all

Monday, November 26, 2012

తలనొప్పికి కారణాలు... తీసుకోవల్సిన జాగ్రత్తలు...

సాధారణంగా మనకు వచ్చే శారీరక నొప్పులలో తలనొప్పి ఒకటి. నేటిరోజులలో ఎవరికి తలనొప్పి లేని వారం లేదా నెల అనేది లేదనే చెప్పాలి. ప్రతిరోజూ కాకున్నా కనీసం వారానికోసారి లేదా నెలకు ఒక సారి చుట్టంలా తలనొప్పి ఏదో ఒక కారణంగా వచ్చే తీరుతుంది. క్షణం తీరికలేని జీవనం. నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. సమయానుకూలంగా నిద్ర, ఆహారం కరువయ్యాయి. నిలకడలేని ఆలోచనలతో యాంత్రిక జీవితం సాగిస్తున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి వ్యాధుల బారినపడుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో ముఖ్యమైంది తలనొప్పి. దీంతో బాధపడేవారిలో ఎక్కువ మహిళలే ఉన్నారు. అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం ఫలితంగా వచ్చే తలనొప్పితో ఏ పనీ సరిగ్గా చేయలేక మదనపడుతున్నారు.


తడి జుట్టు: తలస్నానం చేసిన తర్వాత తలను తడి బాగా అర్పకుంటే కూడా తలనొప్పికి గురికావాల్సి ఉంటుంది. తల జుట్టు తడిగా ఉండటం వల్ల తల మాడు అధికంగా చల్లగా చేస్తుంది. దాంతో తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. కాబట్టి తలస్నానం చేసిన ప్రతి సారి తలను పూర్తిగా ఆరబెట్టుకోవాలి. అందుకు డ్రైయ్యర్ ను ఉపయోగించనవసరం లేదు. సహజంగా వీచే గాలిలో కొద్దిసేపు ఆరబెట్టుకొన్నా సరిపోతుంది.


ఎండలో బయట తిరగడం: తలకు హాట్ పెట్టుకొని బయట ఎండలో తిరగడం పర్వాలేదు. అయితే అతిగా వేడి తలకు తగిలినా కూడా తలనొప్పి రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఖాలీ కడుపుతో ఉండి ఎక్కువగా ఆకలి కలిగినప్పుడు, ఎండలో తిరగడం వల్ల అలసటకు గురియై తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి బాగా తిని సరైన రక్షక కవచాన్ని ధరించి బయట తిరిగాల్సి వస్తుంది.


డియోడరెంట్/ పెర్ఫ్యూమ్స్: ఉదాహరణకు ఎక్కువ సమయం పెర్ఫ్యూమ్ స్టోర్ లో నిలబడ్డా.. ఆ సువాసనలు మెదడుపై ప్రభావం చూపుతాయి. పరిమళభరితమైన సుంగధాలు ఎక్కువగా ఘాటుగా ఉండటం చేత తలనొప్పికి దారితీస్తాయి. కాబట్టి ఎక్కువ ఘాటు వాసనలున్న పెర్ఫ్యూమ్ జోలికి వెళ్ళకండి.


కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ స్ర్కీన్స్: ఎక్కువ సమయం అలాగే కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అప్పుడప్పుడు కను రెప్పలను కదిలిస్తుండాలి. యాంటీ గ్లేర్ స్ర్ర్కీన్ ఫిక్స్ సేఫ్ గార్డ్ చేయించుకోవడం వల్ల తలనొప్పిని అవాయిడ్ చేయొచ్చు.

టెలివిజెన్ స్క్రీన్: అదేవిధంగా ఎక్కువగా టీవీ చూడటం వల్ల కూడా కళ్ళు బాధిస్తాయి. కాబట్టి టీవీ చూడ్డానికి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. టీవికి దగ్గరగా కూర్చోకుండా ఉండాలి. టీవిలో వెలువడే కలర్ చాలా డార్క్ గా కనిపిస్తున్నట్లై వాటి రంగులను అడ్జెస్ట్ చేసుకోండి.

  పడుకుని చదవడం: పడుకొని పుస్తక పఠనం చేయడం అంతి మంచిది కాదు. దాంతో మీ కళ్ళు మితిమీర అలసటకు గురివౌతుంది. కాబట్టి చదివేటప్పుడు ఎప్పుడూ కూర్చొని ఉండాలి. అలాగే చదివేటప్పుడు సరైన లైట్ వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

మరీ చల్లగా ఉండే కూల్ డ్రింక్స్/ ఐస్ క్యూబ్స్: చల్లని పదార్థాలు, అతి చల్లగా ఉండే కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.


ఆల్కహాల్: అలాగే ఆల్కహాల్ కూడా మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మెదడుపై, నాడీ వ్యవస్థపై ప్రభావం చూసి, తలనొప్పికి దారితీస్తుంది.


నిద్రలేమి: మీరు సరిగా నిద్రపోనట్లైతే, అది మిమ్మల్ని అందవిహీనంగా మార్చడమే కాదు, తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది . కాబట్టి కనీసం 7-8గంటల సేమయం గాఢంగా నిద్రపోవాలి. దాంతో నిద్ర లేవగానే మీ మైండ్ మరియు బాడీ రిలాక్స్ గా ఉండి ఏపనిచేయాలన్నా ఉత్సాహంగా ఉంటారు.



లాంగ్ డ్రైవ్: ఎక్కువ సమయం ఎక్కువ దూరం మోటార్ సైకిల్లో ప్రయాణం చేయకపోవడం మంచిది. శీతాకాలంలో చల్లగాలులు, కఠినమైన గాలుల వల్ల, తేమ వల్ల, ఉదయాన్నే, లేట్ నైట్ లో ప్రయాణం చేయడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి అలా ప్రయాణం చేయాలన్నప్పుడు నోటినికి, ముక్కు, చెవులకు రక్షణ కవచంగా ఏదైనా ధరించి ప్రయాణానికి సిద్దం కండి.


No comments: