all

Monday, November 26, 2012

హెల్తీ సోయా మేథీ రైస్

ఆరోగ్యానికి ఎంతో మంచివైన సోయా గ్రాన్యూల్స్, మెంతికూర కలిపి చేసే హెల్దీ రైస్ ఐటం ఇది.అన్నీ రెడీ చేసుకుంటే త్వరగా చేసెయ్యొచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గాను, లంచ్ బాక్స్ లకు పిల్లలకు అందించడంతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకూరలను పప్పు చేస్తే తిననని పిల్లలు ఈ విధంగా వెరైటీగా చేసి ఇవ్వడంతో హాపీగా తినేస్తారు.
కావలసిన పదార్ధాలు :
సోయా గ్రాన్యూల్స్ : 1cup
మెంతికూర : 2కట్టలు
అన్నం : 2cups
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి : 4-8
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు: 1cup
పుదీనా తరుగు: కొద్దిగా
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1tsp
గరం మసాలా పొడి : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
కారం: 1tsp
నూనె : సరిపడా
లవంగాలు,చెక్క,షాజీర
Healthy Soya Methi Rice
తయారు చేసే విధానం:
1. సోయాగ్రాన్యూల్స్ ను మరిగే నీళ్ళలో రెండు నిముషాలు ఉడికించి వడపోయాలి. చల్లని నీళ్ళతో కడిగి నీరు వంపేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
2. మెంతిఆకులను విడిపించుకొని బాగా శుభ్రం చేసి సన్నగా తరిగి అర స్పూన్ నూనె వేసి, వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. నూనె వేడి చేసి రెండు లవంగాలు ,చిన్న దాల్చిన చెక్క ముక్క,షాజీర వేయాలి.
4. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
5. అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి సోయాగ్రాన్యూల్స్ వేయాలి.తడి అంతా పోయి డ్రై గా వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకొన్న మెంతి కూరా వేసి బాగా కలిపి పసుపు,కారం,గరం మసాలా పొడి వేయాలి. చివరగా అన్నం,తగినంత ఉప్పు,తరిగిన కొత్తిమీర,పుదీనా వేసి బాగా కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి. అంతే సోయా మేథీ రైస్ రెడీ. ఇది బ్రేక్ ఫాస్ట్, లంక్ బ్యాక్స్ కు హెల్తీ డిష్..

No comments: