all

Monday, November 26, 2012

లోక్యాలరీ స్నాక్ మొలకెత్తిన పెసలు

కావలసిన పదార్థాలు:
మొలకెత్తిన పెసలు: 1cup
టొమాటో తరుగు: 1/2cup
కీరా తరుగు: 1cup
కొత్తిమీర తరుగు: 1tbps
క్యాప్సికమ్ / పచ్చిమిర్చి తరుగు: తగినంత
సలాడ్ డ్రెస్సింగ్ కోసం...
మిరియాల పొడి: 1/2tsp
ఉప్పు: తగినంత
జీలకర్ర: 1/2tsp
నిమ్మరసం: 1/2tbsp
ఆలివ్ ఆయిల్: 1tbps
పంచదార లేదా బెల్లం: 1tbsp
sprouted salad a low calorie breakfast recipe

తయారు చేయు విధానం:
1. సలాడ్ డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.
2. గిన్నెలో పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి. అందులో మొలకెత్తిన గింజలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గింజలను చల్లారనివ్వాలి.
3. సలాడ్ డ్రెస్సింగ్ కోసం కలిపిన మిశ్రమాన్ని, చల్లారిన గింజలపై వేసి కలపాలి. సర్వ్ చేసే గిన్నెలో టొమాటో, కీరా తరుగు, ఆ పైన స్ప్రౌట్స్ ఉంచి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేయాలి.
నోట్: మొలకెత్తిన గింజలను, కూరగాయల తరుగును కలిపి ఎక్కువసేపు ఉంచకూడదు. దీనివల్ల పచ్చి వాసన వేసి, తినాలనిపించదు.

No comments: