all

Monday, November 26, 2012

ట్రెడిషనల్ సేమియా-కొబ్బరి పాయసం

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలులోని ఈ రుచికరమైన వంటకం కొబ్బరి పాయసం. భారతీయులు తీపి పదార్ధాలు ఎక్కువగానే తింటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో విశేష సందర్భాలలో, సంతోష సమయంలో, పండగలు, పూజలప్పుడు స్వీట్లు చేయడం తప్పనిసరి.. మామూలుగా చేసుకునే సగ్గుబియ్యం పాయసానికి కొంత కొత్తదనం, ఆరోగ్యానికి మంచి చేసే కొబ్బరి తో పాయసం కొత్తగా చేద్దాం..
కావలసిన పదార్థాలు:
సేమియా: 1cup
పాలు: 1/2ltr
చిక్కని కొబ్బరిపాలు: 1/2cup(పచ్చికొబ్బరి తురిమి గ్రైండ్ చేసి వడగట్టిన కొబ్బరి పాలు)
పంచదార: 11/2cup
నువ్వులు, మినపప్పు, పెసరపప్పు: 3tbsp(అన్నీ కలిపి)
జీడిపప్పు పొడి: 2tsp
యాలకులపొడి: 1tsp
ద్రాక్ష, జీడిపప్పు, బాదం: 1/4cup
Traditional Semiya Coconut Payasam Aid0069
తయారు చేయు విధానం:
1. పాన్ లో నువ్వులు, మినపప్పు, పెసరపప్పు విడివిడిగా వేయించాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తనిపొడిలా చేసుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష, బాదం దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి సేమియాను వేయించి పెట్టుకోవాలి.
3. పాలు కాగాక.. కొబ్బరిపాలనూ చేర్చి.. మరోసారి మరగనివ్వాలి. సన్నని మంటపై ఉంచి..సేమియా వేయాలి. కొద్ది సేపటి తర్వాత పంచదార కలపాలి.
4. ఇప్పుడు అరకప్పు పాలు తీసుకుని ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న పొడిని కలిపి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేయాలి. పదినిమిషాలయ్యాక జీడిపప్పు, యాలకులపొడి వేసి కలిబెట్టాలి.
5. నువ్వులు, మినపప్పు, పెసరపప్పు.. రుచితో పాటు.. చిక్కదనాన్ని ఇస్తాయి. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, బాదంతో గార్నిష్ గా చేసి పండగ పూట వచ్చిన అతిథులకు అంధించడమే...

No comments: