all

Saturday, July 20, 2013

వృద్ధాప్యం ఆలస్యం చేయడానికి స్కిన్ డిటాక్స్ డైట్..!

చాల మంది బరువు తగ్గించుకోవడానికి డైట్ ను ఫాలో అవుతుంటారు. లోక్యాలరీ డైట్ తీసుకోవడం వల్ల కొన్ని పౌండ్లు మీరు తగ్గుతారు. కానీ, డైట్ అనేది డైరెక్ట్ గా బరువు తగ్గించే సంబంధం కలిగి ఉండదు. ఉదాహరణకు, డైట్ లో వివిధ రకాల డైట్ లు ఉన్నాయి. డయాబెటిస్ డైట్, బరువుతగ్గించే డైట్, స్కిన్ డిటాక్స్ డైట్ ఇలా..వివిధ రకాల కారణాలతో మీరు వివిధ రకాలైన డైట్ ను మీరు ఫాలో కావచ్చు. అందులో స్కిన్ డిటాక్స్ డైట్. ఇది వయస్సు మీద పడకుండా చేసే డైట్.ముందు డిటాక్స్ అంటే ఏమిటి? సాధారణ స్నానం కన్నా సబ్బులతో రుద్దిన దానికన్నా ... డిటాక్స్ ట్రీట్ మెంట్ తో చర్మం ఎంతో పరిశుభ్రపడుతుంది. స్కిన్ ప్రొస్(చర్మ రంధ్రాలు) ఓపెన్ అయ్యి డీప్ గా లోపల ఉన్న మురికిని, టాక్సిన్స్ కు బయటకు పంపుతుంది. చర్మంపై ఉండే dead cells కూడా తొలగించబడతాయి.

డిటాక్స్ కారణంగా ఉత్పన్నమయ్యే వేడిమి... కండరాల నొప్పుల్ని ... తగ్గిస్తుంది.'డిటాక్స్' ఫలితంగా శరీరంలో హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చర్మాన్ని పరిశుభ్రపరుస్తుంది. చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. చెమట ద్వారా ఎన్నో టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. చర్మం మంచి మృధుత్వాన్ని పొందుతుంది. మొటిమలు, మచ్చలు రాకుండా రక్షిస్తుంది.శరీరానికి, చర్మానికి రక్షణ కల్పించేందుకు డైట్ కూడా ఉంది. దాన్ని స్కిన్ డిటాక్స్ డైట్ అనిపిలుస్తారు. దీన్నే యాంటీఏజింగ్ డైట్ అని కూడా పిలవచ్చు. ఈ డిటాక్స్ డైట్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం, శరీరంలోని మలినాలు(వ్యర్థాలను )తొలగిస్తుంది.

చర్మం ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. మీ శరీరంలోని టాక్సిన్స్ ను అంతమొందించవచ్చడం వల్ల మీరు సహజంగానే వృద్ధాప్యం ఆలస్యం చేయవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది సెలబ్రెటీలు స్కిన్ డిటాక్స్ డైట్ ను పాటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ సెలబ్రెట జెన్నీఫర్ అనిస్టన్ మరియు బెయోన్స్ వంటి ఫేమస్ సెలబ్రెటీలు లెమన్ డిటాక్స్ డైట్ ను అనుసరించి, యవ్వనమైన చర్మ సౌందర్యాన్ని పొందారు.అలాగే, ఈ యాంటీఎజింగ్ ఆహారాలు (డిటాక్స్ డైట్)వల్ల వృద్ధాప్యం ఆలస్యం చేయడంతో పాటు, బరువునుత కోల్పోవటానికి దారితీస్తుంది.

శారీరంలో చాలా వరకూ టాక్సిన్ అనారోగ్యకరమైన కొవ్వులతో నిల్వ చేయబడతాయి. మరియు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, అలాగే కొవ్వులను వదిలించుకోవటం కోసం ఈ డిటాక్స్ డైట్ చాలా బాగా సహాయపడుతుంది. స్కిన్ డిటాక్స్ డైట్ వల్ల శరీరంలోని క్యాలరీలను లెక్కింపు మరియు శరీరం శుభ్రపరచడం అద్భుతంగా సహాయపడుతుంది. వయస్సు మీదపడనియ్యకుండా ఆలస్యం చేయడం కోసం స్కిన్ డిటాక్స్ డైట్ లో మీరు తెలుసుకోవల్సిన కొన్ని బేసిక్ స్టెప్స్...



నిమ్మరసంతో రోజును ప్రారంభించండి: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనెతో మీ దినచర్య ప్రారంభించండి. ఈ మూడింటి మిశ్రం ఉదయం నిద్రలేవగానే పరగడుపున తీసుకోవడం వల్ల మీ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంతో పాటు పెద్ద ప్రేగు కదలికలను సాధారణంగా ఉంచి, మలినం తేలికగా విసర్జింపడానికి సహాయపడుతుంది.




ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకోవడా తగ్గించాలి: మీ యాంటీఏజింగ్ డైట్ విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటే, మీరు మీ చర్మం యొక్క వయస్సును తెలుసుకొని ఉండాలి. ప్రాసెస్డ్ మరియు సెమీ కుక్కుడ్ ఆహారాలు మీ చర్మ వయస్సును తెలుపుతుంది. అంటే మీరు వయస్సు పైబడ్డవారిగా కనబడేలా చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలను (డెలి మాంసాలు, కాల్చిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్స్ )తీసుకోండి ఆపాలి.


సిట్రస్ మంచి ఆహారాలు: స్కిన్ డిటాక్స్ చేయడానికి సిట్రస్ ఫుడ్స్ చాలా మంచిది. కాబట్టి సిట్రస్ పండ్లు తీసుకోవడంతో పాటు వాటి రసాలను తరచూ తాగుతుండాలి . ప్రతి రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల ఇటు ఆరోగ్యానికి, అటు చర్మాన్నికి రెండింటికి మంచిది. ఇది తాగలేనప్పుడు తాజా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు.


చెడు అవాట్లు మానుకోండి: కెఫిన్ మరియు నికోటిన్ వంటి వాటినికి మీరు బానిసలైతే మీరు స్కిన్ డిటాక్స్ డైట్ చేయలేరు. ఒక వేళ చేసినా నిరుపయోగమే. కాబట్టి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి. పొగతాగడం, మద్యం సేవించడం, కెఫిన్ కలిగిన పానీయాలు ఇవన్నీ కూడా మీరు వయస్సు మల్లేలా చేస్తాయి.


గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రొకోలి, మరియు ఆకుకూరలు వంటివి చర్మానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ వెజిటేబుల్స్ లోని యాంటీఆక్సిడెంట్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తే, మరొకటి వయస్సును మీద పడనియ్యకుండా రక్షణ కల్పిస్తాయి.


నీళ్ళు: ప్రపంచంలో అత్యంత సహజసిద్దమైన వనరు నీరు. ఇది మన శరీరాన్ని శుభ్రపరచడం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది . ఎప్పుడైతే మీరు తగినన్ని నీరు తాగుతారో అప్పుడు శరీరంలోని టాక్సిన్స్ తొలగించబడి, శరీరంతో పాటు చర్మం కూడా శుభ్రపడుతుంది.


జీర్ణక్రియకు సహాయపడే రసాలు: టాక్సిన్ మీ శరీరంలో జీర్ణం కావు. అలాగే నిల్వ ఉంటాయి. కాబట్టి, మీ జీర్ణక్రియను మంచి వర్కింగ్ కండీషన్ లో పెట్టుకోవాలి. అందుకు అల్లం, మరియు అజ్వైన్ వంటి వాటిని మీ భోజనం తర్వాత తీసుకోవడం ద్వారా మీ జీర్ణక్రియతో పాటు, శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడుతాయి.


మాప్లే సిరఫ్ థెరఫీ: స్కిన్ డిటాక్ కోసం డిమి మూర్, మాప్లె సిరఫ్ ను ఉపయోగించారు. ఒక చెంచా మాప్లే సిరఫ్ ను, గోరువెచ్చని నీటిలో వేసి ప్రతి రోజూ నాలుగు గ్లాసుల నీరు తీసుకోవాలి.


చక్ స్కిన్ కాంజెస్టింగ్ ఫుడ్స్: క్లియర్ స్కిన్ పొందడానికి మరియు మొటిమలు లేని ముఖం కలిగి ఉండటానికి చాలా మంది స్కిన్ డిటాక్స్ డైట్ ను ఫాలో అవుతారు. చర్మంలోని నూనె గ్రంథుల వల్ల మొటిమల రద్దీ పెరుగుదలకు కారణం అవుతుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, అదనపు కొవ్వులు కలిగి ఉండే ఆహారాలు మరియు ఫాటీ ప్రోటీనులు కలిగిన మాంసం, చేపలు, క్రీమీ డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోవడం నివారించాలి.


హెర్బల్స్: చర్మాన్ని శుభ్రపరచడంలో కొన్ని మూలికలు చాలా శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు, కొత్తిమీర ఆకులు మీ చర్మం ప్రక్షాళ చేస్తుంది.

మీరు అందం విషయంలో ఏమాత్రం రాజీ పడరా?

సాధారణంగా అందం విషయం ఎవ్వరూ రాజీ పడరు. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ముఖంలో మొటిమలు, డార్క్ స్పాట్స్, ముడుతలు లేని అందమైన మెరిసే చర్మం ఉండాలని కోరుకుంటారు. మీకు బోరింగ్ లుక్ ను ఇచ్చే అవాంఛితంగా ఏర్పడ్డ నల్ల ఈ మచ్చలను తొలగించడానికి బ్లీచింగ్ సహాయపడుతుంది. ప్రధాన కారకం ఏంటంటే బ్లీచింగ్ కు సరైన ఎంపికే ప్రధాన సమస్యగా ఉన్నాయి. కొంత మందికి బ్లీచింగ్ లో వివిధ రకాలున్నాయన్న విషయం కూడా తెలియదు. మరి స్కిన్ టోన్ కు సరిపోయే బ్లీచింగ్ ఏంటో తెలుసుకోవాలంటే..మొదట బ్లీచింగ్ లో రకాలు తెలుసుకోండి..

బ్లీచింగ్ లో రకాలు:

పౌడర్ బ్లీచ్- హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు అమ్మోనియా లిక్విడ్ తో బ్లీచింగ్ పౌడర్ జోడించడం ద్వారా జరుగుతుంది.క్రీమ్ బ్లీచ్ - ఈ బ్లీచింగ్ క్రీమ్ దీన్ని బ్యూటీ పార్లర్స్ లో ఎక్కువగా ఉపయోగించే ఈ క్రీమ్ బ్లీచ్ యే మందుల దుకాణంలోనైనా దొరుకుతుంది లేదా కెమికల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంది.మీరు ఎలా వాడాలి? మీరు ఏ కారణం చేత దీన్ని ఉపయోగిస్తున్నారో నిర్ణయించుకోవాలి.డార్క్ స్పాట్స్ మరియు చిన్న చిన్న మచ్చలు యొక్క తొలగింపు కోసం, డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ బ్లీచింగ్ ను ఉపయోగిస్తారు. దీనికి పౌడర్ బ్లీచ్ ను ఉపయోగించాలి.

ఒక వేళ స్కిన్ బ్రైటనింగ్(ముఖం కాంతివంతగా పొందడం) కొరకు అయితే , క్రీమ్ బ్లీచ్ ను ఉపయోగించాలి . మీ ముఖం మీద విస్తృతమైనదిగా అప్లై చేయాలి. మీరు నిర్దిష్ట ప్రాంతంలో(అనగా చిన్న చిన్న మచ్చలు మరియు మచ్చలు ఉన్న ప్రదేశం చుట్టు) ఉపయోగించదలచుకుంటే క్రీమ్ బ్లీచ్ ఉపయోగించడం సురక్షితం. బ్లీచింగ్ ను దీర్ఘకాలం పాటు కొనసాగించకూడదు, మీకు కావల్సిన చర్మ సౌందర్య పొందినప్పుడు బ్లీచింగ్ ను నిలిపివేయాలి. లేకపోతే , మీరు ప్రమాదకరమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది. అతిగా ఉపయోగించినప్పుడు ఇది ప్రమాదకరం.

రసాయనాల సమ్మేళనం కంటే ఇంట్లో హోం మేడ్ బ్లీచింగ్ లు ఎల్లప్పుడూ ఉత్తమమైన ఎంపిక.

.హోం మేడ్ ఫేషియల్ బ్లీచింగ్ లు: ఈ హోం మేడ్ బ్లీచింగ్ లను వారంలో ఒకసారి ఉపయోగించాల్సి ఉంటుంది.



తేనె: 1 టేబుల్ స్పూన్
క్రీమ్: 1 ½ టేబుల్ స్పూన్
నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:ఈ మూడింటిని ఇక మిక్సింగ్ బౌల్లో వేసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ బ్లీచ్ ను ముఖానకి అప్లై చేయాలి. ఇది ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



పసుపు : చిటికెడు
నిమ్మ రసం :కొన్ని చుక్కలు
రోజ్ వాటర్: కొన్ని చుక్కలు

తయారీ విధానం:ఈ పదార్థాలన్నింటిని, ఒక మిక్సింగ్ బౌల్లో వేసి, బాగా మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరి బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


పాలు: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ రసం:1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాలు మరియు నిమ్మరసం సమంగా కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమంతో ముఖం మీద బాగా రుద్దాలి. ఇది పొడిబారిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


గంధం పొడి: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ రసం: 2 టేబుల్ స్పూన్లు
దోసకాయ రసం: 2 టేబుల్ స్పూన్లు
టమోటా రసం: 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:పైన సూచించిన పదర్థాలన్నింటిని మిక్సింగ్ బౌల్లో వేసి, బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తడిజుట్టు ముడివేయడం వల్ల జుట్టుకు జరిగే ప్రమాదం?

జుట్టు సమస్యలను నివారించడం ఎప్పటికి సాధ్యం కాదని గ్రహించలేరు, ఎందుకంటే జుట్టు సమస్యలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. కురులకు సరైన పోషణ అంధివ్వకపోవడం మరియు నిరాశతో ఉండటం కంటే, మీ కేశాల గురించి మంచి శ్రద్ద తీసుకోవడం ఉత్తమం.ఒక వేళ మీజుట్టు, కర్లింగా లేదా స్ట్రెయిట్ (నిఠారుగా)ఉన్న జుట్టా అన్నది కాదు, ఎటువంటి జుట్టు తత్వం ఉన్నవారైనా సరే, ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యలు, చుండ్రు సమస్యలు కలిగి ఉంటారు.

జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు వెంటనే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోయినా, లేదా దీర్ఘకాలం జుట్టు సమస్యలు ఉన్నా, లేదా తడి జుట్టును ముడివేయడం వల్ల, జుట్టు నిర్వహాణ సరిగా లేకపోయినా జుట్టు నష్టం అధికంగా ఉంటుందనే సాధరణ పరిజ్ఘానం కలిగి ఉండాలి.

షవర్ బాత్ చేసేటప్పుడు కేశాలకు డ్యామేజ్ కలుగుతుందని ఏ ఒక్కరు తెలుసుకోరు. షవర్ బాత్ తర్వాత మీ జుట్టును ఎప్పుడైతే ముడి వేస్తారో, అప్పుడు మీ జుట్టు బలహీనపడుతుంది. వెట్ హెయిర్, తడి జుట్టును ముడి వేయడం వల్ల జుట్టుకు కలిగే డ్యామేజ్ లిస్ట్ కు ఇక్కడ మీకోసం అంధిస్తున్నాం. వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోండి...

తడిజుట్టు ముడివేయడం వల్ల జుట్టుకు జరిగే ప్రమాదం?

హెయిర్ డ్యామేజ్:
ఎప్పుడైతే కేశాలు తడిగా ఉంటాయో, అప్పుడు జుట్టు జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, తడి జుట్టును ముడివేయడం కానీ లేదా దువ్వడం కానీ ఎప్పటీకి ప్రయత్నించకూడదు. తడి జుట్టును దువ్వడం లేదా ముడివేయడం వల్ల జుట్టు మూలాలు తెగిపోయేలా చేస్తాయి. ఈ దృఢమైన చర్యలు తీవ్రమైన జుట్టు నష్టంకు దారితీస్తుంది. ఇటువంటి చర్యలు పాటించాలనుకొన్నప్పుడు ముందుగా జుట్టునుండి తడిని తొలగించాలి. అందుకు కురులను పిండి నీటిని తొలగించాలి. ఆ తర్వాత తడి జుట్టును ఒక కాటన్ వస్త్రంతో బాగా పొడిగా, తడి పూర్తిగా పోయాల తుడుచుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన జుట్టును పొందగలుగుతారు

.హెయిర్ లాస్:
తడిగా ఉన్న జుట్టును ఎప్పటి పోనీటైల్ వేయకూడదు. తడిజుట్టును గట్టిగా బిగించడం వల్ల కేశాలకు డ్యామేజ్ కలిగి, జుట్టు రాలే అవకాశం ఉంది. నీరు కారే జుట్టును ముడివేయడానికి ఉపయోగించే హెయిర్ ఎలాస్టిక్ ఖచ్చితంగా మరింత జుట్టు నష్టాన్ని కలిగిస్తుంది. మరియు జుట్టు తెగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జుట్టును టై చేయడానికి ముందు ఖచ్చితంగా పొడి (జుట్టు పూర్తి ఆరేలా)చేసుకోవాలని గుర్తుంచుకోవాలి.

చుండ్రు సమస్య:
తడి జుట్టును ముడివేయకుండా ఉండటానికి ఇది మరో కారణం. జుట్టు బాగా తడి ఆరిన తర్వాత ముడి వేయడం లేదా దువ్వడం వంటివి చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జుట్టు తడితో, నీరుకారుతున్నట్లున్నపుడు, ముడి వేయడం, తలదువ్వడం, లేదా జడవేయడం వంటి పనులు చేయడం వల్ల త్వరగా చుండ్రు చేరే అవకాశం ఉంది. తేమ లేదా చెమట వల్ల కూడా చుండ్రు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీ తడి వెంట్రుకులను ఎప్పటికీ ముడి వేయకండి.

తలలో దురద:
తలలో దురుద, చిరాకు పెట్టడానికి ప్రధాన కారణం చుండ్రు. చెమట కంటే తడి జుట్టే అధిక చుండ్రుకు కారణం అవుతుంది. చుండ్రు వల్ల మీ జుట్టు తడి ఆరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరియు తలలో ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది. తడి ఉన్నప్పుడు ఇది తల మొత్తం వ్యాప్తి చెందుతుంది.

జుట్టు పెళుసు బారుతుంది:
తడి జుట్టును ముడి వేయడం వల్ల జుట్టు పెళుసుభారుతుంది. కాబట్టి జుట్టు తడిగా ఉన్నప్పుడు మీ జుట్టును ముడి వేయడానికి ప్రయత్నించకండి. తడిగా ఉన్నప్పుడు కేశాల నుండి నీటిని పూర్తిగా పిండేయాలి.


జుట్టు పల్చబడటం లేదా బట్టతలకు కారణం కావచ్చు: తడి జుట్టును నిర్వహించడం ద్వారా తలకు హానీ కలిగిస్తుంది. తడిగా వున్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు యొక్క నాణ్యత లోపిస్తుంది. జుట్టు కఠినంగా మారతుంది. దాంతో జుట్టు రాలి, పచ్చగా మారడం లేదా బట్టతలకు ప్రధాన కారణం కావచ్చు.

నునుపైన చర్మం పొందడానికి మసూర్ దాల్ బాడీ స్క్రబ్.!

సాధారణంగా ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎన్నో రకరకాల క్రీములను వాడుతూ వుంటారు. మీరు అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు మీ చర్మం ఎలా వుందో గమనించండి. కలర్‌ ఎలాంటిదైనా మెరుపులీనుతూ ఉన్నదనుకోండి మీది ఆరోగ్యవంతమైన చర్మం లేదంటే డెడ్‌ స్కిన్‌ బాగా పేరుగుపోయిందని అర్థం.

దీన్ని తొలగించాలి.దీని కోసం మార్కెట్‌లో స్క్రబ్‌లు అనేవి వచ్చాయి. కానీ ఏ రకమైన స్క్రబ్‌ వాడాలో తేలికయక కొంతమంది ఈ స్క్రబ్‌ను దూరంగా వుంచుతారు. ఈ సందేహాలనుండి దూరమవడానికి ఈ స్క్రబ్‌కి మన ఇంట్లోనే తయారుచేసుకుంటే మంచిది. స్క్రబ్‌ అంటే సున్నిపిండి అని అందరికి తెలుసు కానీ సున్నిపిండి వాడరు. దాని దగ్గరకు కూడా వెళ్ళరు.మీ వంటగదిని పరిశీలించినట్లైతే, మీరు అందం కోసం ఉపయోగించే ఎన్నో రకాలు బ్యూటీ వస్తువులను కనుగొనవచ్చు.

ఉదా: పసుపు, వెల్లుల్ి, ఉప్పు, పంచదార, వెనిగర్, నిమ్మ, శెనగపిండి, పెసరపిండి మొదలగునవన్నీ బ్యూటీ కోసం సాధారణంగా ఉపయోగించే వస్తువులే. ఇంకా పప్పులు కూడా.. మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు)ను విరివిగా ఉపయోగిస్తారు. ఎర్ర కందిపప్పుతో బాడీ స్ర్కబ్ చేయడం చాలా పాపులర్ బ్యూటీ టిప్. స్కిన్ ను నేచురల్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. మసూర్ దాల్ బాడీ స్ర్కబ్ ను వంటింట్లోని ఇతర వస్తువులో కలిపి తయారు చేసుకోవచ్చు.

ఉదా: కందిపప్పు పౌడర్ కు పాలు పెరుగు వంటి వాటిని చేర్చి బాడీ స్ర్కబ్ గా ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలిగించుకోవచ్చు. మరియు చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మరి మీరు మసూర్ దాల్ బాడీ స్ర్కబ్ చేసుకోవానుకుంటున్నారా..అయితే క్రింది చిట్కాలను పరిశీలించి ట్రై చేయండి...

నునుపైన చర్మం పొందడానికి మసూర్ దాల్ బాడీ స్క్రబ్.!

1. ఎర్రకందిపప్పు-పాలు:ఎర్రకందిపప్పు పిండి, పచ్చి పాలు, కొద్దిగా నెయ్యి... వీటిని పేస్ట్‌లా కలిపి, ముఖానికి వేసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తుంటే చర్మకాంతి మెరుగవుతుంది.

2. ఎర్రకందిపప్పు-పసుపు: ఎర్రకందిపప్పు పౌడర్ ను, పసుపుతో కలిపి, అందులోనే కొన్ని చుక్కల తేనె కలిపి, బాగా మిక్స్ చేసి, శరీరం, ముఖానకి బాగా పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల చర్మ ఎక్స్ ఫ్లోయేట్ అవడంతో పాటు, శుభ్రపడుతుంది. ఇందులోని తేనె చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసి, చర్మాన్ని టైట్ చేస్తుంది.

3. ఎర్రకందిపప్పు-వేరుశెనగ: ఎర్రకందిపప్పు మరియు వేరుశెనగగింజలను రెండింటి కలిపి పొడి చేసుకోవాలి. ఈ పౌడర్ లో కొద్దిగా పసుపు వేసి, పెరుగుతో బాగా మిక్స్ చేస్తే పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని బాడీ స్ర్కబ్ గా ఉపయోగించడం వల్ల ఇది చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు, చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది. పసుపు ముఖంలోని మొటిమలతో పోరాడుతుంది. చర్మ కాంతిని పెంచుతుంది. మరియు వృద్ధాప్యంతో పోరాడుతుంది.


4. ఎర్రకందిపప్పు పొడి చేసి ఒక బాక్స్‌లో ఉంచాలి. అవసరమైనపుడు ఒక స్పూన్‌ పొడిలో కాస్త రోజ్‌వాటర్‌ కలిపి మొహానికి రాసి ఆరిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. రోజుకు ఆరు గ్లాసుల మంచినీరు తాగాలి. ఇలా వారం రోజుల స్క్రబ్‌ ఒక రోజు ఫేస్‌పాక్‌ వేసి మంచినీరు తాగి రాత్రిళ్లు ఆలివ్‌ ఆయిల్‌రాసి చూడండి. చాలా తేడా వస్తుంది. వీటన్నింటితో పాటు నిద్రపోయే ముందు ప్రతి రోజూ ఆలివ్‌ ఆయిల్‌ రాస్తే ముఖంపై ముడతలు పడకుండా సున్నితంగా, మృదువుగా మెరుస్తుంది.

5. ముఖాన్ని మృదువుగా ఉంచేందుకు ఉపయోగపడే స్క్రబ్బింగ్-పెసరపండి, బియ్యప్పిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండి పట్టించి అందులో ఓట్‌ మీల్‌ పౌడరు, నారింజతొక్కల పొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒక స్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

ఇప్పడు మీరు బ్యూటీపార్లర్‌ చుట్టూ తిరనవసరం లేదు. స్క్రబ్‌ వేయలేని వారు పైన చెప్పినవి చేయడానికి సమయం లేనివారు నిద్రించే ముందు ఆలివ్‌ ఆయిల్‌ రాసుకుని ఉదయం చల్లని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. ఏ ప్యాక్‌ వేసిన తరువాత అయిన సరే చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. సబ్బును ఉపయోగించకూడదు. ఎందువలన నంటే సబ్బు మన ముఖం మీద మురికి తొలగించే ప్రయత్నంలో మీరు ఆప్లై చేసుకున్న ప్యాక్‌ను కూడా తొలగిస్తుంది.

ఇంకా ప్యాక్‌ వేసి ఏ ప్రయోజనం వుండదు. వారానికి ఒకసారి సున్నిపిండితో నలుగు పెట్టుకుంటే చర్మం తెల్లబడుతుంది.

చిన్న వయస్సులో వృద్ధాప్యం లక్షణాలకు గల కారణాలు!

అందరికీ పుట్టిన రోజు అంటే ఎంతో అభిమానం. ఎంతో ఘనంగా పండుగ జరుపుకుంటారు. కానీ వృద్ధాప్యం లేదా మరణం అనేసరికి అందరికీ భయమే. మన జీవితంలో మరింత సమస్యలకు దారితీస్తే కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. మనలో చాలా మంది వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తే చాలా భయపడుతుంటారు. మనకు ఉన్న వయస్సు కంటే ఎక్కుగా వయస్సు మళ్లిన వారిగా కనబడితే మరింత ఆందోళన చెందుతుంటారు. కానీ, అందంగా కనబడటానికి మన జీవితంలో ఏం కావాలి. జీవితంలో వయస్సు మళ్ళడమనే ఇది సహజ ప్రక్రియే, అయితే, ఈ వృద్ధాప్యంను ఆలస్యం చేయలేం అని అనుకోలేం.


వృద్ధాప్యంను ఆలస్యం చేయడానికి అనేక మార్గాలున్నాయి. మనకు చాలా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, కోరికలను కలిగించే కొన్ని చెడు అవాట్లు వెంటనే ఆపేయాలి. మన జీవితంలో మొదలైన కొన్ని చెడు అలాట్లను మానుకోవడం వల్ల, త్వరగా వయస్సు మళ్ళిన వారిగా కనబడకుండా చేస్తాయి. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల వృద్ధాప్యంలో తలెత్తే సమస్యలు తలెత్తుతాయి. వీటిని 'ఏజ్‌ రిలేటెడ్‌ డిసీజెస్‌' అంటారు. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోకపోవటం, తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవటం, పొగ మద్యం వంటి వ్యసనాలకు బానిసలు కావటం.. వీటన్నింటి వల్లా ఒక వయసు పైబడ్డవారిలా కనిపించడం సహజం. మిమ్మల్ని వయస్సు మళ్ళినవారిగా చేసే కొన్ని చెడు అవాట్లు మీ తెలుసుకోవడం కోసం కొన్ని...

చిన్న వయస్సులో వృద్ధాప్యం లక్షణాలకు గల కారణాలు!
1. సూర్య రశ్మి(ఎండ): మనందరిక సూర్య రశ్మిలో గడంపడం అంటే ఇష్టం. మరియు ఈ ఎండ వేడిమి మనకు తెలియకుండానే మన శరీరం మీద పడటం మనం అంతాగా పట్టించుకోము. అయితే, ఈ సూర్యకిరణాల్లో హానీకరమైన యూవీ కిరణాలు వయస్సుపెరగడాన్ని మరింత వేగవంతం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడు మీరు బయటకు వెళ్ళే ప్రతి సారి శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం చాలా అవసరం. అందులో spfకలిగిన సన్ స్క్రీన్ లోషన్ ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.

2. స్మోకింగ్: మిమ్మల్ని త్వరగా వయస్సు మళ్ళిన వారిగా చేయడంలో చెడు అలవాట్లలో మొదటిది సిగరెట్ తాగడం. సిగరెట్ తాగడం వల్ల లేదా సిగరెట్ తాగేవారి దగ్గరగా ఉండి పొగ పీల్చడం వల్ల మీ చర్మం ముడుతలు పడటానికి మరియు చర్మం పొడిబారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్మోకింగ్ వల్ల చర్మన్ని మాయశ్చరైజర్ గా ఉంచేటటువంటి ‘విటమిన్ సి'ని శరీరంలో పూర్తిగా తగ్గించేస్తుంది.


3. మద్యం: ఎప్పుడో ఒకసారి మద్యం సేవించడం వల్ల అది మీ శరీరానికి ఆరోగ్యకరమని చెప్పవచ్చు. కానీ, ఇది ఒక అలవాటుగా మారితే మాత్రం, అది మిమ్మల్ని వయస్సు మళ్ళిన వారిగా చూపించడానికి గ్రీన్ సిగ్నల్ గా భావించాలి. మద్యం ఎందుక హానికరమంటే, ఇవి చర్మంలోని చిన్న రక్తనాళాలలను విస్తరింపచేయవు. దాని ఫలితంగా చర్మం ఉపరితంల మీద రక్త ప్రవాహంలో పెరుగుదలకు కారణం అవుతుంది. అదే సమయంలో మీ చర్మం పూర్తిగా దెబ్బతినడంతో పాటు, చర్మం, ముఖం, కాళ్ళు చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి.

4. నిద్ర: ఆలస్యంగా నిద్రపోవడం లేదా నిద్రలేమి వల్ల కూడా వయస్సు వేగంగా పెరగడానికి మరొ చెడు అలవాటుగా చెప్పవచ్చు. సరైన నిద్రలేకపోవడం వల్ల ఉబ్బిన మొహం మరియు వదులుగా ఉండే ఎరుపు కళ్ళకు కారణమవుతుంది. ప్రతి రోజూ చాలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీ నిజమైన వయస్సు కంటే ఎక్కువ వయస్సు మల్లిన వారిగా చూపెడుతుంది.

5. వ్యాయామం: అన్ని వయస్సుల వారికి వ్యాయామం చాలా అవసరం. ఎప్పుడైతే మీరు వ్యాయామం చేస్తారో అప్పుడు మిమ్మల్ని బెటర్ గా ఫీల్ అయ్యేలా చేయడంతో పాటు ,ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాయామాలు చేయకపోవడం వల్ల చర్మం వయస్సుమళ్లిన వారిగా వదులుగా కనబడేలా చేస్తుంది. త్వరగా వయస్సు మల్లినవారిగా చేయడంలో మొదటిది సోమరితనం. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామం చేయడం మరియు జాగింగ్ కు వెళ్ళడం వంటివి మర్చిపోకండి..

ఆహారంలో విటమిన్ సి తక్కువగా ఉంటే చర్మం త్వరగా ముడతలు పడి, వయసు మీరిన వారిలా కనపడుతారు. జామ, నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లు, స్ట్రాబెర్రి, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, టొమాటో, బొప్పాయి, బంగాళదుంపల నుండి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ప్రకృతి పరంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు చర్మాన్ని ఎప్పుడూ తేజోవంతంగా ఉంచుతాయి. ఆహారంలో రోజుకు ఐదు రకాల పండ్లు, లేదా కాయగూరలు తీసుకున్నట్లైతే వృద్ధాప్యం దరికి చేరదు.

ఒక్కరే సంతానమైతే వారి స్వభావం ఎలా ఉంటుంది?

ఒక్కరే ఉన్న పిల్లల గురించి ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయి. పిల్లలు ఎవరైనా పిల్లలే. వాళ్ళకి అక్క చెల్లెళ్ళు లేదా అన్నా తమ్ముళ్ళు ఉన్నా లేక వారు ఒంటరి వారు అయినా వాళ్ళ చిన్నతనం ఒక లాగే ఉంటుంది. కానీ ఒంటరి పిల్లల గురించి ఉన్న అపోహలు ఎన్నో ఉన్నాయి.




తోబుట్టువులు లేని పిల్లల గురించి 8 అపోహలు!

స్వార్ధపరులు
ఒక్కరే ఉన్న పిల్లలకి మాత్రమే స్వార్ధం ఉంటుందని ఎంతో మంది నమ్మకం. కానీ ఇది నిజం కాదు. ఎవరికైనా స్వార్ధం ఉండవచ్చు. స్వార్ధానికి చిన్నా పెద్దా అనే తేడా లేదు. పెరిగిన వాతావరం వల్ల ఇటువంటి లక్షణాలు ఏర్పడతాయి.


ఒంటరి వాళ్ళు
ఒంటరి పిల్లలు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారని ఎవరితో కలవారని అంటారు. కాని ఇది నిజం కాదు. నిజానికి ఒంటరి పిల్లలే ఎంతో నేర్పు కలిగి ఉంటారు. ఎన్నో పనులను చక్కబెడతారు.


సామాజికంగా కలవలేరు
వీళ్ళు సామాజికంగా కలవలేరు అని అనుకుంటారు. ఇది తప్పు. వారు ఎవరితో టైం స్పెండ్ చేస్తారో ఎంచుకుంటారు. ఎక్కువగా కలవలేకపోయినా కుటుంబం అంటే విలువ ఇస్తారు. కొద్ది మంది సన్నిహిత మిత్రులతో కలిసి గడపడానికి ఇష్టపడతారు. అందువల్ల వాళ్ళు ఏకాకిగానే ఉంటారు అని అనడం సబబు కాదు.


వాళ్ళు చెడిపోతారు
తల్లి దండ్రుల గారాబం వల్ల వారు చెడిపోతారు అని ఎంతో మంది అభిప్రాయం. కానీ ఇది నిజం కాదు. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న ఇళ్ళలో కూడా ఒకరు మంచి గా ఉంటే మరొకరు చెడుగా ఉంటారు. కాబట్టి కేవలం ఒంటరి పిల్లలు మాత్రం చెడిపోతారు అని అననవసరం లేదు.


పట్టించుకోవాలి
అందరికీ ఇదే వర్తిస్తుందని చెప్పలేకపోయినా ఎవరైనా పిల్లలు గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారంటే అది ముఖ్యంగా వ్యక్తిత్వ లక్షణం. తోబుట్టువులు లేని వాళ్ళు మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు అనుకోవడం సబబు కాదు. నిజానికి తోబుట్టువులు పుట్టినప్పుడు మొదటి వాళ్ళు గుర్తింపు కోసం ప్రాకులాడటం అనేక సందర్భాలలో చూస్తూ ఉంటాం. 


వారు ఎంతో స్వతంత్రులు
సహోదరులు లేని వాళ్ళే స్వతంత్రంగా ఉండటం మరియు గుర్తింపు పొందాలనే తపన కలిగి ఉంటారని భావించడం తప్పు. నిజానికి, చాలా మంది ఒంటరిగా ఉన్న పిల్లలు పూర్తిగా తల్లి దండ్రుల మీద ఆధారపడే వాళ్ళు గా ఉన్నారు.


భౌతిక వాదులు
సహోదరులు లేని పిల్లలు చెడిపోయేందుకు, భౌతిక వాదులుగా మరెందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది తప్పు. ఒంటరిగా ఉన్న పిల్లలకి ధనవంతులైన తల్లిదండ్రులే ఉండాలని లేదు. అలాగే ప్రతి ధనవంతులు అయిన తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాబంతో పాడు చేస్తారని లేదు.

జుట్టుకు పోషణ అందిచే హోంమేడ్ ఇండియన్ షాంపులు

మనకు ఇష్టమైన అందమైన, ఆరోగ్యకరమైన కురులు వుండటం అంత సులభం కాదు, కానీ అలా ఉండాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది . మనలో చాలా మంది మన కురలు మంచి షైనింత్ తో ఉండాలని, ఒక ఖచ్చితమైన జుట్టు సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటారు. అటువంటి జుట్టును పొందాలంటే, హెయిర్ డ్యామేజ్ చేసే రసాయన ఉత్పత్తులను మరియు వేడి, ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడే మీరు అందుమైన జుట్టును పొందగలుగుతారు.

కఠిమైన హెయిర్ ప్రొడట్స్ నుండి జుట్టును సంరక్షించుకోవాలంటే, మీరు ఎల్లప్పుడూ రసాయనిక హెయిర్ ప్రొడక్ట్స్ ప్రత్యామ్నాయంగా హోం మేడ్ షాంపూలను ఉపయోగించవచ్చు. ఇవి జుట్టు సంరక్షణకు మరియు జుట్టు ఆరోగ్యంగా పెరుగుదలకు ఈ ఇండియన్ హోం మేడ్ షాంపులు బాగా సహాయపడుతాయి. వీటిని మనం ఇట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి, వీటిలో ఎటువంటి రసాలయనాలు లేకుండా ఉంటాయి. ఈ నేచురల్ ఇండియన్ మోం మేడ్ షాంపులు మీ కురలకు ఎటువంటి హాని కలిగించదు. కరులను బలహీన పరచవు, కఠినంగా పొడిగా మార్చవు, మరియు నిర్జీవంగా మార్చవు.

మనలో చాలా మంది రెగ్యులర్ గా తలస్నానం చేస్తూ, కఠినమైన రసాయ షాంపూలను ఉపయోగించే అలవాటు ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి దారితీయవచ్చు. కాబట్టి, మీ జుట్టులో చైతన్యం నింపడానికి, మీ జుట్టుకు మంచి షైనింగ్ ను తిరిగి పొందడానికి, కొన్ని హోం మేడ్ ఇండియన్ షాంపులను ట్రై చేయండి. ఈ హోం మేడ్ ఇండియన్ షాంపులను మీరు ఇంట్లోని వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ట్రై చేసి చూడండి..


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! బేకింగ్ సోడా: ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసికొని నీళ్ళలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, బాగా షేక్ చేసి, తర్వాత తడి జుట్టుకు పట్టించాలి. ఈ నేచురల్ షాంపుకు కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా, తలలోని చుండ్రు వదలగొడుతుంది.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! ఆరెంజ్-ఎగ్ షాంపు: మీ కేశాలు కురచగా లేదా పొడవుగా ఉన్నాసరే, ఈ షాంపు మీ కేశాలను సాఫ్ట్ గా చేస్తుంది. ఒక బౌల్లో ఒక గుడ్డుసొన మరియు ఆరెంజ్ జ్యూస్ ను తీసుకొని బాగా గిలకొట్టాలి. ఈ రెండింటి మిశ్రమం స్మూత్ గా తయారయ్యే వరకూ, బాగా మిక్స్ చేసి, తర్వాత ఈ షాంపును మీతలకు పట్టించి, పది నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! గుడ్డు షాంపు: సాఫ్ట్ గా, షైనింగ్ తో , మరీ మెత్తని కురులకోసం గుడ్డును సాధారణంగా ఉపయోగిస్తుంటారు. మీ జుట్టు మందం, పొడవును బట్టి 2-3గుడ్లు తీసుకోవాలి. ఈ గుడ్లలోని లిక్విడ్ ను గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత గిలకొట్టిన గుడ్డులిక్విడ్ ను తలకు పట్టించి అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.


తేనె-నిమ్మరసంతో షాంపు: ఈ హోం మేడ్ ఇండియన్ షాంపును జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడటంతో పాటు, చుండ్రులేని జుట్టును పొందవచ్చు. 3టేబుల్ స్పూన్ల నిమ్మరసం, మరియు తేనె మిక్స్ చేయాలి. మరో బౌల్లో రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. ఈగుడ్డు లిక్విడ్ ను నిమ్మరసం, తేనె మిశ్రమంలో వేసి బాగా గిలకొట్టాలి. చివరగా మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! రీటా లేదా శీకాకాయ్ షాంపు: రీటా లేదా శీకాయ షాంపు కురులకు మంచి పోషణను అంధిస్తుంది. అందుకు 100grmఉసిరికాయ, 100grms రీటా మరియు 75గ్రాములు శీకాయ మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు తగినన్ని నీళ్ళు కలిపి రాత్రంత నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం, శీకాయ లిక్విడ్ ను తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! గసగసాలు మరియు శీకాయ: శీకాయ, కందిపప్పు, పెసరపప్పు, గసగసాలను ప్రతి ఒక్కటీ 250grms తీసుకొని, అందులోనే మెంతులు మరియు హార్స్ గ్రామ్స్ ను కూడా మిక్స్ చేసి ఈ పద్దార్థలన్నింటి ఒక్క మిశ్రమంగా చేసి, మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పౌడర్ తో తలస్నానం చేయవచ్చే. ఈ పౌడర్ ను కొద్దిగా నీళ్ళలో కలుపుకొని, తలకు పట్టించి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.


అవొకాడో షాంపు: అవొకాడోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి అందులోనే బేకింగ్ సోడా, నీళ్ళు కూడా వేసి, మెత్తగా అయ్యే వరకూ బ్లెడ్ చేయాలి. ఈ హోం మేడ్ ఇండియన్ షాంపును మీ కేశాలకు పట్టించి తలస్నానం చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా కేశాలను రక్షించుకోవచ్చు.


నిమ్మ మరియు ఉసిరికాయ షాంపు: ఒక మిక్సింగ్ బౌల్లోనికి మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు 50గ్రాములు ఉసిరికాయ పొడి తీసుకొని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టు పెరుగుదలకు అద్భుత ఔషదం ఉల్లిపాయ రసం!

కేశాలను సంరక్షించుకోవడం కోసం చాలా మంది కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు.

ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయ ఇంట్లో లభించే బెస్ట్ హెయి ప్రొడక్ట్. అవును, నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది అనడంలో ఆశ్చర్యం కలగక మానదు!.

నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దాంతో పాటు కేశాలు చిట్లడానికి అడ్డుకుంటుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు ఇందులో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది.

కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరికట్టాలనుకున్నా .. ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ రసాన్ని జుట్టు పట్టించాలి.ఉల్లిపాయ వాసన మనకు ఇబ్బంది కలిగించినా కొంత సమయం తర్వాత జుట్టు పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని గ్రహించవచ్చు. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలతో పాటు, జుట్టు పోషణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హోం రెమడీ వల్ల కేశాలు షైనింగ్ మెరుస్తుండటమే కాదు, కేశాలను బలంగా కూడా ఉంచుతుంది. జుట్టు రాలడంతో పోరడా, జుట్టు పెరగాలంటే ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ప్టించాల్సిందే.ఉల్లిపాయ రసాన్ని జుట్టు సంరక్షణలో ఉపయోగించడానికి చాలా మార్గాలున్నాయి.

ఉదా: ఉల్లిపాయ రసాన్ని తేనెతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని నేచురల్ గా తగ్గిస్తుంది. అదే విధంగా, సింపుల్ గా ఉల్లిపాయ ముక్కలను రుబ్బి ఆ రసాన్ని తలకు పట్టించడం ద్వారా జుట్టును పెంచుకోవచ్చు. కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో ఉల్లిపాయ జ్యూస్ ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చిక్కుముడులను మరియు పొడి జుట్టును నివారిస్తుంది. దాంతో పాటు మీ కేశాలు మంచి మెరుపుతో పాటు, నిర్వాహణ కూడా సులభం అవుతుంది.

కాబట్టి ఈ క్రింద ఇచ్చిన ఆనియన్ హెయిర్ చిట్కాల ట్రై చేసి, రిజల్ట్ చూడండి. స్పాలకు, బ్యూటీపార్లకు డబ్బు ఖర్చు చేయడం మానుకొని ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ తో వ్యత్యాసాన్ని గమనించండి . ఒక సూచన ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ ను మినిమం ఒక నెల పాటించాల్సి ఉంటుంది. మరి ఆనియన్ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దామా...


ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల తల మాసిన వాసన శుభ్రంగా తొలగిపోతుంది.



ఉల్లిపాయ నుండి రసాన్ని వేరుచేసుకొని అందులో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు పట్టించాలి. హెయిర్ ఆయిల్స్ కు మీరు ఎసెన్సియల్ ఆయిల్స్(రోజ్ మెరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ మరియు సీడర్ వుడ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. తలకు పట్టించి ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.



ఉల్లిపాయ నుండి జ్యూస్ ను సపరేట్ చేసిన తర్వాత మిగిలి ఉల్లిపాయ గుజ్జుకు కొద్దిగా బీర్ మరియు కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన ఒకటి రెండు గంటలు ఇలాగే ఉంచేయాలి. తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో తలస్నానం చేసుకోవాలి . ఇది హెయిర్ గ్రోత్ కు బాగా సహకరిస్తుంది. కేశాలు అందంగా మెరుస్తుంటాయి. హాట్ వ్రాప్ చుట్టడం ద్వారా కేశకణాకలు కావల్సిన న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది




ఆనియన్ జ్యూస్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి బాగా జెల్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పట్టించిన రెండు గంటల తర్వాత లెమన్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ జెల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది మరియు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. ఈ హెయిర్ జెల్ ను వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు.



ఒక కప్పు బీర్ లో ఉల్లిపాయను రాత్రంతా నానబెట్టాలి. ఈ బీర్ తో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.



ఉల్లిపాయ రసానికి నిమ్మరసం కలిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది మరియు చుండ్రును వదలగొడుతుంది. నిమ్మరసం తలను శుభ్రపరుస్తుంది మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.






ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీసి అందులో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, బాగా గిలకొట్టి తలకు మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి షాంపూతో తలస్నానం చేయాలి.



గుడ్డు జుట్టు సంరక్షణకు చాలా మంచిది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి గుడ్డులో ఉల్లిపాయ రసాన్ని కలిపి, బాగా గిలకొట్టి, తడి జుట్టు మీద అప్లై చేయాలి 25-30నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.