కావలసినవి:
బాస్మతి రైస్ - కప్పు, క్యారట్ - 1, బీన్స్ (చిక్కుడు గింజలు) - 12, బేబీ కార్న్ - 6 ముక్కలు, తెల్లమిరియాలు - టీ స్పూన్ , ఉల్లికాడల తరుగు - 3 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు, పంచదార - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత తయారి: ఒకటిన్నరకప్పు నీళ్లు పోసి బియ్యాన్ని ఉడికించాలి. క్యారట్, బేబీ కార్న్, ఉల్లికాడలు సన్నగా తరగాలి. వీటిలో నీళ్లు పోసి, కొద్దిగా ఉడికించి, నీటిని వడకట్టి తీసివేయాలి. పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక ఉడికించిన కూరగాయల ముక్కలు, పంచదార, ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. చివరగా మిరియాలు, ఉల్లికాడలు వేసి మరికాసేపు వేయించాలి. దీంట్లో ఉడికించిన బాస్మతి రైస్ వేసి, కలిపి మూత పెట్టాలి. పూర్తిగా అయ్యాక దించాలి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Wednesday, May 15, 2013
వెజిటబుల్ ఫ్రైడ్ రైస్
వెజిటబుల్ చీజ్ శాండ్‌విచ్
కావలసినవి: హోల్ వీట్ బ్రెడ్ - 2 స్లైసులు, చీజ్ స్లైసులు - నాలుగు టొమాటో స్లైసులు - 2, కీరా స్లైసులు - 4
లెట్యూస్ - 2 ఆకులు, క్యారట్ తురుము - టేబుల్ స్పూన్ మయోనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) - తగినంత తయారి: బ్రెడ్ సైడ్స్ కట్ చేసి, ఒకవైపు మయోనైజ్, చీజ్‌ను స్ప్రెడ్ చేయాలి. టొమాటో, కీరా స్లైసులు, లెట్యూస్, క్యారట్ తురుము వేసి, పైన మరో బ్రెడ్ స్లైసును ఉంచాలి. రెండు బ్రెడ్ స్లైసులను గట్టిగా అదిమి, సిల్వర్ ఫాయిల్‌లో చుట్టి, స్నాక్ బాక్స్‌లో పెట్టాలి. |
రూట్ జ్యూస్
కావలసినవి:
బీట్‌రూట్ జ్యూస్ - అర కప్పు క్యారట్ జ్యూస్ - అర కప్పు వెల్లుల్లి - అర ముక్క (క్రష్ చేయాలి) ఉప్పు - రుచికి తగినంత నిమ్మరసం - అర టీ స్పూన్ పంచదార - చిటికెడు తయారి: ఈ పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. చల్లగా సేవించాలనుకునేవారు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ జ్యూస్ లో బీపీని వెంటనే సాధారణ స్థితికి తీసుకువస్తుంది. |
చిట్కాలు
చేపలను కొనడానికి ముందు అవి బ్రైట్‌గా ఉన్నాయా, కండపట్టినవా, పట్టుకుంటే గట్టిగా ఉన్నాయా... అని చూసి తీసుకోవాలి.
చేపల తాజాదనాన్ని బట్టి కొన్ని వారాల వరకు డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. వండే ముందు చేప ముక్కలను రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేంతవరకు ఉంచి ఉపయోగించాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన తర్వాత త్వరగా డీప్రాస్ట్ చేయాలంటే చేపముక్కలు ఉన్న బేసిన్‌లో నీళ్లు పోసి, 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. కూర చేయడానికి చేప ముక్కలు పెద్దవిగా ఉండేలా చూసి, కట్ చేసుకోవాలి. చేపముక్కలు త్వరగా ఉడికిపోతాయి. అందుకని సూప్ గానీ లేదా కూర గానీ మిశ్రమం తయారయ్యాక చివరలో వేసి ఉడికించాలి. ముక్క చితికిపోయేంతవరకు ఉడికిస్తే రుచి ఉండదు. వేపుడువి కాకుండా ఉడికించిన చేపలు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి. |
పెప్పరోని పిజ్జా
కావలసినవి: మైదాపిండి - 140 గ్రా.
గుడ్డులోని పచ్చసొన - టీ స్పూన్ నీళ్లు - 10 మి.లీ పాలు - 5 మి.లీ ఉప్పు - రుచికితగినంత తయారి: పిజ్జా బేస్ కోసం మైదా, పచ్చసొన, నీళ్లు, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండి ముద్దపై ఒక గిన్నెను బోర్లించి, గంట సేపు ఉంచాలి. పిజ్జా పైన... టొమాటో ప్యూరీ - 20 గ్రా. మోజరెల్లా ఛీజ్ - 100 గ్రా. చికెన్ సాసేజ్ (మార్కెట్లో లభిస్తుంది) - 80 గ్రా. చికెన్ సలామీ - తగినంత, వెల్లుల్లిపేస్ట్ - 5 గ్రా. ఎండుమిర్చి (కచ్చాపచ్చాగా దంచాలి) - అర టీ స్పూన్ తయారి: పాన్‌లో పిండి మిశ్రమాన్ని వెడల్పుగా పరచి బేస్ తయారుచేయాలి. దాని పైన టొమాటో ప్యూరీ, మోజరెల్లా ఛీజ్, చికెన్ సాసేజ్, చికెన్ సలామి, వెల్లుల్లి, పండు మిర్చి వేసి, పైన మూత పెట్టాలి. అవెన్‌లో అయితే పది నిమిషాలు, స్టౌ మీద అయితే పిజ్జా ఉడికేంత వరకు సన్నని మంట మీద ఉంచాలి. |
Subscribe to:
Posts (Atom)