all

Thursday, October 24, 2013

హై రిస్కు ప్రెగ్నెన్సీ అంటే?

మహిళ గర్భం ధరిస్తే, ఆమెకు ఆరోగ్యపర రిస్కులు చాలా వుంటాయి. ఎన్ని రిస్కులున్నప్పటికి మహిళలు అన్నిటిని భరించి తమ బిడ్డలకు జన్మనివ్వటమనేది ప్రకృతి వారికిచ్చిన వరం. కనుక మీ వైద్యులు చెప్పినట్లు మీది నార్మల్ డెలివరీ అయినప్పటికి అందులో కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. అయితే, కొన్ని కేసుల్లో, గర్భవతి పడే కష్టాలు చాలా తీవ్రంగా కూడా వుంటాయి. తీవ్రంగా వుంటాయని భయపెట్టటం కాదు. అందులో వున్న కష్టాలను తెలుపాలని మా ధ్యేయం. అన్ని వివరాలు తెలిస్తే, ఆరోగ్యపరంగా గర్భవతి కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించవచ్చు. 
హై రిస్కు ప్రెగ్నెన్సీ అంటే పరిస్ధితి ఎలా వుంటుంది? 

1. రక్తపోటు అధికం - ఇప్పటికే మీరు రక్తపోటు కలిగి వుంటే, గర్భవతైన తర్వాత అది మరింత అధికం అవుతుంది. కనుక తగినంత అధిక విశ్రాంతి తీసుకుంటూ, మందులు వాడాలి. లేకుంటే, గర్భానికి హాని కలిగే ప్రమాదముంది. 

2. అధిక బ్లడ్ షుగర్ స్ధాయి - మీరు డయాబెటిక్ అయితే, షుగర్ స్ధాయి నార్మల్ కు రాకుండా గర్భం ధరించటం మంచిదికాదని వైద్యులు సలహానిస్తారు. అయితే, మీరు గర్భవతైనపుడు కలిగే షుగర్ స్ధాయి పెరిగినట్లయితే అది మీ గర్భానికి ఒక హై రిస్కు కాగలదు. నియంత్రణ కలిగించే ఆహార ప్రణాళిక అమలు చేయాలి. ఇటువంటపుడు తల్లులు అధిక బరువుగల పిల్లలకు జన్మనిస్తారు. వారికి ఇన్సులిన్ స్ధాయి సాధారణంకంటే కూడా అధికంగా వుంటుంది. 

3. బొడ్డుతాడు కిందకు జారటం - బొడ్డుతాడు కిందకు జారితే, మీ గర్భం ప్రమాదకర పరిస్ధితిలో వున్నట్లే. మూడవ త్రైమాసికంలో రక్తస్రావం అధికమవుతుంది. ఈ పరిస్ధితికి తక్షణం వైద్యులను సంప్రదించటం. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ, ప్రయాణాలు చేయకుండా, కాళ్ళు ఎత్తులో పెట్టి పడుకోవాలి. 

4. ఇప్పటికే మీకు అబార్షన్లయివుంటే - గతంలో మీకు అబార్షన్ల చరిత్ర వుంటే, మీరు మరింత జాగ్రత్తగా వుండాలి. మీ గర్భం బలహీనంగా వుందని అబార్షన్లు సూచిస్తాయి. అటువంటపుడు పూర్తి విశ్రాంతితోపాటు డాక్టర్ల సలహా అత్యవసరంగా పొందాలి. 

పైన తెలుపబడిన పరిస్ధితులు గర్భవతికిగల అత్యధిక రిస్కులలో ప్రధానమైనవి మాత్రమే. ఇవికాక ఇంకనూ కొన్ని రిస్కులు వుండగలవని గ్రహించాలి.


మహిళ గర్భం ధరించకూడని సమయాలేవి?!

మహిళకు కొన్ని సమయాలలో ప్రెగ్నెంట్ కాని పరిస్ధితులుంటాయి. ఇవి వైద్యపరంగా, లేదా ఆమెకుగల పరిస్ధితులు, లేదా మానసిక స్ధితి ఫలితంగా వుంటాయి. అటువంటపుడు ఆమె బేబీని పూర్తి కాలంగా తన గర్భంలోనిలుపుకోలేదు. ఆమె జీవితానికే కాక, బిడ్డకు కూడా హాని కలిగే స్ధితి వుంటుంది. అవేమిటో పరిశీలించండి. 
1. హైపో ధైరాయిడ్ - ప్రెగ్నెన్సీకి ముందు ధైరాయిడ్ హార్మోన్ పరీక్ష తప్పక చేయాలి. హైపో ధైరాయిడ్ వుంటే బిడ్డ కు హాని లేదా తీవ్ర జబ్బులు కలుగుతాయి. అసలు గర్భం దాల్చటంలోనే సమస్య రావచ్చు. 
2. డయాబెటీస్ - డయాబెటీస్ వ్యాధి వుండి మహిళ గర్భం దాల్చాలననుకుంటే మొదటగా తన షుగర్ లెవెల్ నియంత్రణలోకి తెచ్చుకోవాలి. బ్లడ్ షుగర్ అధికంగా వుంటే, బేబీలు బరువుతక్కువగా వుండి పూర్తి నెలలు నిండక ముందే పుడతారు. లేదంటే పుటకలో కొన్ని వైకల్యాలు సంభవిస్తాయి. 
3. హెమోఫిలియా - ఈ స్ధితిలో రక్తం తేలికగా గడ్డకట్టదు. బిడ్డ పుడుతుందంటే మహిళకు రక్తస్రావం అధికంగా వుంటుంది. కనుక ఈ స్ధితి వున్న మహిళలు గర్బందాల్చటానికి పనికిరారు. 
4. వంశానుగత వ్యాధులు - కొన్ని అరుదైన వ్యాధులు కుటుంబ సభ్యులననుండి సంక్రమించినవి అంటే మానసికపరమైనవి వుంటాయి. వీటిని పరీక్షలలో తెలుసుకోవడం కూడా కష్టమే. కుటుంబ చరిత్ర వలననే సేకరించటం సాధ్యమవుతుంది. 
5. హై రిస్క్ హిస్టరీ - డెలివరీ హై రిస్కు తో కూడి గతంలో మరణం తప్పిందనుకున్నపుడు మరోమారు ఆమె వైద్యపర అనుమతులుంటేగాని గర్భం దాల్చరాదు. 
6. మొదటి బిడ్డ - మొదటి బిడ్డకుకనుక సెరిబరల్ పాల్సీ వంటి వ్యాధులు వుంటే మరో మారు గర్భం ధరించాలంటే వైద్యుల అనుమతి తప్పక వుండాల్సిందే.