all

Monday, November 26, 2012

5 సూపర్ హెల్తీ కార్న్ వంటకాలు-మాన్ సూన్ స్పెషల్..

వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్కజొన్న కండెల అమ్మకాలు ఊపందుకుంటాయి. చల్లచల్లని సాయంత్రాల్లో వేడివేడి గింజలను లాగించేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. వాటిని తినమనే వారు బహుశా తక్కువే. మొక్క జొన్నలో యాంటీఆక్సిండెంట్స్ మరియు ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. కార్న్ ను ఆహారంలో ఉపయోగించడం చాలా సులభం. మరియు ఆరోగ్యకరం. మొక్క జొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని సాధారణంగా జొన్నలని కూడా అంటారు. ఈ మొక్క జొన్న గింజలను వివిధ రకాలుగా వండుతారు.

కండెలుగా ఉన్నపుడే వాటిని తీపివిగా తినేయవచ్చు. లేదా వాటికి మసాలాలు, కారాలు కూడా తగిలించి తింటారు. గ్రేవీలో వేసి ప్రైడ్ రైస్ తో కలిపి తినవచ్చు. లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటివాటితో కూడా చేర్చి సాయంకాలంవేళ మంచి చిరుతిండిగా తినేయవచ్చు. మొక్కజొన్న కండెలును సాధారణంగా మనం నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటాం లేదా కాల్చిన మొక్క జొన్న కండెలకు వివిధ కారాలు, ఉప్పులు రాసికూడా తినేస్తాం.
మొక్క జొన్న తినటం రుచే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మొక్కజొన్న కండెలలోని ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రీయను పెంపొందిస్తుంది. మొక్క జొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది. ఎముకల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ, దృఢత్వానికీ ఉపయోగించే కాల్షియం, భాస్వరం ఇందులో ఉన్నాయి. డయాబెటీస్ రోగులు మొక్కజొన్న తిన్నట్లయితే శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి అధిక రక్తపోటు రాకుండా చేస్తుంది. గుండెకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే 5 హెల్తీ మొక్కజొన్న వంటలు ఈ వర్షాకాల సందర్భంగా మీకోసం...

కార్న్ భేల్ సలాడ్


కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్ప్ గింజలు: 1cup, కీరదోస కాయ : 1పెద్దది(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ: 1చిన్నది(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చికొబ్బరి తురుము: 1tbsp, పచ్చిమిర్చి: 1(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి), నిమ్మరసం మరియు ఉప్పు: రుచికి సరిపడా.




స్పైసీ కార్న్ కబ్

కావలసిన పదార్థాలు: తాజాగా ఉన్న మొక్కజొన్న కండెలు: 2 లేదా 3, నీళ్ళు: మొక్కజొన్న ఉడికించడానికి సరిపడా, ఉప్పు: రుచికి సరిపడా, నిమ్మకాయ: 1/2భాగం, కొత్తిమీర : గార్నిష్ కోసం 1tbs, తయారు చేయు విధానం: ముందుగా బౌల్ సగభాగానికి నీటి నింపు అందులో మొక్కజొన్న కండెలను పెద్దవి లేదా సగానికి కట్ చేసి వేసి, మూత పెట్టి బాగా ఉడికించాలి. మొక్కజొన్న గింజలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పది -పదిహేను నిముషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత పై మూత తీసి, మొక్కజొన్న కండెలను ప్లేట్ లోనికి తీసుకొని వాటికి నిమ్మరతొక్కతో ఉప్పు కారం పట్టించి తర్వాత దాని మీద కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.



అవొకాడో కార్న్ సలాడ్

కావలసిన పదార్థాలు: అవొకాడో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), కార్న్ సీడ్స్: 1cup, ఎర్రని టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి), కొత్తమీర తరుగు: 1tbsp, నిమ్మరసం: 2tbsp, ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి, బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా. తయారు చేయు విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పై చెప్పిన పదార్థాలన్నింటిని వేసి బాగామిక్స్ చేసి పదినిముషాల అలాగే ఉంచి ఆ తర్వాత సర్వ్ చేయాలి. అంతే అవొకాడో కార్న్ సలాడ్ రెడీ...


మెక్సికన్ గ్రిల్డ్ కార్న్


కావలసిన పదార్థాలు: మోయొనైజ్: 2tbsp, పెరుగు: 2tbsp, కారం: 1tsp, మొక్కజొన్న పొత్తులు: 4(పొడవైనవి, నిమ్మరసం: 1tsp, చీజ్: 2tbsp. తయారు చేయు విధానం: ముందుగా గ్రిల్ ను బాగా వేడి చేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మోయొనైజ్, పెరుగు, మరియు కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొక్కజొన్న పొత్తులకు బాగా పట్టించి వేడివేడి గా ఉన్న గ్రిల్(ఇనుప చువ్వల)మీద పెట్టి మీడియం మంట మీద బాగా కాల్చాలి. అన్నీ వైపులా బాగా కాలేలా చూసుకొని తర్వాత పక్కకు తీసుకొని చీజ్ మరియు నిమ్మరసంతో గార్నిష్ చేసి వేడి వేడి గా అందించాలి.

కార్న్ బ్రెడ్


కావలసిన పదార్థాలు: కార్న్: 1cup, మైదా: 1cup, పంచదార: 1tbsp, బేకింగ్ పౌడర్: 1tsp, ఉప్పు: 1tsp, పాలు: 1cup, ఆలివ్ నూనె: 1/2cup, గుడ్డు: 1. తయారు చేయు విధానం: ఓవెన్ ను 400డిగ్రీలో పెట్టాలి. తర్వాత ఒక బౌల్లో నూనె, గుడ్డు, బాగా మిక్స్ చేయాలి. మిగిలన పాదార్థాలన్నింటి వెరొక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాల్ని గ్రీస్డ్ పాన్ లో పోసి, బ్రెడ్ ఎంత మంద రావాలనుకొంటే అంత మందాగా ముందు పొడి పదార్థాలని ఆ తర్వాత నూనె, గుడ్డు మిశ్రమాన్ని వేసి 20-25నిమిషాలు బేక్ చేసి బయటకు తీసి గోరువెచ్చగా లేదా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేయాలి. అంతే మాన్ సూన్ స్పెషల్ కార్న్ రిసిపీతో ఎంజాయ్ చేయండి.


No comments: