all

Monday, November 26, 2012

విభిన్న రుచితో నీలగిరి చికెన్ కుర్మా

కావలసిన పదార్థాలు:
చికెన్ ముక్కలు: 1/2kg
ఉల్లిపాయలు: 2(సన్నగా తరగాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టొమాటో: 1 లేదా 2 (సన్నగా కట్ చేయాలి)
కారం: 1tsp
నిమ్మరసం: 1tbsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె: సరిపడా
కొత్తిమీర: తగినంత
వేయించడానికి కావలసినవి:
జీలకర్ర: 1tsp
సోంపు: 1tsp
గసగసాలు: 1tsp
దాల్చిన చెక్క: చిన్నముక్క
ఏలకులు: 2-3
పచ్చి కొబ్బరి తురుము: 1/2cup
జీడిపప్పు: 10
శనగలు: 1tsp(కొద్దిగా నూనె వేసి, ఐదు నిముషాలు వేయించాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
చిన్న ఉల్లిపాయలు: 10
పచ్చిమిర్చి: 4
కొత్తిమీర తరుగు: 3tbsp
పుదీనా ఆకులు: 1/4cup
Nilgiri Chicken Korma
తయారు చేయు విధానం:
1. ముందుగా వేయించడానికి తయారు చేసిన పదార్థాలన్నింటిని స్టౌ మీద పాన్ పెట్టి ఒక దాని తర్వాత ఒకటి దోరగా అతి తక్కువ మంటలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వేయించిన పదార్థాలు చల్లబడిన తర్వాత వాటిని మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి.
4. అందులోనే కారం, పసుపు, ఉప్పు కలపాలి టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
5. టమోటో మెత్తబడి నూనె పైకి తేలే సమయంలో వేయించి, గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా మిశ్రమాన్ని వేసి మరో పది నిముషాలు ఉంచాలి.
6. తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్‌ లో ఉంచాలి చికెన్ ముక్కలు ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, స్టౌ ఆఫ్ చేయాలి అంతే నీలగిరి చికెన్ కుర్మా రెడీ. ఇది పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి నీలగిరి చికెన్ కుర్మా చాలా బాగుంటుంది.

ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై రుచి అమోఘం..

చేపలంటే చాలా మంది ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో ఆంధ్రా ఫిష్ కూడా ఒకటి. ఆంధ్రా ఫిష్ టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఆంధ్రా స్టైల్ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ ఫిష్ ప్రైను ఏప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు టేస్ట్ చూసేయండి...
andhra style fish fry recipe

ఫిష్ ఫిల్లెట్ (చేపముక్కలు): 8
కరివేపాకు: ఒక రెమ్మ
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు రుచికి తగినంత
మారినేట్(చేపముక్కలను మసాలాలో నానబెట్టుటకు)
ఉల్లిపాయ: 1(కట్ చేసినవి)
వెల్లుల్లి రెబ్బలు: 5
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: 1tsp
ధనియాలు: 1tsp
మెంతులు: 1/2tsp
ఎండు మిర్చి: 4
పసుపు: 1/2tsp
గరం మసాలా: 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫిష్ ఫిల్లెట్స్ నీటిలో శుభ్రంగా కడిగి, తర్వాత చేప ముక్కలకు ఉప్పు, పసుపు వేసి బాగా రుద్ది పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు మారినేట్ కు రెడీ చేసుకొన్న మసాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా మెత్తగా గట్టిగా ఉండేలా గ్రైడ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు చేపముక్కలకు గ్రైడ్ చేసుకొన్న పేస్ట్ ను బాగా అన్నివైపులా పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు వేసి లైట్ గా వేయించుకోవాలి.
5. ఇప్పుడు మసాలా పట్టించిన చేపముక్కలను తీసుకొని ఫ్రైయింగ్ పాన్ లో ఒకటి లేదా రెండు వేసి తగినంత నూనె వేస్తూ తక్కువ మంట మీద పది నిమిషాల పాటు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి.
6. చేపముక్కలు నూనెలో బాగా వేగి బ్రౌన్ కలర్ మారిన తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడి అన్నం, పాలక్ పప్పు తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. పప్పురసం అయితే మరీ రుచిగా ఇంకాస్తా ఎక్కువ తినాల్సిందే...

వెరైటీ బ్రేక్ ఫాస్ట్ పెపసరపప్పు పరోటా

కావలసిన పదార్థాలు:
గోధుమపిండి: 1cup
నూనె: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
పెసరపప్పు: 1/2 cup
జీలకర్ర: 1tsp
పసుపు: చిటికెడు
ఇంగువ: చిటికెడు
కారం: 2tsp
Gramdal Pesarapappu Parata
తయారు చేయు విధానం:
1. ముందుగా గోధుమపిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పొట్టులేని పెసరపప్పును కడిగి రెండు గంటపాటు నానబెట్టుకోవాలి.
3. తర్వాత పప్పులో గ్లాసునీళ్లు పోసి కుక్కర్ లో ఉడికించాలి.
4. ఇప్పుడు పాన్ లో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఇంగువ, జోడించాలి. ఆపై ఉడించిన పెసరపప్పు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. పప్పు గట్టిపడ్డాక దించేయాలి.
5. తర్వాత గోధుము పిండిని కాస్త చిన్న ఉండలా చేసి చపాతీ ఒత్తుకోవాలి. మధ్యలో పప్పుకూరను నింపి మరో చపాతీతో కప్పేయాలి.
6. ఇలా అన్ని రెడీ చేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక వాటిని నూనెతో కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా సమానంగా వేగాక తీస్తే సరి. వేడి వేడి పరోటో సిద్దం. దీన్ని ఏదేని చట్నీ లేదా కుర్మాతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
    


లోక్యాలరీ హెల్తీ ఫ్రైడ్ రైస్

కర్రీ ఫ్రైడ్ రైస్ చాలా సులభమైనటువంటి వంటకం. కరివేపాకు సువాసనతో తయారైటటువంటి ఈ కర్రీ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకానికి రుచి కూడా కరివేపాకు వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. ఇంకా ఈ వంటకు ఎండు కరివేపాకు లేదా కరివేపాకు పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఫ్రై రైస్ వెరైటీలలో ఇది కూడా ఒక వైరైటీయే. దీనికి సోయాసాస్, అజినామోటోతో మరింత రుచి కూడా. ఈ వంటకం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెజిటేబుల్స్ వాడటం వల్ల లోకాలరీస్ ను కలిగిఉంటుంది. మరీ ఈ సింపుల్ రిసిపినీ మీరు ట్రై చేసి కొత్త రుచిని టేస్ట్ చేయండి..
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉల్లిపాయలు: 2-3(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
క్యారెట్: 1cup(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
బీన్స్: 1cup(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా తరిక్కోవాలి)
జీడిపప్పు: 1/2cup
కర్రీ పౌడర్: 2-3tbsp
సోయా సాస్: 1-2tbsp
అజినామాటో: 1tsp
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
Curry Fried Rice
తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో బియ్యం కడిగి సరిపడా(నాలుగు కప్పుల) నీళ్ళు పోసి, కరివేపాకు వేసి మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకూ పూర్తిగా మంట పెట్టి ఉడకనివ్వాలి.
2. ఒకటి లేదా రెండు విజల్ కు ప్రెజర్ కుక్కర్ ను క్రిందికి దింపుకొని, ఆవిరి అంతా పోయేంత వరకూ అలాగే పక్కన పెట్టేయాలి.
3. అంతలోపు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిఅయ్యాక ఉల్లిపాయల ముక్కలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతగా వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే క్యారెట్, బీన్స్ , క్యాప్సికమ్ ముక్కలను, కొద్దిగా ఉప్పును చేర్చి మీడియం మంట మీద పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే జీడిపప్పు, కర్రీ (సాంబార్)పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత సోయా సాస్ వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి.
6. సోయాసాస్ కలర్ పూర్తిగా వచ్చిన తర్వాత అజినామోటోను కూడా వేసి కలపాలి.
7. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత తీసి పొడి పొడిగా చేసి పెట్టుకొన్న అన్నం ను వెజిటేబుల్ ఫ్రైలో వేసి, బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే తక్కువ మంట మీద ఉంచాలి. దాంతో వెజిటేబుల్ ముక్కలన్నీ అన్నంతో కలిసిపోయి మంచి టేస్ట్ ను అందిస్తుంది. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే కర్రీ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని ఏదేని గ్రేవీతో కానీ, గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేయవచ్చు.

బ్రెడ్ రోల్ - స్పైసీ వెజిటేరియన్ స్నాక్

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్: 8-10
బంగాళదుంప: 2-3(ఉడికించి పొట్టు తీసినవి)
పచ్చిబఠాని: 1cup
నిమ్మరసం: 1tbsp
బ్లాక్ పెప్పర్(మిరియాలు): 2tbsp
చీజ్: 9-10tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup
Bread Roll Vegetarian Recipe
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను బాగా ఉడికించి పొట్టు తీసి, ఒక బౌల్ లోనికి తీసుకొని దానికి కొద్దిగా ఉప్పు చేర్చి మెత్తగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు చిదిమి పెట్టుకొన్న పొటాటోకి పచ్చిబఠాని, నిమ్మరసం, మరియు బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలగలిపి పెట్టుకోవాలి.
3. తర్వాత బ్రెడ్ పీసులను తీసుకొని కత్తితో బ్రెడ్ చివర్లను కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని బ్రెడ్ స్లైసెస్ మీద రెండు వైపులా చిలకరించాలి. అప్పుడు బ్రెడ్ స్లైస్ మెత్తబడుతాయి. (నీళ్లును ఎక్కువగా పోయకూడదు లైట్ గా చల్లుకొంటే సరిపోతుంది)
4. నీళ్లు చిలకరించిన తర్వాత బ్రెడ్ పీస్ ను చేతులోనికి తీసుకొని రెండు చేతులతో అదిమి పట్టుకొంటే ఏమైన తడి(నీళ్ళు) ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బ్రెడ్ లో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి దాని మీద మరో బ్రెడ్ ను పెట్టి, బ్రెడ్ ను రోల్ చేయాలి. తర్వాత చెండు వైపుల చివర్లును అదిమితే బ్రెడ్ లో ఉన్న తడి వల్ల రెండు వైపులా క్లోజ్ అవుతాయి.
5. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ ను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు అందులో నూనె వేసి తక్కువ మంట పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ రోల్స్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. (ఒక వేళ బ్రెడ్ రోల్స్ లో నూనె ఎక్కువగా ఉన్నట్లైతే కిచెన్ టిష్యు పేపర్ తో వత్తితే ఆయిల్ పూర్తిగా పీల్చుకొంటుంది). అంతే సర్వ్ చేయడానికి బ్రెడ్ వెజిటేబుల్ రోల్స్ రెడీ .

స్పైసీ మట్టర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్

చల్లగా ఉండే ఈ శీతాకాలంలో వేడివేడిగా రైస్ వెరైటీస్ నోరూరిస్తాయి. ఈజీగా చేసుకోగల ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది.కొంచెం స్పైసీగా లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది
కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం: 2cups
పనీర్ : 150grms
పచ్చిబఠాణీ: 1/2cup
కారట్ తురుము: 1/2cup
కొబ్బరితురుము: 1/2cup
ఉల్లిపాయ: 2
పచ్చి మిర్చి : 4-6
కొత్తిమీర : ఒక కట్ట
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2tbps
గరంమసాలా పొడి: 2tbps
మిరియాలపొడి: 1tps
టమాటాసాస్: 2tbps
రెడ్ చిల్లీ సాస్ : 1tbps
కొద్దిగా కాజూ
ఉప్పు: రుచికి తగినంత
కారం : 1/2tsp
నూనె : సరిపడా
Mutter Paneer Fried Rice

తయారు చేసే విధానం:
1. ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో కాజూ, పనీర్ ముక్కలు వేయించి తీసుకోవాలి.
3. తర్వాత అందులోనే మరికొంచెం నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చివేసి దోరగా వేయించాలి. ఇందులో కారట్ తురుము, ఉడికించిన బఠాణీలు, కొబ్బరితురుము కూడా వేసి కలిపి వేయించాలి.
3. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, సాస్ లు వేసి బాగా కలిపి వేగిన తరువాత పనీర్ ముక్కలు, అన్నం వేయాలి.
4. వెంటనే తగినంత ఉప్పు, మిరియాలపొడి, గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుతూ సన్నని మంటపై వేయించుకోవాలి. ఒక ప్లేట్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర, వేయించిన కాజూతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ చేయాలి.

స్పైసీ బోన్ లెస్ చిల్లీ చికెన్

కావలసిన పదార్థాలు:బోన్ లెస్ చికెన్: 1(కావలసిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
కాశ్మిరి చిల్లీ పౌడర్: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
సోయా సాస్: 2tbsp
పెరుగు: 1tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 4
చిల్లీ సాస్: 2tbsp
టమోటో సాస్: 2tbsp
క్యాప్సికమ్: 1(రెడ్ క్యాప్సికమ్)
క్యాప్సికమ్: 1(గ్రీన్ క్యాప్సికమ్)
మిరియాలపొడి: 1tsp
Boneless Chilli Chicken
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాశ్మిరీ చిల్లి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, ఉప్పు, పెరుగు, కారం, కార్న్ ఫ్లోర్ అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులోనే శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మసాలా అంటించిన చికెన్ ను అరగంట పాటు అలాగే పక్కన పెట్టేసుకోవాలి.
4. అరగంట తర్వాత ఒక పాన్ లో ఈ మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి లైట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి లైట్ గా వేగిన వెంటనే చిల్లీ సాన్, సోయాసాస్, టమోటో సాస్, వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
6. 5-10నిముషాల తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను అందులో వేసి ఫ్రై చేయాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ చల్లి తక్కువ మంట మీద మరో రెండు నిమిషాలు అలాగే పెట్టాలి.
7. తర్వాత రెడ్ మరియు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలను వేసి చికెన్ తో పాటు మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. అంతే బోల్ లెస్ చిల్లీ చికెన్ రెడీ.
8. చికెన్ ను కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేయాలి.
నోట్: కాశ్మిరీ చిల్లి పౌడర్ కు బదులు ఇంట్లో సాధారణంగా ఉపయోగించి చిల్లీ పౌడర్ ఉపయోగించవచ్చు.

5 సూపర్ హెల్తీ కార్న్ వంటకాలు-మాన్ సూన్ స్పెషల్..

వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్కజొన్న కండెల అమ్మకాలు ఊపందుకుంటాయి. చల్లచల్లని సాయంత్రాల్లో వేడివేడి గింజలను లాగించేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. వాటిని తినమనే వారు బహుశా తక్కువే. మొక్క జొన్నలో యాంటీఆక్సిండెంట్స్ మరియు ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. కార్న్ ను ఆహారంలో ఉపయోగించడం చాలా సులభం. మరియు ఆరోగ్యకరం. మొక్క జొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని సాధారణంగా జొన్నలని కూడా అంటారు. ఈ మొక్క జొన్న గింజలను వివిధ రకాలుగా వండుతారు.

కండెలుగా ఉన్నపుడే వాటిని తీపివిగా తినేయవచ్చు. లేదా వాటికి మసాలాలు, కారాలు కూడా తగిలించి తింటారు. గ్రేవీలో వేసి ప్రైడ్ రైస్ తో కలిపి తినవచ్చు. లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటివాటితో కూడా చేర్చి సాయంకాలంవేళ మంచి చిరుతిండిగా తినేయవచ్చు. మొక్కజొన్న కండెలును సాధారణంగా మనం నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటాం లేదా కాల్చిన మొక్క జొన్న కండెలకు వివిధ కారాలు, ఉప్పులు రాసికూడా తినేస్తాం.
మొక్క జొన్న తినటం రుచే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మొక్కజొన్న కండెలలోని ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రీయను పెంపొందిస్తుంది. మొక్క జొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది. ఎముకల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ, దృఢత్వానికీ ఉపయోగించే కాల్షియం, భాస్వరం ఇందులో ఉన్నాయి. డయాబెటీస్ రోగులు మొక్కజొన్న తిన్నట్లయితే శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి అధిక రక్తపోటు రాకుండా చేస్తుంది. గుండెకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే 5 హెల్తీ మొక్కజొన్న వంటలు ఈ వర్షాకాల సందర్భంగా మీకోసం...

కార్న్ భేల్ సలాడ్


కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్ప్ గింజలు: 1cup, కీరదోస కాయ : 1పెద్దది(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ: 1చిన్నది(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చికొబ్బరి తురుము: 1tbsp, పచ్చిమిర్చి: 1(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి), నిమ్మరసం మరియు ఉప్పు: రుచికి సరిపడా.




స్పైసీ కార్న్ కబ్

కావలసిన పదార్థాలు: తాజాగా ఉన్న మొక్కజొన్న కండెలు: 2 లేదా 3, నీళ్ళు: మొక్కజొన్న ఉడికించడానికి సరిపడా, ఉప్పు: రుచికి సరిపడా, నిమ్మకాయ: 1/2భాగం, కొత్తిమీర : గార్నిష్ కోసం 1tbs, తయారు చేయు విధానం: ముందుగా బౌల్ సగభాగానికి నీటి నింపు అందులో మొక్కజొన్న కండెలను పెద్దవి లేదా సగానికి కట్ చేసి వేసి, మూత పెట్టి బాగా ఉడికించాలి. మొక్కజొన్న గింజలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పది -పదిహేను నిముషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత పై మూత తీసి, మొక్కజొన్న కండెలను ప్లేట్ లోనికి తీసుకొని వాటికి నిమ్మరతొక్కతో ఉప్పు కారం పట్టించి తర్వాత దాని మీద కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.



అవొకాడో కార్న్ సలాడ్

కావలసిన పదార్థాలు: అవొకాడో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), కార్న్ సీడ్స్: 1cup, ఎర్రని టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి), కొత్తమీర తరుగు: 1tbsp, నిమ్మరసం: 2tbsp, ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి, బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా. తయారు చేయు విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పై చెప్పిన పదార్థాలన్నింటిని వేసి బాగామిక్స్ చేసి పదినిముషాల అలాగే ఉంచి ఆ తర్వాత సర్వ్ చేయాలి. అంతే అవొకాడో కార్న్ సలాడ్ రెడీ...


మెక్సికన్ గ్రిల్డ్ కార్న్


కావలసిన పదార్థాలు: మోయొనైజ్: 2tbsp, పెరుగు: 2tbsp, కారం: 1tsp, మొక్కజొన్న పొత్తులు: 4(పొడవైనవి, నిమ్మరసం: 1tsp, చీజ్: 2tbsp. తయారు చేయు విధానం: ముందుగా గ్రిల్ ను బాగా వేడి చేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మోయొనైజ్, పెరుగు, మరియు కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొక్కజొన్న పొత్తులకు బాగా పట్టించి వేడివేడి గా ఉన్న గ్రిల్(ఇనుప చువ్వల)మీద పెట్టి మీడియం మంట మీద బాగా కాల్చాలి. అన్నీ వైపులా బాగా కాలేలా చూసుకొని తర్వాత పక్కకు తీసుకొని చీజ్ మరియు నిమ్మరసంతో గార్నిష్ చేసి వేడి వేడి గా అందించాలి.

కార్న్ బ్రెడ్


కావలసిన పదార్థాలు: కార్న్: 1cup, మైదా: 1cup, పంచదార: 1tbsp, బేకింగ్ పౌడర్: 1tsp, ఉప్పు: 1tsp, పాలు: 1cup, ఆలివ్ నూనె: 1/2cup, గుడ్డు: 1. తయారు చేయు విధానం: ఓవెన్ ను 400డిగ్రీలో పెట్టాలి. తర్వాత ఒక బౌల్లో నూనె, గుడ్డు, బాగా మిక్స్ చేయాలి. మిగిలన పాదార్థాలన్నింటి వెరొక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాల్ని గ్రీస్డ్ పాన్ లో పోసి, బ్రెడ్ ఎంత మంద రావాలనుకొంటే అంత మందాగా ముందు పొడి పదార్థాలని ఆ తర్వాత నూనె, గుడ్డు మిశ్రమాన్ని వేసి 20-25నిమిషాలు బేక్ చేసి బయటకు తీసి గోరువెచ్చగా లేదా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేయాలి. అంతే మాన్ సూన్ స్పెషల్ కార్న్ రిసిపీతో ఎంజాయ్ చేయండి.


వెజిటేబుల్ మ్యాగీ మసాలా

పిల్లలు మరియు పెద్దలు అతి ఇష్టంగా తినే ఫేవర్ డిష్ మ్యాగీ. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సాయంత్రపు స్నాక్ గాను తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, స్కూల్ కు వెళ్ళే పిల్ల, టీనేజర్స్ ఎక్కువగా మ్యాగిని ఎక్కువగా ఇష్టపడుతారు. మ్యాగిని ముఖ్యంగా ఒంటరిగా జీవించే వారు ఎక్కువగా చేసుకొంటుంటారు. ఎందకంటే అతి సులభంగా త్వరగా తయారయ్యేది బ్రేక్ ఫ్యాస్ట్, లచ్, డిన్నర్, స్నాక్ గా రుచికరంగా ఉండేది మ్యాగీయే కదా...మరి కొంచెం వెరైటీగా వెజిటేబుల్ మిక్స్ చేసి మీరు కూడా తయారు చేసి చూడండి...
maggi masala with vegetables

కావలసిన పదార్థాలు:
మ్యాగీ: 2packets(200grms)
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
క్యాప్సికమ్: 1(కట్ చేసినవి)
క్యారెట్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పన్నీర్: 3-4(చిన్న ముక్కలు)
పచ్చిమిర్చి: 4-5(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
అల్లం: చిన్న ముక్క(తురుముకోవాలి)
జీలకర్ర: 1/2tsp
ఓరిగానో: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tsp
నీళ్ళు: 2cups
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాక, అందులో జీలకర్ర వేసి వేయించాలి.
2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లులిపాయలు వేసి రెండు నిముషాల పాటు వేగనివ్వాలి.
3. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్ మరయు క్యారెట్ ముక్కలు వేసి ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి మరియు టమోటో వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఓరిగానో వేసి ఉడికించాలి. సరిపడానీళ్ళు పోసి మరగనివ్వాలి.
5. అంతలోపు ప్యాకెట్ లోని మ్యాగీని తీసి పొడి పొడిగా లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దాన్ని మీద మ్యాగీ మసాలా(మ్యాగీప్యాకెట్ తో పాటు ఇచ్చిఉంటారు)ను చిలకరించాలి.
6. ఇప్పుడు ఈ మ్యాగీని వెజిటేబుల్ ఉడుకుతున్న పాన్ లో వేసి మీడియం మంట మీద రెండు నిముషాల పాటు ఉడికించాలి. నీరుంత చిక్కబడి మ్యాగీ రెడీ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే వెజిటేబుల్ మ్యాగీ మసాలా రెడీ...దీన్ని టమోటో కెచప్ తో వేడి వేడి గా సర్వ్ చేయాలి.

చక్కటి కలర్ ఫుల్ మసాలా అటుకులు

కావలసిన పదార్ధాలు:అటుకులు: 2cups
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-8
బంగాళదుంప: 1
క్యారెట్: 1
టమోటో: 1
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
గరం మసాల పొడి: 1/2tsp
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర: అర కట్ట
పల్లీలు ,జీడిపప్పు: 1/4cup
నూనె,ఉప్పు: సరిపడా
పసుపు: చిటికెడు
నిమ్మకాయ: 1
తాలింపుకు శనగపప్పు,ఆవాలు ,జీలకర్ర,ఎండుమిర్చి
Masala Poha Special Breakfast
తయారు చేయు విధానం:
1. ముందుగా అటుకులు కడిగి నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి .
2. తర్వాత పాన్ లో నూనె వేడిచేసి తాలింపు వేసి జీడిపప్పు,కరివేపాకు కూడా వేసి దోరగా వేయించాలి.
3. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి.
4. ఆలూ ఉడికిన తరువాత తరిగిన టమోటో ముక్కలను కూడా వేసి మగ్గనివ్వాలి.
5. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ ,పసుపు,గరంమసాలపొడి వేసి బాగా కలిపి మెత్తబడ్డాక అటుకులను,తగినంత ఉప్పు కలిపి రెండునిమిషాలు సన్నని సెగపై ఉంచాలి .
6. చివరిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి దించెయ్యాలి.నిమ్మరసం పిండి ఒక బౌల్ లోకి తీసుకుని వేయించిన పల్లీలు, జీడిపప్పుతో అలంకరించి వేడిగా సర్వ్ చయ్యాలి. ఇంకా ఇష్టం ఉంటే ఇందులో ఇంకా కాప్సికం,బీన్స్,బటానీ ఇవి కూడా వేసుకోవచ్చు.

స్పైసీ ఈవెనింగ్ స్నాక్: పొటాటో మిక్స్చర్

కావలసిన పదార్థాలు:
బంగాళదుంప తరుము: 2cups
కార్న్ ఫ్లేక్స్: 1cup
పల్లీలు: 1/2cup
కరివేపాకు: రెండు రెమ్మలు
బఠాణీలు: 1/2cup
ఎండుమిర్చి: 4-6
పసుపు : చిటికెడు
కారం: 2tsp
ధనియాలపొడి: 2tsp
మిరియాలపొడి: 1tsp
పంచదార: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
Spicy Potato Mixture
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను తీసి కొద్దిగా లావుగా తురిమి పెట్టుకోవాలి.
2. తర్వాత ఈ తురుమును నీళ్లలో వేసి కడిగి ఆరనివ్వాలి. తర్వాత నూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి.
3. అలాగే పల్లీలు, బఠాణీలు కూడా వేయించి పెట్టుకోవాలి.
4. చివరగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయించుకోవాలి.
5. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొన్నవన్నీ వేసి కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, పంచదార, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. అంతే పొటాటో మిక్స్చర్ రేడీ.

క్రీమీ సఫ్రాన్ మటన్ కుర్మా

కావలసిన పదార్థాలు:మటన్ ముక్కలు: 1kg
ఉల్లిపాయలు: 4(సన్నగా తరగాలి)
పెరుగు: 3cups
కారం: 2tbsp
ధనియాల పొడి: 2 tbsp
పసుపు: 1tsp
జీలకర్ర పొడి: 1/2tsp
లవంగాలు: 5
యాలకులు: 6
దాల్చినచెక్క: చిన్న ముక్క
కుంకుమ పువ్వు : కొద్దిగా
ఉప్పు: తగినంత
అల్లంపేస్ట్: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1tsp
నూనె: 1cup
నెయ్యి: 1/2cup
ఫ్రెష్ క్రీమ్: 2tbsp
Creamy Saffron Mutton Korma
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి, ఉల్లిపాయలను గోధుమ రంగువచ్చేవరకు వేయించుకోవాలి. బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలను కిచెన్ పేపర్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు క్రిస్పిగా తయారయ్యాక వాటిని మిక్సర్ లో వేసి గ్రైండ్ చేయాలి.
2. అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి మటన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కలిపి, ఆరు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.
3. అందలోనే కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, నల్లమిరియాల పొడి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర పొడి, పెరుగు రెండుకప్పుల నీళ్ళు కలిపి అరగంట సేపు సన్నని మంట మీద ఉడికించాలి.
4. ఇప్పుడు ఉల్లిపాయ పొడి వేసి కలపాలి. ముక్క ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు కుంకుమపువ్వు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి కలిపి మూత పెట్టి మరో పదిహేను నిముషాలు ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. అంతే నోరూరించే మటన్ కుర్మా రెడీ. దీన్ని వేడివేడిగా నాన్ , చపాతి, రైస్ లోకి వడ్డించాలి.

క్యారెట్ కోకనట్ ఖీర్

ఎర్రటి క్యారెట్ రంగు చూడలాంటే కళ్ళు కావాలి. ఆ కళ్లకు ఆరోగ్యం కల్పించాంటే మళ్ళీ క్యారట్ కావాలి. చూశారా.. క్యారెట్ కూ కళ్లకూ ఎంత తగ్గరి సంబంధమో.. కంటిచూపును మెరుగుపరిచే విటమిన్ ఎ పుట్టడానికి అవసరమైన బీటా కెరోటిన్ క్యారెట్ లో పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ రేచీకటికి నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారెట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాబట్టి క్యారెట్ తో ఓ మంచి రుచికరమైన వంట తయారు చేద్దాం. పాలు తాగమన్నా,కారట్ తినమన్నా వినని పిల్లలకి బెస్ట్ ఆప్షన్ ఈ ఖీర్.కొబ్బరితురుము వేయడంతో కొంచెం క్రంచీగా బావుంటుంది.
Carrot Coconut Kheer

కావలసిన పదార్ధాలు :
కారట్ : 4-6
పాలు : 1/2lts
కొబ్బరితురుము: 1cup
పంచదార: 1cup
యాలకుల పొడి : 1tsp
బాదం : 8-10
తయారు చేసే విధానం:
1. కారట్ ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. పాలు కాగాక పంచదార వేసి మరిగించాలి.ఇందులో పచ్చికొబ్బరి తురుము వేసి కొంచెం ఉడికించాలి.
2. ఇప్పుడు కారట్ పేస్ట్ వేసి కలిపి సన్నని మంటపై కొంచెం చిక్కబడ్డాక ఇలాచీపొడి వేయాలి.
3. ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసే ముందు కొంచెం కొబ్బరితురుము,సన్నగా తురిమిన బాదం వేసి ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.

హెల్తీ సోయా మేథీ రైస్

ఆరోగ్యానికి ఎంతో మంచివైన సోయా గ్రాన్యూల్స్, మెంతికూర కలిపి చేసే హెల్దీ రైస్ ఐటం ఇది.అన్నీ రెడీ చేసుకుంటే త్వరగా చేసెయ్యొచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గాను, లంచ్ బాక్స్ లకు పిల్లలకు అందించడంతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకూరలను పప్పు చేస్తే తిననని పిల్లలు ఈ విధంగా వెరైటీగా చేసి ఇవ్వడంతో హాపీగా తినేస్తారు.
కావలసిన పదార్ధాలు :
సోయా గ్రాన్యూల్స్ : 1cup
మెంతికూర : 2కట్టలు
అన్నం : 2cups
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి : 4-8
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు: 1cup
పుదీనా తరుగు: కొద్దిగా
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1tsp
గరం మసాలా పొడి : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
కారం: 1tsp
నూనె : సరిపడా
లవంగాలు,చెక్క,షాజీర
Healthy Soya Methi Rice
తయారు చేసే విధానం:
1. సోయాగ్రాన్యూల్స్ ను మరిగే నీళ్ళలో రెండు నిముషాలు ఉడికించి వడపోయాలి. చల్లని నీళ్ళతో కడిగి నీరు వంపేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
2. మెంతిఆకులను విడిపించుకొని బాగా శుభ్రం చేసి సన్నగా తరిగి అర స్పూన్ నూనె వేసి, వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. నూనె వేడి చేసి రెండు లవంగాలు ,చిన్న దాల్చిన చెక్క ముక్క,షాజీర వేయాలి.
4. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
5. అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి సోయాగ్రాన్యూల్స్ వేయాలి.తడి అంతా పోయి డ్రై గా వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకొన్న మెంతి కూరా వేసి బాగా కలిపి పసుపు,కారం,గరం మసాలా పొడి వేయాలి. చివరగా అన్నం,తగినంత ఉప్పు,తరిగిన కొత్తిమీర,పుదీనా వేసి బాగా కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి. అంతే సోయా మేథీ రైస్ రెడీ. ఇది బ్రేక్ ఫాస్ట్, లంక్ బ్యాక్స్ కు హెల్తీ డిష్..

అదిరిపోయే టేస్ట్ తో మొఘలాయీ ఆలూ కుర్మా

పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమఘుమల సరిగమల మోత మోగిపోతుంది. చిక్కగా మారిని గ్రేవీకి ఆలూ చేర్చితే అదిరిపోయే టేస్ట్ తో మొఘలాయిల కంచంలో రాజసం ఒలకబోసిన కుర్మా మీకోసం.. ఈ వెరైటీ వంటని మీరు రుచిచూడండి...
కావలసిన పదర్థాలు:
బంగాళదుంపలు: 4(ఉడికించి పై పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరగాలి)
టమోటోలు: 2(పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
అల్లం వెల్లుల్లిపేస్ట్: 1tsp
పసుపు: 1/2tsp
కారం : 1tsp
ధనియాల పొడి : 1tsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: తగినంత
నూనె: సరిపడా
పచ్చికొబ్బరి: 3 tbsp
గసగసాలు: 1/2tsp
సోంపు: 1/2tsp
జీడిపప్పు: 6-8
నీళ్ళు: కొద్దిగా
Mughlai Aloo Kurma

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి.
2. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మరో రెండు నిమిసాలు వేగనివ్వాలి.
3. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి, కలపాలి.
4. వెంటనే టమోటో ముక్కులు, బంగాళదుంప ముక్కులు వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఐదు నిముషాలు పాటు ఉడికించాలి.
5. పై మిశ్రం ఉడుకుతుండుగానే కొబ్బరి, గసగసాలు, సోంపు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ ను అందులో వేసి కలపాలి.
6. ఇప్పుడు అదుంలో నీళ్లు పోసి, ఉప్పు సరిపడినంత ఉందో లేదో చూసుకొని ఎనిమిది నిముషాలు ఉడికించాలి.
7. గ్రేవీ సరిపడినంత చిక్కగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకోవాలి. ఈ కుర్మా రోటీ, కొబ్బరి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

స్పెషల్ సైడ్ డిష్ బనానా 65

కావలసిన పదార్థాలు: అరటికాయలు: 2
కార్న్‌ఫ్లోర్: 50grms
నూనె: తగినంత
మైదా: 25 గ్రాములు
పెరుగు:1cup
పచ్చిమిర్చి: 4
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం:1 tsp
మిరియాలపొడి: 1/2tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
కేసరి కలర్:1/2 tsp
గ్రీన్ చిల్లీ సాస్: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా

Spicy Banana 65
తయారు చేయు విధానము:
1. ముందుగా అరటికాయల్ని తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. కార్న్ ప్లోర్ లో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీసాస్, కేసరి కలర్, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి.
2. గుజ్జులా తయారైన ఈ మిశ్రమాన్ని అరటికాయ ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఆరనివ్వాలి. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి బాగా కాగాక అరటికాయ ముక్కల్ని పకోడిల మాదిరిగా వేయించాలి.
3. వేగిన ముక్కల్ని నూనె వార్చి ఉంచుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి, అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించి స్పూన్ తో మిశ్రమాన్నంతటిని కలగలిపి దించేయాలి. అంతే బనానా65 రెడీ.
    

పొటాటో స్నాక్

పొటాటో స్నాక్స్ ఇతర స్నాక్స్ కంటే ప్రత్యేకమైనవి. పొటాటో స్నాక్స్ ను చూడగానే నోరూరుతుంది. క్రిస్పీగా, టేస్టీగా ఉండే పొటాటో స్నాక్స్ పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టపడతారు. అందుకే పొటాటో స్నాక్స్ రెసిపీ తెలుసుకుందాం. ....
Potato Snack
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి : 2 cups
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 10
బంగాళాదుంపలు: 1/2kg
నెయ్యి : 2tbsp
అల్లం: చిన్న ముక్క
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా గోధుమ పిండి జల్లించుకుని నీళ్ళు, ఉప్పు వేసి, పూరీ పిండిలా ముద్దగా చేసుకోవాలి.
2. తర్వాత బంగాళాదుంపలు ఉడికించి, పొట్టుతీసి, చిదుముకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం నూరి ముద్దచేసుకోవాలి. గోధుమపిండిలో బంగాళాదుంపల ముద్ద, ఉల్లి, మిర్చిల ముద్ద, ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకుని, నచ్చిన ఆకృతిలో వత్తుకుని ఎర్రగా వేయించాలి. ఈ పొటాటో స్నాక్స్ ఎంత రుచిగా ఉంటాయో, తయారుచేయడం అంత సులువే.

రవ్వ సేమ్యా ఇడ్లీ..

సాధారణంగా రోజూ ఇంట్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం రకరకాల టిఫిన్స్ తయారు చేసుకొంటుంటాం. అయితే అవి ఎప్పుడూ చేసిచేసి రోటిన్ అయిపోయుంటాయి. ఆ రొటీన్ గా చేసుకొనే బ్రేక్ ఫాస్ట్ లనే పద్దతి మార్చి కొంచెం వెరైటీగా చేసుకొంటే రుచికి రుచి..కొత్తదనానికి కొత్తదంతో పాటు ఆనందంగా తినొచ్చు. ఇక వారంలో ఒక్క సారైనా ఇంట్లో ఇండ్లీలు వండాల్సిందే... మరి ఆ ఇడ్లీలే కొంచె వెరైటీగా ఎలా తాయారు చేయాలో చూద్దాం. తెల్లగా మల్లెపువ్వుల్లా,నోట్లో వేసుకుంటే దూదుల్లా కరిగిపోయే ఇడ్లీ, చట్నీ,కారప్పొడి, నెయ్యి కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . వేడిగా పొగలు కక్కుతూ,ఊరించే ఆరోగ్యకరమైన టిఫిన్ ఇడ్లీ. కాకపోతే ముందురోజు పప్పు,రవ్వ నానబెట్టుకోడం,రుబ్బుకోడం ఇలాంటివి తప్పవు అనుకోండి.అంత కష్టపడకుండా యిన్ స్టంట్ గా చేసుకునే ఈ ఇడ్లీ కూడా చాలా బావుంటుంది.ట్రై చేసి చూడండి.ఇవి మైక్రోవేవ్ లో చేసిన ఇడ్లీలు ...
కావలసిన పదార్ధాలు :
రవ్వ: 2cups
సేమ్యా : 2cups
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయ : 1
కారట్ తురుము : 1cup
పెరుగు : 3cups
కొత్తిమీర : కొద్దిగా
ఉప్పు : రుచికి తగినంత
వంటసోడా: చిటికెడు
నూనె : 2tbsp
తాలింపుకు : శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
Rava Semiya Idli
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి రవ్వను దోరగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనెలో సేమ్యాను గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని రవ్వలో వేసి కలుపుకోవాలి.
3. ఇప్పుడు రవ్వ, సేమ్యా మిశ్రమంలో పెరుగు, తగినంత ఉప్పు, వంటసోడా వేసి బాగా కలిపి ఒక గంట సేపు నాననివ్వాలి.
4. ఒక స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,కారట్ తురుము వేసి ఒక నిమిషం వేయించి నానిన రవ్వ మిశ్రమం లో కలపాలి.ఇవి ఇష్టం లేనివారు కలపకుండా ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చు.
5. ఈ మిశ్రమం గట్టిగా ఐతే కొంచెం నీరు కలిపి ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పది నిమిషాలు ఉడికించాలి.
6. వేడి వేడిగా కొబ్బరి పచ్చడితో వడ్డిస్తే రవ్వ సేమ్యా ఇడ్లీ సిద్దం. మైక్రోవేవ్ లో వేయాలంటే 640 వాట్స్ లో 5 నిమిషాలు పెడితే ఇడ్లీలు రెడీ అవుతాయి.ఐతే తప్పనిసరిగా మూత పెట్టి మాత్రమే ఓవెన్ లో ఉడికించాలి.

బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ దేనికైనా సరే గోంగూర రైస్

గోంగూరతో చేసే ఏ వంటైనా రుచి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగో గోంగూరలను చట్నీ ఎక్కువగా తయారు చేసుకొంటుంటారు. తర్వాత గోంగూర చికెన్, గోంగూర మటన్ ఇలా వెరైటీలను తయారు చేసేరు. అయితే గోంగూరతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఉపయోగపడే పులిహోరాను కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూర రైస్ లేదా పులిహోరా సాధారణంగా చింత పండుతో తయారు చేసుకొనే పులిహోరా కంటే ఇంకా ఎక్కువ రుచిగా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇక్కడ చింత పండుకు బదులు పులుపు ఉన్న గోంగూరను ఉపయోగించి గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం....
కావలసిన పదార్థాలు:
బియ్యం: 2cups
గోంగూర: 2కట్టలు
ఎండుమిర్చి: 6
పోపుకోసం:
పల్లీలు: గుప్పెడు
పచ్చిమిర్చి: 3
మెంతులు: 1/2tsp
శనగపప్పు: 1tsp
మినపప్పు: 1tsp
ఆవాలు: 1tsp
పసుపు: 1/4tsp
ఇంగువ: చిటికెడు
జీలకర్ర: 1tsp
దనియాల పొడి: 2tsp
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
Gongura Rice Or Gongura Pulihora
తయారు చేయు విధానం:
1. ముందుగా గోంగూరను వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత బియ్యం శుభ్రం చేసి సరిపడా నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి.
3. పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుషులన్నింటీని వేసి వేయించి అందులో గ్రైడ్ చేసి పెట్టుకొన్న గోంగూర పేస్ట్ ను వేసి రెండు నిమిషాలు వేయించి, ఆ తర్వాత నీటితో సహా బియ్యాన్ని గోంగోరూ మిశ్రమంలో పోయాలి.
4. తర్వాత సరిపడా ఉప్పు వేసి పాన్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి.
5. ఇప్పుడు వెడల్పుగా ఉన్న పాత్తలో కొద్దిగా నెనూ వేసి అందులో జీలకర్ర, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. అంతే గోంగూర రైస్ రెడీ. దీన్ని ఉల్లిపాయ ముక్కలతో వేడి వేడి గా సర్వ్ చేయండి, ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనంతోనూ తీసుకోవచ్చు.

రుచికరమైన రవ్వ పులిహోర

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పులిహోర విరివిగా చేస్తుంటారు. చాలా సింపుల్ గా అతి తక్కువ సమయంలో తయారు చేయగల టిఫ్ బాక్స్ టిఫిన్ రవ్వ పులిహోర ‘పులిహోర'అన్నంతోనే చేయాలా? లేకపోతే అది పులిహోర కాదంటారా? అయో..! పులిహోర అన్నంతో కాకుండా ఉప్మారవ్వ, సేమ్యా, గోధుమరవ్వ, బియ్యంనూక, అటుకులు వగైరా వాటితో కూడా చేసుకోవచ్చు. వెరయిటీగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉప్మారవ్వ లేదా బొంబాయి రవ్వతో పులిహోర చేసే విధానం తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా చేస్తే అన్నంలాగే పొడి పొడిగా రవ్వ పులిహోర చేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు:
రవ్వ: 2cups
నిమ్మకాయ: 1
ఉల్లిపాయ: 1(అవసరమైతే)
ఎండుమిరపకాయలు: 3
పచ్చిమిర్చి: 4
ఆవాలు: 1 tsp
జీలకర్ర: 1/4 tsp
శెనగపప్పు, మినప్పప్పు: 1 tsp
కరివేపాకు: 2రెబ్బలు
పసుపు: 1/4 tsp
ఉప్పు: తగినంత
నెయ్యి: 2 tbsp
నూనె: 3 tbsp
Easy Tasty Rava Pulihora With Lemon
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఒక చెంచాడు నెయ్యి వేసి వేడి చేసి చిన్న మంటపై రవ్వను కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి.
2. తర్వాత రవ్వను తీసి పక్కన పెట్టి అదే ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించాలి.
3. ఇప్పుడు అందులో పసుపు వేసి రెండు కప్పుల రవ్వకు ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పువేసి మరిగించాలి. మంట తగ్గించి మరుగుతున్న నీళ్లలో రవ్వ మెల్లిగా పొస్తూ ఉండలు కట్టకుండా కలుపుతో ఉండాలి. మూతపెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
4. ఆ తరవాత గరిటతో మొత్తం రవ్వను పొడిపొడిగా చేయాలి. నీళ్లు ఎక్కువగా పోస్తే మెత్తగా ఉప్మాలా అవుతుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తపడితే చాలు. ఇందులో నిమ్మరసం పిండి, కొంచెం కొత్తిమిర, నెయ్యివేసి బాగా కలిపి పదినిమిషాల తరవాత వడ్డించాలి. అంతే రవ్వ పులిహోర రెడీ..

నాన్-చపాతీ స్పెషల్ సైడ్ డిష్ నవరతన్‌ కూర్మా..

ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు: 3 కప్పులు
(పొటాటో, క్యారెట్‌, పచ్చి బఠాణీ, బీన్స్‌, కాలిఫ్లవర్‌, కాప్సికమ్‌, కాబేజ్‌, గోరు చిక్కుడు, సొరకాయ)
పనీర్‌: 200grms(తురిమినది)
టమాటాలు: 4
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
అల్లం పేస్ట్‌: 2tsp
వెల్లుల్లి పేస్ట్‌: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
కారం: 2tsp
ధనియాలపొడి: 1tsp
గరం మసాలా పొడి: 2tsp
మీగడ: 2tbsp
నూనె: తగినంత
నెయ్యి: 1tbsp
పాలు/ నీళ్ళు: 1cup
డ్రై ఫ్రూట్స్‌: 1/4cup
కొత్తిమీర తురుము: 2tbsp
Special Navaratan Korma


తయారు చేయు విధానం:
1. ముందుగా టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి. తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజ్జును తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు.
2. తర్వాత ఒక స్పూన్‌ నేయ్యిని పాన్ లో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి. వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
3. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి.
4. గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి. పాన్ కు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి. తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి.
5. తర్వాత అందులో పనీర్‌ వేసి గరిటతో తిప్పాలి. చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. సర్వ్‌ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర తరుగుతో అలంకరించి సర్వ్‌ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి, వేడి వేడి ప్లెయిన్ రైస్ లోనికి చాలా రుచిగా ఉంటుంది.

దొండకాయ-గరంమసాలా రైస్

కావలసిన పదార్థాలు:అన్నం: 2cups
దొండకాయ ముక్కుల: 1cup(దొండకాయలను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్: 2 లేదా 3 ((సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిబఠాణీ: 1/4cup
పచ్చిమిర్చి: 4-8(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1tsp
జీలకర్ర: 1tsp
నూనెలో వేయించడానికి గరం మసాలా: (లవంగాలు:4, చెక్క, చిన్న ముక్క, యాలకలు: 1 లేదా 2, బిర్యాని ఆకు 1)
ధనియాల పొడి: 2tsp
గరం మసాలా పొడి: 1/4tsp
పసుపు: 1/4tsp
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
నిమ్మరసం: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, గరం మాసాలా పదార్థాలు, చెక్క, లవంగం, యాలకులు, బిర్యాని ఆకు అన్నింటిని వేసి వేయించుకోవాలి.
2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించాలి.
3. ఐదు నిమిషాల తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు నిముషాల పాటు వేగనించి, అందులో పుదీనా తరుగును వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
4. ఇప్పుడు దొండకాయ ముక్కలను, క్యారెట్, పచ్చిబఠాణీలను కూడా చేర్చి మరో పదిహేను నిముషాల పాటు మీడియం మంట మీద బాగా వేగనివ్వాలి.
5. తర్వాత అందులో పసుపు, ఉప్పు, ధనియాలపొడి, కారం, వేసి బాగా మిక్స్ చేయాలి.
6. వేపుడు పదార్ధాలన్నీ బాగా వేగిన తర్వాత అందులో ముందగా తయారు చేసుకొన్న రెండు కప్పుల అన్నం చేర్చి బాగా మిక్స్ చేయాలి.
7. చివరగా నిమ్మరసం చల్లి బాగా మిక్స్ చేయాలి. కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే దొండకాయ రైస్ రెడీ..

రుచి - ఆరోగ్యం మునక్కాడల బిర్యానీ

కావలసిన పదార్థాలు:
మునగకాడలు: 8
బాస్మతి రైస్: 1/2kg
పచ్చిబఠాణీ: 1cup
పచ్చిమిరప: 6-8
ఉల్లిపాయలు: 4
ఆయిల్‌: సరిపడా
కరేపాకు: రెండు రెమ్మలు
జీడిపప్పు: 10
చెక్కా, లవంగం, యాలకులు: తగినన్ని
బిర్యాని ఆకు: 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3tbps
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1/2tsp
పచ్చిశనగ: 1tsp
పల్లీలు: 1tsp
కారం: తగినంత
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: చిటికెడు
పుదీన: కట్ట
కొత్తిమీర: ఒక కట్ట
drumstick onion biryani

తయారు చేయు విధానం:
1. ముందుగా మునక్కాడలను చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి.
2. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపలను సన్నగా తరుగుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి కాసేపు కాగనివ్వాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగ, చెక్కా, లవంగం, యాలకులు,బిర్యాని ఆకు వేసి వేయించాలి.
4. కొద్దిసే పాగిన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసిన తర్వాత ముందుగా కట్‌ చేసి ఉంచిన మునక్కాడముక్కలు, పచ్చిబఠానీ, ఉల్లి, పచ్చిమిరపల మిశ్రమాన్ని, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ కూడా పాన్ లో వేసి, బాగా కలపాలి.
5. తర్వాత మూతపెట్టి ఉంచితే మునక్కాడ ముక్కలు మగ్గుతాయి. ఉడికేటప్పుడే కూడా కలపాలి. తర్వా త పసుపు, కొద్దిగా కారం, రుచికి తగి నట్టుగా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
6. ఇప్పుడు అందులో బియ్యం శుభ్రం చేసుకిని సరిపడా నీళ్ళు పోసి నీరు మరిగిన తర్వాత బియ్యాన్ని కూడా అందులో వేసి, తర్వాత, తురిమిన కొత్తిమీర, కరేపాకు, పుదీనాల మిశ్రమాన్ని కూడా చేర్చి. కుక్కర్‌ మూత వేసి కుక్కర్‌ విజిల్స్‌ వచ్చేదాక ఉంచి దించేసుకోవాలి. వేడివేడిగా ఉండగానే తింటే చాలా బాగుంటుంది.

బిర్యాని స్పెషల్- కాజు-ఎగ్ బిర్యాని

సాధారణంగా అతిసులభంగా తయారయ్యేది గుడ్డుతో చేసే వంటలే. గుడ్డుతో చేసే ఏ వంటలైనా సరే చిటికెలో రెడీ అయిపోవాల్సిందే. ఉదయం బ్రేక్ ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్, చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటెకెలో ఆమ్లెట్ వేసుకొని కపుడు నింపేసుకుంటాం. అయితే ఆమ్లెట్ ఎవరైనా పోస్తారు. పైన తెల్లసొన లోన పచ్చసొన విడువలేని ఆస్వాదన. హఠాత్తుగా ఊడిపడే అతిథులకు చికెనూ... మటనూ.. లేకున్నా గుడ్డే ఘనగౌరవం. ఉడకబెట్టిన గుడ్లతో చేసిన వంటకాలు నో డౌట్ వెరీ గుడ్. సండే తినండి... మన్‌డే తినండి... ‘అండే' తినండి.
కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 4 (ఉడికించి, పై పొట్టు తీసినవి)
బాస్మతి రైస్: 2cups
జీడిపప్పు(కాజు): 10(వేయించినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఉల్లిపాయ: 1(ముక్కలుగా కట్ చేయాలి)
దాల్చిన చెక్క: చిన్న ముక్క;
లవంగాలు: 3
నూనె: సరిపడా
నీళ్లు: 31/2cup
పచ్చిమిర్చి: 6-8 (నిలువు, అడ్డం చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
పసుపు: పావు టీ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: అలంకరణకు తగినంత
Kaju Egg Biryani
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం శుభ్రం చేసి మంచినీళ్ళతో కడిగి పక్కపెట్టుకోవాలి.
2. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి మూడు నిమిషాలు వేయించుకోవాలి.
3. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో నీళ్లుపోసి, ఉప్పు కలిపి కడిగిన బియ్యం వేసి ఉడకనివ్వాలి.
4. బియ్యం కాస్త పలుకుగా ఉన్నప్పుడు కోడిగుడ్లు, జీడిపప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే కాజు ఎగ్ బిర్యాని రెడీ. వచ్చిన అతిథులకు వేడి, వేడిగా సర్వ్ చేయాలి.

రుచికరమైన ఈవెనింగ్ స్నాక్ పుదీనా పకోడీ

కావలసిన పదార్థాలు:ఉల్లిపాయలు: 3(సన్నగా కట్ చేసుకోవాలి)
పుదీనా: 2కట్టలు(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6
పల్లీలు: 1tbsp
చాట్ మసాలా: చిటికెడు
శనగపిండి: 3cups
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1/4tsp
నూనె: డీఫ్ ఫ్రైకి సరిపడా
నీళ్ళు: 1cup
Very Easy Simple Snack Pudina Pakoda
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, చాట్ మసాలా, పుదీనా తరుగు, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, నీళ్ళు అన్నింటిని ఇక దాని తర్వాత ఒకటి వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి, నూనె వేడయ్యాక అందులో పిండిని చిన్ని చిన్న ఉండలుగా చేత్తో తీసుకొని, కాగే నూనెలో జారవిడవాలి.
3. వీటిని ఇటు అటూ తిప్పుతూ మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీద వేయాలి.
4. అంతే పుదీనా పకోడీలు రెడీ. వీటిని వేడి వేడిగా ఇష్టమయిన చట్నీ కాంబినేషన్ తో కానీ, టమోటో కెచప్ తో గానీ అందిస్తే టేస్టీగా ఉంటుంది.

నోరూరించే ఫిష్ పులావ్

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1/2kg
ఫిష్ ఫిల్లెట్: 1(పెద్ద చేప)
వెల్లుల్లి: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 3-4tbsp
పచ్చిమిర్చి పేస్ట్ : 3tbsp
బాదం: 1cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 2tbsp
నిమ్మరసం: 1tsp
పంచదార: 2-3tsp
కోవా: 2tbsp
బిర్యాని ఆకు: 2
లవంగాలు: 2
యాలకులు: 2
నెయ్యి: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
fish pulao yummy fish rice recipe

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ ల్లో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి దానికి ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి పేస్ట్ కలపాలి. అలాగే కొద్దిగా ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఫిష్ ఫిల్లెట్ తీసుకొని శుభ్రం చేసి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చేప ముక్కలకు పసుపు, కారం, నిమ్మరసం, మరియు కొద్దిగా ఉప్పు వేసి మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో సగం భాగం నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, లవంగాలు, యాలకులు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో చేప ముక్కలను కూడా వేసి అతి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అవసరం అయితే కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి చేప ముక్కలను పక్కకు తీసి పెట్టుకోవాలి.
5. తర్వాత అందులోనే మిగిన సగ భాగం నెయ్యి, రైస్ మిశ్రమం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రెండు మూడు నిముషాలపాటు వేయించుకోవాలి. తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. ఐదు నిముషాల తర్వాత మూత తీసి, మంటను పూర్తిగా తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు నీరంతా ఇమిరిపోయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చేప ముక్కను, బాదం పలుకులను, కోవాను వేసి మిక్స్ చేసి మరో ఐదు నిమిషాల పాటు సిమ్ పెట్టి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఫిష్ ఫిల్లెట్ పులా రెడీ. ఏదేని గ్రేవీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే సరి...

క్యాబేజ్ఉప్మా క్యా టేస్ట్ హై గురూ...

కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ: 2cups
గోధుమ రవ్వ: 1/2kg
శనగపప్పు: 2tbsp
అల్లం: కొద్దిగా
ఉల్లిపాయలు: 4 పెద్దవి
టమోటో: 1
మినపప్పు: 2tbsp
ఆవాలు: 1tps
పచ్చిమిర్చి: 8-10
కరివెపాకు: రెండు రెమ్మలు
జీడిపప్పు: కొంచెం
నెయ్యి లేదా డాల్డా: తగినంత

Rava Cabbage Upma
తయారు చేయు విధానం:
1. ముందుగా క్యాబేజీని సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఓ గిన్నెలో నీళ్ళు తీసుకుని ఈ క్యాబేజీని నీళ్ళలో వేసి గట్టిగా పిండి పక్కకు పెట్టుకోవాలి.
2. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటో సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి లేదా డాల్డా వేసి కాగాక శనగపప్పు, మినపప్పు వేసి దొరగా వేయించాలి. తర్వాత ఆవాలు వేసి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, టమోటో వేసి బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీని వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
4. తర్వాత తగినంత నీరు పోసి ఉప్పు వేసి మూతపెట్టాలి. నీరు బాగా మరిగిన తరువాత (క్యాబేజీ ఉడికేంత వరకు) జీడిపప్పు వేసి గోధుమరవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి.
5. కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. సన్నని మంటపై కొద్దిసేపు ఉంచి దించేయాలి. అంతే 'క్యాబేజీ ఉప్మా' రెడీ. ఇష్టమున్న వారు దీనిపై నిమ్మరసం పిండుకోవచ్చు. కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి వేడి వేడిగా ఏదేని ఇష్టమైన చట్నీతో వడ్డించాలి.

వెజిటబుల్ బ్రెడ్ బాత్

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసులు-12
క్యారెట్: 2
పచ్చిబఠాణీలు-1cup
పచ్చిమిర్చి: 6-8
ఉల్లిపాయలు: 2
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: 1cup
బీన్స్: 1/4cup
బీట్ రూట్: 1
జీడిపప్పు: 1/2cyo
అల్లం: చిన్న ముక్క
మినపప్పు, శెనగపప్పు: 2tbps
ఆవాలు: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: చిటికెడు
నూనె : తగినంత
vegetable bread bath

తయారు చేయు విధానం:
1. ముందుగా కుక్కర్ లో కూరగాయల ముక్కలు, బఠాణీలు ఉడికించుకోవాలి.
2. తర్వాత బ్రెడ్ స్లైసులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసి అందులో జీడిపప్పు దోరగా వేయించి విడిగా తీసుకోవాలి.
5. తర్వాత అదే పాన్ లో బ్రెడ్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రెండు నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత ఉడికించిన కూరముక్కలు, బఠాణీలు వేసి బ్రెడ్ ముక్కలకు పట్టేలా కలపాలి.
6. ఐదు నిముషాల తర్వాత దింపేసి వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలతో గార్నిష్ చేస్తే చాలు. చివరగా ఆవాలు, శెనగపప్పు, మినపప్పుతో తాలింపు పెట్టాలి. వెజిటబుల్ బ్రెడ్ బాత్ సిద్ధం. రుచికోసం అదనంగా నిమ్మరసమూ చేర్చుకోవచ్చు. వేడివేడిగా తింటే బాగుంటుంది.

కమ్మని రుచితో ఘుమ..ఘుమలాడే పెరుగు వంకాయ

సాధారణంగా వంకాయతో చాలా రకాల వంటలను వండుతారు. అయితే వంకాయలతో తయారు చేసి గుత్తివంకాయ మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది. గుత్తివంకాయ సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్. ఇల్లలో తరచూ చేస్తూనే ఉంటారు. అయితే గుత్తి వంకాయనే కొంచెం డిఫరెంట్ గా చేస్తే అద్భుతమైన రుచి అందిస్తుంది. దీనికి పెరుగు చేర్చడం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ అందిస్తుంది. ఈ వంటను అందరూ ఇష్టపడుతారు.
కావలసిన పదార్థాలు
వంకాయలు: 6-8(మీడియం సైజ్)
పెరుగు : 1-2cups
పసుపు: 1/2tsp
పంచదార: 1tsp
ఉల్లిపాయ పేస్ట్: 2-3tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పచ్చిమిర్చి: 4(మద్యకు కట్ చేసినవి)
పచ్చికొబ్బరి తురుము: 1/2cup
గసగసాలు: 2tbsp
కారం: 2tsp
ధనియా పౌడర్: 2tsp
కొత్తిమీర: 1/2cup(తరిగి పెట్టుకోవాలి
నూనె: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
Spicy Tasty Curd Brinjal
తయారు చేయు విధానం:
1. ముందుగా వంకాయలను తీసుకొని వాటిని మద్యలోనికి(గుత్తివంకాయలకు) కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చికొబ్బరి తురుము, గసగసాలు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
2. తర్వాత అన్నివంకాయలను ఉప్పు నీటిలో బాగా శుభ్రం చేసి, పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో వంకాయలను వేసి వేయించాలి. అలాగే వంకాయలతో పాటు పసుపు, పంచదార, ఉప్పు చేర్చి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొంత నూనె వేసి అందులో ఉల్లిపాయ పేస్ట్ ,అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించి అందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
4. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొబ్బరి పేస్ట్ మరియు కారం, ధనియా పొడి, పసుపు, ఉప్పు చేర్చి బాగా వేయించాలి. తక్కువ మంట మీద పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి.
5. మసాలా వేగిన తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ కలియ బెట్టాలి. పెరుగు మిశ్రమంతో మసాలా మిశ్రమం బాగా కలిసిపోయేంత వరకూ కలుపుతూ ఉడికించుకోవాలి.
6. పెరుగులో మసాలా మిశ్రమం బాగా ఉడికి చిక్కబడిన తర్వాత వేయించి పెట్టుకొన్న వంకాయలను వేసి మరో ఐదు నిముషా పాటు తక్కువ మంటలో ఉడికించి స్టౌ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. దింపుకొన్న తర్వాత కూడా మరికొద్దిగా పెరుగు కలుపుకోవాలి. అంతే కర్డ్ బ్రింజాల్ రెడీ . కొత్తిమీర తరగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి...

వెజిటేరియన్ ఎగ్ భలే రుచి

వెజిటేరియన్ ఎగ్ మంచి ఈవెనింగ్ స్నాక్. ఎగ్ తిన్న ఫీలింగ్ నందిస్తుంది. అచ్చు గుడ్డులా కనిపించే వెజిటేరియన్ ఎగ్ ను పన్నీర్ తో తాయరు చేసుకోవచ్చు. అలాగే వీటివేడి వేడిగా పుదీనా చట్నీ లేదా టామాటా సాస్ తో కానీ కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. మధ్యలోకి కట్ చేస్తే అచ్చు గుడ్డులా ఉంటుంది కాబట్టి వీటిని వెజిటేరియన్ ఎగ్ అంటారు..
Vegetarian Egg
కావలసిన పదార్థాలు:
బంగాళా దుంపలు: 1/2kg
మొక్కజొన్న పిండి: 1/2tsp
పనీర్: 1/2kg
పసుపు: చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా
చాట్ మసాలా: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళాదుంపలని మెత్తగా ఉడికించి చల్లారాక చెక్కు తీసి చెత్తో మెదిపి పెట్టుకోవాలి.
2. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. (రొట్టెల పిండిలా)
3. ఇప్పుడు పన్నీర్ ను మెత్తగా మెదపుకొని అందులో ఉప్పు, పసుపు(మిఠాయి రంగు) వేసి కలిపి పెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో నిమ్మకాయంగ సైజ్ లో బంగాళాదుంప ముద్దని తీసుకొని దానిలో పనీర్ కూర్చి తిరగి కోడి గుడ్డు ఆకారంలో ఒత్తుకొని నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని వేడి వేడిగా పుదీనా చట్నీతో కానీ టమాటా సాస్ తో కానీ కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి

స్పెషల్ సైడ్ డిష్ -స్పైసీ బెండకాయ ఫ్రై

లేలేత బెండకాయల ఫ్రై అందరూ చాలా ఇష్టపడతారు. బెండకాయ వేపుడంటే అందరికీ తెలిసిందే కానీ అది చేసే విధానంలోనే వుంది అసలు రుచి. ఎవ్వరైనా సరే రెండు ముద్దలు ఎక్కువ తినాల్సిందే.. కాస్త ఓపిగ్గా కొంచె టై తీసుకొని బెండకాయ ముక్కల్ని బాగా వేయించితే మంచి రుచి ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి చేస్తే కూడా చాలా బావుంటుంది. మైక్రో వేవ్ లో చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. జిగురు లేకుండా కూర పొడిపొడిగా వస్తుంది.
కావలసిన పదార్ధాలు:
బెండకాయలు: 1/2kg
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి : 1tsp
పచ్చిమిర్చి:2-4
ఉప్పు,కారం: రుచికి సరిపడా
నూనె: 3tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
గరం మసాల పొడి: 1tsp
పసుపు: చిటికెడు
తాలింపుకు
శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు
Spicy Ladies Finger Fry Special Side Dish
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మైక్రో సేఫ్ బౌల్ లో నూనె, తాలింపు దినుసులు, వెల్లుల్లిరెబ్బలు వేసి ఒక నిమిషం హైలో పెట్టాలి.
2. తర్వాత వేగాక తీసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి, కరివేపాకు వేసి రెండు నిముషాలు ఉంచాలి.
3. ఇప్పుడు ముందుగానే బెండకాయల్ని శుభ్ర పరిచి పొడి వస్త్రంతో తుడిచి తరిగిన బెండకాయ ముక్కలు వేసి కలిపి హైలో ఉంచాలి.
4. ముక్కలు వేగాక ఉప్పు, కారం వేసి బాగా కలిపి మళ్లీ ఓవెన్ లో పెట్టాలి. బెండకాయ మెత్తగా వేగిన తర్వాత గరంమసాల పొడి చల్లి ఇంకో నిమిషం పెడితే సరిపోతుంది. కూర వేగేటప్పుడు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి గరిటతో కలియబెడుతుండాలి. అలాగే స్టౌ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టకుండా కొద్దిసేపు అలాగే పెట్టాలి. అప్పుడు బెండకాయ కరకరలాడుతుంటుంది

చిటికెలో తయారయ్యే న్యూట్రిషియన్ బ్రేక్ ఫాస్ట్ ఎగ్ కోతు

సాధారణంగా ఎగ్(గుడ్డుతో)చాలా వెరైటీ వంటలను వండకుంటుంటాం. అందులో ఇదో కొత్తరకం వంట. ఎగ్ కోతు చాలా సులభమైన రుచికరమైన వంట. ఈ స్పైసీ ఎగ్ కోతును ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను తీసుకోవచ్చు. ఉదయం చాలా తక్కువ టైమ్ లో తయారు చేసుకొనే ఒక ఆరోగ్యకరమైన వంట. అంతే కాదు ఇది తయారు చేయడం కూడా సులభం. ఎగ్ కోతుకు వెజిటేబుల్ మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. వెజిటేబుల్స్, ఎగ్ చేర్చడం వల్ల వేరే ఇతర అల్పాహారినికి బదులు ఎగ్ కోతును అల్పాహారంగా తీసుకొంటే సరిపోతుంది. శరీరానికి కావల్సినన్ని న్యూట్రిషియలన్స్ అందుతాయి. దీన్ని ఈవెనింగ్ స్నాక్ గాను తయారు చేసి పిల్లలకు పెద్దలకు పెట్టవచ్చు. ఎగ్ కోతును పరోటాలో స్టఫ్ చేసి కూడా తినవచ్చు. చాలా రుచికరంగా వెరైటీ టేస్ట్ తో ఘుమఘుమలాడుతుంటుంది.
కావలసిన పదార్థాలు:
గుడ్లు: 8
మెంతులు: చిటికెడు
ఆవాలు: 1tsp
ఉల్లిపాయలు: 2-3 (చిన్న ముక్కలుగా తరిగినవి)
కరివేపాకు : రెండు రెమ్మలు
టమోటో: 2 (చిన్నముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 8 (చిన్నముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: 1tsp
కారం: 1tsp
నిమ్మరసం: 3-4 చుక్కలు
బ్లాక్ పెప్పర్ (నల్ల మిరియాల పొడి): 1-2tsp
కొత్తిమీర తరుగు: ½ cup
నూనె: 2-3tbsp
ఉప్పు: రుచికి తగనంత
Egg Kothu Spicy Scrambled Eggs Recipe
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్డును పగుల గొట్టి పోయాలి. అందులో కొద్ది ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో కొన్ని మెంతులు, ఆవాలు వేసి తక్కువ మంట మీద వేయించాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత కరివేపాకు, టమోటో, కూడా వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి. టమోటో మెత్తబడ్డాక, వెంటనే అల్లం వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, నిమ్మరసం, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద వేయిచుకోవాలి.
4. పోపు బాగా వేగిన తర్వాత గుడ్డు, ఉప్పు మిశ్రమాన్ని కూడా చేర్చి బాగా మిక్స్ చేసి కొద్ది సేపు మీడియం మంట మీద వేయించి, తర్వాత మంటను పూర్తిగా తగ్గించి మద్య మద్యలో కలియబెడుతూ ఫ్రై చేయాలి.
5. చివరగా కొత్తిమీర తరుగును చల్లి మరో రెండు నిముషాలు వేయించి స్టౌ ఆప్ చేసి వేడి వేడి వడ్డించాలి. అంతే ఎగ్ కోతు రెడీ...

శెనగల స్పెషల్ గ్రేవీ-పన్నీర్ చన్నా మసాలా...

శెనగలు రెండు మూడు రకాలు ఉన్నాయి. శెనగలతో తయారు చేసే వంటకాలు చాలా పాపులర్ ఫుడ్స్. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే శెనగలు ప్రోటీనులను అధికంగా కలిగి ఉంటాయి కాబట్టి రోజూ తీసుకొనే ఆహారంలో వీటిని కూడా చేర్చడం మంచిది. శెనగలకు పన్నీర్ చేర్చి కొన్నిఇండియన్ మసాలను దండించి చేయడం వల్ల అటు వెజిటేరియన్ ప్రియులకు, ఇటు నాన్ వేజిటేరియన్ ప్రియులకు అమితంగా ఇష్టం అవుతుంది. ముఖ్యంగా శెనగలు(చెన్నా)పన్నీర్ పంజాబీలకు అత్యంత ఇష్టమైన ఆహారం. వారి చేసే వంటకాన్నే మనకు రుచికి తగిన విధంగా వండకోవడంతో ఓ కొత్త రుచిని మనం కూడా రుచి చూడవచ్చు. దీన్ని రోటీ లేదా చపాతీ లేదా అన్నంతో తినడానికి మంచి కాంబినేషన్. మరి చెన్నాపన్నీర్ ను ఎలా తయారు చేయాలా చూద్దాం...
paneer chana masala

కావలసిన పదార్థాలు:
చెన్నా(పచ్చిశెనగలు): 3-4cups
టీబ్యాగ్స్: 2
ఉల్లిపాయలు: 2-3(కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పచ్చిమిర్చి 4-6(కట్ చేసుకోవాలి)
టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tbsp
కాశ్మిరీ మిర్చి పౌడర్: 1tbsp(బయట మార్కెట్లో దొరుకుతుంది)
పసుపు: చిటికెడు
పంచదార: 1tsp
పన్నీర్: 2cups(కావలసిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి)
గరం మసాలా: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా చెన్నా(పచ్చి శెనగలను)రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. శెనగలు నానబెట్టే నీటిలో టీ బ్యాగ్ వేయాలి.(టీ బ్యాగ్ వేయడం వల్ల శెనగలు మంచి కలర్ (బ్రౌన్ కలర్)గా ఉంటాయి.
2. మరుసటి రోజు శెనగలలోని నీరు వంపేసి శుభ్రం చేసి, కుక్కర్ లో వేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.( శెనగలను ఉడికించేటప్పుడు కూడా టీబ్యాగ్ ను వేయవచ్చు). కుక్కర్ మూత తీసి ఒక గిన్నెలోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి, అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
4. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్ట్ , వేసి వేయించిన తర్వాత టమోటో ముక్కలను కూడా వేసి, కొద్దిగాఉప్పు చేర్చి మెత్తగా అయ్యేంత వరకూ వేయించాలి.
5. టమోటో కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో కారం, కాశ్మిరీ చిల్లి పౌడర్, పసుపు మరియు పంచదార కలుపుకొని మరికొద్దిసేపు వేయించాలి.
6. మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకూ వేయించిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలను కూడా వేసి తక్కువ మంట మీద వేయించుకోవాలి.
7. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న చెన్నా(శెనగలును) కూడా చేర్చి బాగా కలగలిపి మీడియం మంటమీద ఐదు నిముషాల పాటు ఉడికించుకోవాలి.
8. తర్వాత రెండు కప్పుల నీటిని చేర్చి ఎక్కువ మంట పెట్టి పది నిముషాల పాటు బాగా ఉడకనివ్వాలి. నీరంత ఇమిరిపోయి గ్రేవీ చిక్కబడేటప్పుడు గరం మసాలా, కొత్తమీర తరుగు చల్లుకొని రెండు నిముషాల తర్వాత క్రిందికి దింపుకోవాలి. అంతే పంజాబీ వంటకం చెన్నా పన్నీర్ గ్రేవీ రెడీ.. అన్నం, రోటీ, చపాతీలతో తినడమే ఆలస్యం...

స్టఫ్డ్ ఇడ్లీ - ఫ్యాట్ లెస్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్

సాధారణంగా అల్ఫాహారాల్లో చాలా మంది ఇష్టపడేది... ఇడ్లీ, దోస. ఈ రెండింట్లో కూడా మరీ ఎక్కువగా ఇష్టపడేది ఇడ్లీ. ఎందుకంటే ఇడ్లీ తయారు చేయడం సులభం. నూనె లేకుండా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ భావిస్తారు. ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతగా పనిచేస్తుందంటే.. ఇందులో లోకాలరీసు కలిగి.. అతి తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అంతే కాదు ఇడ్లీలు, త్వరగా, సులభంగా జీర్ణం అవుతుంది. దక్షిణ భారత దేశంలో ఇడ్లీతో పాటు సాంబర్, వడ ఫేమస్ కాంబినేషన్. ప్రతి రోజూ ప్లెయిన్ ఇడ్లీ, చట్నీ, సాంబార్ తో తినడం ఒక్కోసారి బోర్ అనిపిస్తుంది. కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఇడ్లీను తయారు చేయడంతో రుచితో పాటు ఆరోగ్యం మరియు బోర్ అనిపించదు. అందురూ ఇష్టంగా తింటారు. మరీ వెరైటీగా స్టఫింగ్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం....
faceless healthy breakfast stuffed idly

కావాలసిన పదార్థాలు:
ఇడ్లీ రవ్వ: 2cups
పెరుగు: 1cup
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
బేకింగ్ పౌడర్(వంట సోడ): 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : 1tsp
ఇడ్లీ స్టఫింగ్ కోసం:
బంగాళాదుంప: 1cup(2 ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)
పచ్చిబఠాణీ: 1cup(ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)
కారం: 1tsp
పసుపు: 1tsp
ధనియా పౌడర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ మరియు ఉప్పు, పెరుగు వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి బాగా కలిపి రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసి అందులో ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప, పచ్చిబఠాణి, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం, అన్ని వేసి బాగా మిక్స్ చేసి రెండు నిముషాలు వేయించాలి.
3. ఇప్పుడు మరో ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడాక ఇడ్లీ పిండిలో వేయాలి. అలాగే బేకింగ్ పౌడర్ కూడా చిలకరించి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
4. తర్వాత ఇడ్లీ పాత్రను స్టౌ మీద పెట్టి అందులో కొన్ని నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. అంతలోపు ఇడ్లీ ప్లేట్స్ కు కొద్దిగా నూనె రాసి(అవసరమైతేనే)ఇడ్లీ పిండి సగ భాగం మాత్రం పోసి నింపి పెట్టుకోవాలి.
5. తర్వాత స్టఫింగ్ కోసం తయారు చేసి పెట్టకొన్న బంగాళాదుంప మిశ్రమాన్ని స్పూన్ తో ఇడ్లీ పిండి మధ్యలో పెట్టి మళ్ళీ పైన ఇడ్లీ పిండిని పోయాలి. ఇలా అన్ని ప్లేట్స్ నింపుకొన్న తర్వాత ఇడ్లీ స్టాండ్ ను ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టి పది నిముసాలు ఉడికించుకోవాలి.
6. పది నిముషాల తర్వాత ఇడ్లీ స్టాండును బయటకు తీసి ఐదు నిముషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇడ్లీలను సపరేట్ చేసి వేడి వేడి సాంబార్, కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి. అంతే స్టఫింగ్ ఇడ్లీ రెడీ.(స్టఫింగ్ కోసం మీరు క్యారెట్, బీన్స్, ఆకుకూరలు, పన్నీర్ వంటివి కూడా వినియోగించవచ్చు.)

వెరైటీ టేస్ట్ తో కార్న్ మసాలా దోసె

సాధారణంగా ఉదయం చేసుకొనే అల్పాహారాల్లో ఎక్కువగా దోసెను వండుతుంటారు. దోసెల్లో కూడా చాలా రకాలుగా వెరైటీలను చేస్తుంటారు. మనం బయట వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్, హోటల్స్, స్ట్రీట్ స్టాల్స్ ఫుడ్ జాయింట్స్ మరియు ఇళ్ళలో కూడా రకరకాల వెరైటీ దోసెలను చేస్తుంటారు. మసాలా దోస, ప్లెయిన్ దోస, ఆనియన్ దోస, క్యారెట్ దోస, ఎగ్ దోస, కారం దోసె ఇలా...దోసెను ఒక రకంగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే దోసెకు అతి తక్కువ నూనెను ఉపయోగించే చేస్తారు కాబట్టి. దోసెలోనే మరొక వెరైటీ కార్న్ దోస. కార్న్ స్టఫ్ చేయడంతో వెరైటీ రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ముఖ్యంగా మొక్కజొన్న డయాబెటిక్ పేషంట్స్ కు మరింత ఆరోగ్యకరం. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాబట్టి ఈ కార్న్ మసాలా దోసెను ఎలా తయారు చేయాలో చూద్దాం...
corn masala dosa

కావలసిన పదార్థాలు:
బేబీ కార్న్(మొక్కజొన్నగింజలు): 1/2cup(ఉడికించినవి)
బియ్యం: 2cups
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4-6
టమోటో: 2(కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని మంచినీళ్ళతో శుభ్రం చేసి, రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. రెండు గంటల తర్వాత బియ్యంలో నీటిని వంపేసి బియ్యాన్ని మిక్సీలో వేసి, కొద్దిగా ఉప్పు చేర్చి దోసెపిండిలా గ్రైడ్ చేసుకొని, మరొ గంట లేదా అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి పెట్టుకొన్న మొక్కజొన్న గింజలు, టమోటో మరియు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు అన్నింటిని వేసి బాగా కలుపుకొని, పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద దోస పాన్ పెట్టి వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక దోస పిండితో దోసెను వేయాలి. దోసె మీద దోసె చివర్లలలో కూడా నూనెను వేయాలి.
5. వెంటనే దోసె స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకొన్న మొక్కజొన్న మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, దోసె మద్య భాగంలో పెట్టి దోసె మొత్తానికి స్పూన్ తో స్ప్రెడ్ చేయాలి. అంతే దోసె లైట్ బ్రౌన్ కలర్ రాగానే, కార్న్ మసాలా దోసెను రౌండ్ గా మడిచి సర్వింగ్ ప్లేట్ లోనికి సర్వ్ చేసి వేడి వేడిగా అందించాలి. (అవసరమైతే మొక్కజొన్న మిశ్రమానికి కొబ్బరి తురుమును కూడా చల్లుకోవచ్చు).

పిల్లలు... పెద్దలు.. ఇష్టంగా తినే హోంమేడ్ ఎగ్ పిజ్జా

గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలిసిన విషయమే. మనం ఎగ్ ను ప్రతి రోజూ ఏదో విధంగా ఆహారంతో పాటు తీసుకొంటుంటాం. ఉడికించి, ఎగ్ బుర్జు, ఎగ్ గ్రేవీ, ఎగ్ ఆమ్లె, ఎగ్ రైస్.. ఇలాంటి మనం తరచూ చేసుకొంటుంటాం. అదే ఎగ్ తో కొంచెం వెరైటీగా ఇంట్లోనే ఎగ్ పిజ్జా తయారు చేసి పిల్లలకు పెద్దలకు అందించవచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. చేయడం కూడా సలభం. రుచి అద్భుతం. పిల్లలు పెద్దలు ఇష్టం గా తినే ఈ హోం మేడ్ ఎగ్ పిజ్జాను మీరు తయారు చేసి చూడండి...
Healthy Tasty Homemade Egg Pizza
కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
క్యారెట్‌: 2-3
బంగాళాదుంపలు: 3(మీడియం సైజ్)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
కరివేపాకు: నాలుగు రెబ్బలు
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు, కారం: రుచికి తగినంత
నూనె: సరిపడా
వెన్న: కొద్దిగా
బ్రెడ్‌ స్లైస్: 6-8
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గుడ్లను పగలగొట్టి అందులో ఉప్పు, కారం కలిపి బాగా గిలక్కొట్టాలి.
2. తర్వాత ఆ గిన్నెను కుక్కర్‌ కు విజిల్‌ పెట్టకుండా సొనను ఉడికించి దించేస్తే అది జున్నులా తయారవుతుంది. దాన్ని ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.
3. తరవాత పచ్చిమిర్చి, క్యారెట్‌, ఉల్లిపాయలు, కొత్తిమీరను సన్నగా తరిగి ఉంచుకోవాలి. బంగాళాదుంపలను ఉడికించి చల్లారాక మెత్తగా చేయాలి.
4. ఇప్పుడు బాణలిలో నూనె వేసి స్టౌ మీద పెట్టాలి. వేడయ్యాక క్యారెట్‌, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసి కొంచెం మగ్గించి ఉప్పు, బంగాళాదుంప ముద్ద, సొన ముక్కలు కలపాలి.
5. మరికొద్దిసేపటికి కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి సన్నటి మంట ఉంచి మూత పెట్టాలి.
6. ఇప్పుడు అంచులు తీసిన బ్రెడ్‌కు వెన్న రాసి గుడ్డుకూరను దానిమీద పరచాలి. దానిపైన మరొక బ్రెడ్‌ ను ఉంచాలి. ఇప్పుడు ఈ ముక్కలను నూనె వేసి పెనం మీద కాల్చాలి. అంతే నోరూరించే ఎగ్‌ పిజ్జా తయారయినట్టే.

Atukula upma

Ingredients
:
  • Poha (Atukulu/Avalaki) – 2 cups
  • Medium onion- 1
  • Peanuts about 10
  • green chille- 4
  • few curry leaves
  • coriander leaves
  • lemon juice and salt.
    Atukula upma
Instructions
:
  • In a skillet add a tablespoon of oil followed by mustard seeds. When mustard starts to dance around add the peanuts, half teaspoon each of chana dal and urad dal. When slightly brown add the green chille and curry leaves. Then add the onions, a pinch of salt, turmeric and cook till onion becomes soft.
  • While the onion is cooking take the poha under the cold water and rinse it of twice. Put the poha immediately in the collander and drain the excess water.
  • Once the onions are soft add the poha, followed by salt. Reduce the heat to low and cook the poha for five to seven minutes. Once done add some lemon juice and chopped coriander.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ - గ్లార్లిక్ ఫ్రైడ్ రైస్

వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు. నేచర్ సృష్టించిన నికార్సయిన మెడిసిన్ ఇది. మనం తినే ఆహారం లో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది. LDL ని నియంత్రించే యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది .సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కళంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ సి అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివౌషధంగా పనిచేస్తుంది. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వెల్లుల్లితో చేసి వంటలు తినడం ఆరోగ్యకరం...

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
బటర్: 4tbsp
వెల్లుల్లి రెబ్బలు: 15
ఉల్లిపాయ: 1(సన్నగా తరగాలి)
క్యాబేజీ తరుగు: 1/2cup
బ్రొకోలి: 1/2cup
ఎండు మిర్చి: 5(మధ్యకు విరవాలి)
అజినమోటో: 1/2tsp
నూనె: 2tbsp
జీడిపప్పు పలుకులు: తగినన్ని
తాలింపు దినుసులు: తగినన్ని
బేబీకార్న్: 4(ముక్కలు చేయాలి)
వేయించిన వెల్లుల్లి రెబ్బల తరుగు: 3tbsp
Healthy Breakfast Garlic Fried Rice
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి, అరగంట నానబెట్టి, తర్వాత నీళ్లు లేకుండా వడకట్టాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి 3 కప్పుల నీళ్లు పోసి మరిగించి, అందులో బియ్యం వేసి ఉడికించాలి.
3. అన్నం పూర్తిగా ఉడికాక, ప్లేట్‌లోకి తీసుకొని, ఆరనివ్వాలి. అందులో బటర్, ఉప్పు వేసి కలపాలి.
4. తర్వాత పాన్‌ లో టేబుల్ స్పూన్ నూనె, బటర్ వేసి కాగాక, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి.
5. ఉల్లిపాయలు వేసి, గోధుమరంగు వచ్చేవరకు ఉంచి, బేబీకార్న్ ముక్కలు, క్యాబేజీ తరుగు, అజినమోటో వేసి, కొన్ని నిమిషాల పాటు వేయించాలి.
6. అందులోనే ఉప్పు, అన్నం వేసి క లిపి, 10-15 నిమిషాలు ఉంచి, చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. అంతే గార్లిక్ రైస్ రెడీ ఏదైనా గ్రేవీతో ఈ ఫ్రైడ్ రైస్‌ని సర్వ్ చేయాలి.
  

స్పైసీ అండ్ క్రిస్పీ ఎగ్ చిల్లీ

సాధారణంగా గుడ్డుతో చాలా వెరైటీలనే చేస్తుంటాం. అయితే ఎన్నీ వెరైటీలను చేసి గుడ్డు టేస్ట్ అన్ని వైరటీలకు అనుబంధంగా ఉంటుంది. గుడ్డులో ఉన్న పచ్చసొన, తెల్ల సొన విడువలేని ఆస్వాదన. చిటికెలో ఆకలి తీర్చేది గుడ్డు, హఠాత్తుగా ఊడిపడే అతిథులకు ఆతిథ్యం ఇచ్చేది గుడ్డు. చికెన్, మటన్ లేకున్నా ఉడికించిన గుడ్డును వెరైటీగా చేసి అందించడం. టేస్టీ టేస్టీగా...
Crispy Egg Chilli
కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 4 (ఉడికించి, పై పొట్టు తీసినవి)
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
పండు మిర్చి పేస్ట్: 1tsp
ఉల్లిపాయ తరుగు: 2tbsp
అల్లం: చిన్న ముక్క (పై పొట్టు తీసి సన్నగా తరగాలి)
వెల్లుల్లి రెబ్బలు: 2 (పై పొట్టు తీసి సన్నగా తరగాలి)
చింతపండు గుజ్జు: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
వంటసోడా: చిటికెడు
సోయా సాస్: 1tsp
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె పోసి వేడయ్యాక గుడ్లను మెల్లగా వేసి పైనంతా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి.
2. తర్వాత విడిగా మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి.
3. ఇప్పుడు అందులో పండుమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి నిమిషం పాటు వేయించాలి. దానికి సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించి స్టౌ కట్టేయాలి.
4. ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి. చైనీస్ రైస్, రోటీ లేదా పరోఠాలోకి ఈ చిల్లీ ఎగ్ కాంబినేషన్ రుచిగా ఉంటుంది. గుడ్డు ఇష్టపడనివాళ్లు దీనికి బదులుగా బంగాళదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు.

బెంగాల్ స్పెషల్ స్వీట్స్...

 ముఖ్యంగా బెంగాల్ లో ఎక్కువగా తయారు చేసుకొనే స్వీట్ మీకోసం...
పైనాపిల్ స్వీట్
కావలసిన పదార్థాలు: పైనాపిల్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), నెయ్యి: 3tbsp, కోవా: 2cup(తురుముకోవాలి), పంచదార: 1/2cup, చిరోంజి(సన్ ఫ్లవర్ గింజలు): 1/4cup, యాలకుల పొడి: 1tsp, జీడిపప్పు: 20
తయారు చేయు విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి, తర్వాత అందులో పైనాపిల్ ముక్కలను వేసి ఐదు నిముషాల పాటు వేయించి పూర్తిగా నీరంత పోయేవరకూ వేయించాలి. అందులో పంచదారను కూడా వేసి బాగా కరిగేలా కలియబెడుతు తక్కువ మంట మీద ఉడికించాలి. ఇప్పుడు అందులోనే యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో మిగిలిన నెయ్యి వేసి అందులో సన్ ఫ్లవర్ గింజలు మరియు జీడిపప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించి, పైనాపిల్ మిశ్రమంలో కలుపుకోవాలి. అందులోనే కోవా తురుము కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించి జీడిపప్పును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
 


బెంగాలి పాయసం


కావలసిన పదార్థాలు: పాలు: 1ltr, బాస్మతి రైస్: గుప్పెడు, నెయ్యి: 2tbsp, యాలకులు: 1tsp, బిర్యాని ఆకు: 1, బెల్లం: రుచికి సరిపడా, గార్నిష్ కోసం: ద్రాక్ష, జీడిపప్పు
తయారు చేయు విధానం: ముందుగా మందపాటి గిన్నెలో పాలపోసి, స్టౌ మీద పెట్టి బాగా కాచి, చిక్కబడిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో బాస్మతి బియ్యం వేసి, లైట్ గా వేయించుకోవాలి. అందులోనే ద్రాక్ష, జీడిపప్పు, బిర్యాని ఆకు యాలకలు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలుపుకోవాలి. తర్వాత బెల్లం తురుమును కూడా కలుపుకోవాలి. బెల్లం బాగా పాలలో కరిపోయేలా కలిపి మరో రెండు నిముషాల స్టౌ మీద పెట్టి ఉడికించాలి. చివరగా అందులో వేయించుకొన్న ద్రాక్ష మరియు జీడిపప్పును గార్నిష్ చేసి పాయసం చల్లబడిన తర్వాత కూల్ గా సర్వ్ చేయాలి.
 


ఇలాచి బహార్ సందేష్


కావలసిన పదార్థాలు: చీజ్: 250grms, పంచదార: 150grms, యాలకులపొడి: 1tsp, చెర్రీస్ : 5-10
తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో కాటేజ్ చీజ్, మరియు క్యాస్టర్ షుగర్ రెండూ వేసి బాగా మెత్తగా అయ్యేవంతవరకూ కలుపుకోవాలి. తర్వాత ఒక మందపాటి పాన్ తీసుకొని అందులో చీజ్, షుగర్ మిశ్రమాన్ని వేసి తడిపోయేవరకూ ఉడికించాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ తయారు చేసిన చీజ్ మిశ్రమాన్ని చిన్న చిన్న కప్పులలో నింపుకొని దానీ మీద చెర్రీస్ ను గార్నిష్ చేయాలి. అంతే ఇలాచి బహార్ సందేష్ రెడీ...


ఇలాచీ బేసన్ బర్ఫీ


కావలసిన పదార్థాలు: శెనగపిండి: 1kg, కోవా: 1/2kg, పంచదార: 1.5kg, యాలకులు: 4-5, జీడిపప్పు: 5-10, నెయ్యి: 250grms
తయారు చేయు విధానం: ముందుగా శెనగపిండిలో నెయ్యి కలిపి దోరగా వేయించాలి. పంచదారను పాకంపట్టి, తీగపాకం రాగానే వేయించిన శెనగపిండిని, కోవాను వేసి కలియదిప్పాలి. మంట తగ్గించి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం గట్టిపడుతుండగా యాలకులపొడిని కూడా దానికి కలపాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి.. పైన జీడిపప్పులను అద్దాలి. ఇష్టమైనవారు తగరపు రేకులను కూడా అంటించవచ్చు. ఇది ఆరిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా చేసి సర్వ్ చేయాలి. అంతే బేసన్ బర్ఫీ తయారైనట్లే...!


కుబానీ కా మీఠా:


కావలసిన పదార్థాలు: ఎండు కుబానీపండ్లు: 1kg, పంచదార: 1.5kg, తాజా మీగడ: 1cup, బాదం:1/2cup, కస్టర్డ్ పౌడర్: కొద్దిగా
తయారు చేయు విధానం: ముందుగా కుబానీ పండ్లను ఓ రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు గింజను వేరుచేసి గుజ్జును మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఇందులో పంచదార కలిపి తక్కువ మంటమీద ఉడికించి చిక్కటి పాకంలా అయ్యాక దించాలి. చివరగా దీన్ని ప్లేట్లలో సర్ది పాలమీగడ లేదా కస్టర్డ్‌, బాదంపప్పుతో అలంకరిస్తే రుచికరమైన కుబానీ కా మీఠా రెడీ..


రసగుల్లా


కావలసిన పదార్థాలు: పాలు: 1tsp, పంచదార: 3cups, మైదాపిండి: 1/4cup, వడకట్టేందుకు మంచి క్లాత్: చిన్న నాప్‌కిన్ సైజులో
తయారు చేయు విధానం: ముందుగా పాలని మరిగించి రెండు చుక్కలు నిమ్మరసం పిండితే పాలు విరిగి పోతాయి. తర్వాత ఆ విరిగిన పాలని మంచి క్లాత్‌లో వడకట్టాలి. అప్పుడు గట్టిగా తయారై, పనీర్ అవుతుంది. ఈపనీర్‌లో పిడికెడు మైదా పిండివేసి బాగా మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఆరిపోకుండా తడిబట్టను కప్పి ఉంచాలి. పంచదారలో తగినన్ని నీళ్లుపోసి పాకం తయారు చేసి, పాకం బాగా ఉడుకుతుండగా పై ఉండలను వేసి తీసేయాలి. ఉండలలోకి పాకం బాగా పట్టి, మిశ్రమం బాగా ఆరిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యని రసగుల్లా స్వీట్ తయారైనట్లే...!