాడే హెయిర్‌ డైలో విషతుల్యమైన పీపీడీ ఉన్నట్టు ఎలా గుర్తించడం ?

హెయిర్‌ డై ప్యాక్‌ లో రెండు సీసాలున్నాయా ? అయితే, తప్పనిసరిగా అందులో ఒకటి పీపీడీ అయి ఉంటుంది పీపీడీ తెల్లగా ఉండే ద్రావకం.. దీని గురించి జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే.. పీపీడీ వల్ల ఆస్తమా రావచ్చు. కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడవ్వొచ్చు. సెలూన్లలో పనిచేసేవారు రోజూ పీపీడీ ఘాటు పీల్చడంవల్ల త్వరలోనే అస్వస్థులు కావచ్చు. అయితే, హెయిర్‌ డయిస్‌ కంపెనీలు మాత్రం తామ ఉత్పత్తుల వల్ల హాని కలగదనే అంటున్నాయి. మరి ఇదే హెయిర్‌ డయిస్‌ లోని రసాయనాలు చేస్తున్న మాయాజాలం మాటేమిటి?

ఈ సులభ చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా బొజ్జ పెరగదు!

ప్రస్తుత జీవన విధానంలో రకరకాలుగా వస్తున్న మార్పులు అందుకు కారణం సరైన ఆరోగ్య నియమాలు పాటించకపోవడం. అంతేకాకుండా పని వేళల్లో తేడాలు అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. దీంతో ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటప్పుడు సరైన ఆహార నియమాలు పాటించకుండా ఎన్ని వర్కవుట్స్ చేసినా ఫలితం శూన్యం. నలభై ఏళ్లు దాటాక చాలా మంది మహిళలు, పురుషులు లావెక్కుతూ ఉంటారు. కొందరిక పొట్ట వస్తుంది. కారణం వారి శరీరంలో అదనంగా కొవ్వు వచ్చి చేరడమే. ఇలా చేరిన కొవ్వును కరిగించాలంటే వ్యాయామం చేయక తప్పదు. అయితే కేవలం వ్యాయామాల వల్లే కొవ్వు మొత్తం కరిగిపోదు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను ఈ కొవ్వును కరిగించేందుకు తోడ్పడతాయి.


అధిక బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో కొన్ని శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల భారీన పడకుండా క్రొవ్వు కరిగించుకొని పొట్టతగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. కొవ్వును కరిగించే కొన్ని ప్రభావవంతమైన ఆహరాలు కొన్ని ఉన్నాయి. అవి కనుక రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే తప్పనిసరిగా, మీ శరీరంలో.. మీ నడుం చుట్టూ పేరుకొన్న అధనపు కొవ్వు తగ్గి ఖచ్చితంగా కొన్ని అంగుళాలు నడుము తగ్గడాన్ని మీరు గమనించవచ్చు.

శరీరంలో ఫ్యాట్ కరిగించాలంటే ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. చాలా మంది తీసుకొనే ఆహారం తగ్గించడం వల్ల బరువు తగ్గవచ్చు అనుకుంటారు. అయితే మీ వైయిట్ లాస్ ప్లాన్ లో కొన్ని ఆహారాలను చేర్చుకోవల్సినవి, రెగ్యులర్ డైట్ నుండి కొన్ని ఆహారాలను మినహాయించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఉదా: డైటింగ్ లో ఉన్నానంటూ రెండు పకోడాలను తినేయకూడదు. ఫ్రై చేసిన ఆహారాలను తినడానికి బదులు, వాటి స్థానంలో ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్(సిట్రస్ పండ్లు మరియు ఉడికించిన ఆకుకూరాలు)తీసుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైనవి మరియు బరువు తగ్గించడానికి సహాయపడుతాయి. శరీరంలో అధిక కొవ్వు చేరకుండా, అదనపు కొవ్వును కరిగించడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో న్యూట్రిషన్ ఎక్స్‌ పర్ట్స్ చెబుతున్న సలహాలు...



శరీరం నుండి కొవ్వును కరిగించడంలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఇంటి చిట్కా. లోకాలరీ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంతో పాటు గుండెను సురక్షితంగా ఉంచి, గుండె ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుంది.


రెగ్యులర్ గా వ్యాయం చేయడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. శరీర అవయవాల్లో అదనంగా పేరుకొన్న కొవ్వు నిల్వలను కరిగిస్తుంది. ఉదా, తొడలు, బెల్లీ మరియు చేతి కండాల వద్ద ఉన్న అదనపు ఫ్యాట్ ను కరిగిస్తుంది.




పంచదార పూర్తి శరీర ఆరోగ్యానికి శత్రువు వంటిది. శరీరం నుండి ఫ్యాట్ తగ్గించడంలో ఇంటి చిట్కాలలో ఇది ఒకటి, మీ డైలీ డైట్ నుండి పంచదారను తీసుకోవడం నివారించాలి. పంచదారకు బదులుగా తేనె లేదా బెల్లంను వాడుకోవాలి.


ఇది ఆహారం కాకపోయినా, బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరం లో తేమనుంచుతుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే కొద్ది వారాలలో మీకు ఫలితం కనిపిస్తుంది. వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కూడా బరువు తగ్గటంలో ఫలితాలు వేగంగా వుంటాయి. మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి నీళ్ళు బాగా సహాయపడుతాయి. భోజనానికి ముందు కొన్ని నీళ్ళు త్రాగడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి తక్కువగా తినేలా చేస్తుంది.



చాలా మంది డైటీషియన్స్ ప్రకారం, వైయిట్ లాస్ డైట్ లో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ ను చేర్చుకోవడం వల్ల, శరీరం నుండి కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది




సోడియం శరీరంలో నీటిని తగ్గించేస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ఉప్పు తీసుకోవడం తగ్గించండి. సోడియంకు ప్రత్యామ్నాయంగా హెల్తీ హెర్బ్స్ ను, చెక్క వంటి స్పైసీలను ఉపయోగించడం మంచిది.


విటమిన్ సి ఆహారాలు మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అంధించడం మాత్రమే కాదు, శరీరం యొక్క జీవక్రియల రేటును పెంచుతుంది. క్యారెట్లు, సిట్రస్ పండ్లలో నిల్వ ఉండే విటమిన్ సి అందుకు బాగా సహకరించడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది. మీ ఫ్లాబ్ తగ్గించడం కోసం ఆసక్తి ఉంటే, అందుకు బ్రేక్ ఫాస్ంట్ లో ఆరెంజ్, తాజా నిమ్మరసం, తీసుకోండి. లేదా తాజా పండ్లను నారింజ, నిమ్మ, జామ వంటివి అలాగే తీసుకోవడం వల్ల కూడా కొవ్వు కరిగించుకోవచ్చు. సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు, ఆరెంజస్ వంటి పండ్లు, కేరట్, కేబేజి, బ్రక్కోలి, యాపిల్, వాటర్ మెలన్ వంటి కూరలు పండ్లు శరీరంలోని కొవ్వును కరగించి, కణాలలోని అధిక నీటిని కూడా పీల్చేస్తాయి.


మీరు ప్రతి రోజూ తగినంత నిద్ర పొందుటకు నిర్ధారించుకోండి. నిద్రలేమి లేదా కలత నిద్ర వల్ల కూడా బరువు పెరుగుతారు. కాబట్టి, సరైన నిద్ర చాలా అవసరం.


కొవ్వు తగ్గించాలను కొనే వాళ్ళకు నిమ్మరసం బెస్ట్ అయితే తీపి కలిగిన పానీయాలకంటే మంచినీళ్ళు తాగడమే ఉతమమని నిపుణులు.కొవ్వు తగ్గించుకోవడానికి ఉదయం పూటీ తీసుకొనే తేనె ఉత్తమమైన మార్గం. తేనెను వేడినీటిలో వేసి బాగా గిలకొట్టి ఉదయం పరగడుపున సేవించాలి. ఇది ఊబకాయస్తులకు ఒక దివ్వ ఔషదం వంటిది. ఈ పద్దతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వేడి నీటిలో తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. తియ్యనైన తేనెను ఏదీ కలపకుండా కూడా తీసుకోవచ్చు. తేనెలోని కార్బో హైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరచి బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రిస్తాయి. బరువు వేగంగా తగ్గాలంటే, షుగర్ కు బదులు తేనెవాడండి.


బరువు పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం ఒత్తిడి. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారు ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది.