all

Sunday, November 25, 2012

నిద్రపట్టకపోవడానికి కారణాలు

నిద్రపట్టకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వయసు పైబడ్డవారిలో ఇది సాధారణం. షుగరు, అధికరక్తపోటు ఉంటే వాటిని నియంత్రణలోకి తేవలసి ఉంటుంది. శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి ఉన్నా, అతిమూత్రవ్యాధి, దగ్గు, ఆయాసం, దురదలున్నా నిద్రపట్టకపోవచ్చు. మనసుకు సంబంధించి ఆందోళన, ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు, అంతర్లీనమైన భయభ్రాంతులు, తీరని కోరికలు వంటివి ప్రధాన కారణాలు. కాబట్టి కారణం గమనించి పరిష్కరించుకోవడం అవసరం. ఒక్కొక్కప్పుడు స్పష్టమైన కారణం కనబడకుండానే ‘నిద్రలేమి’ ఇబ్బంది పెడుతుంది. ఈకింది సలహాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

పగటిపూట స్వల్ప విశ్రాంతి తప్ప ఎక్కువగా నిద్రపోవద్దు ఎక్కువగా ఉపవాసాలు చేయవద్దు. రాత్రిపూట విధిగా తృప్తికరమైన ఆహారాన్ని తగు ప్రమాణంలో భుజించాలి టీ,కాఫీలు తక్కువగా సేవించాలి. సాయంత్రం నాలుగు తర్వాత అస్సలు తాగవద్దు. మద్యపానం పూర్తిగా మానేయాలి వయసుకి, శరీరతత్వానికి అనుగుణంగా వ్యాయామం (యోగాసనాలు, నడక, ఆటల వంటివి), రెండుపూటలా ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా చేయాలి రాత్రి భోజనానికి ముందు వేడినీళ్లతో స్నానం చేయాలి. భోజనానంతరం స్వచ్ఛమైన ఆవుపాలు కనీసం 300 మి.లీ. తాగాలి పుస్తకపఠనం, ఇష్టమైన పాటలు, పద్యాలు వినడం, టీవీ చూడటం... వంటివి చేస్తే మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే గది ఎక్కువ కాంతి లేకుండా నిశ్శబ్దంగా ఉండాలి. టీవీ దృశ్యాలు ఇబ్బందికరంగా ఉండకూడదు

No comments: