all

Friday, January 4, 2013

కురుల పెరుగుదలకు ఇంట్లో చేసుకొనే అద్భుతమైన హెయిర్ ప్యాక్స్

సౌందర్యంతో పాటు కురులకు కాపాడుకోలేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. జుట్టు రాలిపోయి అసౌకర్యంగా.. అందవిహీనంగా కనబడుతారు. కాబట్టి ఉన్న జుట్టు ఊడిపోకుండా, చుండ్రు లేకుండా కురులను ఆరోగ్యంగా కాపాడుకొన్నట్లైతే అందమైన కేశ సౌందర్యం మీ సొంతమౌతుంది. ముక్యంగా ఫోర్ హెడ్(తల నుదిటి బాగంలో చాలా మంది అతి త్వరగా జుట్టు రాలిపోతుంటుంది. లేద ఫోర్ హెడ్ దగ్గర కురులు పెరగకుండా అలాగే ఉండిపోయి నుదిటి బాగం ఎక్కుగా కనబడేలా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలిపోకుండా కాపాడి, జుట్టుపెరిగేలా చేసే కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొంతమంది జుట్టు రాలిపోతుందని గాభరా పడి హెయిర్ ట్రీట్మెంట్ లకు అనవసరమైన డబ్బును వృధా చేస్తుంటారు. అటువంటి అవసరం లేకుండానే సహజపద్దతులను ఉపయోగించి ఇంట్లో కురుల పెరుగుదలకు చక్కటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అందమైన, దట్టమైన మీ కేశ సౌందర్యం మీ సొంతం అవుతుంది. మరి ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందాం..
 
 
1. బ్రహ్మి మరియు హెన్నా హెయిర్ ప్యాక్:
బ్రహ్మీ లేదా బకోప మెన్నీరీ ఆయుర్వేద ఔషద. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆయుర్వేద ఔషదం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే...ఇది కురులకు చాలా మంచిది. బ్రహ్మి కురుల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. కేశాలను నలుపు రంగులో ఉంచి హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. బ్రహ్మి హెర్బ్ పౌడర్ ను, హెన్నాపౌడర్, పెరుగుతో మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. దీన్ని అరగంట పాటు అలా ఉంచి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ వేసుకొనే ముందు కురులకు కొబ్బరి నూనె లేదా బాదాం నూనెతో మసాజ్ చేయాలి.

2. వేడి నూనెతో మసాజ్:
హాట్ ఆయిల్ మసాజ్ కంటే అతి త్వరగా ఫలితాన్నించే మరే హెయిర్ ట్రీట్మెంట్ లేదని చెప్పొచ్చు . ఎందుకంటే ఇది కురుల పెరుగుదలకు ఒక అద్భుతమైన హోం మేడ్ హెయిర్ రెమడీ. ఒక వేళ తలలో చుండ్రు, దురద, జిడ్డు ఉన్నట్లైతే మీరు పెట్టుకొనే నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తర్వాత వేడి చేసి తలకు పెట్టి తలమాడుకు బాగా మసాజ్ చేయాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేసినట్లైతే మంచి ఫలితాలను పొందవచ్చు.

3. ట్రైఫ్లా(ఆమ్ల/Triphala), బ్రహ్మి(brahmi) మరియు తులసి హెయిర్ ప్యాక్:

ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ ను ఇంటి దగ్గరే అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆమ్లా(ఉసిరికాయ) పొడి, బ్రహ్మి పౌడర్ రెండింటిని మిక్స్ అందులోనే తులసి ఆకులను కూడా చేర్చి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.

4. హెన్నా:
గోరింటాకు ఆకులు పేస్ట్ చేసి తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు మెరుస్తూ, స్ట్రాంగ్ గా, ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి. మరింత ఫర్ ఫెక్ట్ గా వేసుకోవాలనుకొనే వేవారు ఈ పేస్ట్ కు కొంచె ఉసిరిప పొడి, శీకాకయ పొడి, బ్రహ్మి పొడి మరియు పెరుగు చేర్చి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అలాగే మరో విధంగా గోరింటాకు, కరివేపాకు, మందారం ఆకులు, నానబెట్టిన మెంతులు ఇన్నీ మెత్తగా పేస్ట్ చేసి కొంచెం పెరుగు వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

No comments: