ప్రతి రోజూ బహిర్గతమయ్యే మీ చర్మం ప్రస్తుతం ఉండాల్సిన దానికంటే, ఎక్కువగా లేదా వయస్సు మళ్ళినవారిగా కనబడేలా చేస్తోందా? కఠినమైన వాతావరణం కారణంగా మీ చర్మం త్వరగా పొడిబారుతోందా? మరి పొడి చర్మం వల్ల ముఖంలో ముడుతలు మరియు ఫైన్ లైన్స్ ఏర్పడుతాయి. క్రమం తప్పకుండా మీ చర్మాన్నితేమగా ఉంచుకోడం మీ రోజు కార్యక్రమంలో ఒక కీలక భాగం.మాయిశ్చరైజింగ్ వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా, మరియు మెరుస్తుండేలా చేస్తుంది.
కానీ, కఠినమైన రసాయనాలు కలిగిన మాయిశ్చరైజర్ ను బయటకు కొనడం కంటే, మన ఇండియన్ హోం మేడ్ వస్తువులను మాయిశ్చరైజర్ల గా ఎందుకు ఉపయోగించ కూడదు? ఇవి చర్మానికి ఉపశమనం కలిగించడానికి చాలా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అటువంటి కొన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ నేచురల్, ఇండియన్ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ ను మీరు ఉపయోగించి మీ అందాన్ని రక్షించుకోండి..
కానీ, కఠినమైన రసాయనాలు కలిగిన మాయిశ్చరైజర్ ను బయటకు కొనడం కంటే, మన ఇండియన్ హోం మేడ్ వస్తువులను మాయిశ్చరైజర్ల గా ఎందుకు ఉపయోగించ కూడదు? ఇవి చర్మానికి ఉపశమనం కలిగించడానికి చాలా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అటువంటి కొన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ నేచురల్, ఇండియన్ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ ను మీరు ఉపయోగించి మీ అందాన్ని రక్షించుకోండి..
తేనె -పాలు మాయిశ్చరైజర్: తేనె అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్. ఇది మీ చర్మంన్ని నునుపుగా మరియు, ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఈ తేనెను పాలతో కలపడం వల్ల మీ చర్మం మరింత ఫెయిర్ గా, రేడియంట్ గా కనబడుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి మీ ముఖం మీద అప్లై చేయాలి. అప్లై చేసి 15నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మాన్ని మెరిపిస్తుంది మరియు తేమగల చర్మఛాయను పెంపొందిస్తుంది.
స్ట్రాబెర్రీ -క్రీమ్ మాయిశ్చరైజర్: ఇండియన్ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి రోజీ, పింక్, మరియు తెల్లని చర్మ ఛాయను ఇస్తుంది . కొన్ని స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసుకొని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, మరియు ఒక కప్పు క్రీమ్ ను కలిపి, ఈ మిశ్రమాన్ని15నిముషాలు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి కొంత సేపు అలాగే ఉంచి, తడి ఆరిన తర్వాత చేత్తో రుద్ది కడగడం వల్ల ముఖంలో మెరుపుతో పాటు, మంచి చర్మ ఛాయను ఇస్తుంది.
అలోవెర(కలబంద): మూడు టేబుల్ స్పూన్ల ఆలోవెర జెల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్సూన్ గ్రేప్ సీడ్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు సమంగా తీసుకొని రెండూ బాగా కలిసిపోయేలా మిక్స్ చేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు దీన్ని ఉపయోగించడం చాలా మంచిది. ఈ ఇండియన్ మాయిశ్చరైజర్ నిల్వచేయడం మరియు ఉపయోగించడం చాలా సులభం.
కొబ్బరి నూనె మాయిశ్చరైజర్: కొబ్బరి నూనె మరియు నిమ్మరసం మరియు ఆర్గానిక్ హనీ మూడింటిని సమంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ మాయిశ్చరైజర్ డ్రై స్కిన్ కు బాగా నప్పుతుంది. ఈ మాయిశ్చరైజర్ ను కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఉపయోగించవచ్చు. ఈ నేచురల్ స్కిన్ మాయిశ్చరైజర్ మీ చర్మానికి కొత్త జీవితాన్నందిస్తుంది.
ఆపిల్ మాయిశ్చరైజర్: ఆపిల్ ను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ కు అరకప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ ఇండియన్ మాయిశ్చరైజ్ ఆయిల్ కంప్లక్షన్ ఉన్నవారు ఉపయోగించడం ఉత్తమం. ఇది మీ ముఖాన్ని స్మూత్ గా ఉంచుతుంది మరియు చర్మానికి తగినంత తేమను, పోషణను అంధిస్తుంది.
వాల్ నట్ మాయిశ్చరైజర్: కొన్ని వాల్ నట్ సీడ్స్ ను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ కు కొద్దిగా పెరుగు లేదా క్రీమ్ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి అరగంట పాటు అలాగే వదిలేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం మేడ్ ఇండియన్ మాయిశ్చరైజర్ మీ చర్మంలో చైతన్యం నింపడంతో పాటు ప్రకాశవంతమైన మెరుపును ఇస్తుంది.
అందమైన మరియు మెరిసే చర్మాన్ని కలిగి ఉండటం: ఈ కొన్ని ఇండియన్ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ చర్మానికి కొత్త మెరుపులను అంధించడంలో అద్భుతంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. తర్వాత చర్మాన్ని ది మృదువుగా, తేమగా మరియు కాంతివంతంగా మార్చుతాయి.
No comments:
Post a Comment