all

Friday, January 4, 2013

వెన్నునొప్పి చికిత్సకు ముందు కారణాలు తెలుసుకోండి...!

సాధారణంగా మనుషులను ఎక్కువగా బాధించే అనారోగ్య సమస్యల్లో చాలా తరచుగా ఏర్పడే సమస్య వెన్నునొప్పి ఒకటి. ప్రతి మనిషి జీవిత కాలంలో ఏదో ఒక టైమ్ లో బ్యాక్ పెయిన్ కు గురైయ్యే ఉంటారు. దానికి ఎన్నో కారణాలు. కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవన శైలిలో నడుము నొప్పి లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలే ముఖ్య కారణం. ఒకప్పుడు వయసైపోయిన వారిలో కనిపించే బ్యాక్ పెయిన్, నేటి ఆధునిక యుగంలో యుక్త వస్కులను సైతం బాధింస్తుంది.
నడుము నొప్పి అనేది మహిళలకు మాత్రమే ప్రత్యేం కాదు. స్త్రీపురుషులందరికీ అది వచ్చేదే అయినా, మహిళలకు కొంచెం ఎక్కువగానే వస్తుంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మరీ అధికం. మగవాళ్ళకన్నా స్ర్తీలు సాధారణంగా శారీరకంగా తక్కువ శ్రమ ఉండే పనులు చేస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మాత్రం వెన్నుపూసమీద భారం అధికమౌతుంది. సాధారణ వ్యక్తుల్లో వెన్ను నొప్పి రావడానికి కారణాలేంటి? వాటికి తీసుకోవాలసిన జాగ్రత్తలేంటో చూద్దాం...
సాధారణంగా వచ్చే వెన్నునొప్పి ముఖ్యంగా వారు కూర్చొనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వెన్ను నొప్పికి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ముందు ముందు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరకంగా వెన్నునొప్పి, మెడనొప్పి ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి కూర్చొనే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు.

సంక్రాంతి స్పెషల్ కర్జూరాలు లేదా డైమండ్ స్వీట్

సంక్రాంతి పండుగ అనగానే వారం పది రోజుల ముందు నుండే మహిళలంతా పిండి వంటల తయారీలో నిమగ్నమయిపోతారు. ఎందుకంటే ఈ పండగను మూడు రోజు పాటు సంబరంగా జరుపుకుంటారు కాబట్టి ఇంటికి వచ్చే అతిథులు.. చిన్నారుల కోసం పిండి వంటలెన్నో తయారు చేస్తారు.
పండుగ ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పిండివంట ఈ పండక్కి ప్రత్యేకం. ఉదా రాయలసీమలో ప్రత్యేకంగా తీపి గుమ్మడి కూడర, సజ్జరొట్టెలను ఎంతో ఇష్టంగా తింటారు. ఆంధ్రప్రాంతంలో అరిసెలు, బూరెలు, గారెలు, గులాబీలు వంటి పదార్థాలను ఎంతో ఇష్టంగా తయారు చేసుకుంటారు అయితే ఇవి ఎప్పుడూ చేసే పిండివంటలే అయినా పండుగ రోజు చేసే ఈ పిండి వంటలకు మాత్రం రుచి అమోఘమనే చెప్పాలి. సంక్రాంతికి పిల్లలకు పెద్దలకు ఇష్టమైన, టైం పాస్ కు తయారు చేసుకొని డైమండ్ స్వీట్స్ ఎలాతయారు చేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
మైదా: 2cups
పంచదార: 2cups
యాలకులు: 2
నెయ్యి: 2tbsp
గుడ్లు: 2
నూనె: వేయించడానికి సరిపడ
ఉప్పు: చిటికెడు
వంటసోడా: చిటికెడు
సోంపు: ఒక స్పూను
బొంబాయి రవ్వ: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పంచదారను పొడి చేసుకోవాలి.

2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండిని తీసుకుని అందులో చక్కెర, గుడ్లు, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి, ఉప్పు వంటసోడా, సోంపు, రవ్వను వేసి సరిపడినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.

3. తర్వాత ఈ మొత్తాన్ని నాలుగు బాగాలుగా చేసి, ఉండచుట్టుకొని చపాతీ పీట మీద వేసి పిండిని ఒక అంగు ళం మందంగా ఒత్తుకోవాలి.

4. తరువాత చాకు తీసుకుని డైమండ్‌ లేదా నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి.

5. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకొన్న డైమండ్స్ ను కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి వారం పది రోజుల వరకు నిలవ వుంటాయి.

బ్రింజాల్(వంకాయ)రైస్-సౌంత్ ఇడియన్ స్పెషల్

వాంగీబాత్ లేదా బ్రింజాల్ రైస్ ఈ వంట సౌంత్ ఇండియన్ స్పెషల్ వంటకం. మరీ ముఖ్యంగా ఈ వాంగీ బాత్ ను కర్ణాటకవాసులు ఎక్కువగా చేసుకుంటారు. ఇది కారంగా ఉండే రైస్ తో తయారు చేసే వంట. ఇండియన్ మసాలలతో తయారు చేసే ఈ వంట టేస్టీగా ఉంటుంది.
ముఖ్యంగా బియ్యం, వంకాయ, మసాలా దినుసులు ఈ వంటకానికి కావల్సిన పదార్థాలు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గాను, మధ్యహాన భోజనంగాను తీసుకోవచ్చు.
బియ్యం: 250 grams (నెయ్యివేసి ఉడికించిన అన్నం)
వంకాయలు: 100 grams (sliced)
ఆవాలు: 1/2 tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
శెనగపప్పు: 1tbsp
నిమ్మరసం: 1tbsp
వేయించిన పల్లీలు: 10
పసుపు: 1 pinch
ఇంగువ: 1 pinch
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పేస్ట్ తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు
ఎండుమిర్చి: 3
ధనియాలు: 1tsp
గసగసాలు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
నువ్వులు: 1/2 tsp
చెక్క: 1 inch
లవంగాలు: 2
కొబ్బరి తురుము: 1/2 cup
ఉద్దిపప్పు: 1tbsp
కందిపప్పు: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యంకు సరిపడా నీరుపోసి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా నేయ్యి వేసి అన్నం వండి పెట్టుకోవాలి.

2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, అందులో జీలకర్ర, లవంగాలు, చెక్క, ఎండు మిర్చి వేసి లైట్ గా వేగించి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత అందులోనే ఒక చెంచా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉద్దిపప్పు, కందిపప్పు వేసి మరో నిముషం పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి.

4. అలాగే అదే పాన్ లో గసగసాలు, నువ్వులు మరియు కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. ఇప్పుడు ముందుగా నూనెలో వేయించి పెట్టుకొన్న మసాలా దినుసులు, తర్వాత ఫ్రై చేసి పెట్టుకొన్న పోపు దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.

6. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం వేయించాలి. అందులోనే శెనగపప్పు వేసి వేగించి అందులోనే పసుపు, ఇంగువను చిలకరించి ఫ్రై చేయాలి.

7. ఇప్పుడు అందులో వంకాయ ముక్కలను వేసి, ఉప్పు చల్లి 5-10నిముషాల పాటు వేగించాలి. వంకాయలు కొద్దిగా వేగిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలాను అందులో వేసి మరో 5నిముషాలు వేయించాలి.

8. వంకాయ మెత్తబడ్డాక అందులో ముందుగా వండిపెట్టుకొన్న అన్నం కలిపి మరో రెండు మూడు నిముషాలు వేయించి సర్వ్ చేయాలి. అంతే వాంగీ బాత్ రెడీ.

మకర సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ఒకరకంగా మన సంప్రదాయ వంట అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు. ఈ అరిసెలు పెళ్ళైన ఆడపిల్లకి పెట్టే సారెలో కూడా తప్పకుండా పెడతాము.
అరెసెలు చేయటం కొంచెం కష్టమైన పనే అయినా... చాలా రుచికరంగా ఉంటాయి. అరిసెలు చేయడం రెండు రోజుల పని. మొదటి రోజు బియ్యం నానబెట్టుకోవటం, రెండవ రోజు ఆ నానిన బియ్యాన్ని పిండి పట్టించి మెత్తగా జల్లించి ఈ పిండిని బెల్లం పాకం పట్టి అందులో జల్లించిన పిండిని కలిపి అరిసెలు చేసుకోవటం ఇది అరిసెల ప్రహసనం....
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1kg
బెల్లం తరుము: 1/2kg
నువ్వులు: 100grms
నీరు: 1cup(తగినంత)
యాలకులు: 2-4(మెత్తగా పొడిచేసుకోవాలి)
నెయ్యి: 1/2cup
నూనె: వేయించడానికి సరిపడా


తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి.

2. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

3. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి.

4. ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి.
ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి.
బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు.

ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. అంతే నోరూరించే అరిసెలు రెడీ..!

క్యాబేజ్ కూటు-స్పెషల్ టేస్టీ సైడ్ డిష్

సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంలో క్యాబేజీ ఒక ఆకుకూర.  ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయి.రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది. శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది.
క్యాబేజీతో వివిధ రకాల వంటలు, వండుతారు. ఫ్రై, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్స్, సూప్స్ లోనూ రకరకాలుగా తింటుంటారు. అయితే కొంచెం వెరైటీగా ఓ స్పెషల్ సైడ్ డిష్ క్యాబేజ్ కూటును తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది. మరియు ఆరోగ్యానికి మంచిది కూడా...
cabbage kootu special side dish

కావల్సిన పదార్థాలు:
క్యాబేజ్: 1/2 (shredded)
పచ్చిశెనగపప్పు: 1/3 cup
పెసరపప్పు: 1/4 cup
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీరతరుగు: కొద్దిగా
పోపు వేయించడానికి :
ఆవాలు: 3/4 tsp
జీలకర్ర: 1 tsp.
ఉద్దిపప్పు: 1 tsp.
ఇంగువ: 1/4 tsp.
ఎండు మిర్చి: 2 (పెద్దవి)
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
పేస్ట్ తయారు చేయడానికి కావల్సినవి:
కొబ్బరి తురుము: 3 tbsp.
పచ్చిమిర్చి: 3-4
జీలకర్ర: 1 tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిశెనగపప్పును 1గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట నానిన తర్వాత వాటిని కుక్కర్ లో వేసి, వాటితో పాటు క్యాబేజ్ తురుము, పసుపు, పెసరపప్పు వేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులోనే ఉద్దిపప్పు, ఎండు మిర్చి వేసి లైట్ గా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, ఇంగువకూడా వేసి మిక్స్ వేయించాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకొన్న క్యాబేజ్ మిశ్రమాన్ని పోయాలి. అందులోనే ఉప్పు, కొబ్బరి పేస్ట్ ను వేసి మిక్స్ చేసుకోవాలి.
4. దీన్నంతటిని 5నిముషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా, సైడ్ డిష్ గా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. అంతే క్యాబేజ్ కూట్ రెడీ. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది.

స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ : సేమియా బిసిబేళబాత్

సాధారణంగా సేమియా అంటేనే పాయసం గుర్తొస్తుంది. ఎందుకంటే సేమియా పాయసం అంటే అందరీకి ఇష్టం కనుక. సేమియా పాయసం లేనిదే ఏ పండుగ, శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. సేమియాతో వివిధ రకాల వంటలు చేస్తారు. సేమియా ఉప్మా, సేమియా పాయసం... అందరికీ తెలిసిన స్వీట్ అండ్ సాల్ట్ ఐటమ్స్! సేమ్ టు సేమ్ కాకుండా... సేమ్యాను ఇంకోరకంగా చేసుకోలేమా? కచ్చితంగా ప్రయత్నిస్తే ఓ కొత్త రుచిని చూడవచ్చు.

బిసిబేళబాత్ ఇది కర్ణాటక స్పెషల్ బ్రేక్ ఫాస్ట్, బియ్యం, కందిపప్పు, కూరగాయలతో తయారు చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ అక్కడ చాలా ఫేమస్. అదే తరహాలో కొంచెం డిఫరెంట్ గా ఆంధ్రా స్టైల్లో బిసిబేళబాత్ బియ్యం కాకుండా సేమియాతో ట్రై చేస్తే చాలా అద్భుతమైన సాఫ్ట్ బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. ఈ బ్రేక్ ఫాస్ట్ ను పిల్లలు, పెద్దలు అందరూ హ్యీపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు.

కావలసినవి:
సేమియా: 250grms
కందిపప్పు : 1cup
మునగకాడలు: 2
వంకాయ ముక్కలు: 1/2cup
ఉల్లి తరుగు: 1cup
క్యారట్ తరుగు: 1cup
టొమాటో తరుగు: 1cup
పచ్చిమిర్చి తరుగు: 4
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఇంగువ : చిటికెడు
చింతపండుగుజ్జు: 2tbsp
ఎండుమిర్చి : 2, లవంగాలు : 3
పసుపు : 1/2tsp
దాల్చినచెక్క : చిన్నముక్క
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
నూనె : గరిటెడు, ఉప్పు : రుచికి తగినంత
కారం : 1/2tsp
సాంబారు పొడి: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మూడు కప్పుల నీటిలో టీ స్పూను నూనె వేసి సేమియాను ఉడికించాలి. ఉడికిన సేమ్యాను చల్లని నీటితో బాగా కడిగి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత కందిపప్పు కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరవాత లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.

4. తరవాత కూర ముక్కలన్నీ వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక చింతపండురసం, సాంబారు పొడి వేసి బాగా కలిపి, ఉప్పు, కారం, ఉడికించిన కందిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి పది నిమిషాలసేపు ఉడికించాలి.
చివరగా ఉడికించిన సేమియా, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. అంతే సేమియా బిసిబేళబాత్ రెడీ..

ఖర్చు చేయకుండానే సౌందర్యాన్ని పెంచే 7వస్తువులు

అందం గురించి చెప్పాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొంటే తప్ప ఉన్న అందాన్ని మరింత రెటింపు చేసుకోలేరు. అయితే తమ అందాన్ని కాపాడుకోవడానికి మహిళలు నానా తంటాలు పడుతూ, డబ్బును వధా చేస్తుంటారు. చివరగా వారికి మిగిలేది జీరో. బ్యూటీ పార్లర్స్ కు వెళ్ళి వచ్చిన ఒకటి రెండు రోజులకు కొంచెం తేడా కనిపించినా తర్వాత.. తర్వాత తిరిగి యాథా స్థితికి చేరుకుంటుంది.

డబ్బు కర్చుతో పాటు, బ్యూటీ పార్లర్స్ లో ఉపయోగించే రసాయనాలు ప్రభావం ముఖంలో మొటిమలు, మచ్చలు. ప్రయోజన లేనివాటికి డబ్బు ఖర్చు చేసే కంటే ప్రయోజనం ఉన్న మన వంటింటి వస్తువును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాఅని వంటింటిట్లో ఉపయోగించే అన్ని వస్తువులు సౌందర్యానికి ఉపయోగపడుతాయనుకోకూడదు. అందులో మంచి ఫలితాలనిచ్చే వస్తువు కొన్ని మీకోసం...

బేకింగ్ సోడా:అందాన్ని పెంచుకోవడంలో బేకింగ్ సోడా ఒకటి. అది మీకు తెలుసా? మీ పళ్ళు తెల్లగా మిళమిళ మెరవాలన్నా.. గారపళ్ళు తెల్లబడాలన్నా ఈ బేకింగ్ సోడాను చిటికెడు పళ్ళు రుద్దే బ్రెష్ మీద చిలకరించుకొని రుద్దితే మంచి ఫలితాన్ని మీరు చూడవచ్చు. అలాగే బేకింగ్ సోడాతో పాటు కొంచె తేనె కూడా చేర్చి స్ర్కబ్ చేయాలి. కాబట్టి బేకింగ్ సోడాను వేస్ట్ చేయకుండా అందమైన పళ్ళ కోసం ఉపయోగించండి.


ఆలివ్ ఆయిల్:
ఇంట్లో ఉపయోగించే ఆలివ్ ఆయిల్ ను శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా మంచిది.!చాలా మంది ఈ ఆలివ్ ఆయిల్ ను బాడీ మాయిశ్చరైజర్ గానూ, కంటి మేకప్ ను తొలగించడానికి, స్లాప్ ట్రీట్మెంట్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువ జిడ్డు చర్మం కలిగిన వారు బాడీ ఆయిల్ కు బదులు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

చెక్క:ఇది అద్భుతమైన సువాసననిచ్చే వంటింటి మసాలా దినుసు. ఇది వంటలలో అద్భుతమైన రుచిని అంధిచడమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మొటిమల మీదా దీని ప్రభావం బాగా పనిచేస్తుంది మూడు చెంచాల తేనెకె ఒక చెంచా చెక్క పొడిని చేర్చి మెత్తని పేస్ట్ లా తయారు చేసి రాత్రి పడుకొనే ముందు ముఖానికి పట్టించి, ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డ్రైయర్ షీట్స్:ప్రతి రోజూ మీ కురులను పొడిగా అందంగా ఉంచుకోవాలనుకొన్నప్పుడు ఈ డ్రైయర్స్ షీట్స్ బాగా ఉపయోగపడుతాయి. ఈ డ్రైయర్ షీట్స్ వివిధ రకాలుగా మార్కెట్లో లభ్యం అవుతాయి. కాబట్టి వీటిని తీసుకొని తలను తుడుచుకోవడం వల్ల కురులు మెత్తగా తడి ఆరేలా చేసి, చిక్కు పడకుండా చేస్తుంది.

కుక్కింగ్ స్ప్రే:కుకింగ్ స్ర్పే నిజమైన బ్యూటీ ప్రొడక్ట్. మీరు దరించే టాప్స్, కోట్స్ అతి త్వరగా ఆరబెట్టుకోవాలన్నా, చేతులకు నెయిల్ పాలిష్ త్వరగా ఆరేలా చేసి, డబుల్ కోట్ వేసుకోవాలన్నా, ఈ వాసనలేని కుక్కింగ్ స్ప్రేను ఉపయోగించవచ్చు.

టూట్ పేస్ట్:టూత్ పేస్ట్ క్లాసిక్ బ్యూటి కిచెన్ సహాయకారిని. ఇది స్పాట్ ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుంది. కాలిన మచ్చలు పోగట్టడానికి, తక్షణ ఉపశమనానికి సహాయపడుతుంది. గోళ్ళును శుభ్రం చేసి తెల్లగా మార్చడానికి ఈ టూత్ పేస్ట్ చేతులకు రాసుకొని శుభ్రం చేసుకోవచ్చు.

పెట్రోలియం జెల్లీ:పెట్రోలియం జెల్లీ తో చాలా రకాల ప్రయోజనకరమైన ఉపయోగాలున్నాయి. ఇది అందానికి మాత్రమే కాదు, కాలుకు తొడిగే షూ వల్ల కాళ్ళుకు ఏర్పడే బొబ్బలు నివారించడానికి బాగా పనిచేస్తుంది..


షాంపూ మరియు కండీషనర్ తో తలస్నానం చెయ్యడం ఎలా ?

ఏ కాలం లో అయినా చర్మం కాంతివంతంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు కాంతి వంతంగా ఉండాలంటే  నీరు ఎక్కువగా తాగటంతో పాటు రోజూ షాంపూయింగ్ చేస్తూ ఉండాలి. ప్రతి రోజూ తల స్నానం చేస్తే  జుట్టు రాలిపోతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ప్రతి రోజూ తల స్నానం చేయడం వల్ల  జుట్టు రాలిపోవడం ఏమీ ఉండదు. మనం వాడే షాంపులు, అనారోగ్య కారణాలే జుట్టు రాలిపోడానికి కారణం.
తలస్నానం చెయ్యడం, వినడానికి ఎంతో సులభంగా అనిపించినా, ఎక్కువ మంది తప్పు పద్దతిలో జుట్టుని వాష్ చేస్తారు. అయితే, మెరుస్తున్న, ఆరోగ్యకరమైన జుట్టుని పొందేందుకు తలస్నానం చేసే సరైన పద్దతిని ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.
how take proper head bath

పద్దతులు:
1. షాంపూ, కండిషనర్ మరియు ఒక దువ్వెనని తీసుకోండి.
2. చిక్కు పడకుండా ఉండేందుకు తలస్నానానికి వెళ్ళే ముందు మీ జుట్టుని చక్కగా దువ్వుకోండి.
3. గోరువెచ్చని నీటితో మీ జుట్టుని పూర్తిగా కడగండి. 30 సెకండ్ల పాటు జుట్టుని తడిగా ఉంచుకోండి.
4. మీ అరచేతిలో కొంత షాంపూని తీసుకోండి. మీ జుట్టు పొడుగు మరియు ఒత్తుని బట్టి షాంపూ ని వాడే మొత్తం మారుతుంది. సాధారణంగా ఒక డాలర్ లేదా కాయిన్ సైజులో తీసుకోవచ్చని అంచనా.
5. మీ ముని వేళ్ళతో తలపై నున్న చర్మంపై సుతారంగా మర్దనా చెయ్యాలి. గోర్లని వాడవద్దు. తలపై న భాగంలో మర్దనా చేయండి. షాంపూ తో జుట్టు కుదుళ్ళకి కండిషన్ ని జుట్టు చివర్లకి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
6. గోరు వెచ్చని నీటితో జుట్టుని కడగండి. షాంపూ మొత్తం పోయేవరకు జుట్టుని శుభ్రపరచాలి.
7. ఇప్పుడు కొంత కండీషనర్ ని మీ అర చేతిలోకి తీసుకోండి. మెడ వెనుక భాగంలో నుండి మీ మునివేళ్ళతో జుట్టుని కండీషనర్ తో రాయండి. మీ జుట్టు మొనలని చేరే వరకు ఇలా రాయండి.
8. తరువాత రెండు మూడు నిమిషాలు కండీషనర్ జుట్టుకి పట్టేంతవరకు సమయం ఇవ్వండి. జుట్టు మొత్తానికి కండీషనర్ వ్యాప్తి చెందేందుకు మెల్లగా దువ్వండి.
9. ఇప్పుడు గోరువెచ్చని నీటితో కండీషనర్ మొత్తం తొలగిపోయేవరకు జుట్టుని కడగండి.
10. మీ కేశాలు అందంగా మెరవడం కోసం చల్లని నీటితో మీ జుట్టుని శుభ్రం చెయ్యండి.
11. ఒక తువ్వాలు తీసుకుని జుట్టు తడి అరిపోయేవరకు తుడవండి. జుట్టుని గట్టిగా పిండకండి.
12. జుట్టుని సహజంగా తడి ఆరబెట్టండి. డ్రైయర్ వాడడం మంచిది కాదు.
చిట్కాలు :
రేడియో వింటూ తలస్నానం చెయ్యడం ఏంటో ఆనందాన్ని కలుగచేస్తుంది. ఎంతో ఆహ్లాదంగా, రిలాక్సింగ్ గా ఉంటుంది. అయితే, మీ రేడియోని లేదా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువుల పై తడి పడకుండా జాగ్రత్తపడండి.:
హెచ్చరిక :
తలస్నానం తరువాత జుట్టుని జాగ్రత్తగా శుభ్రం చెయ్యండి. లేకపోతే జుట్టు జిడ్డుగా ఉంటుంది.
తడిగా ఉన్నప్పుడు జుట్టుని దువ్వకండి. జుట్టు చిట్లి, పాడైపోయే అవకాశం ఉంటుంది.
జుట్టు బాగా తడి ఆరాక దువ్వితే మంచిది.
జుట్టు పైన షాంపూని రాసేటప్పుడు చిక్కు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా తలస్నానం చెయ్యండి.

కాంతివంతమైన చర్మానికి నేచురల్ స్కిన్ బ్లీచ్...

నేచురల్ స్కిన్ బ్లీచింగ్ చేసుకోవడం వల్ల దాని ఫలితం తక్షణం చూపెట్టకపోయినా..సున్నితమైన చర్మం కలవారు ఇలా స్కిన్ బ్లీచ్ చేసుకొనే పద్దతి మహిళలకు మంచి పద్దతి. బయట మార్కెట్లో దొరికె కెమికల్ బ్లీచ్ లు అన్ని రకాల చర్మాలకు సరిపోవు. కొందరిక మాత్రమే ఇవి ఎటువంటి హాని కలుగజేయవు. అయితే సున్నితమైన చర్మం కలవారికి కెమికల్స్ ను బ్లీచింగ్ లో వాడటం వల్ల చర్మం మంట పెట్టడం లేదా దద్దర్లు, చారలు ఏర్పడటం వంటివి జరుగుతాయి. కాబట్టి అటువంటి వారు నేచురల్ బ్లీచ్ ను ఇంట్లోనే చేసుకోవడం చాలా ఆరోగ్యకరం.
సాధారణంగా మన చర్మం, పొడి బారడం, మొటిమలు, మచ్చలతో అసహ్యంగా కనబడుతుంటుంది అటువంటప్పుడు బ్లీచింగ్(మెడకు కూడా)చేసుకోవడం చాలా మంచిది. అందుకు ఇక్కడ నార్మల్ బ్లీచింగ్ చేసుకోవడానికి కొన్ని హోం రెమడీస్ మీకు అందిస్తున్నాం. అవి మీకు ఎటువంటి ఫలితాన్ని గమనించండి. అయితే వెంటనే ప్రభావం చూపకపోయినా... కొద్దికాలం తర్వాత ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్- సుగర్ స్ర్కబ్: ఒక మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్ మరియు పంచదారా రెండింటీని వేసి బాగా మిక్స్ చేసి ముఖం మెడకు పట్టించి ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా కాంతివంతంగా మారుతుంది.

ఆరెంజ్ తొక్క మరియు పాల క్రీమ్: సిట్రస్ ఆసిడ్ కు సంబంధించిన ఏ పండ్లు, కూరగాయలైనా చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇస్తుంది. వాటిలో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల అవి బ్లీచింగ్ వస్తువులుగా ఉపయోగపడుతాయి. ఆరెంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి, దానికి పాలక్రీమ్ చేర్చి ముఖానికి, మెడకు పట్టించి 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటో గుజ్జు మరియు నిమ్మరసం: టమోటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిని, ముఖ చర్మానికి పట్టించాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్న తర్వాత మార్పును గమనించండి ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఇందులో ఆసిడ్స్ ఎక్కువగా ఉన్నందును త్వరగా ఫలితాన్నిస్తుంది.

కీరదోస-నిమ్మరసం-పెసరపిండి: కొన్ని కీరదోస ముక్కలను పేస్ట్ చేసి అందులో నిమ్మరసం పిండి, అందులోనే శెనగపిండి లేదా పెసరపిండి వేసి బాగా మెత్తగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి, మెడకు పట్టించి శుభ్రం చేసుకొంటే ముఖం తాజాగా కాంతివంతంగా మారుతుంది.

కీరదోస-నిమ్మరసం-పెసరపిండి: కొన్ని కీరదోస ముక్కలను పేస్ట్ చేసి అందులో నిమ్మరసం పిండి, అందులోనే శెనగపిండి లేదా పెసరపిండి వేసి బాగా మెత్తగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి, మెడకు పట్టించి శుభ్రం చేసుకొంటే ముఖం తాజాగా కాంతివంతంగా మారుతుంది.

వైట్ వెనిగర్: సాధారణంగా మొటిమలు మచ్చలు తొలగించడానికి వైట్ వెనిగర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది మంచి కలర్ ను తీసుకురావడానికి కూడా బాగా సహాపడుతుంది. సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడి, మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా చర్మా శుభ్రం చేసి క్లియర్ స్కిన్ ఏర్పరుస్తుంది. కాటన్ బాల్స్ ను వైట్ వెనిగర్ లో నానబెట్టి తర్వాత ముఖానికి శుభ్రం చేసుకోవాలి.

మెంతి-గసగసాలు-నిమ్మరసం: మెంతులు, గసగసాలు మెత్తగా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పది నిముషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోయి, చర్మం క్లియర్ గా మారుతుంది. తాజాగా కనబడుతుంది.









 

కురుల పెరుగుదలకు ఇంట్లో చేసుకొనే అద్భుతమైన హెయిర్ ప్యాక్స్

సౌందర్యంతో పాటు కురులకు కాపాడుకోలేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. జుట్టు రాలిపోయి అసౌకర్యంగా.. అందవిహీనంగా కనబడుతారు. కాబట్టి ఉన్న జుట్టు ఊడిపోకుండా, చుండ్రు లేకుండా కురులను ఆరోగ్యంగా కాపాడుకొన్నట్లైతే అందమైన కేశ సౌందర్యం మీ సొంతమౌతుంది. ముక్యంగా ఫోర్ హెడ్(తల నుదిటి బాగంలో చాలా మంది అతి త్వరగా జుట్టు రాలిపోతుంటుంది. లేద ఫోర్ హెడ్ దగ్గర కురులు పెరగకుండా అలాగే ఉండిపోయి నుదిటి బాగం ఎక్కుగా కనబడేలా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలిపోకుండా కాపాడి, జుట్టుపెరిగేలా చేసే కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొంతమంది జుట్టు రాలిపోతుందని గాభరా పడి హెయిర్ ట్రీట్మెంట్ లకు అనవసరమైన డబ్బును వృధా చేస్తుంటారు. అటువంటి అవసరం లేకుండానే సహజపద్దతులను ఉపయోగించి ఇంట్లో కురుల పెరుగుదలకు చక్కటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అందమైన, దట్టమైన మీ కేశ సౌందర్యం మీ సొంతం అవుతుంది. మరి ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందాం..
 
 
1. బ్రహ్మి మరియు హెన్నా హెయిర్ ప్యాక్:
బ్రహ్మీ లేదా బకోప మెన్నీరీ ఆయుర్వేద ఔషద. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆయుర్వేద ఔషదం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే...ఇది కురులకు చాలా మంచిది. బ్రహ్మి కురుల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. కేశాలను నలుపు రంగులో ఉంచి హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. బ్రహ్మి హెర్బ్ పౌడర్ ను, హెన్నాపౌడర్, పెరుగుతో మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. దీన్ని అరగంట పాటు అలా ఉంచి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ వేసుకొనే ముందు కురులకు కొబ్బరి నూనె లేదా బాదాం నూనెతో మసాజ్ చేయాలి.

2. వేడి నూనెతో మసాజ్:
హాట్ ఆయిల్ మసాజ్ కంటే అతి త్వరగా ఫలితాన్నించే మరే హెయిర్ ట్రీట్మెంట్ లేదని చెప్పొచ్చు . ఎందుకంటే ఇది కురుల పెరుగుదలకు ఒక అద్భుతమైన హోం మేడ్ హెయిర్ రెమడీ. ఒక వేళ తలలో చుండ్రు, దురద, జిడ్డు ఉన్నట్లైతే మీరు పెట్టుకొనే నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తర్వాత వేడి చేసి తలకు పెట్టి తలమాడుకు బాగా మసాజ్ చేయాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేసినట్లైతే మంచి ఫలితాలను పొందవచ్చు.

3. ట్రైఫ్లా(ఆమ్ల/Triphala), బ్రహ్మి(brahmi) మరియు తులసి హెయిర్ ప్యాక్:

ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ ను ఇంటి దగ్గరే అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆమ్లా(ఉసిరికాయ) పొడి, బ్రహ్మి పౌడర్ రెండింటిని మిక్స్ అందులోనే తులసి ఆకులను కూడా చేర్చి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.

4. హెన్నా:
గోరింటాకు ఆకులు పేస్ట్ చేసి తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు మెరుస్తూ, స్ట్రాంగ్ గా, ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి. మరింత ఫర్ ఫెక్ట్ గా వేసుకోవాలనుకొనే వేవారు ఈ పేస్ట్ కు కొంచె ఉసిరిప పొడి, శీకాకయ పొడి, బ్రహ్మి పొడి మరియు పెరుగు చేర్చి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అలాగే మరో విధంగా గోరింటాకు, కరివేపాకు, మందారం ఆకులు, నానబెట్టిన మెంతులు ఇన్నీ మెత్తగా పేస్ట్ చేసి కొంచెం పెరుగు వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.