పిల్లలు ఎప్పుడో ఒకసారి ఏడ్వటం అన్నది చాలా సాధారణం. కానీ తరచూ ఏడుస్తుంటే పిల్లల డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. కారణం ఏమిటో తెలుసుకోవాలి. పిల్లలు ఆగకుండా అలా ఏడుస్తూ ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ప్రమాదకరమైన సమస్యలు కాగా మరికొన్ని వేళల్లో అది కేవలం చాలా చిన్న కారణం కూడా కావచ్చు. అంటే ఒక్కోసారి పాపకు ఆకలి ఎక్కువగా ఉన్నా ఏడుస్తూ ఉంటుంది. కారణం ఏదైనప్పటికీ పిల్లలు తమ సమస్యను ఏడ్వడం ద్వారానే తెలియబరుస్తుంటారు. అంటే వారు ఏడుపుతోనే తమ భావాలను కమ్యూనికేట్ చేస్తారన్నమాట.
పిల్లలు ఏడ్వటానికి కొన్ని కారణాలు: ఆకలిగా ఉండటం, భయపడటం, దాహం వేయడం, డయపర్ తడి కావడం వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండటం, పెద్ద పెద్ద శబ్దాలు కావడం కాంతి ఎక్కువ కావడం, పొగలు కమ్ముకోవడం, తీవ్రమైన నొప్పి ఉండటం, పళ్ళు రావడం, ఇన్‌ఫెక్షన్‌లు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) జ్వరం, జలుబు, చెవినొప్పి మెదడువాపు జ్వరం గుండె సమస్యలు, జన్యుపరమైన కొన్ని సమస్యలతో కూడా పిల్లలు ఏడుస్తారు.
ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి ముఖ్య కారణాలు. మీ పాప విషయంలో ఏడుపు బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫెన్‌టైల్ కోలిక్) కారణం అనిపిస్తుంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది.
ఈ వయసుపిల్లలు కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇది చాలా సాధారణమైన సమస్య. ఇలాంటి పిల్లల్లో ఏడుపుకు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం వంటి కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు.
తీసుకోవల్సిన జాగ్రత్తలు:
1. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు.
2. పిల్లల్లో ఇబ్బందికరమైన శబ్ధాలు ఏమైనా వస్తున్నాయోమో గమనించాలి. అంటే శ్వాస సరిగా తీసుకోకుండా ముక్కులో, గొంతులోంచి ఎటువంటి శబ్దం వినిపించినా... అజీర్ణం వల్ల వచ్చే యూట్రస్ శబ్ధం, వాటికి తగిన సిరఫ్ లు వాడిని బెటర్ గా ఫీల్ అవుతుంది.
3. నిద్రపుచ్చడానికి శబ్ధంలేకుండా జాగ్రత్తపడాలి. పిల్లలు నిద్రించే సమయంలో మిక్సీలు, వాషింగ్ మెషిన్లు, టీవీలు ఆన్ చేయకపోవడమే ఉత్తమం.
4. బేసి వీపుమీద లేదా టమ్మీ మసాజ్ ఆయిల్ లేదా క్రీమ్స్ తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రిలాక్స్ అవుతుంది.
5. గోరువెచ్చని నీటితో రోజులో ఒకటికి రెండు సార్లు చేయించాలి.
6. కొన్ని సందర్భాల్లో అప్పుడే పాలు పట్టినా కూడా ఏడవడం మాత్రం మానరు అటువంటప్పుడు వాటిర నోటికి శుభ్రపరిచిన ఖాలీ బాటిల్ సక్కింగ్ కోసం ఇవ్వాలి.
ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినా కూడా మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

No comments:
Post a Comment