all

Wednesday, May 15, 2013

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్

 

కావలసినవి:
బాస్మతి రైస్ - కప్పు,
క్యారట్ - 1,
బీన్స్ (చిక్కుడు గింజలు) - 12,
బేబీ కార్న్ - 6 ముక్కలు,
తెల్లమిరియాలు - టీ స్పూన్ ,
ఉల్లికాడల తరుగు - 3 టేబుల్ స్పూన్లు,
ఆలివ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు,
పంచదార - అర టీ స్పూన్,
ఉప్పు - తగినంత

తయారి:
ఒకటిన్నరకప్పు నీళ్లు పోసి బియ్యాన్ని ఉడికించాలి. క్యారట్, బేబీ కార్న్, ఉల్లికాడలు సన్నగా తరగాలి. వీటిలో నీళ్లు పోసి, కొద్దిగా ఉడికించి, నీటిని వడకట్టి తీసివేయాలి.

పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక ఉడికించిన కూరగాయల ముక్కలు, పంచదార, ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

చివరగా మిరియాలు, ఉల్లికాడలు వేసి మరికాసేపు వేయించాలి. దీంట్లో ఉడికించిన బాస్మతి రైస్ వేసి, కలిపి మూత పెట్టాలి. పూర్తిగా అయ్యాక దించాలి.
 

No comments: