గుడ్డు తినమని డాక్టర్స్ ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. ఎందుకంటే గుడ్డులో అధిక శాతం ప్రోటీనులు కలిగి ఉండటం చేత, ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని, ఆహారంతో పాటు గుడ్డు కూడా తినమని చెబుతుంటారు. ఎగిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్స్ ప్రియులు ఎగ్ సాండ్విచ్, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ టోస్ట్ వంటివి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఎగ్ తినడం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా చాలా రుచికరం గా కూడా ఉంటుంది. అయితే ఎన్ని రోజులు ఒకే రకమైన ఎగ్ వంటకాలను రుచి చూస్తుంటాం. కాబట్టి కొంచెం వెరైటీగా ఎగ్ ఆలూ చాట్ తయారు చేసి కొత్త రుచిని చూద్దాం...
కావలసిన పదార్థాలు:
గుడ్లు: 4
పొటాటో(బంగాళదుంపలు: 5
ఉల్లిపాయలు: 3(కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మిరియాలు: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
కారం: 1tsp
కొత్తిమీర: గార్నిషింగ్ కోసం కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను నీటితో శుభ్రం చేసి, ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి.
2. అంతలోపు, మరో గిన్నెలో నీళ్ళు పోసి అందులో గుడ్లను వేసి వాటిని కూడా ఉడికించి, తీసి చల్లని నీటిలో వేసి, పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి.
3. బంగాళదుంపల పొట్టు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో, ఉడికించిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, టమోటో, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పెప్పర్ పౌడర్, కారం, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి, బంగాళాదుంపలను బాగా చిది చాట్ మసాలా బాగా పట్టేట్లు తయారు చేసుకోవాలి.
5. తర్వాత ఒక ప్లేట్ లో ఉడికించిన గుడ్లను తీసుకొని, వాటిని మద్యకు కట్ చేసి లోపల ఉన్న పచ్చసొనను తీసేయాలి(పచ్చసొనను ఆలూ మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకోవచ్చు లేదా అలాగే తినేయొచ్చు)
6. తర్వాత గుడ్డులోపల ఆలూ చాట్ ను నింపుకోవాలి, తర్వాత దాని మీద చాట్ మసాలా నింపి, కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే ఎగ్ ఆలూ చాట్ రెడీ...

No comments:
Post a Comment