| ||||||||||||||
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్‌ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Tuesday, May 21, 2013
విపరీతమైన దగ్గు, గ్యాస్... గొంతు మారుతోంది...
డాక్టర్‌ని అడగండి - ఇ.ఎన్.టి.
నా వయసు 36. ఉద్యోగరీత్యా తరచూ దూరప్రాంతాలకు వెళ్లాల్సిన జాబ్‌లో ఉన్నాను. రోజూ సరైన వేళకు తినే అవకాశం ఉండదు. ఒక్కోసారి వేరే రాష్ట్రాలకూ వెళ్లాల్సి ఉండటంతో నేను తినే ఆహారాలూ మారుతుంటాయి. నాకు గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఉంది. దగ్గు, గ్యాస్ సమస్యలతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. స్వరం బొంగురుగా మారుతోంది. నా సమస్యకు సరైన సలహా ఇవ్వండి.
- ఎం.డి. అన్వర్‌ఖాన్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన కడుపులో కొన్ని ఆసిడ్స్ తయారవుతూంటాయి. ఇవి ఆహారం జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంటాయి. అయితే మనం ఆహారం సరిగా తీసుకోకపోయినా, సరైనవేళకు తినకపోయినా ఈ ఆసిడ్స్ తేన్పుల రూపంలో పైకి వస్తాయి. ఇవి మొదట స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్, గొంతులోని ఇతరభాగాలపై ప్రభావం చూపుతాయి. దాంతో దగ్గు వస్తుంది. స్వరం మారుతుంది. ఎప్పుడూ గొంతు సరిచేసుకోవాలనిపిస్తుంది. దగ్గు ఎక్కువ కావడం, స్వరం మారడం, చెవిలో నొప్పి, ఇతర సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఈఎన్‌టీ నిపుణులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి, ఎండోస్కోపీ వంటి అవసరమైన పరీక్షలు జరిపించి సమస్య ఏమిటన్నది నిర్ధారణ అయిన తర్వాత దాన్నిబట్టి మందులు వాడాల్సి ఉంటుంది. మందులతో పాటు మీ సమస్యకు అసలు కారణాలైన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. నా వయసు 20. మాట్లాడుతుంటే నత్తివస్తోంది. ఈ పోటీ యుగంలో నెగ్గుకురావడం ఎలా అన్నది ఆలోచిస్తే ఆందోళన కలుగుతోంది. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి. - అఖిలేష్, విజయవాడ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. మొదట మీరు... మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించండి. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడిన కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడల్లా ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషిస్తూనే ఉండండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల కౌన్సెలింగ్ తీసుకుంటూ వారు చెప్పినవి ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ సీనియర్ ఇఎన్‌టి నిపుణులు, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్ (సాహి), అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్ |
చిరిగిపోయిన పాత కార్పెట్‌తో...
-బరువైన ఫర్నిచర్ పెట్టినప్పుడు కార్పెట్ మీద గుంతలు పడతాయి. ఫర్నిచర్ వాటి చోట్లు మార్చిన తరువాత ముందు ఏర్పడిన గుంతల మీద ఐస్‌క్యూబ్స్ ఉంచండి. ఐస్ కరిగి కార్పెట్ ఆరిపోయినాక గుంతలు వాటంతట అవే పూడిపోతాయి. -కార్పెట్ అనుకోకుండా కాలితే వెంటనే ఆలుగడ్డ ముక్కవేసి గట్టిగా రుద్దండి. నల్లమరకలు పోతాయి. -కార్పెట్ మరకలు పడి పాతగా కనిపిస్తుంటే పచ్చి ఆలుగడ్డ ముక్కతో మరకలు ఉన్నచోట రుద్ది వేడినీళ్లలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒత్తితే మళ్లీ కార్పెట్ కొత్తదానిలాగా కనిపిస్తుంది. |
Subscribe to:
Posts (Atom)