all

Sunday, November 25, 2012

అందమె ఆనందం

ద్రాక్ష రసంలో మూడు టీ స్పూన్ల ఓట్స్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఊహ తెలిసి జ్ఞానం వచ్చాక బాహ్యప్రపంచం నుంచి పిల్లలే నేర్చుకుంటారులే అని తల్లిదండ్రులు దృఢంగా విశ్వసిస్తారు. అలా అని వదిలేయడం ఏ మాత్రం సబబు కాదు.
ప్రాచీనమైన మన సంస్కృతి - సంప్రదాయాలను తెలియచేస్తూ, నైతిక విలువలు నేర్పుతూ, అమూల్యమైన జీవన విధానాలతో కూడుకున్న మధురమైన బాల్యాన్ని పిల్లలకు అందివ్వడం తల్లిదండ్రుల బాధ్యత. ఎప్పుడో వృద్ధాప్యం లో పిల్లల పెంపకంలో సరైన జాగ్రత్త తీసుకోలేకపోయామే అని చింతిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. నిజాయితీ, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, గౌరవం, ప్రేమ, దయ, న్యాయం, నిస్వార్థత, సఖ్యత... ఇవి ప్రపంచంలో ఏ ప్రదేశంలోనైనా అంగీకరించే అతి ముఖ్యమైన నైతిక విలువలు. తాము సంతోషంగా జీవించటానికి, తమ చుట్టూ మంచి సమాజాన్ని నిర్మించుకోవటానికి ఈ విలువలు ముఖ్యపాత్ర వహిస్తాయి. చెవులతో విన్నవాటి కంటె కళ్లతో చూసిన వాటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు పిల్లలు. నైతిక విలువలు ఎక్కడికో వెళ్లి, ఎవరి దగ్గరో నేర్చుకునే విషయాలు కావు. తమ ఇంట్లో తమ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవలసినవి.

ఊహ తెలిసి జ్ఞానం వచ్చాక బాహ్యప్రపంచం నుంచి పిల్లలే నేర్చుకుంటారులే అని తల్లిదండ్రులు దృఢంగా విశ్వసిస్తారు. అలా అని వదిలేయడం ఏ మాత్రం సబబు కాదు. నియమాలు, పరిధులు, పరిమితమైన హద్దులతో, చక్కటి విలువలతో, క్రమపద్ధతిలో పెరిగిన పిల్లలు చట్టాల్ని, నియమాల్ని గౌరవిస్తూ, సమాజాన్ని గాని ఇతరులను గాని ఇబ్బంది పెట్టకుండా తమ హద్దు తెలిసి ప్రవ ర్తిస్తారు.

చిన్నతనం నుంచే పిల్లలకి నైతిక విలువల ప్రాముఖ్యత తెలుపుతూ పెంచినట్లయితే, వారు పెరిగి పెద్దవుతున్న కొద్దీ తమంత తాముగా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. గాంధీ, నెహ్రూ వంటి నేతల భావాలను గౌరవిస్తూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దితే, ఆ పిల్లలు తమ తల్లిదండ్రులకు, దేశానికి కూడా మంచి పేరు తెస్తారు. ఇటీవల సివిల్స్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ర్యాంకు సాధించిన ఒక అమ్మాయిని, ‘అడ్మినిస్ట్రేషన్‌కు ఉండాల్సిన లక్షణ మేమిటి’ అని అడిగితే, ‘నైతిక విలువలు’ అని జవాబు చెప్పింది. ఈ సమాధానం అందరి పిల్లలది కావాలి. మాటల్లోనే కాకుండా దానిని చేతల్లో చూపాలి. అందుకు తల్లిదండ్రుల పాత్రే ప్రముఖంగా ఉంటుందని తెలుసు కోవాలి. గ్రహించినవి ఆచరణలో పెట్టాలి.

roja-selvamani interview

ఈ తెలుగమ్మాయి తమిళింటి కోడలైంది...
ఆ తమిళబ్బాయి తెలుగింటి అల్లుడయ్యాడు.
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే...
అని ఆయన పాడితే !
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే అని ఆమె పాడింది !!
‘చూడు అచ్చు నీ పోలికే’ అని మురిపెంగా దెప్పుకోమని దేవుడు ఇద్దరి కోరికా తీర్చాడు.
రోజా - సెల్వమణి అన్యోన్యదాంపత్యంలోని మధురిమలే ఈ వారం బెటర్‌హాఫ్!!


రోజా ఒకసారి నవ్వితే వందసార్లు గుర్తు చేసుకుంటాం. మరి ఆ నవ్వుతోనే శుభోదయం పలికితే... ఆ ఇల్లు నందనవనమే. అచ్చం అలాగే... అందంగా అల్లుకున్న పొదరిల్లులా ఉంది వీరి ఇల్లు. మేము వెళ్లేటప్పటికి పాపకు డ్రస్ వేసి, జుట్టు దువ్వుతున్నారు రోజా. ఇంతలో సెల్వమణి బాబును తీసుకుని ‘లతా!’ అని రోజా అసలుపేరుతో పిలుస్తూ, ఏదో చెప్పడానికి వచ్చి, కొత్త వ్యక్తిని చూసి వెంటనే వెళ్లబోయారు. ‘‘కుట్టీ! వెళ్లకు కూర్చో మాట్లాడుదాం’’ అని సెల్వమణిని ఆపేశారామె.

మీ తొలి పరిచయం ఎలా అనగానే... ‘‘చామంతి సినిమా కోసం హీరోయిన్ వేటలో నేను దొరికాను. అప్పటికే డెరైక్టర్‌గా ఆయన కెరీర్ పీక్‌లో ఉంది. ఏ యాక్టర్ అయినా ఈయన సినిమాలో చేయడం లక్ అనుకునే వారు అప్పట్లో. అందుకే అవకాశం రాగానే ఒప్పుకున్నాను’’ అని రోజా చెప్తుండగా సెల్వమణి అందుకుంటూ ‘‘ఆ సినిమాకు చామనచాయగా, పొడవుగా ఉన్న అమ్మాయి కావాలి. నవ్వు బాగుండాలని వెతికాం. అప్పటికి నలుగురు హీరోయిన్లతో షూట్ చేసి నచ్చక పెండింగ్ పెట్టాను. చివరికి లతను చూసినప్పుడు ఈ క్యారెక్టర్‌కు తను పర్‌ఫెక్ట్ అనిపించింది’’ అన్నారు. సెల్వమణి కొంత పాజ్ తీసుకోగానే రోజా... ‘‘సెల్వ వెతికింది హీరోయిన్ కోసం కాదు, భార్య కోసం అంటుంటారు ఫ్రెండ్స్. నాకేమీ చెప్పకుండా ఒకరోజు మా ఇంటికి వచ్చి మా వాళ్లతో... నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మా వాళ్లకు షాక్! మా ఇంట్లో ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్‌లే లేవు, అలాంటిది ఇంటర్ స్టేట్ మ్యారేజ్ అనగానే ఆందోళన పడ్డారు. కానీ సెల్వ అప్పటికే పెద్ద డెరైక్టరు, వ్యక్తి మంచివాడన్న పేరు ఉంది. దాంతో పెళ్లికి ఒప్పుకున్నారు!’’ అని తమ పరిచయం పెళ్లికి దారి తీసిన వైనాన్ని వివరించారామె.

ఒకరిలో ఒకరికి...

రోజాలో తనకు నచ్చింది కష్టపడే తత్వమేనన్నారు సెల్వమణి. ‘‘లత హార్డ్‌వర్కింగ్ నేచర్ నాకు బాగా నచ్చింది. తాను చేయాల్సిన పని తనకు అప్పటి వరకు తెలియనిదైనా సరే... తెలియదు అని ఊరుకోదు, తెలుసుకుని కరెక్ట్‌గా చేస్తుంది. కరెక్ట్‌గా వచ్చే వరకు దాని మీద ఒక పట్టు పడుతుంది’’ అన్నారాయన. ‘‘సెల్వ... స్ట్రీలను గౌరవిస్తారు. ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడంతోపాటు సాఫ్ట్‌కార్నర్ చూపిస్తారు. మహిళలను తప్పుగా ఒక్కమాట కూడా అనరు, ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ పక్షపాతి’’ అన్నారామె మురిపెంగా ఆయనను చూస్తూ.

రాజీలన్నీ ఆయనవే!

ఒకరి కోసం ఒకరు చేసుకున్న రాజీలు పెళ్లికి ముందే మొదలయ్యాయంటూ... ‘‘నేను చిన్నప్పటి నుంచి బాగా అల్లరిదాన్ని, అడ్జస్ట్‌మెంట్ తెలియదు. పెళ్లయిన తర్వాత కూడా నేనెప్పుడూ రాజీపడిందే లేదు. పెద్ద విషయం ఏమిటంటే... మా రాజీల పర్వం పెళ్లికి ముందే మొదలైంది. 1991లో ఎంగేజ్‌మెంట్ అయింది. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు కొంత టైమ్ అడిగాను. నేను డిజప్పాయింట్ కాకూడదని అప్పుడు సరే అన్నారు. ఆ సరే అనడం... అనడం... ఇప్పటి వరకూ నేనేది కావాలన్నా సరే అనడమే. ఈయనకేమో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని రిసెప్షన్ ఇద్దామని. కానీ నా కోరిక ప్రకారమే పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఎప్పుడూ ఎవరింటికీ వెళ్లనివాడు... నా ముచ్చట కోసం పెళ్లికి ఇన్విటేషన్లు ఇవ్వడానికి వచ్చారు. మరో రాజీ ఏంటంటే... తనది కమ్యూనిస్టు భావజాలం. దేవుడిని నమ్మరు. నేను దేవుడిని బాగా నమ్ముతాను. ప్రేమిస్తున్న రోజుల్లో గుడి బయట నిలబడి నన్ను వెళ్లి రమ్మనేవాడు. ఇప్పుడు నాతోపాటు పూజలకు కూర్చుంటున్నారు’’ అన్నారు రోజా.

పిల్లల మంచిచెడ్డలు..!

మాకు ఇద్దరు పిల్లలు, పాప ఫోర్త్ క్లాస్, బాబు ఫస్ట్ క్లాస్. పిల్లలను ఎక్కువగా సెల్వ చూస్తారు. అందుకే నేను పాలిటిక్స్, టీవీషోలు, సినిమాలు చేసుకోవడానికి సాధ్యమవుతోంది. తను బిజీగా ఉంటే నేను ఇంట్లో ఉంటాను. పిల్లల దగ్గర ఇద్దరిలో ఎవరో ఒకరం ఉంటాం. నా షెడ్యూల్ కూడా శనిఆదివారాల్లో పిల్లలతోనే.

అచ్చు నీ పోలికే!

పిల్లల్ని అచ్చు నీ పోలికే అని రాంగ్ పర్సెప్షన్‌లో దెప్పుకునే సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు రోజా. ‘‘మా అమ్మాయి అచ్చు నాలాగే, మొండి. బాబు వాళ్ల నాన్నలాగే సాఫ్ట్. పాప ఎప్పుడైనా మొండిగా ఉంటే అన్షుకి నువ్వే చెప్పు, అంతా నీ పోలికే కదా! అని దెప్పుతారు’’ అన్నారామె నవ్వుతూ. మా పిల్లలు ఎంత ముదుర్లంటే... వాళ్ల డిమాండ్‌కు సెల్వ ఒప్పుకోకపోతే నా దగ్గరకు వచ్చి ‘నువ్వు చెప్తే నాన్న ఒప్పుకుంటారు, నువ్వు చెప్పు’ అని నన్ను కన్విన్స్ చేస్తారు. నేను ఏది అడిగినా సెల్వ కాదనరని వాళ్లకూ తెలిసిపోయింది’’ అన్నారామె. సెల్వమణి కూడా నవ్వుతూ నిజమేనన్నట్లు తలూపారు.

ఆయన ఆమె భర్త!

తన శ్రీమతి సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ఎదగడం, ఆంధ్రప్రదేశ్‌లో తనను రోజా భర్తగా గుర్తించడం చాలా గర్వంగా ఉందంటారు సెల్వమణి. ‘‘మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 50 ఏళ్లుగా పెరియార్ ఆశయాల కోసం పాటుపడిన కుటుంబం. మా అమ్మ, చెల్లెళ్లిద్దరు మహిళల సమస్యల మీద పని చేస్తున్నారు. ఇక్కడ లతకు ఆ అవకాశం వచ్చింది. సొసైటీకి నువ్వు చేయగలిగినంత చెయ్యి, వెనుకడుగు వేయవద్దని చెప్పాను. నేను ఇంతకంటే ఎక్కువ చెబితే బడాయిగా ఉంటుంది. తననే అడగండి’’ అన్నారు. ఇంతలో రోజా... ‘‘మహిళలు డామినేటింగ్‌గా ఉంటే ఆ భర్తను అయ్యోపాపం అని జాలిగా చూస్తారు. కానీ తను చాలా మెచ్యూర్డ్. మీటింగ్‌లలో నేను ఫ్రంట్‌రోలో, తను వెనుక ఉన్నప్పుడు వెనుక కూర్చున్నవాళ్ల కామెంట్స్ వింటూ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పి నవ్వేవారు.

నేను కెరీర్ పరంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో ఒడిదొడుకులను, ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. నాకే ఎందుకిలా జరుగుతోంది అని డిప్రెస్ అయితే... ప్రతి ప్రయాణంలో పూలు, పండ్లు, రాళ్లు అన్నీ ఉంటాయని అనునయిస్తారు. నేనింట్లో లేనప్పుడు పిల్లలు సరిగా తినకపోతే తనే తినిపిస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని... నా పిల్లల్ని, నా భార్యని ఎలా మిస్ చేసుకుంటానంటారు కూడ. దేవుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ మంచి భర్తనిచ్చాడు’’ అన్నారామె.

ఆయన కోపం అర్థం అయ్యేదెప్పటికో!

మనస్పర్థలు, మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంటూ...‘‘నాకు కోపం వస్తే మళ్లీ తనే పలకరించే వరకు మాట్లాడను. తనూ ఏం తక్కువ కాదనుకోండి. అయితే నాక్కోపం వస్తే వెంటనే తెలిసిపోతుంది. ఆయనకు కోపం వచ్చిన సంగతి మనకు అర్థం కావడానికే చాలా టైమ్ పడుతుంది. ఎందుకు మౌనంగా ఉన్నారా అని నేను రీల్ వెనక్కి వేసుకుని ఒక్కో సంఘటనా గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంతకీ కారణం తట్టదు. అప్పుడు నేనే వెళ్లి ఇక నా వల్ల కావడం లేదు ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని అడిగేస్తాను. అప్పుడూ కారణం చెప్పరు, కానీ మామూలైపోతారు’’ అన్నారామె చెప్పడానికి ఇబ్బందిపడుతున్న సెల్వమణి వైపు చిలిపిగా చూస్తూ.భార్యభర్తలు మనసున మనసై... అన్నట్లు ఒకర్నొకరు అర్థం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందమయం అవుతుందనడానికి ఉదాహరణ ఈ దంపతులే అనిపించింది.

మా సంతోషమే తన సంతోషం!
లత మా మీద చాలా కన్‌సర్న్‌గా ఉంటుంది. బయట పెద్ద గొంతుతో, పంచ్ డైలాగ్స్‌తో దడదడలాడిస్తుంది. కానీ పిల్లలకు జ్వరం వచ్చినా ఏడ్చేస్తుంది. మా బాబు ఏడవ నెలలో పుట్టాడు, వాడి కోసం మృత్యుంజయ హోమం వంటి పూజలెన్నో చేసింది. మేము ముగ్గురూ నవ్వుతుంటే తను గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది.
- సెల్వమణి




 

నిద్రపట్టకపోవడానికి కారణాలు

నిద్రపట్టకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వయసు పైబడ్డవారిలో ఇది సాధారణం. షుగరు, అధికరక్తపోటు ఉంటే వాటిని నియంత్రణలోకి తేవలసి ఉంటుంది. శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి ఉన్నా, అతిమూత్రవ్యాధి, దగ్గు, ఆయాసం, దురదలున్నా నిద్రపట్టకపోవచ్చు. మనసుకు సంబంధించి ఆందోళన, ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు, అంతర్లీనమైన భయభ్రాంతులు, తీరని కోరికలు వంటివి ప్రధాన కారణాలు. కాబట్టి కారణం గమనించి పరిష్కరించుకోవడం అవసరం. ఒక్కొక్కప్పుడు స్పష్టమైన కారణం కనబడకుండానే ‘నిద్రలేమి’ ఇబ్బంది పెడుతుంది. ఈకింది సలహాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

పగటిపూట స్వల్ప విశ్రాంతి తప్ప ఎక్కువగా నిద్రపోవద్దు ఎక్కువగా ఉపవాసాలు చేయవద్దు. రాత్రిపూట విధిగా తృప్తికరమైన ఆహారాన్ని తగు ప్రమాణంలో భుజించాలి టీ,కాఫీలు తక్కువగా సేవించాలి. సాయంత్రం నాలుగు తర్వాత అస్సలు తాగవద్దు. మద్యపానం పూర్తిగా మానేయాలి వయసుకి, శరీరతత్వానికి అనుగుణంగా వ్యాయామం (యోగాసనాలు, నడక, ఆటల వంటివి), రెండుపూటలా ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా చేయాలి రాత్రి భోజనానికి ముందు వేడినీళ్లతో స్నానం చేయాలి. భోజనానంతరం స్వచ్ఛమైన ఆవుపాలు కనీసం 300 మి.లీ. తాగాలి పుస్తకపఠనం, ఇష్టమైన పాటలు, పద్యాలు వినడం, టీవీ చూడటం... వంటివి చేస్తే మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే గది ఎక్కువ కాంతి లేకుండా నిశ్శబ్దంగా ఉండాలి. టీవీ దృశ్యాలు ఇబ్బందికరంగా ఉండకూడదు