all

Wednesday, May 15, 2013

చిట్కాలు

 

చేపలను కొనడానికి ముందు అవి బ్రైట్‌గా ఉన్నాయా, కండపట్టినవా, పట్టుకుంటే గట్టిగా ఉన్నాయా... అని చూసి తీసుకోవాలి.

చేపల తాజాదనాన్ని బట్టి కొన్ని వారాల వరకు డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. వండే ముందు చేప ముక్కలను రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేంతవరకు ఉంచి ఉపయోగించాలి.

ఫ్రిజ్‌లో నుంచి తీసిన తర్వాత త్వరగా డీప్రాస్ట్ చేయాలంటే చేపముక్కలు ఉన్న బేసిన్‌లో నీళ్లు పోసి, 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి.

కూర చేయడానికి చేప ముక్కలు పెద్దవిగా ఉండేలా చూసి, కట్ చేసుకోవాలి.

చేపముక్కలు త్వరగా ఉడికిపోతాయి. అందుకని సూప్ గానీ లేదా కూర గానీ మిశ్రమం తయారయ్యాక చివరలో వేసి ఉడికించాలి. ముక్క చితికిపోయేంతవరకు ఉడికిస్తే రుచి ఉండదు.

వేపుడువి కాకుండా ఉడికించిన చేపలు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి.
 

No comments: