- ఒక చెంచాడు టూత్‌పౌడర్‌ని నేల శుభ్రపరిచే నీళ్ల బకెట్‌లో వేయండి. నేల మునుపటి కంటే బాగా, త్వరగా శుభ్రపడుతుంది. - ఫ్రిడ్జ్, వైట్ డోర్స్, షోకేసులను శుభ్రపరచుకోవటానికి పాత టూత్ పౌడర్‌ని ఉపయోగించండి. - తేనెటీగ కుట్టి మంటపుడుతూ ఉంటే ఆ ప్రదేశంలో టూత్‌పేస్ట్ పూయండి. అందులో ఉండే మింట్ మంటని తగ్గిస్తుంది. అలాగే మొటిమలకి కూడా టూత్‌పేస్ట్‌ని రాస్తే త్వరగా తగ్గుతాయి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Tuesday, March 19, 2013
టూత్‌పేస్ట్, పౌడర్‌తో...
కాలీఫ్లవర్‌తో...
కాలీఫ్లవర్ కూడా ఓ రకమైన పువ్వు జాతికి చెందినదే. విదేశాల నుండి భారతదేశానికి చేరింది. కాలీఫ్లవర్ పువ్వులలో చాలా ఖాళీలు ఉంటాయి. వీటి మధ్య పురుగులు ఉంటాయి. అందువలన చాలామంది ఈ పువ్వును తీసుకొనరు. దీనికి తోడు ధర కూడా ఎక్కువ. ఏది ఏమైనప్పటికి ఈ కాలీఫ్లవర్ పువ్వులలో సి విటమిన్ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన అన్ని రకాల లవణాలు ఉంటాయి. అందువలన ఖరీదు ఎక్కువ అయినప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా, కనీసం అప్పుడప్పుడైనా కాలీఫ్లవర్‌ను కూర రూపంలో గాని, మరొక విధంగా కానీ తీసుకోవటం మంచిది. 100గ్రా కాలీఫ్లవర్‌లో పోషక విలువలు ఈ విధంగా ఉంటాయి. పిండిపదార్థాలు-5.3గ్రా. క్రొవ్ఞ్వ పదార్థాలు 0.4గ్రా, మాంసకృత్తులు-3.5గ్రా, సున్న(కాల్షియం)-30మి.గ్రా, భాస్వరం.- 60మి.గ్రా, మెగ్నీషియం -20మి.గ్రా ఇనుము-1.3మి.గ్రా ఉప్పు-12మి.గ్రా పొటాషియం-285మి.గ్రా పీచుపదార్థం-1.2మి.గ్రా నిజానికి, క్యాబేజి కన్నా విలువైన పోషకాలను కలిగి ఉన్నది కాలీఫ్లవర్. విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్ ఆరోగ్యదాయకమైన ఎన్నో పైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ నిరోధక కాయగూరలలో రారాజు. క్యాన్సర్‌ను నిరోధించే బయో ఫ్లావనాయిడ్స్ కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువ. అందువలన మల విసర్జన సాఫీగా జరగటానికి, వ్యర్థ పదార్థాల బహిష్క రణకు దోహద పడుతుంది. వంధ్యత్వాన్ని పోగొడుతుంది. రేచీకటిని, చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని, ఊడిపోవడాన్ని నివారిస్తుంది. |
మీ ఆహారంలో పోషక విలువలు ఉన్నాయా?
| ||
ఆలివ్ అందాలు...
పొడిచర్మం కలవారి పాలిట ఆలివ్ ఆయిల్ ఒకవరమే. దీనితో చర్మం పైన మర్దనా చేయడం ద్వారా, ఆహారంగా లోపలికి తీసుకోవటం ద్వారా పిల్లల చర్మం అందంగా, ఆరోగ్యంగా మృదువుగా కాంతివంతంగా మారుతుంది. చర్మం, జుట్టు, గోళ్లు, చిగుళ్లు వీటిని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ ఆలివ్ ఆయిల్ తన ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలకు ఆలివ్ ఆయిల్‌తో ప్రతిరోజూ మర్దనా చేయవచ్చు. ఈ నూనెకు ఉన్న సౌలభ్యం ఏమిటంటే దీనితో స్నానానికి ముందు లేదా తరువాత ఎప్పుడైనా మసాజ్ చేయవచ్చు. పాపాయికి స్నానం చేయించే ముందుగానే శరీరానికి సరిపడా ఆయిల్‌తో చక్కగా మసాజ్ చేయాలి. తరువాత స్నానం చేయించాలి. లేదా వేడినీళ్లతో స్నానం చేయించి ఆ ఒంటికే ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయటం వలన పిల్లలు ఆదమరిచి చక్కగా నిద్రపోతారు. ఆలివ్ ఆయిల్ వారి శరీరాల్లోకి చక్కగా ఇంకుతుంది. ఏ మాత్రం జిడ్డు అనిపించకుండా చర్మం మృదువుగా మారుతుంది. |
ప్రొటీన్లతో పోషకాల అనాస...
చూడడానికి ముళ్లులాగా ఉండే పండు పైనాపిల్. ఆకారం బాగోకపోయినా దానిలో చాలా పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందామా! - పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు. - సైనసైటిస్, గొంతునొప్పి, కీళ్లనొప్పులు, పంటి వ్యాధులతో బాధపడేవారిలో వాపులూ, మంటలూ నొప్పులూ ఎక్కువ. పైనాపిల్ తింటే ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. కారణం ఈ బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా మెండు. - అయితే దీన్ని ఉదయం భోజనం అయిన తరువాత అంటే మధ్యాహ్న సమయంలో తింటే మంచిది. - ఇందులోని ఎంజైమ్ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరతిగతిన బాగుచేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లనీ ఇతరత్రా గాయాల్నీ కూడా త్వరగా తగ్గిస్తుంది. - ఇది కడుపులోని పురుగుల్నీ చంపేస్తుంది. ఇందులోని రసాయనాలు మూత్రపిండాల్ని ప్రేరేపించి శరీరంలో మలినాలు తొలగిపోయేలా చేస్తాయి. - హృద్రోగ బాధితులా...అయితే పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. అయితే హీమోఫీలియా మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడేవాళ్లు మాత్రం దీన్ని తినకపోవడమే మంచిది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం దీని సహజ స్వభావం కదా. అందుకే. - గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్నీ పైనాపిల్ తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవాళ్లకి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. మతిమరపు, డిప్రెషన్‌లనీ తగ్గిస్తుంది. - పైనాపిల్‌లోని సి-విటమిన్ బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది. - వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని కొన్ని కణాలకి కేన్సర్‌లతోనూ పోరాడగల శక్తి ఉంది. - ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. దగ్గుకీ, జలుబుకీ ఇది మంచి మందు. ఇందులో బ్రొమిలైన్ దగ్గు రాకుండా చేస్తుంది. - చెట్టు నుంచి కాయను తెంపిన తరువాత ఇది పండదు. కాబట్టి పండిన తరువాతే వీటిని కోస్తుంటారు. బాగా పండిన పైనాపిల్‌కు గుర్తేమిటంటే పైనుంచే ఆకుల ముచ్చికను తీయగానే వచ్చేస్తుంది. పండిందా లేదా అనడానికి గుర్తుగా వాసన వస్తే చాలు. - పండు నెత్తిమీద కుచ్చులా ఉండే ఆకులు పసుపు రంగులోకి మారినా ఒంటిమీదుండే కల్లు మరీ ముదురురంగులో ఉన్నా పై తొక్కమీద ముడతలు కనిపించినా పండు పాడయిందని గుర్తించాలి. - ఇది గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువరోజుల నిల్వ ఉండదు. త్వరగా కుళ్లిపోతుంది. కాబట్టి కొన్న వెంటనే తినడమే మంచిది. - చాలామంది పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అరటిపండ్లలానే దీనికి ఫ్రిజ్ పడదు. బయట ఉంచడమే మంచిది. - తొక్కుతీసిన పైనాపిల్‌ను వెంటనే గాలి చొరని డబ్బా లేదా ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే నాలుగైదురోజుల పాటు నిల్వ ఉంటుంది. జ్యూస్‌ని ఫ్రిజ్‌లో పెడితే రుచి మారుతుంది. దానికన్నా ముక్కలుగా నిల్వ చేయడమే మంచిది. కేనింగ్ లేదా ప్రాసెస్ చేసినవయితే ఏడాది వరకూ నిల్వ ఉంటాయి. |
Subscribe to:
Posts (Atom)