జామూన్స్ పేరు చెపితే, తియ్యగా నోరు ఊరి పోతుంది. తినటానికే కాదు చూసేటందుకు కూడా ఈ పన్నీర్ జామూన్స్ ఎంతో ఇంపుగా వుంటాయి. తయారీ చాలా తేలిక. మరి పన్నీర్ తో కలిపిన ఈ జామూన్స్ చేయటం ఎలానో చూడండి.
కావలసిన పదార్ధాలు:
పన్నీర్ 100 గ్రా.
మైదా 100 గ్రా
నెయ్యి లేక నూనె పావు కిలో
చక్కెర పావు కిలో
యాలకుల పొడి 1 చెంచా
తయారీ విధానం:
ఒక బౌల్ లో పన్నీర్, మైదాలను వేసి ముద్దగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నీటిలో చక్కెర వేసి తీగపాకం వచ్చాక దించేసుకుని పక్కన పెట్టుకోవాలి. న్నీర్, మైదా ఉండలను నూనెలో డీప్ ఫ్రై చేసి పాకంలో వేయాలి. చివరిగా యాలకుల పొడి చల్లుకోవాలి. అంతే ఇక వాటిని మంచి బౌల్ పెట్టుకొని వేడి వేడిగా తింటే చాలా రుచికరంగా వుంటాయి.

No comments:
Post a Comment