all

Monday, November 26, 2012

ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై రుచి అమోఘం..

చేపలంటే చాలా మంది ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో ఆంధ్రా ఫిష్ కూడా ఒకటి. ఆంధ్రా ఫిష్ టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఆంధ్రా స్టైల్ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ ఫిష్ ప్రైను ఏప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు టేస్ట్ చూసేయండి...
andhra style fish fry recipe

ఫిష్ ఫిల్లెట్ (చేపముక్కలు): 8
కరివేపాకు: ఒక రెమ్మ
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు రుచికి తగినంత
మారినేట్(చేపముక్కలను మసాలాలో నానబెట్టుటకు)
ఉల్లిపాయ: 1(కట్ చేసినవి)
వెల్లుల్లి రెబ్బలు: 5
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: 1tsp
ధనియాలు: 1tsp
మెంతులు: 1/2tsp
ఎండు మిర్చి: 4
పసుపు: 1/2tsp
గరం మసాలా: 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫిష్ ఫిల్లెట్స్ నీటిలో శుభ్రంగా కడిగి, తర్వాత చేప ముక్కలకు ఉప్పు, పసుపు వేసి బాగా రుద్ది పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు మారినేట్ కు రెడీ చేసుకొన్న మసాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా మెత్తగా గట్టిగా ఉండేలా గ్రైడ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు చేపముక్కలకు గ్రైడ్ చేసుకొన్న పేస్ట్ ను బాగా అన్నివైపులా పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు వేసి లైట్ గా వేయించుకోవాలి.
5. ఇప్పుడు మసాలా పట్టించిన చేపముక్కలను తీసుకొని ఫ్రైయింగ్ పాన్ లో ఒకటి లేదా రెండు వేసి తగినంత నూనె వేస్తూ తక్కువ మంట మీద పది నిమిషాల పాటు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి.
6. చేపముక్కలు నూనెలో బాగా వేగి బ్రౌన్ కలర్ మారిన తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడి అన్నం, పాలక్ పప్పు తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. పప్పురసం అయితే మరీ రుచిగా ఇంకాస్తా ఎక్కువ తినాల్సిందే...

No comments: