all

Monday, November 26, 2012

నాన్-చపాతీ స్పెషల్ సైడ్ డిష్ నవరతన్‌ కూర్మా..

ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు: 3 కప్పులు
(పొటాటో, క్యారెట్‌, పచ్చి బఠాణీ, బీన్స్‌, కాలిఫ్లవర్‌, కాప్సికమ్‌, కాబేజ్‌, గోరు చిక్కుడు, సొరకాయ)
పనీర్‌: 200grms(తురిమినది)
టమాటాలు: 4
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
అల్లం పేస్ట్‌: 2tsp
వెల్లుల్లి పేస్ట్‌: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
కారం: 2tsp
ధనియాలపొడి: 1tsp
గరం మసాలా పొడి: 2tsp
మీగడ: 2tbsp
నూనె: తగినంత
నెయ్యి: 1tbsp
పాలు/ నీళ్ళు: 1cup
డ్రై ఫ్రూట్స్‌: 1/4cup
కొత్తిమీర తురుము: 2tbsp
Special Navaratan Korma


తయారు చేయు విధానం:
1. ముందుగా టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి. తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజ్జును తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు.
2. తర్వాత ఒక స్పూన్‌ నేయ్యిని పాన్ లో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి. వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
3. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి.
4. గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి. పాన్ కు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి. తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి.
5. తర్వాత అందులో పనీర్‌ వేసి గరిటతో తిప్పాలి. చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. సర్వ్‌ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర తరుగుతో అలంకరించి సర్వ్‌ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి, వేడి వేడి ప్లెయిన్ రైస్ లోనికి చాలా రుచిగా ఉంటుంది.

No comments: