all

Monday, November 26, 2012

నోరూరించే ఫిష్ పులావ్

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1/2kg
ఫిష్ ఫిల్లెట్: 1(పెద్ద చేప)
వెల్లుల్లి: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 3-4tbsp
పచ్చిమిర్చి పేస్ట్ : 3tbsp
బాదం: 1cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 2tbsp
నిమ్మరసం: 1tsp
పంచదార: 2-3tsp
కోవా: 2tbsp
బిర్యాని ఆకు: 2
లవంగాలు: 2
యాలకులు: 2
నెయ్యి: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
fish pulao yummy fish rice recipe

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ ల్లో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి దానికి ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి పేస్ట్ కలపాలి. అలాగే కొద్దిగా ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఫిష్ ఫిల్లెట్ తీసుకొని శుభ్రం చేసి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చేప ముక్కలకు పసుపు, కారం, నిమ్మరసం, మరియు కొద్దిగా ఉప్పు వేసి మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో సగం భాగం నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, లవంగాలు, యాలకులు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో చేప ముక్కలను కూడా వేసి అతి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అవసరం అయితే కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి చేప ముక్కలను పక్కకు తీసి పెట్టుకోవాలి.
5. తర్వాత అందులోనే మిగిన సగ భాగం నెయ్యి, రైస్ మిశ్రమం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రెండు మూడు నిముషాలపాటు వేయించుకోవాలి. తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. ఐదు నిముషాల తర్వాత మూత తీసి, మంటను పూర్తిగా తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు నీరంతా ఇమిరిపోయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చేప ముక్కను, బాదం పలుకులను, కోవాను వేసి మిక్స్ చేసి మరో ఐదు నిమిషాల పాటు సిమ్ పెట్టి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఫిష్ ఫిల్లెట్ పులా రెడీ. ఏదేని గ్రేవీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే సరి...

No comments: